ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ సంస్ధలు అండదండలు అందిస్తున్నాయన్న అనుమానాలకు ఊతమిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలయింది. అమెరికాకు చెందిన ఫోర్ట్ ఫౌండేషన్ ఎఎపి కి అన్ని విధాలా సహకారం ఇస్తోందని ఈ పిటిషన్ ఆరోపించింది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఎన్.ఆర్.ఐ ల పేరుతో అమెరికా నుండి ఢిల్లీ ఓటర్లకు పెద్ద ఎత్తున ఫోన్లు, ఎస్.ఎం.ఎస్ లు వచ్చాయని, ఈ కార్యక్రమం వెనుక ఫోర్డ్ ఫౌండేషన్ హస్తం ఉందని పిటిషనర్ ఆరోపించారు.
ఫోర్డ్ ఫౌండేషన్ ఇండియాకు కొత్త కాదు. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలోనే అమెరికా తరపున మన దేశంలో గూఢచర్యం నెరిపిన చరిత్ర ఫోర్ట్ ఫౌండేషన్ కు ఉన్నదని ‘తాకట్టులో భారత దేశం’ అన్న పుస్తకంలో అప్పటి కమ్యూనిస్టు పార్టీ నేత తరిమెల నాగిరెడ్డి గారు వెల్లడించారు. ఛారిటీ సేవల పేరుతో ఈ ఫౌండేషన్ విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించింది. ఎన్.జి.ఓ సంస్ధల ఉద్యమాల నుంచి ఉద్భవించిన ఎఎపి వెనుక కూడా ఫోర్డ్ ఫౌండేషన్ ఉందన్న వార్తలు నిస్సందేహంగా ఆందోళనకరం. ఈ ఆరోపణలు నిజమే అయితే ఎఎపి కి రహస్య ఎజెండా (hidden agenda) ఉందని చెప్పవచ్చు.
అడ్వకేట్ ఎం.ఎల్.శర్మ తాజా పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎఎపి కి విదేశీ నిధులు అందాయని ఆరోపిస్తూ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కూడా ఈయనే కావడం గమనార్హం. సదరు పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ‘విదేశాల నుండి వచ్చిన ఫోన్ కాల్స్, ఎస్.ఎం.ఎస్ లపై విచారణ జరిపించాలంటూ’ ఆయన తాజా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తన స్పందన తెలియజేయాలంటూ హై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం (జనవరి 17) ఆదేశించింది.
జస్టిస్ ప్రదీప్ నంద్ రాజోగ్ నేతృత్వంలోని బెంచి ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఢిల్లీ ఎన్నికల్లో అమెరికా నుండి వచ్చిన బృందం నిర్వహించిన పాత్రపై విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ కోరింది. విచారణ నిర్వహించి నివేదిక తయారు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.
అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆయన బృందం సభ్యులందరూ అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ గ్రూపు ‘పూర్తి స్ధాయిలో ప్రమోట్ చేస్తూ, మద్దతు సమకూర్చిపెడుతోందని’ పిటిషన్ ఆరోపించింది. ఎన్నికలకు చాలాకాలం ముందు నుండే వీరు ఫోర్డ్ ఫౌండేషన్ పోషణలో ఉన్నారని పిటిషనర్ తెలిపారు. ఫౌండేషన్ కు చెందిన వ్యక్తులు ఎన్.ఆర్.ఐల పేరుతో ఇండియాలో చురుకుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తమ ఆరోపణలకు సాక్ష్యంగా పత్రికల వార్తలను పిటిషనర్ ప్రస్తావించారు. “నవంబర్ నుండి డిసెంబర్ 2013 వరకూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 లక్షల ఫోన్ కాల్స్ ఢిల్లీ ప్రజలకు వచ్చాయి. వీటి ఖరీదు రు. 10 కోట్లకు పైనే. ఒక్క లాస్ ఏంజిలిస్ నగరం నుండి ఢిల్లీ ఓటర్లకు ఈ కొద్ది కాలంలో 300 ఎస్.ఎం.ఎస్ లు వచ్చాయి. ఎఎపి కి మద్దతు ఇవ్వాలని, ఆ పార్టీకి ఓటు వేయాలని ఈ ఫోన్ కాల్స్, ఎస్.ఎం.ఎస్ లు ఓటర్లను కోరాయి” అని పత్రికలు చెప్పాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.
