అరవింద్ కేజ్రీవాల్/ఆమ్ ఆద్మీ పార్టీ తనకు తాను విధించుకున్న గీటురాళ్ళు సామాన్యమైనవి కావు. నిజానికి ఆబ్సల్యూట్ దృష్టికోణంలో చూసినపుడు అవి సామాన్యమైనవే. కానీ నేటి వ్యవస్ధ నిర్మాణం అయి ఉన్న తీరుతో పోలిస్తే అవి అసామాన్యమైనవి. ఎర్ర లైటు వాహనంలో తిరగను, మెట్రోల్లోనే ప్రయాణిస్తాను… లాంటివి చిన్న విషయాలు. ప్రజా పాలనలో అవేమీ పెద్ద విషయాలు కావు. అసలు విషయాలు వేరే ఉన్నాయి.
అవినీతి నిర్మూలన గురించి ఆయన చేసిన వాగ్దానం భారీ వాగ్దానం. ఎందుకంటే అవినీతి కేవలం ఒక సమస్య మాత్రమే కాదు. సమాజం పునాదుల్లోనే దాని మూలాలు ఉన్నాయి. అవినీతికి పాల్పడకుండా కనీసం ఇపుడున్న చట్టాల ప్రకారం పని చేసినా ధనిక వర్గాల పనులు చాలావరకు నడవ్వు. ధనిక వర్గాలు అంటే కాస్త పచ్చగా కనిపిస్తూ కారుల్లో తిరిగేవారని కాదు. వ్యవస్ధను శాసించే సూపర్ ధనిక వర్గాలు అని అర్ధం. వీరినే ప్రైవేటు బహుళజాతి కంపెనీలని, భూస్వాములని, పెట్టుబడిదారులనీ, మాఫియా అని, నేర సామ్రాజ్యం అని, ఉన్నత స్ధాయి షేర్ బ్రోకర్లని, దొంగ వ్యాపారులని, దళారీ వ్యాపారులని రకరకాల పేర్లతో పిలుస్తుంటాము.
వీరు సాగించే కార్యకలాపాల్లో అనేకం అవినీతి లేకుండా ముందుకు సాగవు. చట్ట ప్రకారం మాత్రమే పని చేస్తామని ప్రభుత్వాలు చెబితే వీరు ఏమంటారంటే ‘అట్లయితే పెట్టుబడులు రావడం కష్టం’ అంటారు. ‘అభివృద్ధిని అడ్డుకుంటున్నారు’ అంటారు. ‘వ్యాపారులను వేధిస్తున్నారు’ అంటారు. ‘తెల్ల ఏనుగులను (ప్రభుత్వ రంగ కంపెనీలు) పోషిస్తున్నారు’ అంటారు. ‘పోటీ లేకపోతే అభివృద్ధి ఎట్లా?’ అని ప్రశ్నిస్తారు. ‘దిగుమతులకు ఒప్పుకోకపోతే విదేశాలతో సంబంధాలు చెడిపోతాయి’ అంటారు. ‘ఇలాగైతే దేశం ఒంటరిది అవుతుంది’ అని హెచ్చరిస్తారు. ‘ఎగుమతి రాయితీలు ఇవ్వకపోతే వాణిజ్య లోటు పెరిగి కరెంటు ఖాతా లోటు పెరుగుతుంది’ అని బెదిరిస్తారు. ‘మీకు ఆర్ధిక సూత్రాలు తెలియవు’ అని నిందిస్తారు.
ఇవన్నీ పత్రికల్లో గొప్ప గొప్ప సూత్రాలుగా ప్రచారం అవుతుంటాయి. వాస్తవంలో ఇవన్నీ అవినీతిని కప్పి పుచ్చే చచ్చు సూత్రాలు. వ్యవస్ధను లోలోపలి నుండి తొలిచివేసే చీడపురుగు పోషక మార్గాలు. పైకి వ్యవస్ధ నడవడానికి అత్యవసరంగా కనిపించే ఈ సూత్రాలన్నీ కొద్ది మంది ధనిక వర్గాలకు వ్యవస్ధలోని సమస్ధ ఆర్ధిక నాడీ వ్యవస్ధను రాజమార్గంలో అప్పగించే దొడ్డిదారులు. దొడ్డి దారుల్ని రాజమార్గాలుగా మార్చి, రాజమార్గాన్ని ముళ్ళు, పొదలతో నింపే మార్గాలివి.
