ఒక వ్యక్తి చనిపోయినపుడు ఎవరైనా ఎలా ప్రవర్తిస్తారు? చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ వారికి జరిగిన నష్టం వలన తాము ఎంత భాధగా ఉన్నది తెలిసేట్లుగా ప్రవర్తిస్తారు. వేరే ఎన్ని పనులున్నా వాటి జోలికి పోకుండా సంయమనం పాటిస్తారు. నెల్సన్ మండేలా లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోరాట యోధుడు చనిపోయినప్పుడయితే ఎంత క్రమశిక్షణ పాటించాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అమెరికా, డెన్మార్క్, బ్రిటన్ దేశాల అధినేతలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి వార్తలకెక్కారు.
డెన్మార్క్ ప్రధాన మంత్రి హెల్లే ధార్నింగ్-ష్మిత్, బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్, అమెరికా అధ్యక్షుడు ఒబామా సొంత ఫోటో సెషన్ లు జరుపుకుంటూ పత్రికల ఫోటో జర్నలిస్టులకు ఆహారం అయ్యారు. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలు తమ ‘జాతి పిత’గా అమితంగా గౌరవించే నెల్సన్ మండేలా మరణించిన సందర్భంగా అంతిమ వీడ్కోలు ఇవ్వడానికి సోవెటో లోని ఫుట్ బాల్ స్టేడియంకు పెద్ద ఎత్తున ఒకపక్క తరలివచ్చారు. మరో పక్కేమో ఈ మూడు దేశాల అధినేతలు అదేమీ తమకు పట్టనట్లుగా వ్యవహరించారు. ఈ ఉదంతం పైన పత్రికలు, ఇంటర్నెట్ నిండా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డెన్మార్క్ ప్రధాని హెల్లెన్ కు ఇరువైపులా బ్రిటిష్, అమెరికన్ దేశాధినేతలు కూర్చొని ఉండగా ఆమె తన సెల్ ఫోన్ తో ‘సెల్ఫీ ఫోటో’ (తన ఫోటోను తానే తీసుకోవడం ‘సెల్ఫీ’ గా పిలుస్తున్నారు) తీస్తూ పత్రికల కెమెరాలకు పని కల్పించారు. ఫోటో ఫ్రేమ్ లో బ్రిటిష్ ప్రధాని కామెరాన్ మొఖం పూర్తిగా కవర్ కాలేదేమో, హెల్లెన్ ఆయన తలను తన తలవైపుకు లాక్కుంటూ ఫోటో తీసుకుంటున్న దృశ్యాలు కొన్ని పత్రికలకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సైతం ఈ వ్యవహారంలో నవ్వుతూ తుళ్లుతూ కనిపించారు. తాము ఒక ప్రపంచ స్ధాయి నాయకుడు చనిపోయిన సందర్భంగా నివాళి అర్పించడానికి వచ్చామని, అటువంటి సందర్భంలో తమ మనసుల్లో ఎటువంటి విషాధ భావాలూ కలగకపోయినా దేశాధినేతలుగా భావాలు ఉన్నట్లు కనీసం నటించాలనీ వారు గ్రహించినట్లు కనపడకపోవడం విచారకరం. ఈ తతంగం జరుగుతుండగా ఆ పక్కనే కూర్చొని ఉన్న అమెరికా ప్రధమ మహిళ మిచెల్లే ఒబామా ముభావంగా ఉండడం మరింతగా చర్చనీయాంశం అయింది. ఒబామా ప్రసంగం ముగిసిన తర్వాత డెన్మార్క్ ప్రధాని, ఒబామాల మధ్యకు మిచెల్లే కూర్చొని ఉండడం కూడా ఒక వార్త అయింది.