టెలిఫోన్ కాల్స్ కి గానీ, ఎస్.ఎం.ఎస్ లకు గానీ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి లేదని పిటిషనర్ ఎత్తి చూపారు. ఇతర ప్రభుత్వ శాఖల నుండి కూడా తగిన అనుమతి లేదని కాబట్టి ఇది జాతీయ భద్రతకు సంబంధించిన సమస్య అని చెప్పారు. దేశద్రోహం కిందికి కూడా వస్తుందని ఆక్షేపించారు.
మరో ముఖ్యమైన అంశాన్ని కూడా పిటిషనర్ లేవనెత్తారు. భారత దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియల్లో విదేశాల నుండి జోక్యం చేసుకునే అవకాశం భారత రాజ్యాంగంలో ఉన్నదో లేదో పరిశీలించాలని పిటిషనర్ కోరారు.
ఎన్.ఆర్.ఐలు అని చెప్పుకుంటున్నప్పటికీ వారు ప్రాధమికంగా విదేశీ పౌరులు. కాబట్టి ఢిల్లీ ఎన్నికల్లో ఫలానా పార్టీకి లేదా ఫలానా అభ్యర్ధికి ఓటు వేయాలని కోరడం అంటే అది విదేశాల నుండి జరిగే జోక్యమే. ఈ జోక్యాన్ని కొన్ని పత్రికలు ఎఎపి అనుసరించిన భ్రహ్మాండమైన ఎత్తుగడగానూ, సాంప్రదాయక పార్టీలకు రాని గొప్ప ఐడియా గానూ ఆకాశానికెత్తడం ఎలా అర్ధం చేసుకోవాలి?
అవినీతి వ్యతిరేక ఉద్యమ నేతలయిన అన్నా హజారే, కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్ లు మెగసెసే అవార్డు గ్రహీతలు. మెగసెసే అవార్డుకు ఫైనాన్స్ వనరులు సమకూర్చేది ఫోర్డ్ ఫౌండేషన్! అవినీతి వ్యతిరేక ఉద్యమ కాలంలోనే ఫౌర్డ్ ఫౌండేషన్ మద్దతు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలను అరవింద్ కేజ్రీవాల్ ఖండించకపోగా ‘తప్పేంటి?’ అని అడిగారు. ‘ఫౌర్డ్ ఫౌండేషన్ చెడ్డది అయితే దాన్ని రద్దు చేయండి!’ అని సవాలు కూడా విసిరారు. విచిత్రం ఏమిటంటే జన్ లోక్ పాల్ బిల్లు ప్రతిపాదించిన అన్నా-కేజ్రీవాల్ బృందం లోక్ పాల్ పదవికి చివరి ఇద్దరు మెగసెసే అవార్డు గ్రహీతలను అర్హులుగా చేయాలని సదరు బిల్లులో పొందుపరిచారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా (ఢిల్లీ మంత్రి) లు నడిపిన స్వచ్ఛంద సంస్ధ ‘కబీర్’ కు ఫోర్డ్ ఫౌండేషనే నిధులు అందించిన సంగతిని ప్రస్తావించుకోవడం అవసరం.
నిజానికి ఈ తరహా విదేశీ జోక్యానికి సంబంధించి ఎఎపి ఒంటరిగా ఏమీ లేదు. వివిధ రూపాల్లో ఈ తరహా జోక్యం లేదా సహకారం ఇతర పార్టీలకు కూడా అందుతుండడం తెలిసిన విషయమే. ఉదాహరణకి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ విదేశీ ప్రభుత్వాల, అధికారుల అభిప్రాయాలను కొందరు భారతీయ ప్రముఖులు డిమాండ్ చేశారు. మోడీకి వీసా ఇవ్వొద్దని ఏకంగా ఎం.పి లే అమెరికాని కోరిన చరిత్ర ఈటీవలిదే. కాంగ్రెస్, బి.జె.పి లు కూడా విదేశాల నుండి వివిధ రూపాల్లో నిధులు సేకరించాయని వివిధ సందర్భాల్లో పత్రికలు చెప్పాయి. కాకపోతే ఇవి ఎన్నికల సందర్భంగా జరిగి ఉండకపోవచ్చు.
