ఇరాన్ ఒప్పందాన్ని చెరపొద్దు, ఇజ్రాయెల్ తో బ్రిటన్


William Hague and Benjamin Netanyahu

William Hague and Benjamin Netanyahu

ఇరాన్ తో పశ్చిమ దేశాలు కుదుర్చుకున్న చారిత్రాత్మక ఒప్పందం ఇజ్రాయెల్ ను ఒంటరి చేస్తోంది. ‘చరిత్రాత్మక ఒప్పందం’ గా అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పేర్కొన్న ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని ‘చారిత్రక తప్పిదం’గా తిట్టిపోసాడు. “ఇరాన్ ఒప్పందాన్ని చెరపడానికి ఏ దేశాన్ని అనుమతించేది లేదు” అని ఇజ్రాయెల్ ప్రధానికి బదులిస్తూ బ్రిటన్ విదేశీ మంత్రి విలియం హేగ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

“ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఎవరైనా సరే, ఇజ్రాయెల్ తో సహా, చర్యలు తీసుకోకుండా చూస్తాము. అలాంటివారిని నిరుత్సాహపరుస్తాము. ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలు ఎవరూ తీసుకోవడానికి వీలు లేదని సంబంధితులందరికి స్పష్టం చేస్తున్నాము” అని బ్రిటన్ విదేశీ మంత్రి విలియం హేగ్ తమ పార్లమెంటును ఉద్దేశిస్తూ చెప్పాడు. సిరియా, ఇరాన్ ల విషయంలో అహంకారపూరిత ప్రకటనలు చేయడంలో పేరు పొందిన విలియం హేగ్ ఇజ్రాయెల్ ను హెచ్చరించినంత పని చేయడం గణనీయ పరిణామం. ఇరాన్ పై ఆంక్షలు తగ్గించడం వలన అమెరికా, ఐరోపా కంపెనీలకు ఒనగూరే ప్రయోజనాల కోసం వారు ఎంత ఆతృతగా ఉన్నదీ ఇది తెలియజేస్తోంది.

ఇరాన్ తో P5+1 దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆచారాణాత్మక చర్యలతో బలహీనపరిచే అవకాశాలు తమకు కనిపించడం లేదని హేగ్ అన్నారు. అయినప్పటికీ బ్రిటన్ తగిన జాగ్రత్తతో వ్యవహరిస్తుందని విలియం హేగ్ తమ పార్లమెంటుకి హామీ ఇచ్చారు. ఇరాన్ ఒప్పందాన్ని తాము అంగీకరించడం లేదని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించిన దరిమిలా హేగ్ ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది.

“ఇజ్రాయెల్ ఈ ఒప్పందానికి కట్టుబడాల్సిన అవసరం లేదు. ఇరాన్, మిలట్రీ అణు సామర్ధ్యం సాధించడానికి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్ధితుల్లోనూ అనుమతించదు. ఈ ఒప్పందాన్ని చరిత్రాత్మక ఒప్పందంగా అంతర్జాతీయ సమాజం అభివర్ణిస్తోంది. కానీ ఇది నిజానికి చారిత్రాత్మక తప్పిదం” అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించాడు. ఒప్పందం కుదరకుండా ఉండడానికి ఇజ్రాయెల్ తీవ్ర ప్రయత్నాలు చేసినా విఫలం కాక తప్పలేదు. మిలట్రీ కాంట్రాక్టుల ఆశ చూపి ఫ్రాన్స్ ను ఒప్పందానికి వ్యతిరేకంగా నిలబెట్టడానికి బెంజమిన్ శతవిధాలా ప్రయత్నించాడు. ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లనే రెండు వారాల క్రితమే ఒప్పందం కుదరాల్సి ఉండగా వాయిదా పడింది.

ఇజ్రాయెల్ పత్రికలు కూడా తమ ప్రధాని అవగాహనతో తీవ్రంగా విభేదించడం విశేషం. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధిస్తున్న ఒప్పందాన్ని ఆహ్వానించడం మాని అసంబద్ధ ప్రకటనలతో ఇజ్రాయెల్ ను మరింత ఒంటరి చేయొద్దని అవి తమ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ను కోరాయి. ఇరాన్ ఒప్పందాన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోవడం తగదని హెచ్చరించాయి. అంతర్జాతీయ ఒప్పందానికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానన్న ప్రధాని ప్రకటనను నిరసించాయి.

“ఆయన చూస్తుండగానే ఇదంతా జరిగింది. తన పరిపాలనకు ఇది సవాలుగా ఆయన చెప్పుకున్నప్పటికీ ఇది జరిగిపోయింది. కానీ ఆయన ఉన్న స్ధానంలోని వ్యక్తుల తలలోకి వ్యక్తిగత ఆశాభంగాలు చొరబడడానికి వీలు లేదు” అని ఇజ్రాయెల్ పత్రిక యెడియోత్ అహ్రోనోట్ వ్యాఖ్యానించింది. “అంతర్జాతీయ రంగంలో ప్రధాని చాలా అసంబంద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వాగుడు అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను చెరుపుతాయి” అని సదరు పత్రిక హెచ్చరించింది.

