ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల వాగ్దానాల్లో ఒక ముఖ్యమైనదాన్ని నెరవేర్చారు. ప్రతి కుటుంబానికి ఉచితంగా రోజుకు 700 లీటర్ల త్రాగు నీరు అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేరుస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఢిల్లీ జల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మీటర్ ఉన్న ప్రతి ఇంటికీ ఇంటి వాడకం నిమిత్తం 667 లీటర్ల నీరు ఉచితంగా అందిస్తారు.
ఘజియాబాద్ లోని కౌసాంబి లోని తన నివాసంలో ఢిల్లీ జల్ బోర్డు సమావేశాన్ని ముఖ్యమంత్రి అరవింద్ నిర్వహించారు. జల్ బోర్డుకు ఢిల్లీ ముఖ్యమంత్రే చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. ఎన్నికలకు ముందు షీలా దీక్షిత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నీటి ఖరీదు 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఖర్చులు పెరిగాయని చెబుతూ డి.జె.బి ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం నిర్ణయంతో 10 శాతం పెంపుదల అటుంచి 667 లీటర్ల మేర అసలు ఛార్జీలే ఉండవన్నమాట!
అయితే 667 లీటర్ల కంటే ఎక్కువ వాడుకున్నట్లయితే అలా ఎక్కువ వాడుకున్న మేరకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నీటి వాడకాన్ని చూపిస్తూ అదనపు ఛార్జీలేమీ వసూలు చేయబోరని అరవింద్ ప్రకటించారు. ప్రతి కుటుంబానికి నెలకు 20 కిలో లీటర్ల నీరు ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు. అంటే రోజుకు 666.67 లీటర్లు వస్తాయి. నెల యూనిట్ గా తీసుకున్నారంటే ఒక రోజు తక్కువ వాడుకుంటే ఆ మేర మరొక రోజు ఎక్కువ వాడుకోవచ్చా అన్నది తెలియలేదు.
“మీటర్ కనెక్షన్ ఉన్న గృహ వినియోగదారులందరూ జనవరి 1 నుండి 20 కిలో లీటర్ల నీరు ఉచితంగా పొందుతారు. వాటర్ సెస్, సూయరేజి ఛార్జీలు లాంటి ఇప్పుడు ఉనికిలో ఉన్న ఇతర చార్జీలేమీ వసూలు చేయబోము కూడా” అని ఢిల్లీ జల్ బోర్డు నూతన సి.ఈ.ఓ విజయ్ కుమార్ విలేఖరులకు చెప్పారు. వినియోగం 20 కిలో లీటర్లకు మించితే నీటి ఛార్జీలతో పాటు ఇతర ఛార్జీలు కూడా చెల్లించాలని ఆయన తెలిపారు. నీరు ప్రకృతి ప్రసాదితం. అలాంటి నీటికి ఛార్జీలు, నీటి పన్ను మినహాయించి, వసూలు చేయడమే దారుణం. నీటి ఛార్జీలు ప్రపంచ బ్యాంకు రుద్దిన ప్రజా దోపిడీ విధానం. కాబట్టి నీటి చార్జీలను మొత్తంగా ఎత్తేయడం అత్యవసరం. 20 కి.లీకు మించి వసూలు చేసే నీటి చార్జీలకు అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చే సమర్ధన ఏమిటో!
డి.జె.బి పాత సి.ఈ.ఓ దేబశ్రీ ముఖర్జీ రాజీనామా చేయడంతో కొత్త సి.ఈ.ఓ గా విజయ్ కుమార్ నియమితులయ్యారు. పాత సి.ఈ.ఓ కు ఆ 20 కి. లీటర్ల నీరు కూడా ఉచితంగా ఇవ్వడం ఇష్టం లేదట. దానితో ఆయన రాజీనామా చేశారట. ఆ సి.ఈ.ఓ ఎవరో గానీ ఖచ్చితంగా ఏ అమెరికా లేదా ఐరోపా లకు చెందిన బిజినెస్ స్కూల్ లో చదువుకుని ఉండాలి. లేదా పశ్చిమ దేశాల పోషణలో నడుస్తున్న భారతీయ బిజినెస్ స్కూళ్ళలో చదివి ఉండాలి. ఈ బిజినెస్ స్కూళ్ళ మూకలకు కనపడిన ప్రతి వస్తువును సరుకుగా చూస్తూ దానికి వెలకట్టడం పరమ పవిత్రమైన కార్యక్రమం. ప్రకృతి ప్రసాదించిన వనరులపైనా ప్రజలకు సహజమైన హక్కు ఉంటుందని వాటికి వెలకట్టి వసూలు చేయడం తగని పని అనీ వారు కలలోనైనా ఊహించలేరు.