మండేలాకు నివాళి (మెమోరియల్ సర్వీస్) అర్పించడానికి దాదాపు 150 దేశాల నుండి అగ్రనేతలు వచ్చారు. దాదాపు వీరంతా మండేలా ప్రాముఖ్యతను కొనియాడినవారే. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ నేత, యు.పి.ఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ, సి.పి.ఏం నేత సీతారాం యేచూరి తదితరులు కూడా నివాళి అర్పించడం కోసం వచ్చినవారిలో ఉన్నారు. 53 దేశాల నుండి ప్రభుత్వాధినేతలే హాజరు కాగా, ఇతర దేశాల నుండి అత్యున్నత స్ధాయి ప్రతినిధి బృందాలు ఈ నివాళి కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇటువంటి కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్, డెన్మార్క్ దేశాల అధినేతలు అరాచకంగా ప్రవర్తించడంపైన పలు విమర్శలు వస్తుండగా ఈ నేతలు మాత్రం తమ చర్యను సమర్ధించుకోవడం విశేషం. డెన్మార్క్ కు చెందిన ఉన్నత రాజకీయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఫోటో కోసం అడిగితే నిరాకరించలేకపోయానని కామెరాన్ సమర్ధించుకున్నారు. “కిన్నాక్ కుటుంబానికి చెందిన సభ్యురాలు ఒక ఫోటోగ్రాఫ్ కోసం అడిగితే అవునని చెప్పడం సభ్యత అని నేను భావించాను” అని బ్రిటిష్ ప్రధాని తమ పార్లమెంటులో వివరణ ఇచ్చుకున్నారు.
డెన్మార్క్ లో లేబర్ పార్టీ నేతకు ధార్నింగ్-ష్మిత్ కోడలు. ఆమె వయసు 46 సం.లు మాత్రమే. 2011లో ఆమె డెన్మార్క్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఫ్యాషన్ దుస్తులకు ఆమె అధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ఆ దేశంలో అప్పటికే ఆమెపై విమర్శలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వాల్సింది నెల్సన్ మండేలాకు గానీ డెన్మార్క్ కి చెందిన కిన్నాక్ కుటుంబానికి కాదు కదా? ఈ మాత్రం కూడా బ్రిటిష్ నేతకు తెలియదనుకోవాలా?
హెల్లెన్ ధార్నింగ్-ష్మిత్ అయితే మరీ విచిత్రమైన కారణం చెప్పి తన చర్యను సమర్ధించుకున్నారు. “అక్కడ వాతావరణం విషాదకరంగా ఉన్నది నిజమే. కానీ అంతిమంగా అది తన జీవితంలో ఎంతో సాధించిన ఒక 95 సంవత్సరాల వ్యక్తి జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే కదా!” అని ఆమె వ్యాఖ్యానించారని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. ఆమె ఇంకా ఇలా అన్నారు “స్టాండ్స్ లో డ్యాన్స్ కూడా చేస్తున్నారు. ఆడుతున్నారు, పాడుతున్నారు. కాబట్టి మూడ్ పాజిటివ్ గానే ఉంది. ఆ సమయంలో మేము నిజంగా ఒక ఆహ్లాదకరమైన సెల్ఫీ తీసుకున్నాం… ఆ రోజు అనేకమంది ఫోటోలు తీసుకున్నారు. ఒబామా ఫోటోలు కూడా చాలా తీసుకున్నారు. కొద్దిగా ఆహ్లాదకరంగా గడిపాం. నాయకులు కలుసుకున్నప్పుడయినా మేము కూడా సాధారణ వ్యక్తులమే అని అది సూచిస్తుంది” అని హెల్లెన్ అన్నారని టెలిగ్రాఫ్ తెలిపింది.
