ఎఎపి పాలన: లక్ష ఉద్యోగాలు, కానిస్టేబుళ్ల అవినీతి


aap - aravind

ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వ పాలనలో మరో రెండు అసాధారణ అంశాలు నమోదయ్యాయి. నిజానికి అసాధారణం కాదు. మన ప్రభుత్వాల విధానాల ప్రజా వ్యతిరేక స్వభావంలోని సాధారణత్వం వలన ఎఎపి తీసుకుంటున్న సాధారణ చర్యలు కూడా అసాధారణంగా కనిపిస్తున్నాయి. వాహనదారుల పర్సు లాక్కొని డబ్బు వసూలు చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాల్సిన పరిస్ధితికి కేంద్ర ప్రభుత్వాన్ని నెట్టడం ఒక అంశం. కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న లక్షకు పైగా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని విధాన నిర్ణయం తీసుకోవడం రెండోది. ఈ రెండో చర్య నిజంగానే కాస్త అసాధారణం.

కానిస్టేబుళ్లు బలవంతంగా లంచం వసూలు చేస్తూ చేయి చేసుకున్న దృశ్యాలతో కూడిన వీడియోను ఎఎపి విడుదల చేసింది. ఢిల్లీ పోలీసుల పని విధానాన్ని సవరించాలని అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు ఉద్యుక్తం అవుతున్న తరుణంలో జనవరి 12, 2014 తేదీన కానిస్టేబుళ్ల దుశ్చర్యను ఒక పౌరుడు రికార్డు చేశాడు. సదరు వీడియోను ఎఎపి తమ ఫేస్ బుక్ పేజీలో ప్రచురించింది.

జితేంద్ర, ఆర్వీద్, సౌరభ్ అనే ముగ్గురు పోలీసులు ఎర్రకోట వద్ద ఒక వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఆయన్ని చుట్టుముట్టి కొడుతూ ఆయన వాలేట్ లాక్కున్న దృశ్యం వీడియోలో రికార్డయింది. వీడియోను పబ్లిష్ చేస్తూ “ఢిల్లీ పోలీసుల అమనావీయ ప్రవర్తనను మాత్రమే కాకుండా వారి బలవంతపు వసూళ్లను కూడా ఈ వీడియో రుజువు చేస్తోంది” అని ఎఎపి సందేశం ప్రచురించింది. “లాల్ కిలా వద్ద జరిగిన ఈ ఘటనను ఒక ఔత్సాహికుడు రికార్డు చేశారు” అని ఎఎపి తెలిపింది.

“ఈ ఘటనలో ఉన్న పోలీసుల పైన కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే చర్య తీసుకుంటారా?” అని ఎఎపి ఫేస్ బుక్ సందేశంలో ప్రశ్నించింది. వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే కేంద్రం రంగంలోకి దిగింది. పోలీసులపై విచారణ చేస్తున్నట్లు ప్రకటించింది. విచారణ జరుగుతున్నందున వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. రెండు రోజుల ధర్నాను విరమించిన తర్వాత రోజే వీడియో వెలికి రావడంతో ఢిల్లీ పోలీసులకు స్పందించక తప్పినట్లు లేదు.

(పోలీసు దెబ్బలకు తాళలేక అల్లాడిన యువకుడి బాధను వీడియోలో చూడండి. రక్తం మరిగిపోతుంది.)

కానీ పోలీసుల అక్రమ వసూళ్లలో కింది నుండి పై వరకు పంపకాలు ఉంటాయి. పై అధికారుల మద్దతు లేకుండా కింది స్ధాయి కానిస్టేబుళ్లు ఈ విధంగా బహిరంగంగా అక్రమ వసూళ్లకు పాల్పడలేరు. పై అధికారులు ఎన్నటికీ వీడియోలకు చిక్కకపోవడమే ప్రస్తుత అధికార నిర్మాణంలో వారికి ఉన్న రక్షణ. బ్యూరోక్రట్ల లేదా రాజకీయ నాయకుల అవినీతి లెక్కకు వచ్చినప్పుడు ఎల్లప్పుడూ బలి పశువులే బలి కావడం నేటి పాలనా వ్యవస్ధ నిర్మాణంలో ఉన్న అప్రకటిత ఏర్పాటు. ఈ నిర్మాణాన్ని బద్దలు చేయకుండా ఎందరు కానిస్టేబుళ్లను వీడియో తీసి సస్పెండ్ చేసినా అదేమీ చర్య తీసుకున్నట్లు కాదు.

కాంట్రాక్టు ఉద్యోగాలు

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని విద్యా మంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగాలన్నింటిని శాశ్వతం చేస్తామని ఆయన తెలిపారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన కమిటీ ఇందుకు సంబంధించిన విధానాన్ని, అనుసరించవలసిన మార్గదర్శక సూత్రాలను నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.

ఒక అధికారి ప్రకారం ఢిల్లీ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య లక్షకు పై మాటే. వివిధ విభాగాల్లో వీరు పని చేస్తున్నారు. 1992 లో మన్మోహన్ సింగ్, పి.వి.నరసింహారావుల నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల నుండి అప్పులు తెస్తూ ఆమోదించిన షరతుల్లో ఉద్యోగాల కాంట్రాక్టీకరణ ఒకటి. ప్రభుత్వం సైజు తగ్గించాలని, ఉద్యోగాలు రద్దు చేయాలనీ, తద్వారా ఖర్చు తగ్గించాలని ఐ.ఎం.ఎఫ్ షరతు విధిస్తుంది. ప్రభుత్వం అందించే ప్రతి సేవకు రుసుము వసూలు చేయాలని చెబుతూ యూజర్ చార్జీల కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టింది ఐ.ఎం.ఎఫ్-ప్రపంచ బ్యాంకులే. ప్రభుత్వ అధీనంలో నిర్వహించే పనులను, సేవలను ప్రైవేటీకరించడం ఈ షరతుల లక్ష్యం.

