“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” తాము స్త్రీలను దేవతలుగా కొలుస్తామని చెప్పుకోడానికి హిందువులు చెప్పుకునే మాట ఇది. కానీ ఈ సూత్రాన్ని వాస్తవంగా ఆచరిస్తున్నది నాలుగు హిందూ వర్ణాలలో లెక్కకు రాని అవర్ణాల జనమే అని తాజా జనాభా లెక్కల ద్వారా తేలింది. హిందువుల్లో ‘ఇతరుల’ కంటే ఎస్.సి, ఎస్.టి ల్లోనే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్నదని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. పిల్లల్లో చూసినా, పెద్దల్లో చూసినా, మొత్తంగా చూసినా సవర్ణ హిందూ కులాల ప్రజలు స్త్రీల పట్ల అన్యాయంగానే వ్యవహరిస్తున్నారని లెక్కలు తేల్చాయి. భారత సమాజం నడక ముందుకా, వెనక్కా? అన్న ప్రశ్నను ఈ లెక్కలు రేకెత్తిస్తున్నాయి.
జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల ప్రజలు దేశ జనాభాలో 16.6 శాతం కాగా, షెడ్యూల్డ్ తెగల ప్రజలు 8.6 శాతం. భారత దేశంలోని సగటు అక్షరాస్యత కంటే ఈ రెండు తరగతుల అక్షరాస్యత తక్కువగా ఉన్నదని సెన్సస్ వివరాల ద్వారా తెలుస్తోంది. ఎస్.టి మహిళల్లో అక్షరాస్యతా శాతం 50 శాతం కంటే తక్కువే నమోదయింది. ఎస్.సి కులాల మహిళల్లో ఇది 57 శాతంగా ఉన్నది. పురుషుల అక్షరాస్యత కూడా పెద్దగా మెరుగుదల లేదనీ మహిళల కంటే స్వల్పంగానే ఎక్కువగా ఉందని సెన్సస్ కమిషనర్ ని ఉటంకిస్తూ ది హిందూ తెలిపింది.
అక్షరాస్యత విషయంలో వెనుకబడి ఉన్నప్పటికీ సామాజిక స్ధాయిలో, ముఖ్యంగా స్త్రీల పట్ల వైఖరి విషయంలో ఎస్.సి, ఎస్.టి లు చాలా ముందంజలో ఉన్నారు. 1 నుండి 6 సంవత్సరాల వయసు పిల్లల్లో లింగ నిష్పత్తి (1000 మంది బాలురకు ఎంతమంది బాలికలు ఉన్నారు?) ఎస్.టి లలో 957 గా నమోదయింది. అనగా 1000 మంది ఎస్.టి బాలురకు గాను 957 మంది ఎస్.టి బాలికలు ఉన్నారు.
ఈ సంఖ్య ఎస్.సి లకు వచ్చేసరికి తగ్గిపోయింది. 1000 మంది ఎస్.సి బాలురకు 933 మంది ఎస్.సి బాలికలే ఉన్నారు. ఈ సంఖ్య ఇతరుల విషయానికి వచ్చేసరికి ఈ సంఖ్య ఇంకా ఘోరంగా పడిపోయి 910 మాత్రమే ఉన్నది. పట్టణాల్లో అయితే ఇతరుల్లో ఈ సంఖ్య ఇంకా తగ్గిపోయి 900 మాత్రమే ఉన్నదని సెన్సస్ కమిషనర్ విడుదల చేసిన వివరాలు చెబుతున్నాయి. పట్టణాల్లో ఎస్.సి, ఎస్.టి పిల్లల్లో లింగ నిష్పత్తి ఎలా ఉన్నదీ వివరాలు తెలియరాలేదు.
ఎస్.సి, ఎస్.టి కులాల ప్రజలను పంచములని, అంటరానివారని, హరిజనులని, అవర్ణులని ఎన్ని పేర్లు పెట్టి దూరంగా ఉంచారో, ఉంచుతున్నారో రహస్యం ఏమీ కాదు. ‘స్త్రీలు ఎక్కడ పూజించబడుదురో అక్కడ దేవతలు సంచరింతురు’ అన్న పెద్దల వాక్కు నిజమే అయితే దేవతలు ప్రస్తుతం సవర్ణ కులాలు దూరంగా ఉంచిన పంచమ కులాల్లోనూ, కొండ జాతుల్లోనూ మాత్రమే ఎక్కువగా సంచరిస్తున్నారని అనుకోవాలి. సవర్ణ కులాల పట్ల వారు కసితో రగులుతూ ఉండి ఉండాలి. (ప్రాక్టికల్ గా అలాంటి ఛాయాలేమీ లేవనుకోండి!)
