ఉత్తర కొరియా: కొన్ని వాస్తవాలు


ఉత్తర కొరియా గురించి విషం చిమ్మని పశ్చిమ పత్రిక అంటూ కనపడదు. అక్కడికి విదేశీ విలేఖరులను రానివ్వరని, ఉక్కు తెరల మధ్య ప్రజలు అష్టకష్టాలు పడతారని, రోడ్డు మీద అసలు జనమే కనిపించరనీ… ఇలా రాస్తుంటాయి. ఈ ప్రచారం నిజం కాదని చెప్పడానికి ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రత్యేకంగా విలేఖరులను ఆహ్వానించి టూర్లకు తిప్పుతుంది. ఈ టూర్లకు వెళ్ళినవాళ్లు ఫోటోలు తీసుకుని కూడా తమ కోసం ప్రత్యేకంగా జనాన్ని ఏర్పాటు చేశారని పశ్చిమ విలేఖరులు రాయడం కద్దు.

రోడ్డు మీద జనాన్ని, పార్కుల్లో పిల్లల్ని, కాలవల్లో చేపలు పట్టే బృందాల్నీ ఫోటోలు తీస్తారు. వారందరినీ ప్రభుత్వమే మొదట శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేశారని రాస్తారు. ఇంత అన్యాయం మరే దేశం విషయంలోనూ కనపడదు. వీళ్ళ ద్వారానే అప్పుడప్పుడూ ప్రమాదవశాత్తూ నిజాలు కూడా వెలువడుతుంటాయి. తమ దృష్టికి వచ్చిన కొన్ని వాస్తవాలను రాస్తూనే సదరు వాస్తవాల ద్వారా అర్ధం అయ్యే సారాంశాన్ని (inference) మాత్రం సరిగ్గా విరుద్ధంగా రాస్తుంటారు.

ఉదాహరణకి ఈ కింద ఉన్న ఫోటోల్లో మొదటి 12 మటాడార్ నెట్ వర్క్ వెబ్ సైట్ నుండి సంగ్రహించినవి. ఫోటోలు తీసింది సూ సాండ్ బర్గ్. ఉత్తర కొరియాలో వైద్య, ఆరోగ్య వ్యవస్ధ చాలా చక్కగా ఉన్నదని, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య వసతులు అందుబాటులో ఉన్నాయని రాశారు. అయినప్పటికీ ప్రజలు అత్యంత గడ్డు పరిస్ధితుల్లో ఉన్నారని ఆమె రాశారు. బెన్నెట్ ముర్రే, ఆడం ధాంప్సన్ అనే వ్యాఖ్యాతలు వేసిన ప్రశ్నలూ, సూ సాండ్ బర్గ్ (ఫోటోగ్రాఫర్) ఇచ్చిన సమాధానాలూ చూడండి:

Bennett Murray: Since you mentioned that the health care system seemed very efficient, I must ask: There are widespread reports that North Koreans must bribe doctors for even the most basic services, the black market is a primary source of medicine for most, and that the country has one of the highest rates of TB infection in the world. Do you believe these to be falsehoods?

Sue Sandberg: Hi Bennett, I could only speak to our ‘guides’ and ordinary people were not keen to talk to us. But I was told that doctors from local clinics regularly visit everyone in their community to assess their health and provide preventative medicine. Healthcare has been free since 1953 and everyone has a health card. And that there is a system of regional and district hospitals to ensure that everyone can access healthcare. This does ‘seem’ very efficient. But it is entirely possible that the reports you refer to are correct. This is a poor country where people live in difficult circumstances.

Adam Thompson: Hey Sue, I am eventually planning to go to the DPRK, was just wondering from someone who has been there, what type of cameras are you allowed in? dslr? Thanks you, beautiful essay, it helps to curb the idea that the DPRK is this “evil state”.

Sue Sandberg: There was no problem with cameras at all. They were never checked, but I was told that they don’t like extreme zoom lenses. We could take in computers. The restrictions were only mobile phones and anything with GPS. With the photos I tried to portray that like everywhere else these are just people trying to survive under difficult conditions imposed by their leadership. And I have to admit that there were things to admire, the education system and the medical system seemed very efficient.

వీటికి అనువాదం ఇస్తున్నాను.

బెన్నెట్ ముర్రే: ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధ చాలా సమర్ధవంతమైనది అని మీరు చెబుతున్నారు కాబట్టి నేను ఒకటి ఖచ్చితంగా అడగాలి: ఉత్తర కొరియా ప్రజలు డాక్టర్లకు అత్యంత మౌలిక సేవల కోసం కూడా లంచాలు ఇచ్చుకోవాలని, అనేకమందికి ఔషధాల కోసం బ్లాక్ మార్కెట్ నే ప్రధానంగా ఆశ్రయిస్తారని, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువమంది టి.బి రోగులు ఉత్తర కొరియాలోనే ఉన్నారని నేను విస్తృతంగా రిపోర్టులు చదివాను. ఇవన్నీ తప్పుడు రిపోర్టులని మీ నమ్మకమా?

