బాల్యం లేని పాకిస్తాన్ బాల్యం -ఫోటోలు


పాకిస్తాన్ బాల్యం అనగానే మనకి ఈ మధ్య కాలంలో గుర్తుకు వచ్చేది మలాలా యూసఫ్జాయ్. తాలిబాన్ ఆదేశాలను ధిక్కరించి బాలికా విద్యకోసం పోరాడుతున్న బాలికగా ఆమె పేరు ప్రపంచం అంతా మారుమోగేలా చేయడంలో పశ్చిమ పత్రికలు రాత్రనకా పగలనక శ్రమించాయి. నోబెల్ శాంతి బహుమతికి కూడా ఆమె పేరు ప్రతిపాదించి కొందరు సంతోషించారు. కానీ ప్రపంచం విస్మరించిన పాకిస్తాన్ బాల్యం మలాలాకు మించినది.

పాకిస్తాన్ లోని అసలు బాల్యం అనేక సమస్యలకు ఎదురీదుతూ గ్యారంటీ లేని భవిత వైపు ప్రయాణిస్తోంది. నిజానికి ఇలాంటి గడ్డు పరిస్ధుతులను ఎదుర్కొంటున్నది పాకిస్తాన్ బాల్యం మాత్రమేనా అంటే, కాదన్నదే సమాధానం. ఇలాంటి దృశ్యాలు మనకి మూడో ప్రపంచ దేశాలన్నిటా చాలా మామూలుగా దర్శనమిస్తాయి. భారత దేశం అందుకు మినహాయింపేమీ కాదు. కానీ పాక్ బాల్యం ఎదుర్కొంటున్న దీన పరిస్ధితికి అమెరికా, ఐరోపా దేశాల సామ్రాజ్యవాదం నేరుగా కారణం కావడమే గమనార్హమైన విషయం.

ఆఫ్ఘనిస్తాన్ ను దురాక్రమించిన అమెరికా తన టెర్రరిస్టు వ్యతిరేక ప్రపంచ యుద్ధానికి పాకిస్తాన్ ను స్ధానికంగా ముఖ్యమైన భాగస్వామిగా స్వీకరించింది.  పాకిస్తాన్ సహకారం కావాలని అమెరికా కోరుకుంటే ఇక ఆ దేశానికి మరో ప్రత్యామ్నాయం ఏమీ లేనట్లే. దశాబ్దాల తరబడిన నియంతృత్వ పాలనలో అరకొర సౌకర్యాలతో తల్లడిల్లిన పాక్ ప్రజ ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం వలన మరింతగా దారుణమైన పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి తరలివచ్చిన శరణార్ధులు భారం పెంచడంతో ప్రభుత్వం నుండి అందుతున్న అరకొర సౌకర్యాలు కూడా వారికి పలచబడ్డాయి.

ఫలితంగా ఉపాధి ఇంకా పడిపోయి, వేతనాలు తీవ్రంగా తగ్గిపోయాయి. దానితో పేద కుటుంబాలలో పెద్దలందరూ పనులకు వెళ్లాల్సిరావడంతో పాటు కాసింత వయసు వంటిమీదకొచ్చిన పిల్లలు కూడా బలవంతంగా, గత్యంతరం లేని పరిస్ధితుల్లో పనులకు వెళ్లాల్సి వస్తోంది. దానితో ఇళ్లవద్ద పసి పిల్లలను కాచుకునే వారు అనేకచోట్ల కరువయ్యారు. గ్రామాల నుండి తరలివచ్చిన శ్రామికులు నగరాలు, పట్టణాలను ముంచెత్తడం ఒక సమస్య అయితే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం పాకిస్తాన్ నేలపైకి అనివార్యంగా ఒలికిపోవడం మరో సమస్య. ఆఫ్ఘన్ తాలిబాన్ కు అనుబంధంగా పాకిస్తాన్ లో విస్తరించిన పాక్ తాలిబాన్ అనధికార పాలన పాక్ బాల్యానికి ముఖ్యంగా బాలికలకు పెను శాపమే అయింది. అంతిమంగా పాకిస్తాన్ మిలిటెంట్లతో పోరాడుతున్నాం అని చెప్పేవారే మిలిటెన్సీ కి తగిన పరిస్ధితులు సృష్టిస్తున్నారు. 

ఈ ఫోటోలు టైమ్ తదితర పత్రికలు అందించాయి.

2 thoughts on “బాల్యం లేని పాకిస్తాన్ బాల్యం -ఫోటోలు

 1. How life has changed for Delhi rape victim’s family

  ‘A dream’

  All that the family is really left with are her memories, the good and the bad. And a dream.

  Her mother says she remembers how her daughter would talk the night away with her father and her brothers about their hopes for the future. They remember her final hours in the intensive care unit after doctors gave up hope: her brother says the family stood around her bed as “her heart beat slowed, the alarm bells went ringing and the monitors flat-lined”.

  Her father says he has a dream often.
  The victim’s brother is studying to become a doctor “She comes in one dream, you know,” he says, his eyes gleaming suddenly, looking at me. “We are in a hotel in a town to see her. She visits us. She stands near me and asks me whether I need money. I tell her, I don’t need any money, just take care of your brothers. And then she vanishes.

  “She would always tell me not to worry about money. That she would take care of the family.”

  That is what poverty does to you, the father says. Think about money all the time. Think about whether you have enough money in your pocket to take your daughter’s body home.

  “When I went to the hospital on the night of 16 December with a friend the doctors told me my daughter would not possibly live beyond a couple of hours. My first thought was how will I take her body home?” he says.

  “Between the two of us we had 1,000 rupees ($16; £9). Would it be enough to pay for the medicines and the ambulance? She survived the night. Next day a politician came and paid me 25,000 rupees ($405; £250). I felt better. At least I had the money to take her body home if she died. This is what poverty does to you.”

  http://www.bbc.co.uk/news/world-asia-india-25344403

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s