శశిధరూర్ భార్య సునంద ఆత్మహత్య?!


Shashi-Sunanda

కేంద్ర మంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ తమ హోటల్ గదిలో చనిపోయి కనిపించారు. ఎఐసిసి సమావేశాలకు హాజరయిన శశి ధరూర్ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో హోటల్ కి వచ్చారని హోటల్ సిబ్బందిని ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. కానీ శశిధరూర్ తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదని, హోటల్ సిబ్బంది తమ వద్ద ఉన్న మాస్టర్ కార్డ్ తో తెరిచి చూడగా సునంద పుష్కర్ చనిపోయి కనిపించారని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. తమ సమాచారానికి ఆధారం ఏమిటో ఫస్ట్ పోస్ట్ చెప్పలేదు. తమ ఇంటికి పెయింటింగ్ వేస్తున్నందుకు శశిధరూర్ దంపతులు గురువారం నుండి హోటల్ లో ఉంటున్నారు. పాకిస్ధానీ మహిళా విలేఖరితో వివాదం ముగిసిన తర్వాత రోజే సునంద ఆత్మహత్య చేసుకోవడంతో కేసు మరింత జఠిలం అయింది.

సునంద ఆత్మహత్య/మరణం గురించి శశి ధరూర్ వ్యక్తిగత సిబ్బంది తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు చెప్పినట్లుగా ది హిందు తెలిపింది. కానీ ఫస్ట్ పోస్ట్ సమాచారం ఇందుకు భిన్నంగా ఉంది. శశి ధరూరే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చి పిలిచారని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. పోస్ట్ మార్టం నివేదిక తర్వాత మాత్రం మరణం ఎలా సంభవించింది తెలుస్తుందని పోలీసులు చెప్పారు. సునంద విగత దేహంలో రిగర్ మార్టిన్ మొదలయిందని దాన్ని బట్టి మధ్యాహ్నమే ఆమె చనిపోయి ఉండవచ్చని ఫోరెన్సిక్ వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది.

శశి ధరూర్, సునంద పుష్కర్ లు మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. అనగా 7 సంవత్సరాలు పూర్తి కాలేదు. అందువలన చట్టం ప్రకారం విచారణ ప్రారంభం అయిందని ఉన్నత స్ధాయి ప్రభుత్వ వర్గాలు చెప్పారని పత్రిక తెలిపింది. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ స్ధాయి అధికారి విచారణ చేస్తారని తెలుస్తోంది.

Mehr Tarar

Mehr Tarar

లీలా కెంపిన్ స్కీ హోటల్ లో రూమ్ నెంబర్ 345 లో శశిధరూర్, సునందా పుష్కర్ దంపతులు గురువారం నుండి నివసిస్తున్నారు. సునంద తన గదిలో చనిపోయి కనిపించారని హోటల్ సిబ్బంది ఫోన్ లో చెప్పడంతో పోలీసులు హుటాహుటిన వచ్చారు. శశిధరూర్ వ్యక్తిగత సహాయకుడు అభినవ్ కుమార్ ప్రకారం ధరూర్ శుక్రవారం ఉదయమే హోటల్ వదిలి వచ్చారు. ఎ.ఐ.సి.సి సమావేశాలకు ఆయన హాజరవుతున్నారు. ధరూర్, రాత్రి గం. 8:15 ని.ల ప్రాంతంలో హోటల్ కి తిరిగి వచ్చారు. అయితే ఆయన కొద్ది సేపు తన గదిలో (ante-room) లో గడిపారు. మరో ఎంగేజ్ మెంట్ కు హాజరు కావాల్సిన సమయం దగ్గరపడడంతో ఆయన పడకగదిలోకి అడుగు పెట్టారు. అక్కడ మంచంపై తన భార్య చనిపోయి ఉండగా అప్పుడాయన కనుగొన్నారు.

గదిలో ఆత్మహత్య లేఖ ఏమీ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీ ఫోరెన్సిక్ సైన్స్ బృందం గదిని తనిఖీ చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వెబ్ సైట్ లో శశిధరూర్ కేంద్రంగా ఆయన భార్య సునంద, పాకిస్తాన్ మహిళా విలేఖరి మెహర్ తరర్ ల మధ్య ట్వీట్ ల యుద్ధం నడుస్తోంది. మెహర్ తరర్ తన భర్త వెంట పడుతోందని (stalking) సునంద ఆరోపించారు. శశిధరూర్ ట్విట్టర్ పేజీలో మెహర్ తరూర్ నుండి “ఐ లవ్ యు….” అంటూ  సందేశాలు ప్రత్యక్షం కావడంతో రగడ మొదలయింది. సదరు ట్వీట్ లు ఇలా ఉన్నాయి:

@mehrtarar I love you, Shashi Tharoor. And I go while in love with you, irrevocably, irreversibly, hamesha. Bleeding, but always your Mehr,