‘అవినీతి నిర్మూలిస్తాం’ అన్న వాగ్దానం నెరవేరాలంటే ఇవన్నీ చేయాలి. అంటే వ్యవస్ధలోని విలువల్ని మొదట పెంచాలి. ట్రెజరీ ఆఫీసులో లంచం ఇవ్వడానికి గానీ, పుచ్చుకోవడానికి నిరాకరిస్తే చుట్టూ ఉన్నవారు ఎలా చూస్తారు? పిచ్చోడ్ని చూసినట్లు చూస్తారు. ‘ఏ కాలంలో ఉన్నావు నాయనా?’ అని ప్రశ్నిస్తారు. నేటి సామాజిక సగటు విలువల స్ధాయి అధమంగా ఉన్నదని అర్ధం. అందుకే మొదట ఈ విలువల్ని పెంచాలి. సమాజాన్ని మరింత సున్నితీకరించాలి.
ప్రజల సమస్యలను ప్రతి ఒక్కటీ పరిష్కారం చేసేందుకు అనుకూలమైన వ్యవస్ధ ఏర్పాటు చేయడానికి తనకు 10 రోజుల గడువు ఇవ్వండి అని అరవింద్ కోరుతున్నారు. 10 రోజుల్లో ఒక వందమంది లేదా ఒక వెయ్యి మంది ఉద్యోగులను ఫిర్యాదుల స్వీకారానికి నియమించవచ్చు. వాటిని ప్రాసెస్ చెయ్యడానికి పురమాయించవచ్చు. కానీ పరిష్కారం ఎన్ని రోజుల్లో సాధ్యం? వ్యవస్ధలోని ప్రతి అంగమూ ధనిక వర్గాల నియంత్రణలో ఉన్నపుడు ఒక ఎనిమిది మంత్రులు, మరో ఇరవై మంది ఎమ్మేల్యేలు, మరో వందమంది నిజాయితీ ఉద్యోగులు పూనుకుని సమాజ విలువను పెంచగలరా?
సమాజ సగటు స్ధాయిని పెంచాలంటే మొదట ఆ సమాజాన్ని నియంత్రణలోకి తీసుకోవాలి. పోలీసులు, కోర్టులు, బ్యూరోక్రసీ, అసెంబ్లీ లను అదుపులోకి తెచ్చుకోవడం ఒక విషయం అయితే రాష్ట్రం/దేశం లోని ఉత్పత్తి సాధనాలను అదుపులోకి తెచ్చుకోవడం మరో అంశం. ఈ రెండోదే అత్యంత ముఖ్యమైన అంశం. ఉత్పత్తి సాధనాలు అంటే సింపుల్ గా భూములు, పరిశ్రమలు. ఇవి లేకుండా ఉత్పత్తి సాధ్యం కాదు. కానీ ఇవి ధనిక వర్గాల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఉత్పత్తి సాధనాలను నియంత్రణలోకి తెచ్చుకోవడం అంటే ధనిక వర్గాల ఆస్తులను లాక్కోవడం. ఉదాహరణకి మారుతి కార్ల పరిశ్రమ ఉంది. దీనిపైన బడి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ వర్గాలు పందికొక్కుల్లా మేస్తున్నారు. వారి నుండి మారుతిని విముక్తి చేస్తేనే అక్కడ అవినీతి నిర్మూలించినట్లు లెక్క. అంటే మారుతీలో అవినీతి నిర్మూలించడం అంటే ఆ కంపెనీని నిజమైన అర్ధంలో ప్రజలపరం చేయడం. అందుకు రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్లు అంగీకరిస్తారా? చస్తే అంగీకరించరు. వారు తమ అవినీతి సంపాదనను కాపాడుకోవడానికి ఎంతటి తీవ్రమైన చర్యకయినా వెనుకాడరు.