ప్రతి సేవకు రుసుము వసూలు చేయడం అంటే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం అయిన ప్రజా సేవకు వెల కట్టడం. ఇలా ప్రతి సేవకు వెల కట్టినట్లయితే ఆయా సేవల రంగంలో ప్రైవేటు కంపెనీలు కూడా జొరబడడానికి మార్గం సుగమం అవుతుంది. ‘ధర్మాసుపత్రిలోనూ ఛార్జీలు వసూలు చేస్తారు, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలోనూ ఛార్జీలు వసూలు చేస్తారు’ అని జనానికి అర్ధం అయినపుడు కంటికి కాస్త నదురుగా కనిపించే కార్పొరేట్ ఆసుపత్రి వైపే మొగ్గు చూపుతారు. ఆ విధంగా ప్రభుత్వ సేవలకు ఆదరణ తగ్గించేసి ప్రైవేటు సేవలను అనివార్యం చేయడం ఇందులోని లక్ష్యం.

ప్రైవేటు సేవలకు అలవాటు పడ్డాక ఇక ఆ రంగాన్ని కార్పోరేటీకరించి విదేశీ కార్పొరేట్ కంపెనీలకు గుత్తస్వామ్యంగా మార్చడం క్రమంగా జరిగిపోతుంది. అనగా… ప్రభుత్వ సైజు తగ్గించడం, యూజర్ ఛార్జీలు ప్రవేశ పెట్టడం ద్వారా సేవలను వ్యాపారీకరించడం, కాంట్రాక్టీకరణ చేపట్టడం మొదలైన షరతులన్నీ అంతిమంగా విదేశీ బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు మార్గాన్ని సుగమం చేయడానికి ఉద్దేశించినదే అని అర్ధం చేసుకోవచ్చు. కానీ పైకి చెప్పేది ఇది కాదు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని చెబుతారు. డబ్బు చెట్లకు కాయవు అని గొప్ప సత్యం చెప్పినట్లు చెబుతారు. అప్పులు ఇచ్చేవాడు అవి వసూలు చేసుకొనే మార్గం చూసుకోడా అని ఎదురు ప్రశ్నిస్తారు. దేశంలోని సేవలు తాగు నీరు, సాగు నీరు, విద్య, వైద్యం… ఇలా అన్నింటిలోనూ కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించాక గాని మనకు తత్వం బోధపడదు. అప్పట్లో ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల షరతుల మర్మం ఇదీ అని విప్లవ పార్టీలు చెప్పినా వినిపించుకున్నవారు లేరు. వారు చెప్పింది నిజమే అయ్యాక ప్రతిఘటించలేని స్ధితికి జనమే చేరుకున్నారు.

ఈ నేపధ్యంలో కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడం చిన్న విషయం కాదు. కానీ ఇది నిజంగా ఆచరణలోకి వచ్చేవరకూ అప్పుడే సంతోషించడానికి కూడా వీలు లేదు. వేచి చూద్దాం.

23 thoughts on “ఎఎపి పాలన: లక్ష ఉద్యోగాలు, కానిస్టేబుళ్ల అవినీతి

 1. పింగ్‌బ్యాక్: ఎఎపి పాలన: లక్ష ఉద్యోగాలు, కానిస్టేబుళ్ల అవినీతి | ugiridharaprasad

 2. @అప్పట్లో ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల షరతుల మర్మం ఇదీ అని విప్లవ పార్టీలు చెప్పినా వినిపించుకున్నవారు లేరు. వారు చెప్పింది నిజమే అయ్యాక ప్రతిఘటించలేని స్ధితికి జనమే చేరుకున్నారు.

  నిజమే శేఖర్ గారు. కమ్యూనిస్టు పార్టీలు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటున్నా….ఇప్పటికీ జనం వాటిని పట్టించుకోరు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు చెప్పేవాటిని….హేళన చేస్తూ…, అపహాస్యం చేస్తూ పెద్ద ఎత్తున ప్రాపగండా జరుగుతోంది. పెట్టుబడిదారులే కమ్యూనిస్టుల పేరుతో…చలామణీ అవుతూ కమ్యూనిస్టు పార్టీలను తోకపార్టీలుగా మార్చేశారు.

 3. తోడేళ్ళ మద్దతు తీసుకున్నవాళ్ళు, ఎలుకల అవినీతిపై పోరాడడంలో అర్థం లేదు.
  మొత్తం భ్రష్టుపట్టిన వ్యవస్థలో పొలీసులు ఒక భాగం మాత్రమే. ఇంత గొడవ చేసి AAP సాధించింది ఏమిటి?
  ధర్నాలతో సమాజంలో మార్పు తేవాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి పదవి అధిరోహించడం ఎందుకు?

  ప్రపంచబాంకు గురించి నాకు పెద్దగా తెలియదు కాని, ఆర్థిక సంస్కరణలని తప్పుదోవ పట్టించింది మాత్రం క్రోనీ కేపిటలిజమే.

