మనిషి సృజనాత్మకతకు అవధుల్లేవు అనడానికి ఈ మంచు శిల్పాలు ఒక సూచిక. శిల్పాల సంగతి అటుంచి చైనాలో మంచుతో ఏకంగా భవనాలే నిర్మించడం ఫొటోల్లో చూడొచ్చు.
ఉత్తరార్ధ గోళంలో ఉన్న దేశాల ప్రజలకే ఈ మంచు శిల్పాలు చెక్కే అవకాశం వస్తుందనుకుంటాను. అంటార్కిటికాకు దగ్గర్లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కూడా శిల్పాలు చెక్కే మంచు అందుబాటులో ఉంటుందేమో.
బిగ్ బెన్ గడియారం దగ్గర్నుండి వివిధ జంతువులు, వివిధ మైధాలజీల పాత్రలు, టైటానిక్ పడవలాంటి ఘటనల వరకూ భారీ పరిమాణాల్లో చెక్కి ‘మంచు పండగ’ల్లో ప్రదర్శించగా తీసిన ఫొటోలివి.
‘హార్బిన్ ఫెస్టివల్’ పేరుతో చైనాలో హార్బిన్ అనే చోట ప్రత్యేకంగా మంచు శిల్పాల పండుగ జరుపుతారట. మంచు గోళాలతో దీపాలు పెట్టుకోవడం అక్కడ ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం అని తెలుస్తోంది.
ఈ మంచు శిల్పాలు ఎంత కాలం నిలుస్తాయో తెలియదు గానీ నిలిచినంత వరకు చూపరులను ఇట్టే కట్టిపడేయడం ఖాయం. చలికాలంలో మంచు శిల్పాల ఉత్సవం జరపడం చలి దేశాలన్నింటిలో ఉన్న అలవాటులా కనిపిస్తోంది.
ఈ ఫోటోల్ని మాటాడర్ నెట్ వర్క్ వాళ్ళు అందించారు.
చూడముచ్చటగా ఉన్నాయి ఈ మంచు శిల్పాలు. ముఖ్యంగా థింకర్, హర్బిన్ ఫెస్టివల్, పెంగ్విన్ లూ, గుర్రాలూ ఎంతో బాగున్నాయి.