- చదువుల తల్లి
- 2001
- 2001 vs 2011
- 1981 to 2011
ఈ పరిస్ధితికి కారణం ఏమిటి? పసిపిల్లల వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో (pre-natal diagnostic technology) నిపుణులు అయిన డా అభయ్ బంగ్ ఈ ప్రశ్నకు తన దృష్టిలో ఉన్న సమాధానాలు చెప్పారు. ఆయన అవార్డు పొందిన డాక్టర్ అనీ, మహారాష్ట్ర లోని గడ్చిరోలీ ఏరియాలో సామాజిక కార్యకర్త కూడా అని ది హిందు తెలిపింది. ఆయన ఏమన్నారంటే “మధ్యమ కులాలకు మల్లే ముఖ్యంగా భూములు కలిగి ఉన్న కులాలకు మల్లే గిరిజన ప్రజల్లో స్త్రీలకు వ్యతిరేకంగా సామాజిక వివక్ష లేదన్నది నిజం. గిరిజనుల్లో స్త్రీలు భర్త నుండి విడిపోయే హక్కు సామాజికంగానే ఉన్నది. అనేక (గిరిజన) కమ్యూనిటీల్లో పెళ్లి సమయాల్లో పురుషుని కుటుంబాలే స్త్రీ కుటుంబానికి డబ్బు చెల్లిస్తాయి” అని.
అదే సమయంలో గిరిజనులకు లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండవచ్చని అభయ్ చెబుతున్నారు. “కానీ, విద్యావంతులైన గిరిజనుల్లో, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కుటుంబాల్లో లైంగిక ఎంపిక మెల్లగా ప్రారంభం అయింది” అని ఆయన తెలిపారు. అంటే వ్యక్తిగత ఆస్తులు, సంపదల అవకాశాలు పెరిగే కొద్దీ స్త్రీల పట్ల వివక్షా ధోరణి పెరుగుతోందన్నమాట! భూములు కలిగిన కుటుంబాల్లో స్త్రీల పట్ల వివక్ష నెలకొనడానికి కారణం కూడా ఈ స్వంత ఆస్తి విధానమే కావడం గమనార్హం.
అనగా లైంగిక వివక్ష అనేది ఆస్తులతో అనివార్యంగా ముడిపడి ఉందని ఇక్కడ అర్ధం అవుతోంది. అంతే కాకుండా మన చదువులు మన సామాజిక చైతన్యాన్ని పెంచడం లేదని కూడా తెలుస్తోంది. పైగా ఉన్నత చదువుతో వచ్చే ఉన్నత ఉద్యోగావకాశాలు సంపదలను పెంచి మరింతగా స్త్రీలపై వివక్ష చూపడానికి దారి తీస్తోంది.
ఎందుకిలా?
ఎందుకంటే ఆస్తులు సమకూరాక వాటికి వారసులు ఎవరు అన్న సమస్య తలెత్తుతుంది. కష్టపడి సంపాదించిన ఆస్తులను (అలాగని శ్రమ చేయని వాడు కూడా అనుకుంటాడు, అది వేరే విషయం) దారిన పోయే దానయ్యకు ఇవ్వాలని అనుకోలేరు. (ఈ క్రమంలో వచ్చినది దంపతీ వివాహ వ్యవస్ధ.) వారసులకే తమ ఆస్తులను దక్కాలి అనుకున్నాక స్త్రీలు సంతానాన్ని కనిపెట్టే యంత్రాలుగా మాత్రమే మిగిలిపోయారు. సంతానాన్ని కని, సాకి, తమ వంశానికి ఒక దివ్యమైన వారసుడిని ఇచ్చే యంత్రమే స్త్రీ. ఆ యంత్రానికి రక్త, మాంసాలు ఉండవు, ఉండరాదు. ఆమెకు మెదడు, హృదయం, శరీరం ఉండవు, ఉండరాదు. ఉంటే ఇంకా అనేక సమస్యలు రావచ్చు. స్వచ్ఛమైన వారసుడు పొందే అవకాశం పోవచ్చు. ఈ విధంగా స్వంత ఆస్తి సంబంధాలు స్త్రీని పురుషుడి ఆస్తికి కట్టిపడేశాయి.