 4. కేపిటలిజంలో క్రోనియిజం అనివార్యమైన భాగం. క్రోనీయిజం లేని కేపిటలిజం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాగే ఆర్ధిక సంస్కరణల లక్ష్యమే స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల లాభాలు పెంచే విధంగా దేశ ఆర్ధిక వ్యవస్ధను మార్చడం. అంటే ఆర్ధిక వ్యవస్ధను ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగానూ కొద్ది మంది సూపర్ ధనికులకు అనుకూలంగానూ తయరు చేయడం. ఈ దారే తప్పుదారి. అందులో మళ్ళీ తప్పుదోవ, ఒప్పుదోవ అంటూ ఉండవు. ఆర్ధిక సంస్కరణలు ఒప్పుదోవ పట్టి జనానికి మేలు చేసిన చరిత్ర ఎక్కడా లేదు. ఉండదు కూడా. ఆర్ధిక సంస్కరణల లక్షణమే అంత!

 5. Oh sorry sir,i dont know that you will anwer to questions only on what you analysed…also i dont u will not entertain any questions of national and intenational importance other than what u said…i thought u will encorage ur bloggers(viewers of ur site). on seeing few articles in enadu i was inspired to visit ur blog.now i felt that it is only one sided,what you like u will post and if any one have clarifications on what u analysed they can ask on that…if it is so it is not public friendly

 6. Really sorry sir,i really misunderstood ur question..when i saw your question where did I mention?
  i understood this wrongly because even u know these are the statements made by our prseident on the eve of republic day and you didnt talk abt this in blog.

  I thought u could elaborate these in ur own style abt our indian politics

  If possible can u through light on these two statements.Once again my deep apologies for my mistake

 7. నా ప్రశ్నలకు మీరిచ్చే సమాధానాల నుండే విషయం రాబడదామని ప్రశ్నతో మొదలు పెట్టాను. కానీ మీ ఆలోచన మరోవైపు వెళ్లింది. దాన్నలా వదిలేయండి.

  నాకు వస్తున్న ప్రశ్నలన్నీ ఎలా ఉన్నాయంటే: అడుగుతున్నవారు తమకు తాము ఆలోచించడానికి, తర్కించుకోవడానికి, పత్రికలుగానీ మరేమన్నా పుస్తకాలు వెతికి తెలుసుకోవడానికి శ్రమగా భావిస్తున్నట్లుగా ఉంది. తమకు వచ్చిన అనుమానాలకు సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని ‘ఎవరన్నా ఒక బాటిల్ లో నింపి తమ మెదడులో ఒంపి పెడితే బాగుండు’ అని భావిస్తున్నట్లుగా ఉంది.

  దురదృష్టం ఎమిటంటే సమాచారం గానీ జ్ఞానం గానీ అలా రాదు. మన మెదళ్లు అలా నిండవు. ఎవరైనా మొదట తాము ఒక జ్ఞాన పునాది మీద నిలబడి ఉండాలి. ఆ పునాది రిఫరెన్స్ గా మరింత సమాచారాన్ని సమకూర్చుకుని దాన్ని మరింత జ్ఞానంగా మార్చుకోగలిగి ఉండాలి. దానికి నిరంతర సాధన అవసరం. ఆ సాధనలో ఇలా బ్లాగ్స్ చదవడం కూడా ఒకటి. కానీ మనకు అవసరం అయిందంతా ఒకే బ్లాగ్, ఒకే పత్రిక, ఒకే పుస్తకం… ఇలా ఒకే చోట ఉండవు. దానికి శ్రమ చేయాలి. ఓపిక ఉండాలి. చర్చలు చేయాలి. తప్పో, ఒప్పో నాలుగు మాటలు చెప్పాలి. నాలుగు మాటలు రాయాలి.

  మన శరీరం మన చుట్టూ ఉన్న పరిసరాలతో నిత్యం సాంగత్యం నెరుపుతూ ఉంటుంది. దీన్ని మెటబాలిజం అంటారు. మన శారీరక ఎదుగుదల బయొలాజికల్ మెటబాలిజం పై ఆధారపడి ఉన్నట్లే, మన సామాజిక ఎదుగుదల సోషల్ మెటబాలిజం పైన ఆధారపడి ఉంటుంది. అలాగే మెదడు ఎదుగుదల లేదా జ్ఞాన సముపార్జన అనేది మన మెదడు మన చుట్టూ ఉండే సమాచారంతో నిత్యం మెటబాలిజం లాంటిది జరుపుతూ ఉండాలి. దీనికి మెదడు చురుకుదనం అవసరం. అంటే ఒకరి మెదడు తానుగా కృషి చేయాలి. ఆ తర్వాత పరిసరాలతో ఇచ్చి పుచ్చుకోవాలి. తద్వారా తన జ్ఞాన పునాదిని విస్తృతం చేసుకోవాలి. పెరిగిన జ్ఞాన పునాది ద్వారా మరింత విస్తృతంగా మెటబాలిజం జరపాలి.

  నాకు వస్తున్న ప్రశ్నలు ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. ఒక ప్రశ్న వేస్తారు. దానికి సంబంధించిన సమస్త సమాచారం నా సమాధానంలో క్లుప్తంగా, చదివిన వెంటనే అర్ధం అయ్యేట్లుగా, ఉండాలన్నట్లుగా ఆ ప్రశ్న ఉంటుంది. దానితో నాకు సమాధానం చెప్పడం కుదరడం లేదు.

