తెలంగాణ: వివక్ష లేనిదేక్కడ?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పునరుద్ధరణకు డిమాండ్ తలెత్తడానికి ముఖ్య కారణాలు రెండు.

ఒకటి: వివక్ష

రెండు: నిర్లక్ష్యం

తెలంగాణ కంటే ముందుగా సంపన్నులైన సీమ, ఆంధ్ర భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ వర్గాలు ఆంధ్ర ప్రదేశ్ అధికార పగ్గాలను తమ చేతుల్లో ఉంచుకోగలిగారు. తద్వారా నూతనంగా సంపన్నులవుతున్న తెలంగాణ భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ వర్గాలకు అవకాశాలను వివిధ రూపాల్లో నిరాకరించారు.

అవకాశం ఉన్న చోటల్లా వివక్ష చూపారు. అవకాశం లేనిచోట నిర్లక్ష్యం చూపారు.

ఇందులో సీమ, ఆంధ్ర ప్రజలకు భాగస్వామ్యం ఉందన్న ఆరోపణ సత్యదూరం. తెలంగాణకు ఇతర ప్రాంతాల నుండి జరిగిన వలసలు వివిధ కారణాల వల్ల జరిగాయి. రాజధాని కాబట్టి కొందరు, పరిశ్రమలు అక్కడ కేంద్రీకృతం అయినందున కొందరు, చదువుల కోసం కొందరు… ఇలా. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అవకాశాలు ఉన్న చోటికి జనం తరలి వెళ్ళడం ఆదిమ కాలం నుండి జరుగుతున్నదే.

కానీ వివక్ష, నిర్లక్ష్యాలు సహజం కాదు. పదవులను, అధికారాన్ని ఆక్రమించిన వర్గాలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వీటిని పాటించారు. ఇది ప్రాంతీయ వివక్షగా వ్యక్తీకృతం అయింది. వివక్ష, నిర్లక్ష్యాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం ప్రజాస్వామికమైనది. అవి కొనసాగాలని పడే ఆరాటం స్వార్ధపూరితమైనది.

తెలంగాణ ఎదుర్కొన్న వివిధ వివక్షల్లో మచ్చుకు ఒకటి ఈ చిత్రంలో చూడవచ్చు. ఫేస్ బుక్ లో దీనిని చూశాను.

 Descrimination

4 thoughts on “తెలంగాణ: వివక్ష లేనిదేక్కడ?

 1. @ ఇందులో సీమ, ఆంధ్ర ప్రజలకు భాగస్వామ్యం ఉందన్న ఆరోపణ సత్యదూరం. ante vudhhoyaa niyamakalao violations …. nilla taralimpu lavaalla andhraa prajalu bagu padaledaa ….. andhra migration kevalam hyderabad ke vella ledu ekkada telanagana sampdha vundho vunna chotalla ee migerations vunnai .. ( nagarjuna sagar nijam sagar singareni …… ) ….
  telangana nundi andhra ke endhuku migerations jaragaedu ?… andhraa lo vunna parshrmallao telangana vallu entha madnhi ? balavanthu ni ki balhinuniki oke pallemulo bojhanam petti thinamandam oka pedda thapppu

 2. “ఇందులో సీమ, ఆంధ్ర ప్రజలకు భాగస్వామ్యం ఉందన్న ఆరోపణ సత్యదూరం.” అని మీరు అభిప్రాయపడటం సబబే.
  కాని “సీమాంధ్రలో పుట్టినవారంతా తెలంగాణాద్రోహులే” వంటి నీచమైన మాటలు మాట్లడే దుష్టులు తెలంగాణా సాధారణజనానీకం మనస్సులను కలుషితం చేస్తున్నారు. మిగతా తెలంగాణానాయకులు కూడా అటువంటి మాటలను హర్షించటం కారణంగా విబేధాలు ముదురుతున్నాయి. విచారించవలసి విషయం ఏమిటంటే సీమాంధ్రులు ఒక్కమాట అంటే‌ పదివ్యాసాలుగా విమర్శించే మన మేథావులు కూడా ఈ‌ కేసీఅర్ వంటి వారి దురాలాపాలను చూసీ చూడనట్లు ఊరుకుంటున్నాయి.

 3. చందుగారు, మీ ప్రశ్నలకు సమాధానం కూడా పైన ఉంది, క్లుప్తంగా. వలసలు మానవ సమాజంలో సహజ లక్షణం. అవకాశాలు ఉన్న చోటికి వలసలు జరుగుతాయి. వ్యతిరేక దిశలో కాదు. (రాయల) సీమ, ఆంధ్ర పెట్టుబడిదారులు తమ లాభాలను పెంచుకోవడం కోసం తెలంగాణ వనరులను ఉపయోగపెట్టుకున్నారు. హైద్రాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లో వారు పెట్టుబడులు పెట్టారు. అవి లాభాల కోసం వచ్చిన పెట్టుబడులు తప్ప తెలంగాణను ఉద్ధరించడానికి వచ్చినవి కాదు. ఏ పెట్టుబడికయినా లాభమే లక్ష్యం, ఉద్ధరణ కాదు. అక్కడ పరిశ్రమలలో పని చేయడానికి సీమ, ఆంధ్ర లలోని విద్యావంతులనే తీసుకెళ్లారు. దానికి ఒక కారణం దగ్గరివారు అయితే మాట వింటారని కావచ్చు. మరొక కారణం అప్పటికి అక్కడ సరిపోయినంతమంది క్వాలిఫైడ్ దొరకకపోవడం. కాని క్వాలిఫైడ్స్ తయారయ్యాక కూడా ఈ తేడా కొనసాగి వివక్ష రూపం తీసుకుంది. ఇందులో సీమ, ఆంధ్ర ప్రజలు ఉద్దేశ్యపూర్వకంగా దోపిడి చేయడానికి వచ్చినట్లు చెప్పడం సరికాదు. బ్రతుకు తెరువు కోసం వచ్చారంతే. దోపిడీ కోసం వచ్చింది పెట్టుబడిదారులు. వారు సీమ, ఆంధ్రలో పెట్టుబడులు పెట్టినా దోచుకుని ఉండేవారే. ఇప్పుడు చేస్తున్నట్లుగా.

  శ్యామలరావు గారు

  కె.సి.ఆర్ తదితరుల మాటలు అతిశయోక్తులు, దూషణలతో కూడినవి. వాటికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వడం ఉత్తమం. విలువ ఇవ్వడం వలన మన ఆరోగ్యానికే నష్టం. అలాంటివారి మాటలను ఉపయోగించుకుంటూ సీమ, ఆంధ్ర ప్రజల్లో అనవసర భావోద్వేగాలు రెచ్చగొట్టేవారికి కూడా ఇప్పుడు కొదవలేదు. కేంద్రం తనపని తాను చేస్తున్నా, విభజన ఆపి తీరతాం అని మోసం చేస్తున్న నాయకుల మోసాన్ని కూడా మనం గుర్తించాలి.

 4. స్టాంపులు, పెట్టుబడులు, ఉపాధి కల్పన , పదవులు, నాయకులు ఆంధ్ర వే.. ఫలాలు, అభివ్రుధి, ఉపాధి, హైదరబాద్ ది.(తెలంగాణ ది కాదు).బెదిరింపులు ,కక్ష, ద్వేషం ఆంధ్ర ప్రాంత సెటిలర్స్ పై.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s