ఎన్నికల విషయం అటుంచి కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఎ మంత్రి పదవి నిర్వహించాలన్న విషయంలో కూడా అమెరికా ప్రభావితం చేస్తుందని వికీలీక్స్ వెల్లడి చేసిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడి అయిన సత్యం. ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీని నియమించినప్పుడు అప్పటి అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ అసహనం వ్యక్తం చేశారనీ, ఆయన బదులు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారని వికిలీక్స్ పత్రాలు వెల్లడి చేశాయి.
కాబట్టి విదేశీ జోక్యం గురించి కొత్తగా భృకుటి ముడివేయడం అమాయకత్వమే కాగలదు. విదేశీ కంపెనీలకు దేశంలోని ఖనిజ, నీటి, అటవీ వనరులను అప్పనంగా అప్పగిస్తున్న ప్రభుత్వాల ఏలుబడిలో దేశం మొత్తం ఉండగా ఎఎపి మాత్రమే అందుకు అతీతంగా ఉండగలదా? అమెరికాకు ప్రయోజనాలు చేకూర్చే అణు ఒప్పందాన్ని అంగీకరించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించినపుడు ఎవరూ ఏ పిటిషనూ దాఖలు చేయలేదు. భోపాల్ విషవాయువు దుర్ఖటనలో వేలాది మంది చనిపోయినా కంపెనీ అధిపతి యాండర్సన్ ను గుట్టుగా దేశం దాటించిన ప్రభుత్వాలు మనవి. 26/11 ముంబై టెర్రరిస్టు దాడులకు పాకిస్ధాన్ మీద విరుచుకుపడేవారే గానీ, సదరు దాడులకోసం రెక్కి నిర్వహించిన సి.ఐ.ఏ గూఢచారి డేవిడ్ హేడ్లీని ఇండియాకు అప్పగించడానికి నిరాకరిస్తున్న అమెరికాను ప్రభుత్వం ఎందుకు నిలదీయదో అడిగేవారు లేరు. ఆ సంగతి సో కాల్డ్ దేశ భక్తులకూ పట్టదు, కోర్టులకూ పట్టదు. ప్రభుత్వాలకు అసలే పట్టదు.
ఈ నేపధ్యంలో పిటిషనర్ లేవనెత్తిన ప్రశ్నలు ముఖ్యమైనవి. పిటిషనర్ ఉద్దేశ్యం ఎలా ఉన్నా, ఈ పిటిషన్ విచారణ సీరియస్ గా జరిగితే గనుక దాని ఫలితం ప్రభావం కాంగ్రెస్, బి.జె.పి లపై కూడా పడడం ఖాయం. ఇందిరా గాంధీ హయాంలో బహుళ ప్రాచుర్యం పొందిన ‘విదేశీ హస్తం’ ఆరోపణ మళ్ళీ మరొక్కసారి భారత రాజకీయాలను చుట్టుముట్టనుంది.
(ఎన్.జి.ఓలతో ఉద్యమాలు నిర్వహించడం ఆ తర్వాత సమస్యలపై ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించడం ఇండియాకే పరిమితం కాదు. ఈ అంశంపై గతంలో రాసిన ఆర్టికల్ కింద లింక్స్ లో చూడవచ్చు.)
కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -1
కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -2
కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -3
కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -4
వి.శేఖర్ గారు. మీరు నాగిరెడ్డి గారి తాకట్టులో భారతదేశం చదివారా…? దానితో పాటూ దేవులపల్లి వెంకటేశ్వర్రావు(D.v.) గారు రచించిన కోర్టుస్టేట్ మెంట్ కూడా చదవగలరు.