సూ సాండ్ బర్గ్: హాయ్ బెన్నెట్, నేను గైడ్ తోనే మాట్లాడాను. సాధారణ ప్రజలు మాతో మాట్లాడానికి పెద్ద ఆసక్తిగా లేరు. (భాష ప్రధాన సమస్య అని ఈమె అంతకుముందే ఒకరికి చెప్పారు) కానీ స్ధానిక క్లినిక్ ల నుండి వైద్యులు క్రమం తప్పకుండా తమకు కేటాయించిన ఇళ్లను సందర్శిస్తారని నాకు చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని రెగ్యులర్ గా పరిశీలిస్తూ, రోగాలు రాకుండా ముందే అనేకమందికి మందులు ఇస్తారు. 1953 నుండి (కమ్యూనిస్టులు అధికారం చేపట్టినప్పటి నుండి) వైద్య సేవలు అక్కడ ఉచితం. ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డు ఉంటుంది. ప్రాంతీయ మరియు జిల్లా ఆసుపత్రులు అనే వ్యవస్ధ ఉన్నది. తద్వారా ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండేలా చూస్తారు. ఇది చాలా సమర్ధవంతమైనదనే అనిపిస్తోంది. కానీ మీరు విన్న రిపోర్టులు పూర్తిగా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. గడ్డు పరిస్ధితుల మధ్య ప్రజలు నివసించే పేద దేశం ఇది.

అదీ సంగతి! ఒక పక్కేమో వైద్య సేవా వ్యవస్ధ చాలా సమర్ధవంతంగా పని చేస్తోంది అని చెబుతున్నారు. మళ్ళీ అదే నోటితో తప్పుడు రిపోర్టులే నిజం అయ్యే అవకాశం ఉంది అని ముక్తాయిస్తున్నారు. జనాన్ని నిరంతరం బ్రెయిన్ వాష్ చేస్తుంటారు అని ఉత్తర కొరియా ప్రభుత్వం మీద ఆరోపించే ఈ విలేఖరులు నిజానికి ఎవరు బ్రెయిన్ వాష్ కి గురయ్యారో సూ సాండ్ బర్గ్ మాటల్లోనే తెలియడం లేదా?

మరో సంభాషణ అనువాదం చూద్దాం.

ఆదమ్ ధాంప్సన్: హే సూ, నేనూ డి.పి.ఆర్.కె వెళ్లాలని అనుకుంటున్నాను. ఇప్పటికే అక్కడికి వెళ్ళి వచ్చినవారి ద్వారా నాకు అర్ధం అయిందాన్ని బట్టి ఒక విషయం తేల్చుకోలేకపోతున్నాను. ఎలాంటి కెమెరాలను వాళ్ళు అనుమతిస్తారు? డి.ఎస్.ఎల్.ఆర్? మంచి (ఫోటో) వ్యాసం అందించారు, ధన్యవాదాలు. ఉత్తర కొరియా ఒక చెడ్డ దేశం అన్న భావనని రూపుమాపడానికి ఇది సహాయం చేస్తుంది.

సూ సాండ్ బర్గ్: కెమెరాలతో అసలు సమస్యే లేదు. కెమెరాలను అసలు తనిఖీ చెయ్యరు. కానీ భారీగా జూమ్ ఉండే లెన్స్ లను అనుమతించరని నాకు చెప్పారు. మనం కంప్యూటర్లు తీసుకెళ్ళొచ్చు. మొబైల్ ఫోన్ల విషయంలోనే అభ్యంతరం ఉంటుంది. అది కూడా జి.పి.ఎస్ సౌకర్యం ఉంటేనే. తమ నాయకత్వం రుద్దుతున్న గడ్డు పరిస్ధితుల మధ్య బతకడానికి ప్రయత్నిస్తున్న సాధారణ ప్రజల జీవనాన్ని చిత్రీకరించడానికి ఈ ఫోటోల ద్వారా ప్రయత్నించాను. అన్నిచోట్లకు మల్లే వీరు సాధారణ ప్రజలు. అయితే అక్కడ అద్భుతమైన విషయాలు కూడా ఉన్నాయని నేను అంగీకరించాల్సిందే. విద్యా వ్యవస్ధ, వైద్య వ్యవస్ధ చాలా సమర్ధవంతమైనవని అనిపిస్తుంది.

