ప్రశ్న: లుక్ ఈస్ట్ పాలసీ అంటే?


ఎ.సురేష్: ‘లుక్ ఈస్ట్ పాలసీ’ అంటే ఏమిటి?

సమాధానం: సురేష్ గారూ ఈ ప్రశ్నకు సమాధానం గతంలో రాశాను.

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడం ఎలా?’ అన్న శీర్షికన ఈనాడు చదువు పేజీలో వచ్చిన వ్యాస పరంపరలో మూడో భాగంలో ఈ పాలసీ గురించి చర్చించాను.

సదరు ఆర్టికల్ ను ఈ బ్లాగ్ లో కూడా ప్రచురించాను. ప్రచురించడం అంటే ఈనాడులో వచ్చిన ఆర్టికల్ పి.డి.ఎఫ్ కాపీ ని ఇక్కడ పోస్ట్ చేయడం.

ఒకవేళ మీకు ఆ భాగం అందుబాటులో లేకపోతే ఈ లింకు పైన క్లిక్ చేసి చూడగలరు.

ఆర్టికల్ లో ‘తూర్పు వైపు చూద్దాం’ అనే ఉపశీర్షిక కింద ఆ పాలసీ గురించి చర్చించబడింది. మరికొన్ని అంశాలు: హిందూ మహా సముద్రంలో చైనా ‘ముత్యాల దండ’ (string of pearls) ఏర్పాటు చేసుకుంటోందని భారత పత్రికలు తరచుగా చెబుతాయి. అంటే చైనా తూర్పు తీరం మొదలుకొని పోర్ట్ ఆఫ్ సూడాన్ వరకు తనకు చమురు, సరఫరాలు అందే సముద్ర రవాణా మార్గం పొడవునా ఆయా దేశాలు/ప్రాంతాలు తన చెప్పు చేతల్లో ఉండేలా చూసుకుంటోందని అవి చెబుతాయి. చైనా స్ట్రింగ్  ఆఫ్ పెరల్స్ విధానానికి ప్రతిగా ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ రూపొందించుకుందని కొందరు చెబుతారు.

అయితే చైనా ఎన్నడూ తన అధికార ప్రకటనల్లో గానీ వాణిజ్య, రాయబార, రాజకీయ చర్చలు, వేదికలపైన గానీ ఈ పదజలాన్ని ఉపయోగించిన దాఖలా లేదు. ఇంకా చెప్పాలంటే ఆ పదబంధాన్ని మొదట ఉపయోగించింది అమెరికా. చైనా ఆర్ధిక, మిలట్రీ ప్రభావాలను తిప్పికొట్టే పేరుతో చైనా చుట్టూ అమెరికా ప్రభావిత ‘ముత్యాల దండ’ ఏర్పాటు చేసుకోవాలని అమెరికా రక్షణ శాఖ తన అంతర్గత నివేదికల్లో ప్రస్తావించినట్లు పశ్చిమ పత్రికలే వివిధ సందర్భాల్లో చెప్పాయి.

ఎవరు ముందు వాడినా చైనా మాత్రం హిందు మహా సముద్రంలో తన ప్రభావిత ప్రాంతాలను పెంచుకోడానికి కృషి చేస్తున్న మాట వాస్తవం. కింద పటంలో చూపించినట్లు ఆగ్నేయాసియా దేశాల్లోని అనేక ఓడరేవులు, విమానాశ్రయాల  నిర్మాణంలోనూ, ఆయా దేశాల మిలట్రీ బలగాల విస్తరణ, ఆధునీకరణల్లోనూ చైనా భాగస్వామ్యం వహిస్తోంది. అయితే ఈ చర్యల్లో చైనా వైపు నుండి మిలట్రీ వ్యూహాలు లేవనీ, ఇవన్నీ పక్కా వాణిజ్య దృష్టితో కూడినవేనని పశ్చిమ పత్రికలు కూడా అంగీకరించే విషయం.

String of Pearls

కానీ చైనాకంటే ముందు అమెరికా చైనాను సైనికంగా చుట్టుముట్టిన మాట కాదనలేని వాస్తవం. అమెరికా వాణిజ్య, మిలట్రీ, రాజకీయ సామ్రాజ్యం ఇప్పటికే స్ధిరపడింది. చైనా తన వాణిజ్య, రాజకీయ సామ్రాజ్యాన్ని పెంచుకునే పనిలో ఉంది. కాబట్టి ఇరు పక్షాల మధ్య వైరుధ్యాలు సహజం, అనివార్యం. చైనా కేవలం వాణిజ్య కార్యకలాపాలకే పరిమితం అయినప్పటికీ అలా అనుకుని ఊరుకునే నిజం అమెరికా, ఐరోపాలది కాదు.

ఈ వైరుధ్యాల్లో ఇండియా అమెరికా పక్షం తీసుకున్న ఫలితంగా రూపొందిన పాలసీయే ‘లుక్ ఈస్ట్ పాలసీ.’ భారత పాలకులు అనాదిగా ఐరోపా, అమెరికా రాజ్యాలకు విధేయులు. వారు భారత ప్రజల కంటే ముందు అమెరికా, ఐరోపాలకే విధేయులు అన్నా తప్పు లేదు. పశ్చిమ దేశాలపై ఆధారపడడమే తప్ప వంద కోట్లు దాటిన దేశ మానవ వనరులను నమ్ముకుని స్వయంగా వృద్ధి చెందే కృత నిశ్చయం మనవారికి లేదు. అలాంటి కృత నిశ్చయమే మనవాళ్లు ప్రదర్శిస్తే ఈ రోజు సిరియా, ఇరాన్, ఉత్తర కొరియా లు ఎదుర్కొంటున్నట్లుగా అనేక బెదిరింపులు, దాడులు భారత దేశం కూడా ఎదుర్కొనేది.

