ఇజ్రాయెల్, పాలస్తీనాల వైషమ్యాలకు కారణం?


israel-palestine

ప్రశ్న (ఉమేష్ పాటిల్): ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య వైషమ్యాలకు కారణం వివరించండి.

సమాధానం: ఇది అమెరికా, ఐరోపా (ప్రధానంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు) సృష్టించిన సమస్య. యూదు ప్రజలకు చారిత్రక న్యాయం చేసే పేరుతో సొంత ప్రయోజనాలను నెరవేర్చుకునే కుట్రతో ఇజ్రాయెల్ ను ఈ దేశాలు సృష్టించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత హిట్లర్ యూదులను వెంటాడి వేటాడనీ, గ్యాస్ ఛాంబర్లలో పెట్టి సామూహికంగా చంపాడని ఆరోపించి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా యూదులకు సొంత రాజ్యం సృష్టిస్తామని చెప్పి ఇజ్రాయెల్ ను స్ధాపించాయి పశ్చిమ దేశాలు.

ఒకవేళ హిట్లర్ పాపం చేశాడనే అనుకుందాం. జాత్యహంకారంతో యూదులను సామూహికంగా చంపాడనే అనుకుందాం. ఆ పాపం చేసింది యూరోపియన్లు కాబట్టి ఆ సొంత రాజ్యం యేదో జర్మనీలోనే ఇస్తే అది సరైన పరిహారం అవుతుంది. లేదా ఐరోపాలో ఇంకెక్కడన్నా చోటు ఖాళీ చేసి యూదులకు ఒక దేశాన్ని కేటాయిస్తే అది న్యాయం అయి ఉండేది. కానీ యూరోపియన్ల పాపంలో ఏ విధంగానూ పాత్ర లేని పాలస్తీనాలో ఇజ్రాయెల్ ను సృష్టించారు.

ఇజ్రాయెల్ ని సృష్టించడానికి పాలస్తీనా ప్రజల భూములను, గ్రామాలను, ఇళ్లను, నీళ్ళను, పచ్చని పంట పొలాలను లాక్కున్నారు. సహస్రాబ్దాలుగా వారు నడిచిన నేలను వారికి కాకుండా చేశారు. ఐరాస తీర్మానం ద్వారా ఇజ్రాయెల్ కి కేటాయించిన భూమి కంటే ఎక్కువే లాక్కుని పాలస్తీనీయులను తరిమి తరిమి కొట్టారు. బ్రిటన్-ఫ్రాన్స్-అమెరికాల సహాయంతో యూదు సైన్యాలు సాగించిన అరాచకాల ధాటికి పాలస్తీనీయులు పొట్ట చేత బట్టుకుని పొరుగు అరబ్ రాజ్యాలకు వలస పోయారు. పాలస్తీనా భూభాగంలో నివసించిన పాలస్తీనా అరబ్బులలో దాదాపు 85 శాతం మంది ఈ విధంగా బలవంతంగా వెళ్లగొట్టబడ్డారు.

2012 ఐరాస అంచనా వేసిన లెక్కల ప్రకారం వెస్ట్ బ్యాంక్, గాజాలతో పాటు పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనా శరణార్ధుల సంఖ్య 5.1 మిలియన్లు. వీరికి ఇంతవరకు ఒక దేశం అంటూ లేదు. 1967 నాటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత ఐరాస తీర్మానం ప్రకారం పాలస్తీనా అరబ్బులకు కేటాయించిన భూములను కూడా ఇజ్రాయెల్ దురాక్రమించింది. అప్పటినుండి సదరు దురాక్రమణ ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. పాలస్తీనా భూములనే కాక సిరియా, లెబనాన్, ఈజిప్టు, జోర్డాన్ దేశాలకు చెందిన భూభాగాలను కూడా కొన్నింటిని ఇజ్రాయెల్ ఆక్రమించింది.

ఇలా ఆక్రమించిన భూముల్లో ఇజ్రాయెల్ యూదుల కోసం అక్రమంగా సెటిల్మెంట్లు నిర్మిస్తూ వస్తోంది. ప్రపంచం నలుమూలలో నివశిస్తున్న యూదులను పిలిచి వారికి ఈ సెటిల్మెంట్లు కేటాయిస్తోంది. తద్వారా సరికొత్త వాస్తవాలను భౌతికంగా ఏర్పాటు చేసుకుని పాలస్తీనా మొత్తం ఇజ్రాయెల్ గా ప్రకటించుకోవాలని కుట్రలు చేస్తోంది. ఈ కుట్రలకు అమెరికా, ఐరోపాల మద్దతు ఉంది. ముఖ్యంగా అమెరికా అండతో ఇజ్రాయెల్ రాజ్యం చెయ్యని నేరం లేదు.