గమనించారా, మళ్ళీ అదే కూత! విద్యా, వైద్య వ్యవస్ధలు చాలా సమర్ధవంతమైనవని అంగీకరిస్తూనే జనం గడ్డు పరిస్ధితుల మధ్య బతుకుతున్నారని, ప్రజలు అందరికి మల్లె సామాన్యులని కానీ నాయకత్వమే చెడ్డదని చెప్పడానికి ఫోటోగ్రాఫర్ చేస్తున్న విశ్వ ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది.

జనానికి విద్యా, వైద్య సౌకర్యాలకు మించిన అత్యవసరాలు ఇంకేమిటి? కూడు తర్వాత మనిషికి కావలసినవి ఈ రెండే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యంగా పెట్టుబడిదారీ దేశాల్లో అందుబాటులో ఉండనివి ఇవే. సద్దాం పాలనలోని ఇరాక్, గడ్డాఫీ పాలనలోని లిబియా, ఛావెజ్ పాలనలోని వెనిజులా (ఇప్పుడు కూడా), కొర్రీయా పాలనలోని ఈక్వడార్ దేశాల్లో కూడా ఇలాగే ప్రజలకు అత్యవసరమైన సేవలు ఉచితంగానో లేదా అత్యంత తక్కువ ధరలకు అందుబాటులో ఉండేవి. ఇలా ఉచితంగా ఇవ్వకుండా విద్య, వైద్యం మార్కెట్ ను తమకు అప్పజెప్పాలని పశ్చిమ దేశాలు డిమాండ్ చేస్తాయి. ఆ డిమాండ్ ను అంగీకరించకపోతే ఇక ఆ దేశం ఉక్కుతెరల మధ్య గడ్డు పరిస్ధితుల్లో బతుకుతున్నట్లు పశ్చిమ పత్రికలు చిత్రీకరిస్తాయి.

అమెరికాలో ‘ఒబామా కేర్’ పేరుతో ఒబామా ప్రవేశపెట్టిన వైద్య విధానం అమలు కాకుండా చూడడానికి అక్కడ ఏకంగా ప్రభుత్వాన్నే మూసేశారు. ఇరు పార్టీల నేతలూ ఇందులో భాగస్వాములే. ఇంతా చేసి ‘ఒబామా కేర్’ వల్ల జనానికి పెద్దగా ఒరిగేది లేదు. ఆరోగ్య భీమా చెల్లించలేని అత్యంత పేదలకు ప్రభుత్వమే చెల్లించడానికి సిద్ధపడడమే అమెరికా నాయకత్వానికి ఇష్టం లేకుండా పోయింది. కానీ ఉత్తర కొరియాలో ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం ఉచితం. రోగులు వైద్యుల దగ్గరికి వెళ్ళడం కాదు, వైద్యులే రోగుల దగ్గరికి వస్తారు. 1953 నుండి ఇదే పద్ధతి అక్కడ అమలులో ఉంది.

జి.పి.ఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఉన్న ఫోన్లను అనుమతించకపోవడానికి సరైన కారణమే ఉత్తర కొరియాకు ఉంది. పశ్చిమ దేశాల నిఘా తప్పించుకోవాలంటే వారికి అది తప్పదు. ఎడ్వర్డ్ స్నోడెన్ బైట పెట్టిన గూఢచార పత్రాల ద్వారా వ్యాపార ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం అమెరికా, ఐరోపాలు ఎంత దారుణంగా ప్రపంచ ప్రజలందరి పైనా నిఘా పెడుతున్నదీ రుజువైంది. ఉత్తర కొరియా చుట్టూ అమెరికా అనుకూల దేశాలు ఉన్నాయి. దక్షిణ కొరియాలో అమెరికా అణు బాంబులను మోహరించింది. అక్కడ 50,000 వరకు అమెరికా సైన్యాలు తిష్ట వేశాయి. వారు నిరంతరం ఉత్తర కొరియా పై నిఘా వేస్తారు. అనగా ఉత్తర కొరియా ప్రజలపైన గడ్డు పరిస్ధితుల్ని రుద్దుతున్నది ఆ దేశ నాయకత్వం కాదు, అమెరికాయే.