“అవమానకరంగా మాట్లాడడం, ఆరోపణలు, దూషణలు, ఫిర్యాదులు… ఇలాంటివన్నీ ఇజ్రాయెల్ జాతీయ ప్రయోజనాలకు దోహదపడతాయా లేక హాని చేస్తాయా? నిరంతర దురహంకారం, మొఖం మీదే సణగడం చేస్తే అది నిర్మాణాత్మక రాజనీతి కౌశల్యం కాగలదా?” అని మరో ఇజ్రాయెల్ పత్రిక హారెట్జ్ ప్రశ్నించింది. ప్రధాని వ్యక్తిగత పోకడ, ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ ఒంటరి కావడానికే దారి తీస్తోందని హారెట్జ్ హెచ్చరించింది. “ఇజ్రాయెల్ చెప్పేది సరైందా కాదా అన్నది మాత్రమే కాదు సమస్య, అది తెలివిగా ఉంటోందా లేదా అన్నది కూడా సమస్యే” అని వ్యాఖ్యానించింది.

P5+1, ఇరాన్ ల ఒప్పందం ప్రకారం యురేనియంని 20 శాతం కంటే ఎక్కువ శుద్ధి చేయడం  6 నెలల పాటు ఇరాన్ ఆపేస్తుంది. కేవలం 5 శాతం వరకు మాత్రమే శుద్ధి చేస్తుంది. ఇప్పటివరకు 20 శాతం మేర శుద్ధి చేసిన యురేనియంను స్తంభింపజేస్తుంది. నటాంజ్, ఫోర్డో అణు శుద్ధి కర్మాగారాలలోకి ఐ.ఏ.ఈ.ఏ తనిఖీదారులకు రోజువారీ ప్రవేశం కల్పిస్తుంది. ఈ చర్యలకు బదులుగా ఐరాస విధించిన వాణిజ్య ఆంక్షలను పాక్షికంగా సడలిస్తారు. అంతర్జాతీయ సంస్ధల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల్లో 4.3 బిలియన్ యూరోల (7 బిలియన్ డాలర్లు) మేర వాడుకోవడానికి అనుమతిస్తారు. ఇరాన్ కు హామీ ఇచ్చిన అవకాశాలు డిసెంబర్ నుండే అమలులోకి వస్తాయని బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలు ప్రకటించాయి.

ఇరాన్ ఒప్పందాన్ని మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రత్యర్ధి దేశాలు కూడా ఆహ్వానించాయి. ఇరాన్ బద్ధ శత్రువు సౌదీ అరేబియా ఒప్పందాన్ని ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. కానీ ఒప్పందం కుదరనున్న సంగతిని తమనుండి దాచి పెట్టారని అమెరికాపై అసంతృప్తి ప్రకటించింది. గత మార్చి నెల నుండి అమెరికా-ఇరాన్ ల మధ్య ఒమన్ లో ఐదు సార్లు రహస్య చర్చలు జరపడం వల్లనే తాజా ఒప్పందం సాధ్యపడిందని వివిధ పత్రికలు తెలిపాయి. ఇలా చర్చలను తమకు చెప్పకుండా దాచిపెట్టడం సౌదీ అరేబియాకు సహజంగానే నచ్చలేదు. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ లు దాడి చేయాలని కోరిన దరిద్రులు సౌదీ అరేబియా పాలకులు. ఇరాన్ లేకపోతే ఆయిల్ వ్యాపారంలో తమకు ఎదురు లేకుండా చేసుకోవాలన్నది సౌదీ రాచరిక పాలకులు దురాశ.

ఒప్పందాన్ని సౌదీ అరేబియా ఆహ్వానించిన వెంటనే ఇతర గల్ఫ్ దేశాలు కూడా వరుసగా ఆహ్వానం ప్రకటించాయి. యు.ఏ.ఈ, బహ్రెయిన్, కతార్, కువైట్ దేశాలు ఈ మేరకు అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి. టర్కీ అయితే ఇరాన్ తో నూతన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి అప్పుడే తమ ప్రతినిధులను ఇరాన్ కు పంపిస్తోంది. అమెరికా, ఈ.యు ల ఆంక్షల వలన ఇరాన్-టర్కీ వాణిజ్యం దెబ్బతిన్నది. దీనిని పునరుద్ధరించుకోడానికి టర్కీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆంక్షల సడలింపు వలన భారత్ కూడా లాభపడనున్నది.

4 thoughts on “ఇరాన్ ఒప్పందాన్ని చెరపొద్దు, ఇజ్రాయెల్ తో బ్రిటన్

  1. Hi Sir, your analysis on international events are very good…Infact will be useful for the people who are preparing for competitive exams…I would like to know from u abt al-Qaeda militant group and its ill effects on different countries in middle east ,

    Also please explain the crisis going on among several middle eastren countries…

  2. Hi rakesh, I think you can see the category named “మధ్య ప్రాచ్యం” above the title of this blog. You can click it to see several articles on middle east. Regarding al-Qaeda also you can search the blog with “ఆల్-ఖైదా”.

    Your question can’t be answered in a single article. It’s a vast subject.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s