ముస్లిం ప్రార్ధనల్లో క్రమ శిక్షణే వేరు -ఫోటోలు


ముస్లిం మతావలంబకుల ప్రార్ధనలో క్రమ శిక్షణ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒంటరిగా ప్రార్ధించినా / నమాజు చేసినా లేదా వందలు, వేలు, లక్షల మంది ప్రార్ధనల్లో పాల్గొన్నా వారు క్రమ శిక్షణ తప్పరు. బహుశా క్రైస్తవ మత ప్రార్ధనల్లో కూడా క్రమ శిక్షణ ఉంటుందనుకుంటాను.

క్రమ శిక్షణ అంటే నా ఉద్దేశ్యం హంగూ, ఆర్భాటాలు, శబ్దం, హడావుడి ఇత్యాదులు ఉండవని. ఇవే కాకుండా ఒక వరుస వెనుక మరొక వరుసలో ఎవరూ చెప్పనవసరం లేకుండానే, నిర్వాహకులు అనేవారి అవసరం లేకుండానే ముస్లింలు కూర్చుని నమాజు చేసే పద్ధతి చూడ ముచ్చటగా ఉంటుంది. నేను గమనించినంత వరకూ వారి నమ్మకాల్లో స్వచ్ఛత కనిపిస్తుంది. ఎంత మూఢమైనదైనా కావచ్చు గాని సిన్సియారిటీ ఉంటుంది.

మరో ముఖ్య విషయం దేవుడికి లంచాలు ఇచ్చే పద్ధతి లేకపోవడం. పూజారులకు ఎవరు, ఎలా డబ్బు ఇస్తారో తెలియదు గానీ రకరకాల పేర్లతో భక్తులను బాహాటంగా దోపిడీ చేయడం నేను చూడలేదు. ప్రార్ధనకు వెళ్ళినవారు, పూజారుల (వీరిని ముస్లింలు ఏమని పిలుస్తారో తెలియదు) ఆశీర్వాదం తీసుకునేటప్పుడూ భక్తులు మౌనంగా డబ్బు వారి చేతుల్లో పెట్టడం ఈ మధ్య కొన్ని వీడియోల్లో చూశాను. బహుశా పూజారుల బతుకులు ఆ డబ్బుతోనే గడుస్తాయేమో.

ముస్లింలలో వ్యక్తిగత లాభాల కోసం ప్రార్ధించడం కంటే మంది ప్రయోజనాల కోసం ప్రార్ధించడం కూడా నేను కొన్నిసార్లు గమనించాను. ఇది ఇతర మతాల్లో నాకు కనిపించలేదు. బహుశా నేను గ్రహించకపోయి ఉండవచ్చు. కానీ హిందూ మతంలో వెంట్రుకలు ఇచ్చినా, బంగారం, నగలు, వజ్ర కిరీటాలు లాంటివి దేవుళ్ళకు బహూకరించినా వ్యక్తిగతంగా లేదా కుటుంబాపరంగా ఏదో ఒక లాభం కోరుతూ ఇస్తున్నవే కానీ సమాజం మేలు కోరి ఇస్తున్నవి కనపడవు.

నిజానికి సమాజం మేలు కోరేవారు ఆశ్రమాలు నడపడమో, ఫలానా ముఖ్యమైన రోజున దాన, ధర్మాలు చెయ్యడమో, ఇంకా అలాంటివి ఏమన్నా చేస్తారు గానీ గుళ్ళు, గోపురాలకు వెళ్ళి పూజలు చేయరు. దేవుడి పేరుతో ఆశ్రమాలు నడిపేవారు కూడా ఉంటారు గాని అందులో కూడా లాభాపేక్ష చూపేవారికి కొదవలేదు. ‘మానవ సేవే, మాధవ సేవ’ అని సూత్రాలు చెప్పడమే గానీ ఆచరణలో బహు తక్కువ.

ఇది ఒక మతాన్ని ఎత్తి, మరొక మతాన్ని దించడానికి కాదు. కేవలం నా పరిశీలన చెబుతున్నానంతే. దేవుళ్ళ గొప్పతనానికీ ఈ అభివ్యక్తికి సంబంధం లేదు. కాబట్టీ ఎవరూ నొచ్చుకోవద్దు.

బక్రీద్ పండగ సందర్భంగా వివిధ దేశాల్లో జరిగిన ప్రార్ధనల ఫొటోలివి. ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.

38 thoughts on “ముస్లిం ప్రార్ధనల్లో క్రమ శిక్షణే వేరు -ఫోటోలు

 1. ఒకమారు ఉయ్యూరు నుంచి విజయవాడ బస్సులో వెళ్తున్నప్పుడు దారిలో రోడ్డు ప్రక్క కనిపించే షాప్ లలో ఒక దానిపై ”’నల్లని చీకటి లో నల్లని రాతిపై నల్ల చీమ నడక చప్పుడును సైతం వింటాడు అల్లాహ్”!! అని వ్రాసి ఉండటం చూసి మరలా అటువైపు వెళ్తున్నప్పుడు ఆ వాక్యం చూస్తూ చదువుతూ అంతరార్థాన్ని భావాన్నివిచారణ చేస్తూ ఉండేవాడిని!!