  రాష్ట్రపతి మీరు చెప్పిన మాట అన్నారు. బహుశా అది మీకు ఎంతోకొంత అర్ధం అయి ఉండాలి. అది ఎవరిని ఉద్దేశించి, ఏ ఘటనలను ఉద్దేశించి అన్నారో మీకు అర్ధం అయి ఉండాలి. అలా మీకు అర్ధం అయింది ఏమిటో నాకు చెప్పండి. దాన్ని బట్టి మన సంభాషణ కొనసాగిద్దాం. ఈ సంభాషణలో ప్రశ్నలు, సమాధానాలు వెంట వెంటనే జరగాల్సిన అవసరం లేదు. మధ్యలో మీకు ఒక పని తగలొచ్చు. నాకూ మరో పని తగలొచ్చు. లేదా నేను ఇతరత్రా వేరే అంశం రాస్తూనో, చదువుతూనో ఉండొచ్చు. కాబట్టి ఓపిగ్గా మనం సంబాషిద్దాం. ఓ.కే. ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వండి. మళ్ళీ రిపీట్ చేస్తాను:

  రాష్ట్రపతి మీరు చెప్పిన మాట అన్నారు. బహుశా అది మీకు ఎంతోకొంత అర్ధం అయి ఉండాలి. అది ఎవరిని ఉద్దేశించి, ఏ ఘటనలను ఉద్దేశించి అన్నారో మీకు అర్ధం అయి ఉండాలి. అలా మీకు అర్ధం అయింది ఏమిటో నాకు చెప్పండి

  (ఒక షరతు: మీరు తెలుగులోనే రాయాలి. కుడిపక్కన లేఖిని అని కనపడుతుంది. అది క్లిక్ చేస్తే తెలుగులో టైప్ చేసే ఉపకరణం వస్తుంది. అక్కడ రాశాక కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చెయ్యండి)

 8. Sir you rightly pointed out the mistakes that people like me will do…i am in the process of improving my capabilities and abilities in social,political and economic aspects.In that hurry people like us will commit mistakes,but what u said is correct how an individual should mould himself during the process of acquring knowledge.Definitely i do follow your words.

  I found difficulty in writing this in Telugu and because of less available time at my disposal i am continuing my convesation in english and i will never mind if u reply me in
  english

 9. ”Populist anarchy no substitute for governance”-I understood this statement in the following way:
  Anarchy as my understanding absence of controlling authority over people or state less society,it represents extreme of liberalism with individuals are free to do what ever they want

  Populalist as per my understanding supported by most of people.

  The timing of this statement by our president made an obvious refernce to the recent incident (AAP Dharna)happened in dlehi,even though incidents of this sort happened in past.

  Being a CM of Delhi who has to govern the State ,he went on to streets for protesting. In democracies people have the right to do dharnas and protest peacefully against rulers and their policies.If ordinary people(who were not given the duty to govern) are doing this we can accept because they wanted to represent ther voice and to get rid of their problems.

  But being a CM to Delhi,Unlike normal people he is having many ways to represnt his cocerns because every one will listen and watch what he is saying and what is his demands…which will put moral pressure on the central government to take some action.But if ordinary people say something no one will listen and no will care ,so the people who have similar concerns can unite and protest so that they can draw attention of many people to keep up pressure on rulers.

  But the CM who was the responsibilty to govern ,left it and went to street protests with the support of many people(popularism).If every ruler adopt the same way with the support of people then when can be the governace then it will represent the state of Anarchism

  Sir,we will start discussion of another statement( “rising trend of hypocrisy in public life”) once this statement discussion is completed

 10. తెలుగులో రాయమన్నది ఇతర పాఠకులకు కూడా ఉపయోగపడుతుందని. పైగా ఇది తెలుగు బ్లాగ్. సైట్ అడ్రస్ కూడా తెలుగువార్తలు డాట్ కామ్.

  కాబట్టి populist anarchy గురించి మీకు ఆల్ రెడీ ఒక అవగాహన ఉంది. మీకు ఏదయితే అర్ధం అయిందో రాష్ట్రపతి కూడా అదే చెప్పదలిచారు. ఎఎపి కి వ్యతిరేకంగా ఈ మాటల్ని ఆయన చెప్పారు.

  నిజానికి రాష్ట్రపతి కాదు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆయన చేత ఆ మాటలు చెప్పించింది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ మాటలు చెప్పిందని కూడా అనుకోవచ్చు. కాంగ్రెస్ మాత్రమే కాదు. బి.జె.పి నేతలు కూడా ఇలాంటి మాటలనే చెప్పారు. జనతా దర్బార్ పేరుతో వీధుల్లో కూర్చొని ప్రజల విజ్ఞాపనలు తీసుకుంటే దాన్ని వారు ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు వీధుల్లో నడవ్వు అని కిరణ్ బేడి లాంటి ఉద్యమకారులు కూడా వెక్కిరించారు. వీరంతా ఒకే అభిప్రాయంతో ఉన్నారని అర్ధం అవుతోంది.

  నాదో ప్రశ్న. మరి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు నడిచేదె ప్రజాస్వామ్యం అన్న నిర్వచనం ప్రకారం ప్రభుత్వం యొక్క ప్రతి చర్యలోనూ ప్రజల పాత్ర ఉండాలి. అది ప్రజల కోసం ఉండాలి.

