ఎఎపి రాజకీయ అయస్కాంతం -కార్టూన్


Magnetic wave

ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఒక్కో రోజూ తీసుకుంటున్న పాలనా చర్యలు స్వతంత్ర పరిశీలకులను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నాయి. అనేకమంది ప్రముఖులు తాము ఎఎపి లో చేరుతున్నామని ప్రకటింస్తున్నారు. వివిధ రంగాలలో లబ్ద ప్రతిష్టులయిన ప్రముఖులు వీరిలో ఉండడం విశేషం. మరోవైపు పెద్ద పెద్ద పార్టీలు నైరాశ్యపు చలికి మునగడ తీసుకుని ఎఎపి ఆకర్షక గాలికి తట్టుకోవడం ఎలాగా అని ఆందోళనలో పడిపోయాయని కార్టూన్ సూచిస్తోంది.

నరేంద్ర మోడి రాష్ట్రం గుజరాత్ లో ప్రముఖ నర్తకి మల్లికా సారాభాయ్ ఎఎపి లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇన్ఫోసిస్ కంపెనీ మాజీ ఉన్నతాధికారి ఒకరు ఎఎపి సాధారణ సభ్యుడుగా చేరుతున్నట్లు ప్రకటించారు. ఎఎపి ఆకర్షణ ప్రస్తుతం ప్రధానంగా ఉత్తర భారతంలో కేంద్రీకృతం అయింది. బెంగుళూరు లాంటి నగరాల్లో పెద్ద ఎత్తున సభ్యులు చేరుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ దక్షిణ భారతంలో పెద్దగా కదలికలు ప్రస్తుతానికయితే లేవు.

ముంబై, అహ్మదాబాద్, తదితర నగరాల్లో ఎఎపి కి అవకాశాలు బాగా వృద్ధి చెందుతున్నాయని పత్రికల ద్వారా తెలుస్తోంది. ఎఎపి పని పద్ధతి ఇప్పుడు రాజకీయ పార్టీలకు పెద్ద ఆకర్షణ. ఎంత పెద్ద ఆకర్షణ అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతుల్ని ఆచరించడానికి సమాయత్తం అవుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే తమ అభ్యర్ధులను కూడా నిర్ణయిస్తామని రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారు.

కాంగ్రెస్ మద్దతు తీసుకున్నందుకు ఎఎపి ని విమర్శించిన బి.జె.పి ఇప్పుడు మౌనం వహించింది. ఎఎపి ని ఎంత గట్టిగా విమర్శిస్తే తమకు అంత ఎదురుగాలి తప్పదని గ్రహించిన ఫలితమే ఈ మౌనం అని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. ఎఎపి ని నరేంద్ర మోడి ఇంతవరకు పల్లెత్తు మాట అనలేకపోవడాన్ని వారు ఇందుకు తార్కాణంగా చూపుతున్నారు. మోడి గాలి అంటూ ఊగిపోతున్న బి.జె.పి నాయకులకు ఎఎపి ఇప్పుడు భారీ ఆశానిపాతమే అయింది.

అయస్కాంత తరంగాలు ఎఎపి ని ఆవరించగా ఇతర ‘పెద్ద’ పార్టీలను చలి గాలులు చుట్టుముట్టాయని ఈ కార్టూన్ సూచిస్తోంది. ఈ పెద్ద పార్టీలు చలి గాలుల నుండి బైటపడేలోపు ఎఎపి గాలి దేశాన్ని చుట్టుముట్టినా ఆశ్చర్యం లేదు. తధాస్తు దేవతలకి ఇప్పుడు బాగా పని దొరికినట్లే.

3 thoughts on “ఎఎపి రాజకీయ అయస్కాంతం -కార్టూన్

 1. Let us watch how long this populism continues. AAP is not a revolutionary party since it has no working class perspective. If that party has proletarian perspective, these elite would keep off the party from themselves.

 2. Not related to this post. Pls go throguh it
  Within 48 hours, more than 20,000 people had applied online for those 400 jobs. The volume crashed Ikea’s computer servers in Spain.

  http://www.npr.org/blogs/parallels/2013/12/05/248903567/help-wanted-ad-shows-depths-of-spains-unemployment-problem

  If You Are Waiting For An “Economic Collapse”, Just Look At What Is Happening To Europe

  -Citigroup is projecting that the unemployment rate in Greece will reach 32 percent in 2015.
  -The unemployment rate in Spain is still sitting at an all-time record high of 26.7 percent.
  -The youth unemployment rate in Spain is now up to 57.7 percent – even higher than in Greece.
  -The percentage of bad loans in Spain has risen for eight straight months and recently hit a brand new all-time record high of 13 percent.
  -The number of mortgage applications in Spain has fallen by 90 percent since the peak of the housing boom.
  -The unemployment rate in France has risen for 9 quarters in a row and recently soared to a new 16 year high.
  -For 2013, car sales in Europe were on pace to hit the lowest yearly level ever recorded.

  -Deutsche Bank, probably the most important bank in Germany, is the most highly leveraged bank in Europe (60 to 1) and it has approximately 70 trillion dollars worth of exposure to derivatives.

  http://theeconomiccollapseblog.com/archives/if-you-are-waiting-for-an-economic-collapse-just-look-at-what-is-happening-to-europe

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s