ఇది చాలా,చాలా పాత వార్త కదండి. ఈ విషయం మీకు ఇంతవరకు తెలియదా?
http://www.outlookindia.com/article.aspx?278264
http://www.outlookindia.com/article.aspx?278266
*ఎన్.ఆర్.ఐలు అని చెప్పుకుంటున్నప్పటికీ వారు ప్రాధమికంగా విదేశీ పౌరులు… సాంప్రదాయక పార్టీలకు రాని గొప్ప ఐడియా గానూ ఆకాశానికెత్తడం ఎలా అర్ధం చేసుకోవాలి?*
హిందూ మాజి ఏడిటర్ సిద్దార్థ్ వరదరాజన్ విషయం మాటేమిటి? అమేరికా పౌరుడై ఉండి, భారత దేశ ఎన్నికల గురించి రోజు ఇంగ్లిష్ టివి చానల్స్ లో జరిగే చర్చలో స్వదేశి పౌరుడి మాదిరిగా పాల్గొనటాన్ని ఏమనుకోవాలి? మనదేశ రాజకీయ నాయకులను విమర్శించటం ఎంత వరకు సబబు? ఎవరైనా ప్రశ్నిస్తే నేను సుమారు దశాబ్దం పై గా ఇండియాలో నే ఉంట్టున్నానంటు సమర్ధించుకొంటారు. ఆయనను చూసి ఎవరు అమేరికా వాడనుకోరు. బ్లూం బర్గ్ లాంటి విదేశీ పత్రికలలో ఆప్ పార్టిదే భారత్ లో భవిషత్ అని రాస్తూంటాడు.
N. Ram denied that the move was prompted by the case filed by the BJP’s Subramanian Swamy on Varadarajan’s ineligibility to be editor of the paper because he is a US citizen, but admitted that it “was hanging like a sword over our heads”.
http://www.livemint.com/Consumer/7Igh9ncxU6SfsvAg9sukZL/Siddharth-Varadarajan-resigns-from-The-Hindu.html
http://www.bloomberg.com/news/2013-12-23/india-s-modi-wave-may-lose-momentum.html
NGOs: enemies or allies? 9 October 04
This article is an attempt to analyse the politics of the NGOs in Asia, using our experiences as socialists in Thailand as an example. Nearly 20 years have elapsed since the massive proliferation of NGOs in developing countries. The pre-1980s NGOs were mainly charitable foundations, such as the YMCA, the Red Cross, Japanese Societies of Gratitude, Budi Oetomo in Indonesia1 or the various Chinese mutual-help foundations which were set up in Thailand. The real spurt in growth of the NGOs came after the 1970s.
http://www.isj.org.uk/index.php4?id=18
The Security of Aam Aadmi by Col. RSN Singh
http://ibnlive.in.com/blogs/sauravjha/2976/64986/guest-post–5-the-security-of-aam-aadmi-by-col-rsn-singh.html
African Union to raise issue over Somnath Bharti’s raid at UN: Sources
Commerce Minister Anand Sharma has a tough time in Davos pacifying African leaders, who are extremely upset over Delhi law minister’s midnight raid. Anita Katyal reports
http://m.rediff.com/news/report/african-union-to-raise-issue-over-somnath-bhartis-raid-at-un-sources/20140126.htm?sc_cid=twshare
AAP’s NRI funding line dries up as affluent overseas donors say they ‘regret’ backing the party
http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2546335/AAPs-NRI-funding-line-dries-affluent-overseas-donors-say-regret-backing-party.html
AAP did what CPM wanted to do: Prakash Karat
http://articles.economictimes.indiatimes.com/2014-01-07/news/45955215_1_aam-aadmi-party-aap-communist-party
http://www.dnaindia.com/pune/report-aap-offered-money-party-post-for-propaganda-1956035
EC cautions Kejriwal on pamphlets appealing for Muslim votes
http://articles.timesofindia.indiatimes.com/2014-01-24/india/46561797_1_harish-khurana-arvind-kejriwal-model-code