అవినీతి నేటి వ్యవస్ధ లక్షణం. అది కేవలం జబ్బు అనుకుంటే పొరబాటు. అవినీతి అన్నది దానికదే ఒక వ్యవస్ధ. వ్యవస్ధ పునాదుల నుండి ఉపరితలం వరకు నిండా అల్లుకుపోయి ఉన్న వ్యవస్ధ అది. దాన్ని కూల్చాలంటే మొదట సమాజాన్ని ఇపుడున్న నిర్మాణంలో కూల్చాలి. కొత్త నిర్మాణానికి పూనుకోవాలి. అది ఎన్నికల ప్రభుత్వం ద్వారా సాధ్యం అయ్యేదేనా? సాధ్యం కావాలంటే తీవ్రమైన మార్పు జరగాలి. అనగా విప్లవం సంభవించాలి. సమాజం మకిలి పట్టిన తన పాత రూపాన్ని వదిలించుకుని అభివృద్ధికరమైన కొత్త రూపం సంతరించుకోవడమే విప్లవం. అది ఓట్లతో సాధ్యం అయ్యేది కాదు. అందుకే అరవింద్ అధిరోహించిన నైతిక స్ధాయి కంటే సమాజం యొక్క నైతిక స్ధాయి చాలా తక్కువ ఎత్తులో ఉన్నదని కార్టూనిస్టు సూచిస్తున్నారు. దీని అర్ధం అరవింద్ కేజ్రీవాల్ తన స్ధాయిని తగ్గించుకోమని కాదు. సమాజం స్ధాయిని పెంచడం గురించి ఆలోచించాలని. అది విప్లవాత్మక మార్పు ద్వారానే సాధ్యమని వేరే చెప్పాలా?
సూపర్ ధనిక వర్గాలనే కాదు , ఆయన సాధారణ విషయాలని కూడా మార్చవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆరొగ్యం. మన గాంధీ ఆసుపత్రినే తీసుకుంటే అక్కడ చేతులు తడపకుండా ఏపని అవ్వదు.రోగులను పీడించుకు తింటూ ఉంటారు. అక్కడికి వెళ్ళేది కేవలం దిగువ మధ్య తరగతి , పేద ప్రజలు మాత్రమే. ఢిల్లీ లో కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్తితి ఖచ్చితంగా ఇలానే ఉండి ఉంటుంది. అక్కడ మార్పు తీసుకుని రాగలిగితే అది ఆయన సాధించే గొప్ప విజయం అవుతుంది.
కేజ్రివాలా మెహర్బాని ఎదో ఒక రోజు కుర్బానికి దారితీయక తప్పదు. ఒక విధంగా ఉచితం పేరుతో అనుచితంగా ప్రవర్తించి ఆమ్ ఆద్మీని ఆవకాయ జాడీ రీతిలో మూల కూర్చోపెట్టి శ్రీమంతంగా మార్చే కార్యక్రమం ఒకటే చివరకు మిగిలేది. అసలే ఓటరు జనాలు సోమరిపోతులు, ఇలా ఉచితంగా దున్నేస్తే వారు మరింత దున్నపోతులుగా మారి కేజ్రివాలాని కుమ్మేసే ప్రమాదముంది. టేక్ కేర్ కె.జి.సాబ్!
how to share this in facebook
Hi rajasekhar, You can see sharing buttons at the bottom of the article. Fasebook button is represented by ‘f’ button. You can click it to share in facebook. You can also share it on Linkedin, twitter, pinterest, your wordpress blog, if you have one) and google+ by clicking corresponding buttons. You can also print or email this article by clicking such buttons.
http://www.independent.co.uk/news/science/the-lost-girls-illegal-abortion-widely-used-by-some-uk-ethnic-groups-to-avoid-daughters-has-reduced-female-population-by-between-1500-and-4700-9059790.html
Must read
Ignore the Benaam Aadmi, there are middle class nightmares to fix
http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2539402/Corruption-gender-abuse-policy-lethargy-redefining-India-story.html