(తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఉదంతంపై ఔట్ లుక్ పత్రికకు అరుంధతి రాయ్ రాసిన ఆర్టికల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)
ఇండియా ఇంక్ (India Ink) భాగస్వాముల్లో తరుణ్ తేజ్ పాల్ ఒకరు. నా నవల ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ ను మొదట ప్రచురించిన పబ్లిషింగ్ కంపెనీ ఇదే. ఇటీవలి ఘటనలపైన స్పందించమని నన్ను అనేకమంది జర్నలిస్టులు కోరారు. మీడియా సర్కస్ పెద్ద పెట్టున ఊళపెడుతున్న నేపధ్యంలో ఏదన్నా చెప్పడానికి నేను వెనకాడాను. కూలిపోతున్న వ్యక్తిని తన్నడం అధమం అని నాకు తోచింది. ముఖ్యంగా అతను అంత తేలికగా బైటపడలేడని స్పష్టంగా అర్ధం అవుతున్నపుడు, అతను చేసినదానికి తగిన శిక్ష అతని దారిలోనే ఉన్నపుడు! కానీ ఇప్పుడు నాకు అంత నమ్మకం కలగడం లేదు. లాయర్లు రంగప్రవేశం చేశారు. బడా రాజకీయ చక్రాలు గిర్రున తిరగడం మొదలయింది. నా మౌనం ఇక అన్ని రకాల అనుచిత అర్ధాలకు అర్హమవుతుంది.
చాలా యేళ్లుగా తరుణ్ ఒక మిత్రుడు. నా పట్ల ఆయన ఎల్లప్పుడూ ఉదారంగా ఉన్నారు. ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నారు. అంశాలవారీగానే అయినా, తెహెల్కాకు కూడా నేను ఆరాధకురాలిని. నా దృష్టిలో తెహెల్కాకు గొప్ప రోజులు ఏవంటే, 2002 నాటి గుజరాత్ మారణకాండకు కర్తలుగా వ్యవహరించిన కొందరిపైన ఆశిష్ ఖేతన్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ప్రచురించినప్పుడు. సిమి ట్రయల్స్ విషయంలో అజిత్ సాహి కృషిని ప్రచురించినప్పుడు కూడా. కానీ తరుణ్, నేనూ పూర్తిగా విభిన్నమైన ప్రపంచాలలో బతికాము. మా అభిప్రాయాలు (రాజకీయాలతో పాటు సాహిత్యం కూడా) మమ్మల్ని ఒకచోటికి చేర్చడానికి వీలు కానంత దూరంలో ఉండడంతో దూరం అయిపోయాం. ఇప్పుడు జరిగింది నన్ను షాక్ కు గురి చేయలేదు, కానీ నా హృదయాన్ని బద్దలు చేసింది.
తరుణ్ కి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను బట్టి గోవాలో తాను నిర్వహించే మేధో ఉత్సవం, ‘థింక్ ఫెస్ట్’ సందర్భంగా ఆయన తన యువ కొలీగ్ పై తీవ్రమైన లైంగిక దాడికి పాల్పడ్డారు. మైనింగ్ కార్పొరేషన్లతో కూడిన కన్సార్టియం థింక్ ఫెస్ట్ ను ప్రాయోజితం (స్పాన్సర్) చేసింది. వాటిలో కొన్ని అత్యంత భారీ పాపాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇంకా ఘోరం ఏమిటంటే థింక్ ఫెస్ట్ స్పాన్సరర్లు దేశంలోని ఇతర ప్రాంతాల్లో లెక్కలేనంత మంది ఆదివాసీ మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురయ్యే వాతావరణాన్ని సృష్టించేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ వాతావరణంలో వేలాది మంది జనం జైళ్ళలో కుక్కబడ్డారు, చంపబడ్డారు కూడా.
తరుణ్ చేసిన లైంగిక దాడి స్వభావాన్ని బట్టి అది కొత్త చట్టం ప్రకారం అత్యాచారం కిందికే వస్తుందని చాలా మంది లాయర్లు చెప్పారు. తాను దాడి చేసిన బాధితురాలికి పంపిన పాఠ్య సందేశాల్లోనూ, ఈ-మెయిళ్లలోనూ తన నేరాన్ని తరుణ్ స్వయంగా అంగీకరించారు. ఆమె బాస్ గా పోటీ లేని అధికారంలో ఉన్న తరుణ్, ఆ తర్వాత తనకు తాను ఆపాదించుకున్న గొప్ప ఉదాత్తతతో క్షమాపణ చెప్పారు. అనంతరం ‘ఒక భ్రాంతి’గా మాత్రమే చెప్పగల చర్యలోకి వెళ్ళిపోయి తనకు తాను శిక్ష విధించుకుంటున్నట్లు ప్రకటించారు -తనకు తానే లోతైన గాయం చేసుకుంటూ ఆరు నెలలు సెలవులో వెల్లడమే ఆ శిక్ష!
