గుజరాత్: అప్పుల కుప్పగా మార్చిన మోడి


vibrant Gujarat

నరేంద్ర మోడి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 2001-02 లో గుజరాత్ అప్పు 45,301 కోట్లు కాగా అది 2013-14 నాటికి 1.76 లక్షల కోట్లకు చేరనుందని అంచనా వేస్తున్నారు. ఈ డజను సంవత్సరాల్లో గుజరాత్ కి చేసిన సేవ ఇక చాలనుకుని దేశం మొత్తానికి సేవ చేస్తానని మోడి బయలుదేరారు. భారత మాత రుణం తీర్చుకోవడానికి తాను ఎదురు చూస్తున్నానని మోడి ఓ సందర్భంలో చెప్పారు కూడా. (మోడి తరహాలోనే భారత మాత రుణం తీర్చుకోవాలని దేశ ప్రజలంతా భావిస్తే ఎన్ని ప్రధాన మంత్రి పదవులు కావాలో మరి!) భారత మాతకు మోడి చెల్లించనున్న రుణం ఏ తరహాలో ఉండనుందో అప్పుల కుప్పగా మారిన గుజరాత్ తేటతెల్లం చేస్తోంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రకారం 31 మార్చి 2012 నాటికి గుజరాత్ అప్పు 1,38,978 కోట్ల రూపాయలు. ఇది ప్రొవిజనల్ అంకె కూడా కాదు. వాస్తవ వివరాల ప్రకారం సవరించిన అంకె. గుజరాత్ ను మించిన రాష్ట్రాల్లో ఇటీవల వరకూ వామపక్షాలు పాలించిన పశ్చిమ బెంగాల్, మాయావతి పాలించిన ఉత్తర ప్రదేశ్ లు కూడా ఉండడం గమనార్హం. మార్చి 31, 2012 తేదీ నాటికి బెంగాల్ అప్పు 1,92,100 కోట్లు కాగా ఉత్తర ప్రదేశ్ అప్పు 1,58,400 కోట్లు. అయితే ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు తమవి మోడల్ స్టేట్ లు గా చెప్పుకోవడం లేదు. కేవలం మోడి మాత్రమే తమది నమూనా రాష్ట్రంగా చెబుతూ దేశాన్ని కూడా గుజరాత్ లాగానే అభివృద్ధి చేస్తాను అంటున్నారు.

తలసరి అప్పు ప్రకారం చూసినా మోడి వదిలి వెళ్ళే గుజరాత్ అప్పు మామూలుగా లేదు. గుజరాత్ తలసరి అప్పు మార్చి 31, 2012 నాటికి 23,613 రూపాయలు. అనగా చిన్నా, పెద్దా, ముసలీ, ముతకా గుజరాతీయులు అంతా ఒక్కొక్కరు చెల్లించాల్సిన అప్పు అక్షరాలా 23,613 రూపాయలు. గుజరాత్ జనాభా సరిగ్గా 6 కోట్లు అని భావిస్తే లెక్కకు వచ్చే తలసరి అప్పు ఇది.

ఋణ సేవల (చెల్లింపులు) విషయానికి వస్తే గుండె గుభేల్ మానడం ఖాయం. రోజుకు కేవలం వడ్డీ నిమిత్తమే 34.50 కోట్ల రూపాయలు గుజరాత్ చెల్లిస్తోంది. 2013-14 నాటికి గుజరాత్ అప్పు 1,79,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తుండగా 2015-16 నాటికది 2,07,695 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ బడ్జెట్ అంచనాల ప్రకారమే ఈ అంచనాకు రావచ్చని టి.ఓ.ఐ తెలిపింది.

డజను సంవత్సరాల్లో గుజరాత్ మాతకు నరేంద్ర మోడి చెల్లించిన రుణం 1,30,000 (1,76,000 కోట్లు మైనస్ 45,301 కోట్లు) పై చిలుకే ఉంటే భారత మాతకు ఐదేళ్లలో మోడి చెల్లించనున్న రుణం ఇంకెంత ఉంటుందో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే.

మోడి చేసిన అప్పుల్లో ప్రధాన భాగం గొప్పలు చూపుకునే ఇన్ఫ్రా స్ట్రక్చర్ రంగంలోనే ఖర్చు పెట్టారని విమర్శకుల అభిప్రాయం. వైద్యం, ఆరోగ్యం, ప్రజలకు అత్యవసరమైన మౌలిక నిర్మాణాలు (రోడ్లు, ప్రజా సదుపాయాలు) తదితర రంగాల్లో పెట్టింది అత్యల్పం అని వారి విమర్శ. గుజరాత్ లో జనం తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారన్న సంగతి అందరికి తెలిసిందే. దీనికి సమాధానం చెప్పమంటే ఆడపిల్లల సౌందర్య పిపాస వలన పాలు తాగరని అందుకే పోషకాహార లోపం అనీ చెప్పిన ఘనులు మోడి గారు.