అమెరికా, ఐరోపాలకు చమురు సంపదలకు నిలయమైన అరబ్బు దేశాల మధ్య ఒక త్రోజాన్ హార్స్ కావాలి. దాని సాయంతో అరబ్బు దేశాలను నియంత్రించాలి. తద్వారా అక్కడి చమురు సంపదలను తమ చేతుల్లో పెట్టుకోవాలి. అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేరాలంటే ఇది తప్పనిసరి అవసరం. ఏ దేశానికైనా ఇంధన (ఎనర్జీ) వనరు అత్యవసరమే. కాకపోతే ఆ అవసరం ఎలా తీర్చుకోవాలి? మన ఉత్పత్తులను వారికి ఇచ్చి వారి చమురు మనం తీసుకోవాలి. కానీ వలసవాద దోపిడీకి, బల ప్రయోగంతో స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు అలవాటు పడ్డ సామ్రాజ్యవాద దేశాలకు స్నేహపూరిత వాణిజ్యం ద్వారా, సరుకులు ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా అవసరాలు తీర్చుకోవడం అంటే తెలియదు. వారికి తెలిసిందల్లా కుట్రలు చేయడం, దండెత్తడం, దురాక్రమించడం, లొంగదీసుకోవడం.

భారత దేశంతో పాటు, ఇతర ఆసియా దేశాలను, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలను, కొన్ని తూర్పు ఐరోపా దేశాలను వారు ఇలాగే దురాక్రమించి, వందలయేళ్లు వలసలుగా పాలించారు. వాణిజ్యం పేరుతో వచ్చి సంపదలను దోచుకెళ్లి కుప్పలు పోసుకున్నారు. జాతీయోద్యమాలతో ఈ దేశాలు నామమాత్ర స్వతంత్ర దేశాలుగా అవతరించాక దోచుకెళ్లిన డబ్బునే అప్పులుగా ఇచ్చి, ఫైనాన్స్ ద్వారా ఆయా దేశాల ప్రభుత్వాలను తద్వారా అక్కడి సహజ సంపదలను నియంత్రిస్తున్నారు.

ఇదే తరహాలో పాలస్తీనాను ఇజ్రాయెల్ దురాక్రమించింది. ఆక్రమించింది ఇజ్రాయెలే అయినా దాని వెనుక ఉన్న అసలు శక్తులు అమెరికా, ఐరోపాలు. వాటి మద్దతు లేకుండా ఇజ్రాయెల్ ఉనికి ఒక్క రోజన్నా ఉంటుందా అన్నది అనుమానమే.

మరిన్ని వివరాల కోసం ఈ కింది లింక్ లు చూడండి.

అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను చీత్కరిస్తూ పాలస్తీనాకు ఐరాసలో స్ధానం –1

అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను ఓడిస్తూ ఐరాసలో పాలస్తీనా –2

అంతర్జాతీయ చీదరింపులు తోసిరాజని కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం

గంటర్ గ్రాస్ ను ‘పర్సోనా నాన్ గ్రాటా’ గా ప్రకటించిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ అక్రమ సెటిల్ మెంట్ల పై విచారణకు ఐక్యరాజ్య సమితి ఆదేశం

‘ఇరవై సంవత్సరాల్లో ఇజ్రాయెల్ నాశనం’, రెండేళ్ళ క్రితమే హెచ్చరించిన అమెరికా

ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానానికి మద్దతిచ్చిన ఇండియాపై అమెరికా ఆగ్రహం -వికీలీక్స్

2 thoughts on “ఇజ్రాయెల్, పాలస్తీనాల వైషమ్యాలకు కారణం?

  1. Very true sir….even they are not having any rights in their own villages…ISRAEL army placed many army base camps and restricting the people of PALESTINE to travel between their villages..i have seen an international news agency documentary on this issue. And with these actions USA and ISRAEL creating enemy’s against them by their own……
    Thank you very much sir for this website, we are getting a lot of knowledge on international issues.

  2. శేఖర్ గారు , ఇప్పటివరకు మీరు మొన్న జరిగిన ఎన్నికల గురించి
    ఎమీ స్పందించలేదు … మీ తరహా విస్లెషణ గురించి నేను ఎడురుచూస్తున్నాను

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s