వారసత్వ ఆస్తిని గడప దాటనీయరాదన్న సూత్రమే స్త్రీలను కూడా గడపదాటకూడని ఆస్తిగా స్ధిరపరిచింది. ఆ సూత్రమే ఆడ పిల్లను ‘ఆడ’ పిల్ల గానూ, మగ పిల్లాడిని వారసుడుగానూ స్ధిరపరిచింది. ఇది మరింత ముందుకెళ్లి ‘ఆడ’ పిల్లను వద్దు అనుకునేవరకూ వెళ్లింది. వద్దు అనుకున్నాక పుట్టినవారిని ఏం చేయాలి? పుట్టినవారిని కాదనుకోలేరు గనుక ఆడపిల్లను ‘ఇంటి ఆడపడుచు’ గానూ, ఇంటి ‘లక్ష్మి’ గానూ నూరిపోయడం ద్వారా ఆడ పిల్లలకు కొంత సామాజిక రక్షణ ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎన్ని రక్షణలు సమకూర్చినా స్వంత ఆస్తి ముందు అవి దిగదుడుపుగా అవుతూ వచ్చాయి.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ‘ఆమ్నియో సెంటసిస్’ లాంటి గర్భస్ధ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు వచ్చాక ‘మగ’ వారసుడిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశాలు, కలిగిన వర్గాలకు చేరువగా వచ్చాయి. దానితో భూములు కలిగిన వర్గాలలో ఆడ శిశువుల సంఖ్య భారీగా పడిపోతోంది. చదువుకుని ఆస్తులు సంపాదించిన వర్గాలలోనూ ఈ జాడ్యం ప్రబలింది. హర్యానా లాంటి రాష్ట్రాల్లో తరాల తరబడి ఆడ పిల్లలు అనేవారే లేని భూస్వామ్య కుటుంబాలకు లెక్కే ఉండదంటే కారణం ఇదే. హర్యానాలో చివరికి ఎస్.సి కుటుంబాలు కూడా ఇతర రాష్ట్రాల్లోని ఎస్.సి లతో పోలిస్తే తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉన్నారు. ‘పాలకుల భావాలే పాలితుల భావాలు’ అని ఊరకనే అన్నారా?
మనకు తల్లిని ప్రేమించడం తెలియదు!ప్రతీ స్త్రీ లో తల్లిని చూసినపడు ఇటువంటి జాడ్యాలు ఎదురుకావు!
సైన్స్ వూరకనే ఎలా అంటుంది దేన్నయినా?..తార్కికంగానే అంటుంది..-పాలకు భావాలే పాలితుల భావాలు..
ఇక్కడ ఒక యు టర్న్ తీసుకుందాం. సమీప భవిష్యుత్తులో మగ జాతి అంతరించి పొతుందట! కారణం ఏమిటంటే, పురుషుల్లో లింగ నిర్ధారణ కు కారణమైన ఎక్స్ క్రోమో జోం కంటే వై క్రోమో జోం పర్యావరణ కారణంగా త్వరగా నసించి పోతుందట! ఈ వై క్రోమో జోమే కదా మగపుట్టుకకు కారణం. (2001 లో యూరప్ లో సమవేశమైన జీవ శాస్త్రజ్నులు దీన్ని దృవీకరించారు) అందు వల్ల యుగ యుగాలుగా మగ జాతి స్త్రీలకు చేస్తున్న ద్రోహం పాపమై కూర్చున్నదేమో!?
దేవతా స్త్రీలే కాదు పతివ్రతలు కూడాని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. భాగవతం తెరచి చూస్తే అనేక విషయాలను సింహావలోకనం చేసుకోవచ్చు. ఉదాహరణకు పరాశరుడి భార్య. ఈ కలియుగంలో రాజకీయ ప్రశస్థం కలిగిన మాహా వనితలు. ఓటుకైన చోటుకైన కావలిసింది రిజర్వేషన్. నేషన్ మొత్తం ఆధరపడిన ఏకైక సబ్జెక్ట్. తెలుగు రాయతీలు, ఇంగ్లీష్ రాయల్టీలతో, ముడుపులతోను, దడుపులతోను సాధించే వర్గం.
chaduvukunnaka samskaaram chedindani……yem poyye kaalam raa babu aada pillalni champestunnaaru