అగ్రరాజ్య హోదా అంటే లిబర్టీ విగ్రహాన్ని అనుకరించడమా? -కార్టూన్


Skyscrapper statutes

“అవి మన మన్ హట్టన్…. ఆకాశహర్మ్య విగ్రహాలు”

అక్టోబర్ 29 తేదీన కేంద్ర ప్రభుత్వ నిధులతో సర్దార్ పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మ్యూజియం ప్రారంభం అయితే, అక్టోబర్ 31 తేదీన గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పటేల్ విగ్రహ నిర్మాణానికి శంకుస్ధాపన జరిగింది. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే నరేంద్ర మోడి ఆధ్వర్యంలో అనుకోవాలి. ఆయన నిర్మించబోయే పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అవుతుందట. న్యూయార్క్ నగరంలోని మన్ హటన్ లో నెలకొల్పబడిన ‘లిబర్టీ’ విగ్రహం కంటే కూడా పెద్దది అవుతుందట!

గుజరాత్ అభివృద్ధి కధ గురించి చెప్పుకోడానికి మరో కొత్త నిర్మాణం మోదలవుతోందన్నమాట! ఈ విగ్రహ నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలు తగలేయ్యబోవడం విపరీతాల్లోకెల్లా విపరీతం. దేశవ్యాపితంగా ఉన్న రైతుల దగ్గర్నుండి ఇనుము సేకరించి ఈ విగ్రహం నిర్మిస్తామని గుజరాత్ ప్రభుత్వం చెబుతోంది.

రైతుల నుండి ఇనుము సేకరించడం ఏమిటో బొత్తిగా అర్ధం కానీ విషయం. రైతుల ఇనుముతో ఒక జాతీయ నాయకుడికి విగ్రహం నిర్మిస్తే అది దేనికి సంకేతం అవుతుంది? లిబర్టీ విగ్రహం అమెరికాలో జనానికి లేని ‘లిబర్టీ’ కి సంకేతం అయినట్లు పటేల్ విగ్రహం భారత రైతుల్లో లేని ఆర్ధిక దారుఢ్యానికి సంకేతం అవుతుందా?

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కి ఉక్కు మనిషి అని పేరు కాబట్టి ఆయన విగ్రహాన్ని కూడా ఉక్కుతో నిర్మించాలని ఉద్దేశ్యం అయి ఉంటుంది. పత్రికలు చెబుతున్నాదాని ప్రకారం పటేల్ విగ్రహం 597 అడుగుల ఎత్తు ఉంటుందట. ఇంత విగ్రహాన్ని ఉక్కుతో నిర్మించి ఏ ప్రయోజనం సాధించబోతున్నట్లు? ఆ పేరుతో పటేల్ వారసత్వానికి తానే నిజమైన అర్హుడిని అని చెప్పుకునే ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే ఇందులో ఉన్నాయన్న విమర్శకు బి.జె.పి నుండి గానీ, మోడి నుండి గానీ తగిన సమాధానం ఇంతవరకూ రాలేదు.

పటేల్ ఐక్యతకు, దేశ సమగ్రతకు చిహ్నమని మోడి, బి.జె.పి చెబుతున్నారు. కానీ మోడి కాదుగా! బి.జె.పి అయితే అసలే కాదుగా! మతం మార్చుకుని ముస్లింలు అయిన భారతీయుల్ని ఈ దేశం నుండి వెళ్లిపోవాలని వాదించే ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్ధ బి.జె.పి గానీ, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మారణకాండకు కారకుడయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడి గానీ ఐక్యతకు, సమగ్రతకు ఎలా వారసులు కాగలరు? కాంగ్రెస్ పార్టీ నేతగా ఆర్.ఎస్.ఎస్ పై నిషేధం విధించిన వ్యక్తి వారసత్వం తమదే అని బి.జె.పి, మోడీలు చెప్పుకోవడమే ఒక వింత కాగా, ఆ పేరుతో విగ్రహ నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు వృధా చేయడం  మరో వింత!