రాష్ట్ర ఆదాయంలో భారీ మొత్తం ఋణ చెల్లింపులకే పోతుండగా మిగిలింది షో-పీస్ నిర్మాణాలకు పోతోంది. ఇటీవల తలపెట్టిన భారీ పటేల్ విగ్రహ నిర్మాణం ఈ కోవలోనిదే. రైతుల నుండి ఇనుము సేకరించి కడుతున్నాం అని చెప్పే ఈ విగ్రహం అవసరం ఏమిటో చెప్పినవారు లేరు. పోనీ రైతుల నుండి ఇనుము ఎలా సేకరిస్తారో కూడా చెప్పినవారు లేరు. అసలు రైతుల నుండి ఇనుము సేకరించడం ఏమిటో అర్ధం కాని విషయం.

అత్యధిక వ్యాట్ (Value Added Tax) వసూలు చేసే రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. పెట్రోల్ మీద అధిక వ్యాట్ వసూలు చేయడంలో కూడా గుజరాత్ ముందే ఉంది. రైతులకు ఇచ్చే ఎరువుల పైన వ్యాట్ వసూలు చేసే అతి కొద్ది రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. (కర్ణాటక బి.జె.పి ప్రభుత్వం కూడా ఈ పుణ్యం కట్టుకుంది.) 2013లో గుజరాత్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కాగ్ నివేదిక ప్రకారం 31 మార్చి 2012 నాటికి అంతకు ముందు ఐదేళ్లలో పెట్టిన పెట్టుబడుల్లో 39,179 కోట్ల పెట్టుబడులకు సగటున సాలీనా 0.27 శాతం మాత్రమే ఆదాయం వచ్చే రంగాల్లో పెట్టింది. అదే కాలంలో గుజరాత్ చేసిన అప్పులకు గాను శాలినా 7.75 శాతం వడ్డీ చెల్లించింది. పెద్దమొత్తంలో అప్పులు తెచ్చి ఆదాయం లేని రంగాల్లో పోయడం వలన గుజరాత్ ఆర్ధిక పరిస్ధితి త్వరలోనే దివాళా స్ధితికి చేరుతుందని కాగ్ హెచ్చరించింది. ఈ మాత్రం తెలియడానికి కేంద్ర ఆడిటింగ్ సంస్ధ కాగ్ కావాలా?

6 thoughts on “గుజరాత్: అప్పుల కుప్పగా మార్చిన మోడి

  1. చీకటి గారు,
    మీ పోష్టు బాగుంది కానీ మోడి అభిమానికి ఇంత ఓపిక ఉందమారా? ఇంత సౌమ్యత పాటిస్తారా? నెవెర్‌!

  2. Meeru ichhina samachaaramlo iteevala daaka 30 sanvachharaalu vaamapakshaala adhikaaramlo unna west bengal ani prastaavinchaaru vaamapkshaalu adhkaaramloki raakamundu unna appu enta 30 ella vaamapakshaala paalanalo perigina runa bhaaram enta mamata benarjee TMC adhikaaramlokivachhina tarvaata perigina runabhaaram enta anedi denukadi vidigaa vivarangaa istebaagundedi.ika modi BJP gaani congress gaani eedesaani aneka raastraalanu runagrastam cheyyaatamlo keelaka paatradhaarulu.eerenditivi oke aardhika vidhaanaalu aardhikavidhaanaallo renu oke naanaaniki bommaa borusulaantivi.avineetiki appulaku prajalpibhaaraalaku dharalaperugudalaku nootana aardhikavidhaanaale pradhaana kaaranam,vaatiki vyatirekangaa poraadatam lokikavaadaanni rakshinchu kovadam eedesamundunaa pradhaana kartavyaalu.anduku prajalanu chitanyaparachatamlo meelanti medhaavulu keelaka bhoomikanu poshinchaali.

  3. మోడీ ఒక్కడే కాదు ,ఏ నాయకుడి వాగ్ధాటికీ మనం లొంగకూడదు.ప్రతి రాష్ట్రం ,మొత్తం దేశానికి సంబంధించిన గణాంకాలు,మానవ అభివృద్ధి సూచికలు (human development index) ప్రభుత్వాలేగాక,నమ్మదగిన ప్రైవేటు సంస్థలు,అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తుంటాయి.వాటి ఆధారంగా మనం అభిప్రాయాలు ఏర్పరుచుకోవాలి.గుజరాతీలు సహజంగా వ్యాపారదక్షతకలవారు (enterpreneurs) కాబట్టి వ్యాపారం ,పరిశ్రమల విషయంలో గుజరాత్ అభివృద్ధి చెందింది.కాని మిగతా అనేకవిషయాల్లో మన అంధ్రప్రదేశ్ కన్న వెనుక బడి ఉన్నట్లు తెలుస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s