
లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవడానికి వెళ్తూ…
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే తాను ఇచ్చిన వాగ్దానాల్లో రెండింటిని అరవింద్ కేజ్రివాల్ నెరవేర్చినట్లు కనిపిస్తోంది. కోట్లాది కళ్ల పహారా మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అరవింద్ తనకు వ్యక్తిగత సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి భద్రతా సిబ్బందిని వెనక్కి పంపేశారు. తద్వారా వి.ఐ.పి సంస్కృతిని నిర్మూలిస్తామన్న వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నాంది పలికారు. అలాగే ప్రభుత్వ భవనంలోకి తన నివాసం మార్చుకోవడానికి కూడా ఆయన తిరస్కరించారని పత్రికలు తెలిపాయి.
తాను గానీ, తన ఎమ్మేల్యేలు గాని ప్రభుత్వ పోలీసులు ఇతర భద్రతా విభాగాలు అందించే భద్రతా సౌకర్యాలను తీసుకోబోరని అరవింద్ కేజ్రివాల్ ఎన్నికల ప్రచారంలో చెబుతూ వచ్చారు. ప్రభుత్వ బంగ్లా, ఎర్ర రైట్లు ఉండే కార్లు మొదలయిన సౌకర్యాలను కూడా తాము స్వీకరించబోమని వాగ్దానం చేశారు. ఈ సౌకర్యాలన్నీ వి.ఐ.పి సంస్కృతికి నిదర్శనాలని ఆయన నిరసించారు. వి.ఐ.పి సంస్కృతిని నిర్మూలించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఇరువురూ అరవింద్ కు భద్రత ఇవ్వడానికి ముందుకు రావడం విశేషం. ఎ.ఎ.పి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సమ్మతి తెలిపిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించనున్న కేజ్రివాల్ కు భద్రత కల్పించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఘజియాబాద్ జిల్లా ఎస్.పి అరవింద్ ను కలిసి భద్రతను ఆఫర్ చేయగా ఆయన తిరస్కరించారని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. “ఢిల్లీ పోలీసు భద్రతా విభాగం నుండి మాకు లేఖ అందింది. కౌశంబి లోని ఆయన నివాసానికి భద్రత ఇవ్వాలని వారు మమ్మల్ని కోరారు. ఈ విషయం మాట్లాడడానికి నేను అరవింద్ ను కలవగా ఆయన భద్రత నిరాకరించారు” అని ఘజియాబాద్ ఎస్.పి ధర్మేంద్ర యాదవ్ తెలిపారు.
అంతకుముందు ఢిల్లీ పోలీసుల నుండి వచ్చిన ఆఫర్ ను కూడా అరవింద్ తిరస్కరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ జెడ్ కేటగిరీ భద్రతకు అర్హులు. ఢిల్లీ రాష్ట్ర పరిధిలో పోలీసు విభాగం అంటూ ఏదీ లేదు. ఢిల్లీ పోలీసు విభాగం కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంటుంది. అందుకే ఆయనకు భద్రత కల్పించే అవకాశం కల్పించడానికి యు.పి ప్రభుత్వం పోటీ పడింది. తద్వారా అరవింద్ తో స్నేహం కలిపామని చాటుకుని ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అరవింద్ కు భద్రత ఇవ్వడానికి ఒకసారి ప్రయత్నించి విఫలం అయిన ఢిల్లీ పోలీసులు మళ్ళీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తాము కల్పించే భద్రతను స్వీకరించాలని కోరుతూ ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ) వి.రంగనాధన్ అరవింద్ ప్రైవేటు కార్యదర్శికి లేఖ రాశారని జీ న్యూస్ తెలిపింది. జాతీయ రాజధానిలో ఢిల్లీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉన్నదని రంగనాధన్ తెలిపారు. ఆ మేరకు మళ్ళీ లేఖ రాశామని ఆయన తెలిపారు. మళ్ళీ నిరాకరించినట్లయితే ప్రత్యేక పోలీసులను ఆయన వెంట నియమించలేమని రంగనాధన్ తెలిపారు.
అయితే కొన్ని చోట్ల, కొన్ని సందర్భాల్లో పోలీసు భద్రతను అరవింద్ కోరినట్లు తెలుస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున సభలకు హాజరయినప్పుడు వారిని నియంత్రించడానికి పోలీసుల సాయం అవసరమని ఆయన కోరారని, కొన్ని చోట్ల స్క్రీనింగ్ చేయడానికి కూడా సాయం అడిగారని తెలుస్తోంది. ఈ సహాయం ఇవ్వడానికి కూడా తాము నిరంతరం ముఖ్యమంత్రిని అంటి పెట్టుకుని ఉండాల్సిందేనని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి చెప్పారని హిందూస్ధాన్ టైమ్స్ పత్రిక తెలిపింది. ఇది తేలివయిన ఎత్తుగడ అని కూడా కొందరు అభివర్ణిస్తున్నారు.
