అమెరికా కుట్ర: దేవయాని అరెస్టు ముందే పని మనిషికి వీసా


A bulldozer removes the security barriers in front of the U.S. embassy in New Delhi December 17, 2013. Indian authorities removed security barriers in front of the U.S. embassy in New Delhi on Tuesday apparently in retaliation for the arrest and alleged heavy-handed treatment of an Indian diplomat in New York. New Delhi police used tow trucks and bulldozers to remove the concrete barricades, which are used to restrict traffic on the road outside the embassy

A bulldozer removes the security barriers in front of the U.S. embassy in New Delhi December 17, 2013. Indian authorities removed security barriers in front of the U.S. embassy in New Delhi on Tuesday apparently in retaliation for the arrest and alleged heavy-handed treatment of an Indian diplomat in New York. New Delhi police used tow trucks and bulldozers to remove the concrete barricades, which are used to restrict traffic on the road outside the embassy

దేవయాని అరెస్టు వెనుక కుట్ర ఉన్నదన్న ఆమె తండ్రి ఆరోపణలు నిజం చేసే సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ పనిమనిషికైతే వీసా ఇప్పించడంలో దేవయాని మోసానికి (ఫ్రాడ్) పాల్పడ్డారని అమెరికా ఆరోపించి అమానవీయ పద్ధతిలో అరెస్టు చేసి నిర్భంధింఛిందో అదే పని మనిషికి దేవయాని అరెస్టుకు రెండు రోజుల క్రితమే పూర్తి స్ధాయి వీసా మంజూరు చేసి అమెరికా తరలించారని వెల్లడి అయింది. దేవయాని ఇంటి నుండి మూడు నెలల క్రితం మాయామయిన సంగీతా రిచర్డ్స్ ఆనుపానులు కనిపెట్టాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి అలా ఉండగానే ఆమెకు అమెరికా వీసా మంజూరు చేయడం గమనార్హం. దేవయాని అరెస్టు ఉన్నట్లుండి జరగలేదనీ, అరెస్టు వెనుక ఒక చరిత్ర ఉన్నదని విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించడం గమనార్హం.

గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఈ సంవత్సరం జూన్ వరకు దేవయాని ఇంటిలో పని చేసిన సంగీతా రిచర్డ్స్ అకస్మాత్తుగా అక్కడి నుండి మాయమయింది. దేవయాని ఇంటి నుండి 200 డాలర్లు, ఒక సెల్ ఫోన్ దొంగిలించినట్లు కనుగొన్న దేవయాని కుటుంబం ఈ విషయమై ఢిల్లీ హై కోర్టుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ లోపు తనకు 10,000 డాలర్లు ఇవ్వాల్సిందిగా సంగీతా రిచర్డ్స్ దేవయాని కుటుంబానికి ఫోన్ చేసి డిమాండ్ చేసింది. ఈ నేపధ్యంలో వేతన ఫిర్యాదులు ఏమన్నా ఉంటే వాటిని ఇండియా కోర్టుల్లో తేల్చుకోవాలి తప్ప అమెరికా కోర్టులకు వెళ్లరాదని ఢిల్లీ హై కోర్టు తాత్కాలిక ఇంజక్షన్ జారీ చేసింది.

ఈ తతంగం జరుగుతున్నన్నాళ్ళూ సంగీతా రిచర్డ్స్ ఎక్కడ ఉన్నదీ భారత అధికారులకు అంతుబట్టలేదని వారు అమెరికాకు ఇచ్చిన ఫిర్యాదుల ద్వారా తెలుస్తోంది. సంగీతా రిచర్డ్స్ తనకు మంజూరు చేసిన రాయబార పాస్ పోర్టు తో సహా పారిపోయారనీ కాబట్టి ఆమె ఆచూకీ తమకు తెలియజేయాలని భారత అధికారులు అమెరికాను కోరుతూ వచ్చారు. అమెరికా ఈ విషయంలో ఎలాంటి స్పందనా ఇవ్వలేదు. ఇండియా మాత్రం విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తూనే ఉంది.

