మోడీకి నీతివంతులైన యువకులు కావాల్ట! -కార్టూన్


Clean Candidates

‘రాజకీయాలు ఎలా చేయాలో మేం వారికి నేర్పుతాం’ అని అరవింద్ కేజ్రీవాల్ కొన్ని నెలల క్రితం అన్నపుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొంతమంది పైకే నవ్వితే చాలా మంది లోలోపలే నవ్వుకున్నారు. అరవింద్ ది అతి విశ్వాసం అని చాలామంది రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. కానీ ‘నవ్విన నాప చేనే పండుతుంది’ అన్నట్లుగా ఇప్పుడు ఎఎపి వల్ల ప్రభావితం కానీ పార్టీ అనేదే ఇండియాలో లేకుండా పోయింది.

కాంగ్రెస్ అగ్ర యువ నేత రాహుల్ గాంధీ ఎఎపిని అనుసరిస్తున్న సంగతి దాచే ప్రయత్నమే చేయట్లేదు. బి.జె.పి పైకి కనిపించకపోయినా లోలోపలికి ఎఎపి గాలి జొరబడ్డ దాఖలాలు క్రమంగా వెల్లడి అవుతున్నాయి. నీతివంతమైన యువకుల అభ్యర్ధిత్వంపై మోడి తదితర అగ్రనేతలు దృష్టి సారించినట్లు ఇటీవల వస్తున్న వార్తలు ఈ కోవలోనివే.

“పాత మొఖాల్ని ఎన్నికల బరి నుండి తప్పించే అవకాశం ఉంది. సామర్ధ్యం రుజువు చేసుకున్న నీతివంతులైన యువ అభ్యర్ధులను ఎంపిక చేయాలని మోడి సూచించారు. ప్రభుత్వ వ్యతిరేకత నుండి తప్పించుకోడానికి కూడా అది ఉపయోగపడుతుంది. అభ్యర్ధుల ఎంపికలో వ్యక్తిగత విశ్వసనీయత, ఆమోదయోగ్యత కీలక పాత్ర పోషిస్తాయి” అని బి.జె.పి పార్టీ వర్గాలు చెప్పాయని ది హిందూ పత్రిక తెలిపింది.

దీనర్ధం కర్ణాటక మాజీ నేత యెడ్యూరప్పకు అవకాశాలు సన్నగిల్లినట్లేనా అన్నది ఒక ప్రశ్నగా ముందుకు వచ్చింది. యెడ్యూరప్ప సామర్ధ్యం ఏమిటో ఇప్పటికే రుజువయింది. అయితే ఆ సామర్ధ్యం మోడీ తదితర నేతలు కోరుతున్న నీతివంతులయిన యువతకు సంబంధించింది కాకపోవడమే సమస్య. ఆకులు, కొమ్మలు, వేళ్ళతో సహా విస్తరించిన యెడ్యూరప్పను యేరుకుని బుట్టలో వేసుకున్న మోడి కర్ణాటకలో ఎలా నెగ్గుకు వస్తారో చూడాల్సిందే. లేదా ఎఎపి ప్రభావంతో యెడ్యూరప్పను బుట్టలో నుండి బైటికి విసిరేస్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది.

7 thoughts on “మోడీకి నీతివంతులైన యువకులు కావాల్ట! -కార్టూన్

 1. సాంప్రదాయ పార్టీలన్నీ సాంప్రదాయకంగా వస్తున్న ఓటుబ్యాంకు అవలక్షణాల ఆధారంగానే నడుస్తున్నాయి. అవి కనీసం మారినట్లు కనిపించడానిక్కూడా తమనుతాము పూర్తిగా నాశనంచేసుకొని పునర్నిర్మించుకోగలగాలి. గలగడం సంగతటుంచితే అలాంటి సాహసం కూడా కాంగ్రెస్, బీజేపీ చెయ్యలేవు. ప్రస్తుతానికి వీళ్ళుచేస్తున్నదల్లా రంగులుపూసుకోవడమ్మాత్రమే!

 2. Delhi law minister Somnath Bharti under fire for ‘tampering with proof’
  NEW DELHI: The Congress on Tuesday raised questions over the continuance of Somnath Bharti as Delhi’s law minister after he termed as “erroneous” a CBI judge accused him of tampering with evidence in a case he was handling last year.

  “People in this country respect the judiciary the most. Our judiciary is independent and nothing can be more serious than raising questions on it,” said Congress Delhi chief Arvinder Singh Lovely.

  “Whether a department like law should be headed by a person who is himself accused of breaking the law is a matter of concern,” he added.

  According to media report, an order was passed by then CBI special judge Poonam A Bamba when she pulled up Bharti and his client Pawan Kumar — facing prosecution on corruption charges — after the CBI accused them of influencing a prosecution witness by speaking to him on phone and discussing the case.

  http://timesofindia.indiatimes.com/city/delhi/Delhi-law-minister-Somnath-Bharti-under-fire-for-tampering-with-proof/articleshow/28794462.cms

 3. శ్యామలరావు గారి అభ్యంతరాన్ని ప్రశంసిస్తూనే… నాదో చేర్పు. ఆ వాక్యంలో వ్యాకరణ దోషం కూడా ఏమీ లేకుండా ఉండాలంటే – ‘నీతిమంతులైన యువకులు ’ అని రాయాలి! (బుద్ధిమంతులు, శక్తిమంతులు – ఇలా ఇకారాంత పదాలకు ‘వంత’ బదులు ‘మంత ’ అని కలుస్తుంది)

 4. శేఖర్ గారు,
  ‘ నీతి వంతులైన యువకులు ‘ అన్న దానికి కూడా అర్దం తెలియాలి గదా. నీతి మనిషికి మనిషికి మారి పోతుంది. మోడి దౄష్టిలో నీతిమంతులైన అంటే ‘ మాకు తప్ప ఇంకెవ్వరికి హక్కులుండవు ” అని రొమ్ము విరుచుకొనే వారేమో!

 5. వేణు గారు, వ్యాకరణ వివరణతో సహా ఇచ్చిన మీ చేర్పుతో మరో సంగతి తెలిసింది. మళ్ళీ మార్చితే కూడలి వారితో సమస్య అని ఆ ధైర్యం చేయలేకున్నాను.

  నేను కొన్ని భాషా ప్రయోగాలను యధేచ్ఛగా చేసేస్తున్నాను. కాబట్టి మరిన్ని తప్పులు దొరకొచ్చేమో. సవరణలు సూచించడానికి మీబోటివారు ఎల్లప్పుడూ ఆహ్వానితులే. సవరణల వలన పాఠకులకు కూడా ఉపయోగం. (నేను ఎన్ని తప్పులు చేస్తే అన్ని ఒప్పులు తెలుస్తాయి.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s