Shashi. I’m not crying any more. I’m not falling to pieces. I’m more lucid than ever. How little I knew you became visible to me.@mehrtarar

You unfollowed me. You don’t RT me and you don’t answer me on twitter. I can live with your favourites. I have your personal validation have your personal validation of my words, I don’t need any public one. For that I will wait until we are together publically really mehr

ఈ ట్వీట్ లన్నీ మెహర్ తరర్ పోస్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కానీ ఇవి శశిధరూర్ ట్విట్టర్ పేజీలో పోస్ట్ అయ్యాయి. దానితో శశిధరూర్ తాను వీటిని పోస్ట్ చేయలేదని తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని ప్రకటించారు. అయితే సునంద పుష్కర్ ఎకనమిక్ టైమ్స్ (ఇ.టి) పత్రికతో మాట్లాడుతూ అసలు గుట్టు విప్పారు. ధరూర్ ట్విట్టర్ ఖాతాను ఎవరూ హ్యాక్ చేయలేదనీ, తానే ధరూర్ పేజీ లోకి లాగిన్ అయి వాటిని పోస్ట్ చేశాననీ, అవన్నీ శశిధరూర్ మొబైల్ ఫోన్ లో కనిపించాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె శశి ధరూర్, మెహర్ తరర్ లు ఇద్దరినీ ఏకీ పారేశారు. ఇలా:

“Our accounts have not been hacked and I have been sending out these tweets. I cannot tolerate this. This is a Pakistani woman who is an ISI (Inter Services Intelligence) agent, and she is stalking my husband. And you know how men are. He is flattered by the attention. I took upon myself the crimes of this man during IPL (Indian Premier League). I will not allow this to be done to me. I just can’t tolerate this. I have nothing more to say,” she said, speaking on the phone.

“మా ఖాతాలను ఎవరూ హ్యాక్ చేయలేదు. ఈ ట్వీట్ లను నేను పంపుతున్నాను. దీనిని నేను ఎంత మాత్రం సహించేది లేదు. ఈమె ఒక ఐ.ఎస్.ఐ (పాక్ గూఢచార సంస్ధ) ఏజెంటు. ఆమె నా భర్త వెంటపడుతోంది. ఈ మగాళ్లు ఎలాంటివారో మీకు తెలిసిందే కదా. ఆమె చూపుతున్న ఆసక్తికి ఈయనగారు పడిపోయారు. ఐ.పి.ఎల్ సందర్భంగా ఈయన చేసిన నేరాలను నా నెత్తిమీద వేసుకున్నాను. ఇలాంటి వ్యవహారం నా విషయంలో జరగడానికి నేను అనుమతించను. దీనిని అసలు సహించను. ఇంతకుమించి చెప్పేదేమీ లేదు” అని సునంద పుష్కర్ ఇ.టి తో మాట్లాడుతూ చెప్పారు.

సునంద పుష్కర్ తన భర్త వ్యవహారాన్ని క్షమించడానికి ఏ మాత్రం ఇష్టపడ లేదని ఈ సమాధానం స్పష్టం చేస్తోంది. ‘ఈ మగాళ్లు ఎలాంటివారో మీకు తెలిసిందే కదా’ అనడంలోనే ఆమె తన నిస్సహాయతను, వ్యతిరేకతను, అసహ్యాన్ని వెళ్ళగక్కారు. పైగా ఐ.పి.ఎల్ లో శశిధరూర్ నేరానికి పాల్పడ్డారని, దాన్ని తన నెత్తిమీద వేసుకున్నానని కూడా ఆమె చెప్పారు. (కోచి ఫ్రాంఛైజీని తమకు దక్కేలా సహాయం చేసినందుకు 70 కోట్లు శశిధరూర్ కు సదరు యాజమాన్యం ముట్టజెప్పిందని ఆరోపణ. సునంద పుష్కర్ కు కోచి ఫ్రాంఛైజీ లో 70 కోట్ల మేరకు వాటా ఉన్నట్లుగా దీన్ని మార్చి చెప్పారు. నిజానికి సదరు మొత్తం సునంద వాటా కాదని శశిధరూర్ కు ముట్టిన లంచం సొమ్మని సునంద వివరణతో స్పష్టం అయింది.) శశిధరూర్-మహార్ తరర్ వ్యవహారాన్ని తాను తేలికగా వదలదలుచుకోలేదని కూడా ఆమె స్పష్టం చేశారు.

ఈ ఆరోపణలకు మెహర్ తరర్ ట్విట్టర్ ద్వారా ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఒక మహిళ తన భర్తకు, మరో మహిళకు సంబంధం అంటగట్టడం బట్టే ఆమె పతనాన్ని అర్ధం చేసుకోవచ్చని, తానసలు ధరూర్ ను రెండు సార్లు మాత్రమే కలుసుకున్నానని ఆమె తెలిపారు.