Devyani Khobragade

Devyani Khobragade

ఇదిలా ఉండగానే హఠాత్తుగా డిసెంబర్ 12 తేదీ ఉదయం 9 గం.ల ప్రాంతంలో తన పిల్లలను పాఠశాల వద్ద దింపడానికి వెళ్ళిన దేవయానిని అమెరికా రాయబార పోలీసులు అరెస్టు చేశారు. వారి పిల్లల ముందే సంకెళ్లు వేసి పట్టుకుపోయారు. అనంతరం ఆమెను యు.ఎస్.మార్షల్ సర్వీస్ (యు.ఎస్.ఎం.ఎస్ – అమెరికా న్యాయ శాఖ ఆధీనంలో ఉండే పోలీసు విభాగం) పోలీసులకు అప్పజెప్పారు. ఇక అక్కడి నుండి యు.ఎస్.ఎం.ఎస్ పోలీసులు రెచ్చిపోయారు.

సంగీతా రిచర్డ్స్ కు జారీ చేసిన వీసా నిబంధనలను దేవయాని సక్రమంగా పాటించలేదన్న ఆరోపణలపైనే దేవయానిని అమెరికా అరెస్టు చేసింది. వీసా ఫ్రాడ్ కు ఆమె పాల్పడ్డారని చెప్పి అరెస్టు చేసింది. అంటే తప్పుడు వీసాపైన సంగీతా రిచర్డ్స్ అమెరికా ఉన్నట్లు అర్ధం. అలాంటి ఆమెకు ఇప్పుడు అమెరికా పూర్తి స్ధాయి వీసా మంజూరు చేసి న్యూయార్క్ తరలించినట్లు ది హిందూ తెలిపింది. అనగా ఒక పధకం ప్రకారమే అమెరికా ఈ తతంగం నడిపినట్లు స్పష్టం అవుతోంది. ఈ పధకానికి సంగీతా రిచర్డ్స్ సహకరిస్తుందోన్నది స్పష్టమే. బహుశా అమెరికా పధకంలో భాగంగానే దేవయాని ఇంటి నుండి సంగీతా రిచర్డ్స్ మాయమై ఉండొచ్చు. లేదా సంగీతా రిచర్డ్స్ మొదటి నుండి అమెరికా గూఢచార సంస్ధల కుట్రలో భాగస్వామ్యం వహించినా ఆశ్చర్యం లేదు. అటువంటి శక్తి సామర్ధ్యాలు, నైతిక పతనం అమెరికా సొంతం కూడా.

ఎందుకిందంతా? అదే ఇంకా తేలవలసి ఉంది. తమ కూతురు అరెస్టు వెనుక కుట్ర జరిగిందని దేవయాని తండ్రి ఉత్తమ్ కుమార్ ఇప్పటికే ఆరోపించారు. ఆయన ఆరోపణలను సమర్ధించే విధంగా ఈ రోజు రాజ్యసభలో విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన ప్రకటన ఉండడం గమనార్హం. దేవయాని అరెస్టు ఉన్నట్లుండి ఆకాశంలో నుండి ఊడిపడిన ఘటన కాదని, దీని వెనుక ఒక చరిత్ర ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. బహుశా ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపిన ఇటలీ మెరైన్ సైనికులను అరెస్టు చేసి విచారిస్తున్నందుకే అమెరికా ఈ ప్రతీకారానికి తెగబడిందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి విషయాలలో ఐరోపా-అమెరికాలు పూర్తిగా సహకరించుకుంటాయి. గూఢచార సమాచారంలోనే సహకరించుకునే దేశాలు ఇటువంటి చిన్న విషయంలో సహకరించుకోకుండా ఉండవు. ఇది కాక ఇంకేదైనా ‘చరిత్ర’ ఏమి ఉన్నదో వెల్లడి కావాల్సి ఉంది.

అమెరికా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దేవయానిని బట్టలు విప్పించి తనిఖీ చేసిన మాట నిజమేననీ, యు.ఎస్.ఎం.ఎస్ ప్రోటోకాల్స్ ప్రకారమే ఇది జరిగిందనీ అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధులు ప్రకటించారు. బట్టలు విప్పి తనిఖీ చేయడమే కాకుండా సెల్ లో వేసేవరకూ సంకెళ్లు వేశారని తెలుస్తోంది. ఇతర సాధారణ నేరస్ధులతో పాటే ఉంచాలని తమ ప్రోటోకాల్స్ చెబుతున్నాయని ఆ విధంగానే ఆమెను ఇతర నేరస్ధులతో కలిపి నిర్బంధించామని అమెరికా చక్కగా స్పష్టంగా వివరించింది.