  ఆఫీసుల్లో, మంత్రుల కార్యాలయాల్లో, ప్రధాని మంత్రి కార్యాలయంలో, రాష్ట్రపతి కార్యాలయంలో, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల కార్యాలయాల్లో, ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఆర్.ఎస్ ఇంకా అనేకానేక అధికారుల ఆఫిసుల్లో సామాన్యులకు ప్రవేశం ఉంటుందా? ఉండదు. కాబట్టి వీధిలో విజ్ఞాపనలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని ఒక అడుగు ప్రజలకు చేరువుగా తెచ్చిన ఖ్యాతి అరవింద్ కి ఇవ్వద్దా? (ఆఫ్ కోర్స్! నిర్వహణలో ఆయన విఫలం అయి మానుకున్నారనుకోండి. కాని సరిగ్గా నిర్వహిస్తే అది సరైన పద్ధతి అనీ నా అభిప్రాయం. వీధిలో కాకపోతే నాలుగ్గోడల మధ్య ప్రజలకు స్పేస్ ఇస్తూ చేయొచ్చు. కానీ ఆ పద్ధతి మాత్రం కొనసాగాలి.)

  ధర్నాలు చేస్తే గవర్నెన్స్ ఎప్పుడు చేస్తారు అన్నది మీ ప్రశ్న. అసలు ఎఎపి ఎందుకు ధర్నా చేసిందో మీరు చెప్పలేదు. ఆ విషయం చెప్పండి. ఎఎపి ఎందుకు ధర్నా చేసింది? కారణం లేకుండా ధర్నా చేసిందనా మీ ఉద్దేశ్యం?

 11. First i will answer to your question why Delhi CM done street protests?Police personnel ignoring the orders of somnath barathi to raid on Nigerian people who were involved in prostitution and drugs supply.

  Law and Order of Delhi is not under the control of Delhi Government.So they cannot take action against Police.Their demand is to suspend the police officers who ignored the Orders of lawminister.Since Central Gov ignored, the Cm went to street protests

  About Delhi darbar:In a state of arround 2 crore people state gov cannot sit and collect petitions of each and every individual and can solve them.The democracy of the people , for the people , by the people can best be reflected by delegating more powers to the panchayats.Because panchayats constitutes very limited people and that darbar can be realistically done at panchayat levels.
  Instead he conducting the delhi darbar,he could have fought for the devolution of more powers to local panchayats .

  But i like his dharana it will open up a new debate

 12. “Instead he conducting the delhi darbar, he could have fought for the devolution of more powers to local panchayats.”

  “But i like his dharana it will open up a new debate.”

  You are coming to the point.

  ఢిల్లీలో ఒక ఏరియాలో ప్రజలకు ఒక సమస్య వచ్చింది. విదేశీయులు డ్రగ్స్, వ్యభిచారం నిర్వహిస్తూ తమ ప్రాంతాన్ని కలుషితం చేయడం వారి సమస్య. ఈ సమస్యకు స్పందించాల్సింది ఢిల్లీ పోలీసులు. కానీ వారు ఢిల్లీ ప్రభుత్వం చేతుల్లో లేరు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య వైరుధ్యం. ఈ వైరుధ్యం పరిష్కారం అయితే సంతోషించేది ఢిల్లీ ప్రజలు. ఢిల్లీ పోలీసుల్ని ఢిల్లీ ప్రభుత్వం ఆధీనంలోకి అప్పజెప్పడమే ఈ వైరుధ్యానికి పరిష్కారం. లేదా ఢిల్లీలో రెండు పోలీసు విభాగాలను ఏర్పరిచి ఒక భాగానికి కేంద్ర సంస్ధల రక్షణ బాధ్యతను, మరో భాగానికి రాష్ట్ర సంస్ధల రక్షణ బాధ్యతలను అప్పజెప్పడం.

  ఈ వైరుధ్యం ఈనాటిది కాదు. ఢిల్లీ రాష్ట్రం ఏర్పడినప్పటినుండీ ఉంది. పాత సి.ఎం లు ఖురానా, షీలాలు ఇద్దరూ ఈ విషయమై కేంద్రంతో తగాదా పడ్డారు. కాని వైరుధ్యం పరిష్కారానికి ఢిల్లీ పోలీసులు, కేంద్రం ఇరువురూ సిద్ధంగా లేరు. కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం ఏం చేయాలి? చర్చల ద్వారా పరిష్కారం చేసే పరిస్ధితి లేనేలేదు. ఆ అంకం గత ప్రభుత్వాల్లో పూర్తయింది. ఇక మిగిలింది ఘర్షణ. అందుకే అరవింద్ ధర్నాకు దిగాడు. ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న ఒక సమస్య పరిష్కారం ఈ ధర్నా ద్వారా ఆశించారు. ధర్నా అవసరం లేకుండానే కేంద్రం సమస్యను పరిష్కరిస్తే సంతోషమే. కాని అందుకది సిద్ధంగా లేదు. ఢిల్లీ మంత్రి ఆదేశాలను పోలీసులు లెక్క చేయలేదు. ఇక మిగిలిన దారి ఒక్కటే. ఆ దారే ఢిల్లీ ప్రభుత్వం తొక్కింది.

  కాబట్టి ఇక్కడ ప్రధాన దోషి కేంద్రం, పోలీసులు. వారిని తప్పు పట్టడం మాని ప్రజల తరపున వ్యవహరించిన సి.ఎం ని తప్పు పట్టడం సరైందేనా?