అయితే శుక్రవారానికల్లా ఈ తగాదా సెటిల్ అయినట్లు కనిపించింది. ధరూర్ ట్విట్టర్ పేజీలో దంపతుల సంయుక్త ప్రకటనతో వివాదం పరిష్కారం అయిందని అంతా భావించారు. తాము సంతోషంగా ఉన్నామని, ఎట్టి వివాదమూ లేదని వారు తమ ప్రకటనలో తెలిపారు. మెహర్ తరర్ దానికి స్పందనగా ‘సంతోషం’ ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేసింది. వాస్తవంలో సమస్య పరిష్కారం కాలేదేమోనన్న అనుమానాన్ని సునంద ఆత్మహత్య లేవనెత్తింది.

పత్రికల కధనం ప్రకారం సునంద రెండు జబ్బులతో బాధపడుతున్నారు. ఒకటి: లూపస్, రెండు: కడుపులో టి.బి. లూపస్, పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా వచ్చే వ్యాధి. దీనివలన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్ధ అపసవ్యంగా ప్రేరేపితమై ఆరోగ్య కణాలనే చంపేస్తుంది. కీళ్ల నొప్పి, వాపులతో పాటు (ఆర్ధరైటిస్) గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు కూడా దీనివల్ల దెబ్బ తింటాయి. ఈ జబ్బులకు సునంద చికిత్స తీసుకుంటున్నారు. ఈ వివాదం ప్రారంభం కాక ముందు ఆమె తిరువనంతపురంలో ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు కూడా. సునంద ఆత్మహత్యకు ట్విట్టర్ వివాదం కారణమా లేక వ్యాధులే కారణమా అన్నది తేలాల్సి ఉంది (ఆమెది ఆత్మహత్య అయితే). ఆత్మహత్య లేఖ రాస్తే పోలీసుల పని సులభం అవుతుంది. రాసినా దానిని దాచేస్తే సునందకు అన్యాయం జరిగినట్లు అవుతుంది.

కానీ జరిగింది మాత్రం చాలా ఘోరం. లూపస్ వ్యాధిగ్రస్తులకు మూడ్ అప్ అండ్ డౌన్స్ కి గురి కావడం కూడా ఒక లక్షణం. డిప్రెషన్ కూడా రావచ్చు. ఇవి కాకుండా దాంపత్య జీవితం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటే పురుష స్వామ్యానికి అది మరో తార్కాణం అవుతుంది. పారిశ్రామికవేత్తగా సఫలం అయిన మహిళలకు కూడా ఇలాంటి హృదయం బద్దలయ్యే మగస్వామ్యం ఎదురుకాక తప్పదని రుజువయినట్లు అవుతుంది. అలా కాకూడదనే ప్రస్తుతానికి ఆశిద్దాం.

One thought on “శశిధరూర్ భార్య సునంద ఆత్మహత్య?!

  1. నాదో ప్రశ్నండీ. Of course. It’s just me talking to myself.

    అసలు భర్తలు ఇంకొకర్ని ప్రేమిస్తే బ్రద్దలయ్యేంత నాజూకుగా భార్యలు ఎందుకుండాలి? దీన్ని సాతివ్రత్యం అనొచ్చా? (ఒకవేళ అనొచ్చనుకుంటే) ఈ పాతివ్రత్యానికీ, సాతివ్రత్యానికీ అతీతంగా మనం మన హృదయాలను అభివృధ్ధిచేసుకోవలసిన అవసరం ఉందా లేదా? (Of course rightfully…!) శీలం అన్నదాన్ని శరీరపు పరిధులకావల ఉన్నదానిగా నిర్వచిస్తున్న ఈకాలంలోకూడా ఎందుకు భార్యలు/భర్తలు తమ భాగస్వాముల లైంగిక సంబంధాలపై ఇంత తీవ్రంగా స్పందించాలి? శరీరానికి సంబంధించిన కోర్కెనుకూడా కేవలం కోర్కెగా ఎందుకు చూడకూడదు?

    మన సమాజంలో పెళ్ళికీ అతిపురాతన వృత్తికీ తేడా పెద్దగా లేకుండాపోయింది. ఇష్టమున్నా లేకున్నా చుట్టుప్రక్కలవారికోసం కలిసుంటూ, గౌరవాన్ని నిలుపుకోవడానికి ఒక తంతుగా మిగిలిపోయింది? ఇలాంటి పరిస్థితుల్లో భార్యో భర్తో తమకు మరింతసరిపోయే జోడీ దొరికితే ఏం చెయ్యాలి? తమనీ, భాగస్వామినీ ఎవ్వరినీ పూర్తి సంతృప్తిగా ఉంచలేక (మన పార్లమెంటు సభ్యునిలా) అర్ధబ్రతుకు బ్రతకాలా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s