కాంగ్రెస్ నేత దినేష్ పటేల్ చెప్పినట్లు మొదట నర్మదా ఆనకట్ట, దాని అనుబంధ కాలువల నిర్మాణం పూర్తి చేసి గుజరాత్ రైతులకు నీరు ఇవ్వగలిగితే అంతకుమించిన నివాళి పటేల్ కి మరొకటి ఉండబోదు. రాముడి గుడి పేరు చెప్పి ఇటుకలు సేకరించడం, పటేల్ విగ్రహం పేరు చెప్పి ఇనుము సేకరించడం… ఇవే బి.జె.పి దృష్టిలో పెద్ద కార్యక్రమాలు. ప్రభుత్వంలోకి వచ్చాక విదేశీ బహుళజాతి కంపెనీలకు మేలు చేసే విధానాలను వేగంగా అమలు చేసి దానినే ‘దేశం వెలిగిపోతోంది’ అని చెప్పుకోవడం కూడా బి.జె.పి నిర్వాకమే.

విగ్రహాల రాజకీయాలు మాని జనానికి నిజమైన అధికారాన్ని కట్టబెట్టే వాళ్ళని జనం వెతుక్కోవాల్సి ఉంది.

5 thoughts on “అగ్రరాజ్య హోదా అంటే లిబర్టీ విగ్రహాన్ని అనుకరించడమా? -కార్టూన్

 1. “తీరా చూడబోతే ఈ మెమోరియల్ నిర్మాణం కోసం తన పదేళ్ళ పాలనలో నరేంద్ర మోడి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఆయన ముందు ముఖ్యమంత్రిగా పని చేసిన కేశూభాయ్ పటేల్ ఈ మెమోరియల్ నిర్మాణానికి ప్రధాన రూపకర్త అనీ, నిధులు ఇచ్చింది కూడా ఆయనేననీ, ఇందులో మోడికి ఇవ్వాల్సిన క్రెడిట్ వీసమెత్తు కూడా లేదనీ సర్దార్ పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారు చెబుతున్న వాస్తవం!”

  Naku asalu artham kaledu… 30th Oct 2013 rojuna meru prachurinchina shershika lo Patel vigrahaniki “keshubhai patel” nedi ichadu anna ru…

  Mari eroju prachurinichina shershika lo… kendhra prabuthavm nidi ishundi antunnaru…

  asalu meku orginal ga nidi ishundi evaro thelusa?

 2. మీరు కనిపెట్టింది ఎమీ లేదు.

  కుడిపక్క ‘లేఖిని’ కి లింక్ ఇచ్చాను. అది ఉపయోగించి తెలుగులో అడిగితే సమాధానం ఇస్తాను.

  తెలుగు ఉపకరణాలు అందుబాటులో లెకపోతే ఆంగ్ల లిపిని వాడితే అర్ధం. అందుబాటులో ఉన్నాక కూడా తెలుగును తెలుగులో రాయడానికి ఏమిటి సమస్య?

 3. రాజుల సొమ్ము రాళ్ళపాలు పాత సామెత కానీ, ప్రజల సొమ్మును నేలపాలు చేసే అధికారం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. సజీవులైన ప్రజల జీవన ప్రమాణాలను అభివృద్ధి చేయక ఇలా రాజకీయ వ్యక్తిగత వ్యామోహంలో సమ్పదను ఈనకాచి శిలలపాలు చెయ్యడం చాలా దారుణం. ఋణం కోసం సామన్యుడు ప్రభుత్వ కరుణకు నోచుకోక అగచాట్లు పాలయ్యే తరుణంలో తృణమో పణమో ఇచ్చి ఆదుకోవలసిన సమయంలో ఇటువంటి శిలా శాసనాలు ప్రజల శాపనార్ధాలకు అద్దంపడతాయి. “నమో” ఈ సుమో ప్రాజెక్ట్ విషయంలో తన విజ్ఞతకు పదును పెట్టడం రాజకీయ భవితవ్యానికి సోపానమవుతుంది.

 4. @ mr visekar
  “మతం మార్చుకుని ముస్లింలు అయిన భారతీయుల్ని ఈ దేశం నుండి వెళ్లిపోవాలని వాదించే ఆర్.ఎస్.ఎస్” . when does rss said this man. why you telling people false ?

  ” మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మారణకాండకు కారకుడయ్యారని ” ఆరోపణలు ” ఎదుర్కొంటున్న మోడి గానీ”. let saym if i can allege that osama bin laden and obama are secret lovers. does it becomes true ? then whats point in saying alleged….alleged…alleged. its just dreaming and creating a prejudice in the hearts of people that modi would had killed muslims or initiated killings/riots. its just a political trick of leftists and congress for political gains. viewers , please dont believe in such statements

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s