  ఇక్కడ గుర్తించాల్సిన సమస్య ధర్నా సరైందా కాదా అన్నది కాదు. ప్రజల సమస్య సజావుగా పరిష్కరించబడే అవకాశాన్ని కేంద్రం, పోలీసులు ఇచ్చారా అన్నది ఆలోచించాలి. వారా అవకాశం ఇవ్వకపోతే ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల సహాయంతో ఏ చర్యకు దిగినా తప్పు లేదు. ధర్నా కావచ్చు. రాస్తా రోకో కావచ్చు. సమ్మె కావచ్చు. ఏదైనా కావచ్చు. కాని అందులో ప్రజల పాత్ర, వారి ఆమోదం ఉన్నంత వరకూ ఏ చర్య తీసుకున్నా ఆమోదనీయం అవుతుంది.

  ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ధర్నాలూ, ఆందోళనలు చేయడం సమంజసమేనా అన్న ప్రశ్నే అసంగతం. ఆ ధర్నా, ఆందోళనలు నిజంగా ఎవరికోసం అన్నదే అసలు విషయం. అవి ప్రజల కోసం అయితే నిస్సందేహంగా సమర్ధనీయం. అలాంటి కార్యాచరణను అరాచకంగా (anarchy) అభివర్ణించడం ఒక మోసం. ప్రజల సమస్యను పరిష్కరించే కర్తవ్యం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి పదజాలాన్ని ప్రయోగిస్తున్నారు తప్ప. అందులో ప్రజా జీవనం పట్ల చిత్తశుద్ధి లేనే లేదు. ప్రజాజీవనాన్ని సుఖమయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ప్రజల లేవనెత్తిన వ్యభిచారం, డ్రగ్స్ సమస్యలను పరిష్కరించాలి. ఆ క్రమంలో ఆటంకంగా ఉన్న ‘ఢిల్లీ పోలీసులు ఎవరి నియంత్రణలో ఉండాలి’ అన్న సమస్య పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. కేంద్రం ఇవేవీ చేయలేదు. ధర్నా తర్వాత కూడా ఇవి జరగలేదు. అందువలన ఈ సమస్య మళ్ళీ తలెత్తడం ఖాయం. ఢిల్లీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే మళ్ళీ ఘర్షణ తప్పదు. చిత్తశుద్ధి లేకపోతే లోలోపల రాజీలతో ముగిసిపోతుంది.

  ———————————————-

  రెండు కోట్ల మందీ విజ్ఞాపనలు పట్టుకుని రారు. అందులో చిన్నపిల్లలు, విద్యార్ధులు తదితరులను తీసేస్తే వారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఈ విజ్ఞాపనలన్నీ సి.ఎం, మంత్రులే తీసుకోవాల్సిన పని లేదు. అందుకోసం ఒక వ్యవస్ధను వారు ఏర్పాటు చేయవచ్చు. దానిద్వారా కొన్ని ఉద్యోగాలు కూడా లభిస్తాయి. మీరన్నట్లు ధర్నా ద్వారా మాత్రమే కాదు జనతా దర్బార్ ద్వారా కూడా అనేక రంగాల్లో చర్చలు లేవనెత్తబడతాయి. ఇప్పుడు మన మధ్య జరుగుతున్న చర్చ కూడా అందులో ఒకటి. గతంలో ఇలాంటి చర్చలు ఎక్కడన్నా జరిగాయా? కనీసం అవకాశం వస్తే ప్రజలు అనేక సమస్యలతో ముందుకు వస్తారు అన్న జ్ఞానాన్ని కలిగించే కార్యకలాపాలు జరిగాయా? లేదు. గతంలో చంద్రబాబు నాయుడు ‘ప్రజల వద్దకు పాలన’ పేరుతో ప్రభుత్వ యంత్రాంగాల్ని పల్లెలకు తరలించాడు. కానీ అది ఒట్టి జనాకర్షక కార్యక్రమం అని త్వరలోనే తేలిపోయింది. దాన్ని కాపీ కొడుతూ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు రచ్చబండ నిర్వహించారు. కానీ ఒక్క సమస్యనీ పరిష్కరించలేదు.

  వాటికి భిన్నంగా జనతా దర్బార్ నడిచింది. అయితే అరవింద్ చేసిన తప్పు పరిణామాలను అంచనా వేయలేకపోవడం. పరిపాలనకు కొత్త కాబట్టి ఆ తప్పుని తేలికగా క్షమించేయొచ్చు. ఇప్పుడు ఆయన చేయాల్సింది జనతా దర్బార్ లాంటి కార్యక్రమాల్ని నిర్వహించడానికి ఒక పటిష్టమైన వ్యవస్ధను ఏర్పరచడం. ఆ వ్యవస్ధకూ, పాలనా వ్యవస్ధకూ ఆరోగ్యకరమైన డైనమిక్ సంబంధాల్ని ఏర్పరచడం. కాని దీనిని ఆయన చేసే ఉద్దేశ్యంలో ఉన్నారని నాకు అనిపించడం లేదు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నవాల్లు ప్రజలను చైతన్యవంతం చేసి వారి బలహీనతలను తగ్గించే ప్రయత్నం చేయాలి. తద్వారా జనతా దర్బార్ లాంటి ప్రయత్నాలను విసృతంగా చేయాలి. నిజానికి జనతా దర్బార్ లను పటిష్టం చేసే క్రమంలో వచ్చే అనుభవాలే అటు జనాన్ని చైతన్యవంతం చేస్తూ, ఇటు పాలకులకు గొప్ప అనుభవాలని సమకూర్చుతాయి.

  కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అంతిమంగా ప్రజలు చైతన్యవంతం కావడానికి దారి తీస్తాయి. రాష్ట్రపతి చెప్పినట్లు అరాచకానికి కాదు దారితీసేది. ప్రభుత్వ పాలనలో ప్రజల పాత్ర పెరగడానికీ, తద్వారా వారి పౌర బాధ్యతలను ఎరుకపరచడానికీ దారి తీస్తాయి. ఆ క్రమంలో ప్రజల చైతన్యం పెరుగుతూ పోతుంది. అదే సమయంలో వ్యవస్ధలోని బలహినతల పట్ల కూడా ప్రజల చైతన్యం పెరుగుతూ పోతుంది. వ్యవస్ధలో ఏది ప్రజలకు అనుకూలంగా ఉందో, ఏది వ్యతిరేకంగా ఉందో వారికి తెలుస్తుంది. అనుకూలంగా ఉన్నది మరింత మెరుగుపరచుకోవడానికీ, వ్యతిరేకంగా ఉన్నదాన్ని రద్దు చేయించుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అవినీతికి ఎక్కడ పునాది ఉందో వారు ఇట్టే పసిగడతారు. పసిగట్టడమే కాకుండా దాన్ని రూపుమాపడానికి ఏం చేయాలో కూడా వారు ఆలోచిస్తారు.

  అనగా ప్రజలు మరింతగా చురుకుగా మారతారు. మరింత తెలివిగా మారతారు. మరింత క్రియాశీలకంగా మారతారు. ప్రజలు ఇలా మారడమే పాలకుల దృష్టిలో Populist Anarchy. అంటే రాష్ట్రపతి చెప్పిన ప్రజల అరాచకం నిజానికి అరాచకం కాదు. అది వారి చైతన్యం. పాలకుల అవినీతిని, లొసుగులను పసిగట్టి, వారి పని పట్టే చైతన్యాన్ని ప్రజలు సంతరించుకుంటే వారు ఏం చేస్తారు? అలాంటి అవినీతిని, లొసుగులను రూపుమాపడానికి ప్రయత్నిస్తారు. అనగా ఏ వర్గాలైతే ప్రభుత్వాలను నడుపుతున్నారో, ఏ వర్గాలైతే ప్రభుత్వాలు నడుపుతూ వ్యవస్ధలోని ఆర్ధిక వనరులను తమ గుప్పిట్లో పెట్టుకున్నారో, ఏ వర్గాలైతే వ్యవస్ధలను శాసిస్తూ సమస్త వనరులను తమ స్వప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారో ఆ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం అవుతారు. చైతన్యం అయిన వారు చేతులు ముడుచుకుని కూర్చోరు. అందుబాటులో ఉన్న ఉపకరణాల ద్వారా వ్యవస్ధను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వీలయితే ఎఎపి లాంటి పార్టీలను మరిన్ని చోట్ల గెలిపిస్తే వ్యవస్ధను మార్చుకోవచ్చేమో చూస్తారు. ఆచరణలో దానివల్ల ఫలితం లేకపోతే మరింత చైతన్యవంతమైన పాత్రను పోషిస్తారు. అనగా బలవంతంగానైనా అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రజలు ఆ పనికి పూనుకున్నపుడు జరిగేవే విప్లవాలు.

  కాబట్టి ప్రజల చైతన్యం కాస్తా ఆధిపత్య వర్గాలను వారి ఆధిపత్యాన్ని కూలదోయడానికి దారితీస్తుంది. పాలకులు దీనికి ఒప్పుకుంటారా? దాన్ని మొగ్గలోనే తుంచడానికి ప్రయత్నిస్తారు. మొగ్గగా ఉన్నపుడే దానిని ‘పిచ్చి కుక్క’ అని పేరు పెడతారు. కుదిరితే టెర్రరిజం అనవచ్చు. కుదరకపోతే నక్సలిజం అన్నా అనవచ్చు. అందులో మొదటి దశగా దానికి ‘పాపులిస్టు అనార్కీ’ అంటున్నారు. రిపబ్లిక్ డే రోజునే రాష్ట్రపతి ఈ మాటలు చెప్పడం వెనుక ఇంత విస్తృతార్ధం, పాలక వర్గాల విస్తృత ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆ బుట్టలో మీరు పడిపోయినట్లు కనిపిస్తోంది.

  ———————-

  పంచాయితీలు గురించి మీరు చెప్పింది నిజం. మరి పంచాయితీలకు ఆయా ప్రభుత్వాలు హామీ ఇస్తూ వచ్చిన అధికారాలు ఇంకా ఎందుకు ఇవ్వలేదు. మీ దృష్టిలో దీనికి కారణం ఏమిటి?

 13. First ur analysis is fantastic.I will accept,no doubt it will bring enlightenment,only if all people are good and no person is bad in the society.But it is not the case in the real world there are whimsical opprotunists in
  society who will use these kind of methods for their vested intrests by gathering public which will stall the governace be it a state or in country.(just like as u r pointing hand at US for its interfence in other nations but the difference is there a foreign player is involved but in our case domestic player will be involved)

  జనతా దర్బార్ కోసం ఒక వ్యవస్ధను వారు ఏర్పాటు చేయవచ్చు-There is a thin line of difference between the institutions which u mentioned and Panchayats which i mentioned…in panchayats they can find their elected leaders be directly involved in adressing their grievances…

  పంచాయితీలకు ఆయా ప్రభుత్వాలు హామీ ఇస్తూ వచ్చిన అధికారాలు ఇంకా ఎందుకు ఇవ్వలేదు. మీ దృష్టిలో దీనికి కారణం ఏమిటి?