పైగా పశ్చిమ పత్రికలు కీర్తించే దక్షిణ కొరియాలో ఆదాయ అంతరాలు తీవ్రంగా ఉంటాయి. సామ్ సంగ్ లాంటి కంపెనీలను చూపి అక్కడ అంతా బాగుందని చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ అమలులో ఉన్నది పచ్చి నియంతృత్వం. ఎన్నికలు కేవలం నామమాత్రం. ఇటీవల వరకూ అక్కడ నియంతృత్వ ప్రభుత్వాలు నడిచాయి. వాటిని అమెరికా మద్దతిచ్చి పోషించింది. దక్షిణ కొరియా వాస్తవాలు బైటపడకుండా ఉండడానికి పశ్చిమ పత్రికలు ఉత్తర కొరియా పైన కేంద్రీకరించి పచ్చి అబద్ధాలను కధలు కధాలుగా ప్రచారంలో పెడతాయి. అప్పుడప్పుడూ ఇలా ప్రమాదవశాత్తూ నిజాలు బైటికి వస్తాయి.

కింద ఫొటోల్లో మొదటి 12 మటాడార్ నెట్ వర్క్ అందించింది. తతిమా ఫోటోలు మెయిల్ టుడే నుండి సంగ్రహించినవి.

5 thoughts on “ఉత్తర కొరియా: కొన్ని వాస్తవాలు

 1. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యంగా పెట్టుబడిదారీ దేశాల్లో అందుబాటులో ఉండనివి ఇవే. This is not true.
  Health and Education are not only free in most of the western European countries they are also one of best in world. Needless to say that these are Capitalist economy countries. If we agree usage of electricity is a measure of living standards as the case now, just compare photos of Koreas from space at night time.

 2. Hi Chandra,

  You must have known that patients from the U.S. and Europe are coming to India, which phenomenon is being called ‘medical tourism. It is reported that medical tourism is one of the fastest growing industries in India, yearly growth rate pegged at nearly 30%. This is only because healthcare industry in those countries is not within reach of even somewhat-rich people. It is increasingly felt that Indian healthcare facilities are world-clas and also cheap. Do you know who are most beneficiearies of Indian medical tourism industry? Americans! Next come Europeans, but not other poor nations like North Korea.

  No doubt healthcare in the US or the EU or one of the best. But they are not within reach of their own people. They are very expensive. This is what I talked about in the article.

 3. Hi Visekhar,
  Thank you. I think you did not understand my point. When Health care in most of the westran European countries is free, how can be it not with in reach? I think US has health insurance system, but I have no idea about its being affordable for all. If people from North Korea are allowed to leave the country freely, I am sure they will also contribute to Indian medical tourism industry.

 4. I did get your point and it seems you didn’t get mine. If healthcare in the US is free, why would they come to India? Healthcare in the US is not free as being suggested by you. It is covered under various insurance schemes. People have to bear insurance fee and major diseases are not covered under such schemes. As for as I know healthcare in the US is covered mostly by private companies. Of course, they depict themselves as non-profit, which is not true in practice. Almost 80% healthcare in the US is privately sourced. Only 20% is public paid. Public programs are covered under Medicare, Medicaid or such programs.

  “If people from North Korea are allowed to leave the country freely…”

  This type of assumptions are misplaced and are part of propaganda. I don’t say that NK is a heaven on earth. But I want to say that there is plenty of anti-NK propaganda among western news outlets. This is only because of geopolitical reasons. The US imperialism hates whatever independent state that keeps going on, on its own or those that live with the help of China or Russia or whatever state that lives without allowing the US multinationals.

  Leaving North Korea is not the only thing to be observed, allowing North Koreans into one’s state is also to be seen. Does every other country allows immigrants straight away without restrictions? Does the US allows whoever Indian wants to go there? Why would NSA spy on people of other countries? Why would it taps under-sea cables of internet and telephones? Why would the president of the USA defends such spying? German Chancellor, Indian PM, French president… are all these people terrorists?

  I have written how NK is surrounded by intimidating allies of the US. And it is a small country facing the wrath of all sorts of anti-propaganda and unsolicited hate towards themselves. In such circumstances I would like to empathize with their fears rather than blindly believing hate propaganda against them. There may be some mistakes and there will be mistakes. But don’t others have? Why India is not hated for it’s unrelenting exploitative caste system? Why is it not hated for it’s wide spread hunger, poverty… and so on? Because it allows freely the MNCs from imperialist countries. It allows the loot and plunder of MNCs of western nations.

  Anti-NK propaganda is not a linear thing to look upon with narrow outlook. It is multi-faceted. It is political, economical, socio-economic and geopolitical. If you miss this point there is every chance of hating/misrepresenting NK for not only what they are but for also what they are not.

 5. There is some good and some bad in every system.Communist countries pay more attention and care to universal education and medical care and cheap food supply..But they restrict individual freedom and luxuries.Capitalist countries allow freedom of individuals,social dissent and encourage wealth,luxuries and social differences.It is true western media direct shrill anti-propaganda against communist countries and also against developing countries.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s