అందరూ ఒబామా ఫోటోలు తీసుకుంటున్నారు, నేనూ తీసుకున్నాను. అందులో తప్పేముంది అని డెన్మార్క్ ప్రధాని ప్రశ్నిస్తున్నారు. కానీ ఫోటోలు చూస్తే వాతావరణం అలా కనపడ్డం లేదు. అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ సీరియస్ గానీ కనిపిస్తున్నారు, ఈ ముగ్గురు తప్ప. చివరికి మిచెల్లే ఒబామా కూడా సీరియస్ గా కనిపిస్తున్నారు. డెన్మార్క్ ప్రధాని తో మాట్లాడేటప్పుడు కూడా మిచెల్లే సీరియస్ గానే ఉన్నారు. ఇక ఆహ్లాదకరం అని హెల్లెన్ ఎలా చెప్పగలరు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తో కలిసి చర్చలు జరిపిన ఒక సందర్భంలో పుతిన్ కుర్చీలో జారిగిలబడి కూర్చోవడం గురించి పశ్చిమ పత్రికలు పెద్ద గొడవ సృష్టించాయి. పుతిన్ కు సభ్యత తెలియదని, అమెరికా అధ్యక్షుడు అంతటివారి పక్కన రిలాక్స్ అయి కూర్చుంటారా అని అమెరికా, యూరోపియన్ పత్రికలు ప్రశ్నించాయి. ఆ సంఘటన ముగిసి అనేక నెలలపాటు దాని గురించి కుళ్ళు జోకులతో అవి చర్చించుకున్నాయి. కానీ విచిత్రంగా ఘనత వహించిన అమెరికా, ఐరోపా దేశాధినేతలు మండేలా నివాళి సభలో వ్యవహరించిన తీరుపై అవి ఏ మాత్రం ప్రశ్నించిన దాఖాలా లేదు. ఫోటోలు, వార్తలు ప్రచురించిన పత్రికలు కూడా ఒక వార్తగా ప్రచురించాయే తప్ప విమర్శ మాత్రం చేయలేదు. బ్లాగర్లు, స్వతంత్ర పత్రికలు మాత్రమే కాస్త విమర్శ చేశారు.
పింగ్‌బ్యాక్: మండేలా అంతిమ క్రియల్లో ఒబామా ఫోటో సంబరం | ugiridharaprasad
there is a difference in culture. People don’t cry on top of a corpse like we Indians do. In west Death is generally a celebration of the life lives by the person. http://www.rawstory.com/rs/2013/12/11/happy-tears-as-south-africa-celebrates-nelson-mandelas-life/
You can also see Africans dancing and celebrating in the streets
Hi atluris, I think it’s not for the west to celebrate. It’s only for South Africa. What we see in the West is to mourn, pray and praise but not to celebrate. That too, for South Africans it was to celebrate only after ‘formal mourning.’
For examble see what an atendee said (from your link)
“The last few days were very formal and very difficult for all of us. Now that we have accepted everything…it’s time for us to celebrate his life.”
Obama, Hellen and Cameron are not part of this culture. I think they should have restrained themselves. They met several times before and am sure will be meeting in future. They might have spared this meeting as per their own traditions.
I think, we can understand the behaviour of South Africans but not of Obama, Hellen and Cameron.
People need not cry but they can sit right. Sorrow full is not meant for country (India), it’s a time of factor for humanity. If top corpse have to be in crazy of romance, why they have to be before media publicity, level enough to room simplicity. This is only called BROTHAL POLITICS. Culture doesn’t have differenciation of East and West but it is the question honesty and common sense
స్మశానంలో శొభనం చేసుకునేవరికి సానికొంప అవస్థలు తప్ప సంసార సాంస్కృతిక వ్యవస్థ గురించి తెలియదు. మానవత్వపు విలువలకు సంభందించిన అంతిమ సంస్మరణ అంశం. ఆ సమయంలో దేశవాళీ,పాశ్చాత్య భావనల బేధాలు కాదు చూడవలసినవి మనసులతో మమేకమైన విలువల సాంప్రదాయం. రాజకీయ దురంధరుల దర్పణంలో ఇదొక లైంగిక కోణం.
“Culture doesn’t have differenciation of East and West but it is the question honesty and common sense”
You have a valid point for the present issue. But, this may not hold good in general. It may be said “there may be cultural differences, but common sense is common for all cultures.’