వర్డ్ ప్రెస్ వాళ్ళు ఒక ముఖ్యమైన ఉపకరణాన్ని అందుబాటులోకి తెచ్చారు. వర్డ్ ప్రెస్ లో నిర్వహించే బ్లాగుల్లో ప్రతి టపా కిందా ఆ టపాలోని విషయంతో సంబంధం ఉండే మూడు టపాలకు లంకెలు ఇచ్చే ఉపకరణం ఇది.
ఈ ఉపకరణం కోసం వర్డ్ ప్రెస్ బ్లాగర్లు చాలా కాలంగా అడుగుతున్నారట. నా బ్లాగ్ పాఠకులు కూడా గతంలో కొంతమంది అడిగారు. ఒకరిద్దరు వ్యాఖ్యలు కూడా రాశారు, ‘ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చెయ్యగలరా?’ అని. కానీ అలాంటి విడ్గెట్ ఏదీ నాకు కనపడకపోవడంతో నేనేమీ చేయలేకపోయాను.
నిజానికి ఇలాంటి సౌకర్యం గతంలో వర్డ్ ప్రెస్ లో ఉండేది. ఈ రూపంలో కాకుండా మరో రూపంలో. ఒక టపా ఏ కేటగిరీలో అయితే రాశామో అదే కేటగిరీలో గతంలో రాసిన టపాలకు లింక్ లు కనపడే విడ్గెట్ గతంలో వర్డ్ ప్రెస్ లో ఉండేది. రెండు మూడు టపాల లంకెలు అదే బ్లాగ్ నుండి ఇస్తే ఇంకా ఒకటో, రెండో వేరే బ్లాగ్ లో అదే కేటగిరీ లేదా ట్యాగ్ తో ఉండే లంకెలు కనపడేవి. ఏమయిందో గానీ ఆ విడ్గెట్ ను తీసేశారు.
ఈసారి కేటగిరీ, ట్యాగ్ లతో సంబంధం లేకుండా టపాలోని విషయాన్ని బట్టి సంబంధిత టపాలకు లంకెలు ఇచ్చే అవకాశం కల్పించారు. అంటే గతం కంటే ఇది ఇంకా మెరుగ్గా ఉన్నట్లే లెక్క. ఇది పాఠకులకు చాలా చాలా ఉపయోగం. నిజానికి నాకూ ఉపయోగమే. ఒక్కోసారి అదే విషయంపై రాసిన గత టపాలు నాకూ అంత తేలిగ్గా దొరికి చావవు.
పాఠకులు గమనిస్తే గనక ప్రతి టపా కిందా ‘Related’ శీర్షికన మూడు గత టపాలకు లింక్ లు చూడొచ్చు. కొన్ని టపాలు సంబంధం లేనివి కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. బహుశా వారికి తెలియని తెలుగు భాష అయినందునేమో! బహుశా ముందు ముందు ఈ సౌకర్యం ఇంకా మెరుగుపడే అవకాశం ఉంది.
వర్డ్ ప్రెస్ వాళ్ళకి ఈ సందర్భంగా Thanks చెప్పుకోవడం సముచితం కాగలదు!
nice feature 🙂