న్యూ ఢిల్లీలోని అమెరికా ఎంబసీ వద్ద ఉంచిన సిమెంట్ బ్యార్కేడ్లను ఇండియా తొలగించడం పైన అమెరికా స్పందించింది. వియన్నా ఒప్పందం ప్రకారం తమ రాయబార సిబ్బందికి రక్షణ కల్పిస్తారని తాము ఆశిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వాషింగ్టన్ డి.సిలోని భారత రాయబార కార్యాయం వద్ద ఇంతకు ముందే అమెరికా ఇలాంటి చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయబార కార్యాలయ సిబ్బందికి కేటాయించిన పార్కింగ్ స్ధలాన్ని స్వాధీనం చేసుకుని సాధారణ ఉపయోగం నిమిత్తం కేటాయించుకుంది. దానికి ప్రతిగానే న్యూ ఢిల్లీలో అమెరికా ఎంబసీ వద్ద రోడ్డుపై అదనంగా కేటాయించిన స్ధలాన్ని భారత అధికారులు స్వాధీనం చేసుకుని ప్రజల ఉపయోగం నిమిత్తం కేటాయించారు.

దేవయాని అరెస్టు విషయమై బుధవారం రాజ్య సభలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా పార్టీలన్నీ అమెరికా చర్యలను ఖండించాయి. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతు ప్రకటించాయి. దేవయానిని గౌరవపూర్వకంగా వెనక్కి తెచ్చే బాధ్యత తనదేనని విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాజ్య సభలో ప్రకటించారు. రాయబారిని వెనక్కి తీసుకురానంతవరకు తానిక రాజ్య సభలో అడుగు పెట్టబోనని ఆయన శపధం కూడా చేశారు. కానీ ఈ ప్రభుత్వం నడిచేది మరో విడత పార్లమెంటు సమావేశాల వరకే. ఈ లోపు ఆయన శపధం నెరవేర్చుకోవాలి.

4 thoughts on “అమెరికా కుట్ర: దేవయాని అరెస్టు ముందే పని మనిషికి వీసా

  1. భారతీయ జాలర్లను కాల్చి చంపిన ఇటలీ మెరైన్ సైనికులను అరెస్టు చేసి విచారిస్తున్నందుకే అమెరికా ఈ ప్రతీకారానికి తెగబడిందా అన్న 

    ఇది మీ వ్యక్తిగత అనుమానమా లేక ఎదైనా హిందూ లాంటి విశ్వసనీయ పేపర్లో రాశారా?

  2. ఏ పనిమనిషికైతే వీసా ఇప్పించడంలో దేవయాని మోసానికి (ఫ్రాడ్) పాల్పడ్డారని అమెరికా ఆరోపించి అమానవీయ పద్ధతిలో అరెస్టు చేసి నిర్భంధింఛిందో అదే పని మనిషికి దేవయాని అరెస్టుకు రెండు రోజుల క్రితమే పూర్తి స్ధాయి వీసా మంజూరు చేసి అమెరికా తరలించారని వెల్లడి అయింది. Here I did not understand one thing, that is the maid is shifted to America from India or from India to America? Where was the maid before and after the arrest of Mrs Devayani?

  3. రావు గారూ, ఈ వాక్యం రాసేటప్పటికి పత్రికలు కూడా స్పష్టత ఇవ్వలేదు. తర్వాత వెల్లడైన అంశాలను బట్టి సంగీతా రిచర్డ్స్ అప్పటికి అమెరికాలోనే ఉన్నారు. అమెరికా ప్రభుత్వంలోని ఒక శాఖ పోషణలో ఉండే స్వచ్చంద సంస్ధ రక్షణలో ఆమె ఉన్నారు. కాని ఆమెకు అమెరికాలో ఉండడానికి చట్టబద్ధ వీసా లేదు. దేవాయని అరెస్టుకు ముందు చట్టబద్ధ వీసా ఇచ్చారు. అలాగే ఆమె కుటుంబ సభ్యులు (భర్త, పిల్లలు) ఢిల్లీలో ఉండగా వారికి కూడా వీసాలు ఇచ్చి న్యూయార్క్ తీసుకెళ్లారు.

    కాబట్టి పై వాక్యం కొన్ని సవరణలతో అర్ధం చేసుకోవాలి. పూర్తి స్ధాయి వీసా ఇచ్చింది నిజమే కాని సంగీతా రిచర్డ్శ్ కుటుంబం మొత్తానికి. అలాగే ఇండియా నుండి అమెరికా తరలించింది నిజమే కానీ సంగీతా భర్త, పిల్లలను మాత్రమే. సంగీత అప్పటికే అమెరికాలో ఉన్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s