భద్రతతో పాటు ప్రభుత్వ బంగ్లాలోకి నివాసం మార్చడానికి కూడా అరవింద్ నిరాకరించారని ది హిందు తెలిపింది. కౌశంబి లోని తన నివాసాన్ని ఢిల్లీ సెక్రటేరియట్ సమీపంలోని ఏదన్నా ఫ్లాట్ కు నివాసం మార్చడానికి ఆయన నిర్ణయించారని పత్రిక తెలిపింది. కేజ్రివాల్ మంత్రివర్గంలోని సభ్యులు సైతం ప్రభుత్వ బంగ్లాలను నిరాకరించవచ్చని తెలిపింది. నిబంధనల ప్రకారం ఢిల్లీ మంత్రులు టైప్ 6 లేదా టైప్ 7 బంగ్లాలకు అర్హులు ఇవి రెండూ మూడు పడక గదులు కలిగి ఉంటాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ టైప్ 8 నివాసంలో 2003 నుంచి ఉంటున్నారు.
ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రి, బి.జె.పి నాయకుడు మదన్ లాల్ ఖురానా కూడా మొదట ప్రభుత్వ బంగ్లా నిరాకరించారు. 8 నెలల పాటు ఆయన అలాగే గడిపారు. కానీ అతిధులను, ప్రజలను కలుసుకోవడానికి స్ధలం సరిపోకపోవడంతో ఆయన ప్రభుత్వ నివాసానికి మకాం మార్చక తప్పలేదు. నిజంగానే స్ధలం సరిపోలేదా లేక ప్రభుత్వ సౌకర్యాలపై కన్ను కుట్టిందా అన్నది బ్రహ్మ రహస్యం. అరవింద్ కేజ్రీవాల్ ఎంతకాలం ప్రైవేటు నివాసంలో గడుపుతారో, ఒకవేళ ప్రభుత్వ బంగ్లాకు మారితే ఏ కారణం చెబుతారో చూడాలి.
వి.ఐ.పి సంస్కృతిని నిర్మూలించడంలో భాగంగా సొంత భద్రతను, బంగ్లాలను నిరాకరించడం చేతుల్లో పని. కాబట్టి పాటించడం తేలిక. అసలైన పని, కష్టమైన పని, ధనిక వర్గాలు గానీ వారి ప్రతినిధులైన కాంగ్రెస్, బి.జె.పి ఇత్యాది పార్టీలు గానీ అడుగడుగునా ప్రతిఘటించేది ప్రజోపయోగమైన విధానాలు అమలు చేయడం. ఇవి అమలు చేసిననాడే ఎ.ఎ.పి అసలు పరీక్షలో పాసయినట్లు.
ప్రభుత్వం ఇచ్చే ఇంట్లో ఉన్నంత మాత్రాన నిజాయితీకి వచ్చే ముప్పులేదు. అలాగే పోలిసుల రక్షణ కూడా తీసుకోవాలి. ఆయన శంకర్ సినేమా లో కథానయకుడి (ఒక్కరోజు ముఖ్యమంత్రి గా అర్జున్ నటించాడు,పేరు గుర్తుకు రావటంలేదు)వేషాలు వేయటం ఆపితే నిజంగా దేశానికి ఎంతో మేలు చేసినవాడౌతాడు. జాతీయ ఇంగ్లిష్ మీడియా లోని ఆయన మిత్రులు, కెజ్రివాల్ ప్రతి చేష్టని ఆహా ఓహో అని పొగుడుతూ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అంతటివాడు భుజానకెత్తుకొంట్టున్నారు. అరవింద్ కేజ్రివాల్ అజెండ ను చూస్తే, 1980 దశకంలో సోషలిస్ట్ విధానాలను షుగర్ కోట్ వేసి, మీడీయా సహాయ సహకారాలతో ప్రజల నెత్తిన వదలాడు. ఈ గ్లొబలైసేషన్ కాలంలో, ఆయన చెప్పే మోడరన్ భావాల సోషలిస్ట్ పాలన డిల్లి ప్రజల అనుభవంలోకి వస్తే ఎలా ఉంట్టుందో వేచి చూడాలి.
శ్రీరామ్ గారూ
సోషలిస్టు విధానాలకు షుగర్ కోటింగా? మీ పద ప్రయోగం నాకు కొత్తగా ఉంది. 1980లో అమలు చేసిన సోషలిస్టు విధానాలు ఏమిటి? వాటికి షుగర్ కోటింగ్ ఎలా వేశారు? కాస్త వివరించండి.