  As per my understanding:

  1)If panchayats are accorded with independence,they will become more powerful in their panchayt units which will threaten their(Centre or State) political survival and haegemony

  2)or they may have opinion that panchayts didnt attain that much maturity in the matters of complete governace

  3)Excessive decentralization creates new types of problems to deal with issues of national and international importance

  4)Just like as there is a feeling of Nationhood among different nations,feeling of statehood among
  diffrent states in a country,it will create one more feeling of panchayathood.As already people are divided on the lines of region,race,caste,colour,creed one more dividing line among the people
  will be added to this list in the form of Panchayathood.

 14. మంచి, చెడ్డ అన్నదానికి ఈ ప్రాసెస్ లో చోటు ఉండదు. జనతా దర్బార్, ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిజంగా ప్రజలకోసం చిత్తశుద్ధితో జరిపితే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఖచ్చితంగా నేను రాసినట్లే జరగాలని రూల్ లేదు. కాస్త అటు ఇటూగా ఇలాంటి క్రమం జరుగుతుంది. ఇందులో మీరన్నట్లు చెడ్డ వ్యక్తులు చొరబడడం అంటే ఆధిపత్య శక్తులు అడ్డుకోవడమే. అనగా ఈ ప్రక్రియ జరక్కుండా ఇప్పటికే స్ధిరపడిన ధనిక వర్గ పాలకులు తప్పనిసరిగా ఆటంకాలు సృష్టిస్తారు. అలాంటి ఆటంకాల్లో ఒకటే ఈ ‘పాపులిస్టు అనార్కీ’గా చెప్పడం. లొంగుతారని భావించేవరకూ ఈ ఆటంకాలు నాగరికంగా కనపడతాయి. అలా లొంగకపోతే అసలు పని మొదలు పెడతారు. కేసులు ఎదురవుతాయి. కుట్రలు చేస్తారు. నమ్మినవాళ్లే ముంచుతారు. పక్కన తిరిగిన వ్యక్తే అత్యాచారం ఆరోపణ చెయ్యొచ్చు… ఇలా ఎన్నైనా జరగొచ్చు. వీటిని ఎదుర్కోవాలంటే నిరంతర జాగరూకత కావాలి. అన్నింటి కంటే ముఖ్యంగా సైద్ధాంతిక నిబద్ధత ఒకటి కావాలి. ఎంత కఠినమైనా దాన్ని ఆచరించే నిశ్చయం ఉండాలి. ఇదంతా ఇప్పటివరకూ జరిగినట్లు నల్లేరు మీద నడకగా ఉండదు.

  పంచాయితీల గురించి మీరు చెప్పిన పాయింట్ల మధ్య వైరుధ్యం ఉంది. అది గమనించి చెప్పండి.

 15. “The democracy of the people , for the people , by the people can best be reflected by delegating more powers to the panchayats.Because panchayats constitutes very limited people and that darbar can be realistically done at panchayat levels. Instead he conducting the delhi darbar,he could have fought for the devolution of more powers to local panchayats.”

  ఇక్కడ మీరు పంచాయితీల పక్షాన నిలిచారు. మీరు గుర్తించింది నిజం అని, అది జరగాలని నేనూ చెప్పాను.

  కానీ మీరు చెప్పిన నాలుగు పాయింట్లు పై అవగాహనను విభేదించాయి. ఈ పాయింట్లలో మీరు కేంద్రం, రాష్ట్రాల పక్షం వెళ్లిపోయారు.

  పంచాయితీ అనేది చాలా చిన్న యూనిట్. దేశానికి ప్రాధమిక యూనిట్. అలాంటి చిన్న యూనిట్లకు మరిన్ని అధికారాలు ఇవ్వడం అంటే అధికారాల ప్రజాస్వామ్యీకరణగా మీరు సరిగ్గా గుర్తించారు. కాని అంత చిన్న యూనిట్లు అధికార కేంద్రాలు అవుతాయంటూ అతి అంచనా వేశారు. రాష్ట్రాలకు, కేంద్రానికి విసృతమైన అధికారాలు, వనరులు ఉంటాయి. వాటిని అధిగమించే అవకాశం పంచాయితీలకు ఎప్పటికీ రాదు.

 16. Sir,The points which i mentioned does mean that i am supporting them.

  మరి పంచాయితీలకు ఆయా ప్రభుత్వాలు హామీ ఇస్తూ వచ్చిన అధికారాలు ఇంకా ఎందుకు ఇవ్వలేదు. మీ దృష్టిలో దీనికి కారణం ఏమిటి?

  ye question ki answer cheyalanukunanu,vari views ala undachani four points mention chesanu sir.

 17. నేను అడిగింది మీ అభిప్రాయం. వారి అభిప్రాయం మిమ్మల్నెలా అడుగుతాను! అలా అడిగితే అది నా తప్పు. పంచాయితీలకు అధికారం ఇస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం అని అన్ని పార్టీలూ చెబుతాయి. అయినా ఎందుకు ఇవ్వరు? అదే నా ప్రశ్న. వారు అలా ఇవ్వకపోవడంపై మీ అవగాన ఏమిటన్నది నా ప్రశ్న.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s