నయాగరా జలపాతమే గడ్డకట్టిన కాలం… -ఫోటోలు


ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం నయాగరా అని మనకి తెలిసిందే. గుర్రపు డెక్క ఆకారంలో ఉండే ఈ భారీ జలపాతం నిత్యం సందర్శకులను ఆకర్షిస్తూ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ఫొటోల్లో చూస్తేనే గుండెలు గుభిల్లుమానిపించే ఈ జలపాతం గడ్డ కడితే?!

పోలార్ వొర్టెక్స్ పుణ్యమాని అటువంటి అరుదైన ప్రకృతి దృశ్యం మనిషి కళ్ల ముందు ఆవిష్కృతం అయింది. అమెరికా, కెనడాల సరిహద్దులో విస్తరించి ఉండే నయాగరా జలపాతం వద్ద చరిత్రలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జలపాతంలోని అధికభాగం గడ్డకట్టుకుపోయింది. నిత్యం నీటి తుంపర్లతో కూడిన పొగల్ని చిమ్ముతూ భారీ శక్తిని విడుదల చేసే నయాగరా గడ్డ కట్టినా, సందర్శకులు మాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా అరుదైన దృశ్యాలను చూడడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

డెయిలీ మెయిల్ పత్రిక ప్రకారం నయాగరా వద్ద జనవరి 8, 9 తేదీల్లో -2 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత మమోదయింది. తీవ్ర చలిగాలులు వీయడంతో -20F ఉష్ణోగ్రతలా తోచిందని పత్రిక తెలిపింది. ఈ ఉష్ణోగ్రతల వలన నయాగరాలో ఏర్పడిన మంచు గడ్డలను ‘ఐస్ జామ్’ అని పిలుస్తారట. ‘ఐస్ జామ్’ అంటే ఏమిటో కింద ప్రారంభ ఫొటోల్లో చూడవచ్చు. జనవరి 8, 9 తేదీల్లో తీసిన ఫొటోలివి.

నయాగరా జలపాతం గడ్డకట్టిన సందర్భాలు చరిత్రలో చాలా తక్కువ అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. రికార్డుల ప్రకారం 1848లో మాత్రమే చలి వాతావరణం వలన నయాగరా లోని వేలాది క్యూబిక్ అడుగుల నీరు గడ్డకట్టి మంచుగా మారింది. ఈ తరహా ఐస్ జామింగ్ వలన భారీ ఐసు గడ్డలే ఆనకట్టలుగా మారిన దృశ్యాలు రికార్డయ్యాయి.

మళ్ళీ 1936లో ఇలాంటి వాతావరణం ఏర్పడింది. అమెరికావైపు ఉండే జలపాతం మొత్తంగా గడ్డకట్టిందని ఎన్విరాన్ మెంటల్ గ్రాఫిటి అనే వెబ్ సైట్ ద్వారా తెలుస్తున్నది. కింద ఫొటోల్లో 1911, 1912 సంవత్సరాల నాటి నయాగరా గడ్డకట్టిన దృశ్యాలను చూడవచ్చు. ఐస్ జామింగ్ వలన నహాగరాలోని ఒక ఒడ్డు నుండి మరో ఒడ్డుకు వెళ్లడానికి ఐస్ బ్రిడ్జిలు ఏర్పడ్డాయని సదరు వెబ్ సైట్ తెలిపింది. ఏకంగా జలపాతం మీదనే సందర్శకులు నడిచి వెళ్తున్న దృశ్యాలను కింద చూడవచ్చు.

Photos: Daily Mail, RT.com, Hanif world

 

One thought on “నయాగరా జలపాతమే గడ్డకట్టిన కాలం… -ఫోటోలు

  1. కళ్ళు చెదిరేలా ఉన్నాయి ఫొటోలు చూస్తుంటే! అంత పెద్ద జలపాతం చలి ధాటికి హిమపాతంగా మారిపోయిందన్నమాట!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s