ఢిల్లీలో మొత్తం మీద 1600 వరకు అనధికారిక కాలనీలు ఉన్నాయి. వాటికి నీటి మీటర్ కనెక్షన్లు లేవు. వారి నుండి నీటి ఛార్జీలు వసూలు చేస్తారా లేదా అన్నది తెలియలేదని ది హిందు తెలిపింది.
కోటి పరిహారం
కేజ్రీవాల్ మరో సాహసోపేతమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. అక్రమ మద్యం అమ్ముతున్న మాఫియాలను అరెస్టు చేయడానికి వెళ్ళి వారి చేతిలో హతుడైన పోలీసు కానిస్టేబుల్ కుటుంబానికి ఆయన కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. బహుశా ఈ నిర్ణయం విని కాంగ్రెస్, బి.జె.పి నేతలకు కనీసం రెండు, మూడు క్షణాలు గుండెలు ఆగిపోయి ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము జనానికి ఇవ్వడం అంటే వారి ముల్లె ఏదో ధారాదత్తం చేస్తున్నట్లే ఫోజులు పెడతాయి ఆ పార్టీలు.
“డబ్బులు చెట్లకు కాయవు” అన్నది వారికి మహా ఇష్టమైన సూత్రం. పేదవాడు బతకడానికి రోజుకు పాతిక రూపాయలు సరిపోతాయని చెప్పే ప్రబుద్ధులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సాధారణ కానిస్టేబుల్ కు కోటి రూపాయలు పరిహారం ఇవ్వడం అంటే సహించగలరా? ఈ బాపతు నాయకులు టాయిలెట్ల కోసం లక్షలు తగలేస్తారు గానీ జనం సొమ్ము జనానికి ఇవ్వమంటే మాత్రం మహా యాష్టపడిపోతారు.
అందువలన అరవింద్ ప్రకటించిన పరిహారం నిస్సందేహంగా సాహసోపేతమైన నిర్ణయం. ఇలాంటి నిర్ణయాల వలన నిజాయితీగా విధి నిర్వహించాలన్న యావ పెరుగుతుంది. నిజాయిటీకి ప్రోత్సాహం ఉంటుందని తెలియజెప్పడం ద్వారా నిజాయితీ సంస్కృతిని ఉద్యోగుల్లోనూ, ప్రజల్లోనూ పెంపొందించవచ్చు. కానీ ఈ ధోరణిని ఆయన ఎంతకాలం కొనసాగించగలరో వేచి చూడాల్సిందే.
కోటికి పడగలెత్తినవాడు కూడా సొంత డబ్బు ఖర్చు చెయ్యడానికి వెనకా ముండు ఆలోచిస్తాడు. ఆమ్ ఆద్మి ఒక్కడికి కోటి నష్టపరిహారం కేజ్రివాలా కోతిచేష్ట. నీటిని ఉచితంగా సరఫరా చేసే రీతిలో నష్టపరిహారం కూడా ధారపోస్తే కేజ్రివాలాకు త్వరలోనే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పదవి భ్రష్టత పొందక తప్పదు. అతి సర్వత్రా వర్జయేత్ అన్న సామెతకు బలైపోవడం తధ్యము సుమతి!
Reblogged this on ugiridharaprasad.
పింగ్బ్యాక్: ఉచిత నీరు వాగ్దానం నెరవేర్చిన కేజ్రీవాల్ | ugiridharaprasad
పదవి ముఖ్యమా ప్రజా సేవ ముఖ్యమా అని తేల్చుకోవాలిసిన వాడు కేజ్రీ వాలా.
పధవే ముఖ్యమైన రాజకీయనాయకులకు కొదువా?
oka liquor mafia okaaa ghantalo akrmangaa sampadinche dabbunu ..sahsopethangaa varini edurukunna Constiable ivvadam koti charya naa … 🙂 . Ilanti prosthha valla liquor mafia nu konthaa arikattinaa .. ennno kotlu prabuthvaa kajahan ku vasthaiii
I support the act of Kejriwal in giving the one crore compensation. Honesty, sincerity in duty shall be suitably rewarded and encouraged. We waste lot of money on unnecessary things like spending crores of money for hosting a Pakistani presidents etc. Nothing wrong in giving compensation to the family of a duty minded person.
athanu chsindi manchi pani kadaa ? adi enduku koti cheshta avuthundi?nijayitee ki thagina prathiphalam untundi ani niroopinchaadu.