శేఖర్ గారు,
నేను చెప్పింది పూర్తి థిరిటికల్ సోషలిస్ట్ విధానాల గురించి కాదు. మనదేశంలో సోషలిస్ట్ విధానాలు అని చెప్పబడ్డ నెహ్రు,ఇంధిరా, రాజీవ్ గాంధిల కాలం నాటి ఆర్ధిక విధానాలు. ఆర్ధిక విధానలతో రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు బాగా లాభపడేవారు. ప్రభుత్వోద్యుగుల ప్రవర్తన మొహమొత్తిన సమయం లో తెలుగుదేశం పార్టి పెట్టి రామారావు గారు అధికారంలోకి వస్తే అవినీతి నిర్ములిస్తాము, ప్రభుత్వోద్యుగులు లంచం తీసుకోకుండా అరికడతాము, రేట్లు తగ్గిస్తాము అంట్టూ వాగ్దానలను చేసి, కొంతకాలం అమలు చేశారు. ఆరోజుల్లో దోశ రేటు రుపాయ ఉండాలని రామారావు గారు ఆదేశిస్తే, హోటల్ వారు దానికి యంటీఅర్ దోశ అని పేరుపెట్టి, ఆదోశ తయారు చేసేటప్పుడు నూనే వేసేవారుకాదు. అదేసమయంలో ఇంకొక దోశ రెండూ/మూడు రూపాయలకు (నూనె పోసి తయారు చేసి )అమ్మేవారు. అలాగే ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యుషన్స్ చెప్పగుడదు అని కూడా వారిని మానిటర్ చేసేవారు. మీకు ఇవ్వని గుర్తు ఉండేవుంటయి. కాలక్రమేణా అటువంటి వాగ్దానాలు ప్రాముఖ్యతను కోల్పోయాయి.
ఇక అరవింద్ గారు ఢిల్లీలోని ప్రతి కుటుంబానికీ 700 లీటర్ల తాగునీరు ఉచితంగా సరఫరా,మురికివాడల్లో నివసించే వారందరికీ పక్కా ఇళ్ళు కట్టించి ఇవ్వటం. విద్యుత్ బిల్లులు యాభై శాతం తగ్గింపు, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్ళతో సమానమయ్యేలా అభివృద్ధి , ఇటువంటి వాగ్దానాలు రామారావు,జయలలిత నటించిన కథనాయకుడి సినేమా కాలం నుంచి వింట్టునే ఉన్నాం. తమిళనాడు,ఆంధ్రా రాజకీయ నాయకులు ఇటువంటి వాగ్దానలలో పండిపోయారు (వీటివలన ప్రయోజనం మొదట్లో ఉన్నట్టు అనిపించినా పోను పోను లోపాలు బయటపడి ప్రాముఖ్యతను కోల్పోతాయి.) డిల్లి ప్రజలు కేంద్ర ప్రభుత్వం స్కాం ల మీద వ్యతిరేకతతో అరవింద్ గారిని గెలిపించినా, ఆయన ప్రజలు ఇతని కొత్త వాగ్దానలను చూసి (అందులో డిల్లి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు వాగ్దానలను లోకలైజ్ / కస్టమైజేషన్ చేశారేగాని, నిజానికి అవి ఎన్నికలముందు ప్రతి రాజకీయపార్టి కురిపించే పాత వరాలే) ఓటు వేశారనుకొని,వాటిని అమలు చేస్తానని చాలా నమ్మకంతో ఉన్నాడు.
కాని ముఖ్యమంత్రి అయిన వెంటనే కొన్ని రోజులలో ఆయన చేయగలిగేది, అసేంబ్లి లో జనలోక్‌పాల్ లాంటి బిల్లులు పాస్ చేయటం, ఆపైన రామారావుగారి లాగా ఉద్యోగస్తుల మీద పడటం. దాని పరిణామాలు మీకు తెలుసు. డిల్లి రాష్ట్రం లో ప్రభుత్వాన్ని కఠిన నిబందనలతో ఆయన అనుకొనే పద్దతిలో అమలు జరిపితే, ఇప్పటివరకు తినమరిగిన వారు,ఉద్యోగస్తులు ఆయనకు స్పీడ్‌కు తగ్గటు ఎలా సహకరిస్తారో అనేది వేయి డాలర్ల ప్రశ్న. మరి ఆయన నమ్మకమేమిటో,ప్రభుత్వం ఎలా నడుపుతాడో అర్థంకాని విషయం.
డిల్లి రాజకీయ చదరంగం ఆట మాత్రం చాలా ఆసక్తి కరంగా మారింది 🙂
The Arvind Kejriwal interview: We don’t have a magic wand to change everything
http://indiatoday.intoday.in/story/india-today-newsmaker-of-2013-arvind-kejriwal-interview/1/333252.html
80% of AAP funds from outside Delhi
MUMBAI: Political rivals may like to slot the Aam Aadmi Party as a Delhi phenomenon, but its funding pattern reveals that Delhi has contributed only 20% or Rs 4.5 crore to AAP’s total collections of about Rs 22.3 crore. NRIs contributed 30%, about Rs 6.7 crore, while the rest came from across the country, with Maharashtra alone chipping in Rs 2.8 crore.
TOI painstakingly downloaded details of all of the 83,000-odd donations put up on AAP’s website till Friday afternoon and analysed it to see which cities and states contributed how much and the distribution by the size of contributions.
http://timesofindia.indiatimes.com/india/80-of-AAP-funds-from-outside-Delhi/articleshow/28074062.cms
___________________________________
http://www.financialexpress.com/news/industrialist-brokered-deal-between-arvind-kejriwals-aap-and-cong-to-stop-bjp-nitin-gadkari/1212860
http://www.ndtv.com/article/assembly-polls/arvind-kejriwal-rubbishes-nitin-gadkari-s-claims-says-no-deal-with-congress-464359