ఈ పరాధీన స్వభావమే ఇండియా ‘లుక్ ఈస్ట్ పాలసీ’ ని రూపొందించుకునేలా చేసింది. అంటే అమెరికా చైనాకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న భౌగోళిక రాజకీయ వ్యూహంలో పావుగా మారడానికి భారత పాలకులు సిద్ధపడి వారి కోసం ఈ పాలసీ రూపొందించారు. ఈ పాలసీ ద్వారా తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లో వాణిజ్య, రాజకీయ, మిలట్రీ సంబంధాలు నెలకొల్పుకోవడం మన వాళ్ళ లక్ష్యం. కానీ ఇవి సొంతానికి కాదు. చైనా ప్రభావాన్ని అడ్డుకుని నిలువరించే అమెరికా వ్యూహంలో భాగం మాత్రమే ఇది. ఐతే చైనా మాత్రం ఇండియా లుక్ ఈస్ట్ పాలసీని అనుమానంతో చూడడం లేదు. ఇండియా స్వంత విదేశాంగ విధానంలో భాగంగానే ‘లుక్ ఈస్ట్ పాలసీ’ ఉన్నదని చైనా కమ్యూనిస్టు పత్రిక పీపుల్స్ డైలీ స్వయంగా పేర్కొనడం దీనికి సాక్ష్యం.

(ఇండియా-చైనా సంబంధాలకు సంబంధించి ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ ని వివరించే ఈ కింది పటం చదువరులకు ఉపయోగం.)

Click to enlarge

Click to enlarge

అమెరికా కౌగిలి దృత రాష్ట్ర కౌగిలి లాంటిది. అమెరికాకు మిత్ర దేశంగా ఉండి బాగుపడ్డ దేశం లేదు. కానీ ఇప్పటివరకూ చూస్తే చైనాతో ఇతర దేశాల వాణిజ్యం, స్నేహ సహకారాలు సమానత ప్రాతిపదికన ఏర్పడ్డవే. చైనా పెత్తనం చేస్తున్న దేశం ఇంతవరకు లేదు. అమెరికాని చూస్తే అది ఐరోపా దేశాల మీద కూడా పెత్తనం చేయకుండా ఉండలేదు. కాబట్టి మన లుక్ ఈస్ట్ పాలసీ మన పాలకులకి (పెట్టుబడిదారులు, భూస్వాములు) లాభకరమే అయినా ప్రజలకి మాత్రం నష్టకరం.    

5 thoughts on “ప్రశ్న: లుక్ ఈస్ట్ పాలసీ అంటే?

 1. భవిష్టత్తుని అంచనా వేయాలన్నా, వర్తమానాన్ని అర్ధం చేసుకోవాలన్నా గతం ఒక పరికరం. ఈ పరికరంతో చూస్తే అమెరికా పెత్తందారీ విదేశాంగనీతి స్పష్టంగా కనిపిస్తుంది. వాణిజ్య పరమైన పెత్తందారీతనానికి రాజకీయ పెత్తందారీతనం అవసరమని భావించే అమెరికా వ్యూహం భారత పాలకులకు తెలియకుండా ఉండే అవకాశం లేదు. మన పాలకులు దేశనాయకులు కాదు. పెట్టుబడిదారుల ఉద్యోగులు. మన విదేశాంగనీతి మన పెట్టుబడిదారుల తక్షణ లాభాలనే కేంద్రం చేసుకుంది. కనీసం ఈ దేశపు పెట్టుబడిదారులకైనా తమ భవిష్యత్తు పైన దీర్ఘకాలిక వ్యూహం ఉంటే పరిస్థితి ఇలా ఉండేదికాదు. వలసపాలనలో ఆదునికులైన మన పెట్టుబడిదారుల నుంచి కనీసం అది కూడా ఆశించలేం.

 2. “మన పాలకులు దేశనాయకులు కాదు. పెట్టుబడిదారుల ఉద్యోగులు. … … … … కనీసం ఈ దేశపు పెట్టుబడిదారులకైనా తమ భవిష్యత్తు పైన దీర్ఘకాలిక వ్యూహం ఉంటే పరిస్థితి ఇలా ఉండేదికాదు.”

  వివిన మూర్తి గారూ మన పాలకుల పరాధీన స్వభావం గురించి సరిగ్గా చెప్పారు.

 3. వి వి న మూర్తి గారు,
  ఒక రచయితగా ఈ వ్యాఖ్యకు చాలా విలువుంది. మీ రచనల్లో కంటె ఒక మంచి సందేశం పాఠకులకు ఇచ్చినందుకు ధన్య వాధాలు.

 4. ఈ పుస్తకాన్ని మద్రాస్‌ ఐ ఐ టి ఫ్రొ: డా. శ్రీనివాస చక్రవర్తి గారు రాశారు ఇంటెరెస్ట్‌ ఉన్న వారు చదు వుకో అటానికి అనుగునంగ ఇ పుస్తకం లింక్‌ ఇవ్వడం జరిగింది.
  http://nptel.iitm.ac.in/demystifying.php

 5. ప్రశ్న:మనదేశంలొ ముస్లింలకు ప్రత్యేక చట్టం ఉంది అంటారుకదా , మన రాజ్యాంగం/చట్టాలు అందరికి సమానం అయినప్పుడు వారికి ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వవలిసి వచ్చింది… మీకుదిరుతే వివరంగా చెప్పగలరు.(ప్రశ్న ఎక్కడ అడగాలొ తెలియక ఇక్కడ కామ్మెంట్స్ దాగ్గరనుంచే అడుగుతున్నాను).

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s