ఇప్పుడు ఇక విషయం పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయినందున, అత్యంత ధనికులకు మాత్రమే సేవలు అందించే ఒక మాలావు లాయర్ సలహా మేరకు, అత్యాచార నిందితులు సాధారణంగా ఏదయితే చేస్తారో అదే చేయడం ప్రారంభించాడు -తాను వేటాడిన మహిళదే తప్పని, ఆమె అబద్ధాలకోరు అని ఎంచడం మొదలు పెట్టాడు. రాజకీయ కారణాల వల్లనే -మితవాద హిందూత్వ బ్రిగేడ్ చేత- తాను ఇరికించబడ్డానని సూచించడం మరింత పెద్ద అఘాయిత్యం.
కాబట్టి, ఇటీవలివరకు ఉద్యోగంలో నియమించుకోదగ్గ వ్యక్తిగానే కనిపించిన ఒక యువతి ఇప్పుడు ఒక తిరుగుబోతు మాత్రమే కాదు, ఫాసిస్టులకు ఏజెంటు కూడా? ఇది రెండో సారి రేప్ చెయ్యడమే: (Rape Number Two) ఏ విలువలకు, రాజకీయాలకు తెహెల్కా నిలబడుతుందని చెప్పారో వాటినే రేప్ చెయ్యడం ఇది. అక్కడ పని చేసేవారికి, ఆ పత్రికకు గతంలో మద్దతు ఇచ్చినవారికి కూడా ఇది అవమానం.
ఇది ఇంకా మిగిలి ఉన్న రాజకీయ మరియు వ్యక్తిగత సమగ్రత తాలూకు చివరి జాడలు ఏవైనా ఉంటే వాటిని కూడా పూర్తిగా తుడిచిపెట్టుకోవడమే.
స్వేచ్ఛ, నిజాయితీ, నిర్భయం (Free, fair, fearless)! తెహెల్కా తనకు తాను ఇచ్చుకున్న నిర్వచనం ఇది. ఇప్పుడిక సాహసం ఎక్కడుంది?
స్వేచ్చ,నిజాయితీ లు మాత్రం ఎక్కడున్నాయి…!ఈ తెహెల్కా ..బాధను కలిగిస్తోన్న వాస్తవం..
” స్వేచ్ఛ, నిజాయితీ, నిర్భయం (ఫ్రీ, ఫైర్, ఫీర్లెస్స్). తెహెల్కా తనను తాను ఇచ్చుకున్న నిర్వచనం ఇది. ” ఇందు లో వాస్తవం ఉన్నా, ఒక లక్ష్యం తో పని చేసే వారికి బలహీనతలు ఉండకూడదు – అది పంక్సన్ లలో విస్కీలు సిప్ చేయడం లాంటివైనా. ఉంటె గింటే స్వయంకృతాపరాధాలకు దారితీస్తుంది. స్వాభావికంగా ఇతను బూర్జువా. వారికి నైతిక విలువలు ఉండదం సాద్యం కాదు.
రంధ్రాన్వేషణ చెయ్యడంలో మన తరవాతే. రేపు అనే సూక్ష్మక్రియకు కర్తలైనవారిని వారి ఖర్మకాలే విధంగా అన్ని కోణాలనుంచి బహిర్గతం చేసి చివరకు న్యాయస్థానం ముందుకు వస్తే ఒకోసారి తీర్పు శొభనంచేసే రీతిలో చెప్పబడి హడావుడి హంగామాలను భంగపరుస్తుంది. నిన్ననే ఇతర రాష్ట్రంలోని న్యాయాధీశుడు తొలి పెళ్ళం, మలి పెళ్ళం వుంటే రెండు గడులున్న ఇల్లు తప్పక తీసుకోవలని తీర్పిచ్చి న్యాయసత్తాను చాటుకున్నాడు. ఓరి దేవుడా! ఈ రితిలో పలు గదులున్న ఇంటికి బహు భార్యలు లైంగిక తోరణాలుగా భావించవచ్చునా ? బహుళ అంతస్టుల యజమానులు ఈ పరిధిలో మానాభిమానాలు వదులుకుని సంసారభారానికి పునాదిరాయిలా నిలిచిపోవచ్చు.
స్వేచ్ఛ, నిజాయితీ, నిర్భయం (Free, fair, fearless)! తెహెల్కా తనకు తాను ఇచ్చుకున్న నిర్వచనం ఇది. ఇప్పుడిక సాహసం ఎక్కడుంది?…hmm…..nijame