టామ్ & జెర్రీ – కాంగీ & ఎఎపి -కార్టూన్


Tom & Jerry

టామ్ & జెర్రీ కార్టూన్ సీరియల్/సినిమాను ఇష్టపడని వారెవరుంటారు? 1940ల్లో ఉనికిలోకి వచ్చింది లగాయితు అనేక తరాల పాటు ఆబాలగోపాలన్నీ అలరిస్తోంది. బలం పెద్దగా లేని చిట్టెలుక తన తెలివితేటలతో బలవంతురాలైనన పిల్లిని ఎలా బురిడీ కొట్టించేదీ ఈ షో చూపిస్తుంది.

ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఎపి, కాంగ్రెస్ పార్టీల వ్యవహారం కూడా టామ్ & జెర్రీ ఆటను తలపిస్తోందని కార్టూనిస్టు కేశవ్ ఈ కార్టూన్ లో చెబుతున్నారు. వందేళ్ళకు పైగా చరిత్ర కలిగి మహా మహా నాయకులెందరో పార్టీని వీడి కొత్త పార్టీలు పెట్టినా వాళ్లందరిని మట్టి కరిపించడమో తిరిగి తనలో కలిపేసుకోవడమో చేయడంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎఎపి ఎనే చిట్టెలుక ముందు ఎత్తుగడలుడిగినట్లు నిస్సహాయంగా నిలబడినట్లు కనిపిస్తోంది.

ఎఎపితో కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పరిచ్చినప్పటికీ ఎఎపి తప్పుల ద్వారా ఆ పార్టీని తొక్కాలని కాంగ్రెస్ పార్టీ గోతికాడ గుంట నక్కలా కాచుకుని ఉంది. కానీ ఇప్పటివరకు వచ్చిన అవకాశాలు వేటినీ కాంగ్రెస్ సద్వినియోగపరచలేదు. దీనికి ప్రధాన కారణం ఎఎపి ప్రజల ప్రయోజనాలకు నికరంగా కట్టుబడి ఉన్నట్లు ప్రజలకు నచ్చజెప్పుకోవడంలో సఫలం కావడమే. ఈ విద్యలో విఫలం అయిననాడు ఎఎపిని ప్రజల నుండి దూరం చేయడం తేలిక అవుతుంది.

3 thoughts on “టామ్ & జెర్రీ – కాంగీ & ఎఎపి -కార్టూన్

  1. పింగ్‌బ్యాక్: టామ్ & జెర్రీ – కాంగీ & ఎఎపి -కార్టూన్ | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s