  అలానే

  నేను ఒక మారు హైదరాబాద్ నుండీ ఢిల్లీ వస్తున్నప్పుడు ట్రైన్ లో సాయంసంధ్యా సమయం లో ముస్లిం సోదరులు తొలుత నేలను శుభ్రపరచి తదుపరి ఒక clothe ని నేలపై పరచి ఒకరి తరువాత మరొకరు శ్రద్ధ భక్తి సమన్వితులై బాహ్య స్పృహ వీడి అంతర్ముఖులై నమాజు చేసే దృశ్యం చూసి ఆశ్చర్య ఆనంద అనుభూతులకు లోనయ్యాను. చాల inspire అవ్వాల్సిన సంఘటన అది.

  ఇక్కడ మీరు ఉంచిన చిత్రాలను నిన్ననే నేను యాహూ సౌజన్యమ్ తో హార్డ్ డిస్క్ లో భద్ర పరచుకున్నాను.

  నేను దేశం లో వివిధ ప్రాంతాలను చూసిన అనుభవంతో చెప్తున్నాను

  భక్తి మార్గంలో ఉన్న హిందువుల దైవదర్శన పద్దతులలో (గుడులలో ) మీకు క్రమ శిక్షణ కనిపించి ఉండక పోవచ్చు కాని జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తున్న వారి విషయం లో క్రమశిక్షణ చాల ప్రాధమిక నిబంధన
  కనుక వారు ఇలానే క్రమమైన పద్ధతులలో తమ కార్యక్రమాలు నేరవేర్చుతారు,

  పూజారులను గూర్చి దేవుడికి లంచం అనే మీ మాటలు కటినంగా ఉన్నప్పటికీ వాస్తవం లేకపోలేదు
  అలా అని అది అందరికి వర్తించేది కాదు ఇప్పటికి అన్ని రకాల వైదిక,నిత్య పూజా విధి అనుష్టానం అయ్యేవరకు పచ్చి మంచినీళ్ళు ముట్టని వాళ్ళతో నాకు ప్రత్యక్ష పరిచయం ఉన్నది అంతే కాక కొన్ని విశేష దినములలో నక్షత్ర దర్శనం అయ్యే వరకూ ఏవిధమైన ఆహారం తీసుకోక నిష్ఠ తో దైవారాధన చేసేడి వారు ఉన్నారు !!

  thanks again

 2. “అలా అని అది అందరికి వర్తించేది కాదు”

  అవును. అది అందరికీ వర్తించేది కాదు. అందుకే ఏ స్వార్ధం లేకుండా దైవభక్తితో సేవ చేసే వారూ ఉన్నారని, వారు తక్కువేననీ రాశాను.

  మీ అనుభవాన్ని సమయోచితంగా, అందంగా వివరింఛారు. పరమత సహనం మీకు సహజ అలంకారంగా, ఆదర్శప్రాయంగా భాసిల్లుతుంది. ధన్యవాదాలు.

 3. ముస్లిం మతాన్ని కీర్తించే రోజులు పోయాయి. హింసకు , జాత్యహంకారానికి ఇస్లాం పునాది. దీక్ర్ఘకాలం గల్ఫ్ లో జీవించి , ముస్లింల చరిత్రలో ఇమిడిన ప్రమాదకర ధోరణులు విద్యావంతులైన అరబ్బులతో చర్చించి తెలుసుకుని చెబుతున్న చేదు నిజం ఇది. మా ముస్లిం ప్రజలు మంచివారే. కానీ ఇస్లాం ఒక గుది బండ.

  దానిని సంస్కరించాలె. లేకుంటె మాకు శాంతి లేదు. సాలెహ్ ఫీ జమాత్ అనబడే మూక ప్రార్ధనలు క్రమశిక్షణకు ప్రతీక కాదు. మధ్య యుగాల మూక రాజకీయానికి ప్రతీక మాత్రమే. ఇక్కడె ఆలోచనల్లో హింస ప్రారంభమవుతుంది. పాకిస్తాన్, ఎమెన్, సిరియా, ఇరాక్ , ఈజిప్ట్ కనబడలేదా మీకు .

 4. ముస్లిం మతాన్ని కీర్తించె రోజులంటూ కొన్ని ఉన్నాయన్న సంగతే నాకు కొత్త. కీర్తించడానికి కాదని కూడా టపాలో చెప్పాను కదా!

  మీ ముస్లిం పేరు, విద్యావంతులైన అరబ్బులతో చర్చించి వారి మతంలో ఉన్న ప్రమాదకర ధోరణులను వారే చెప్పారని చెబుతున్న మీ సాహసం అబ్బురం గొలిపే విషయాలు.

  మూక ప్రార్ధనలు అన్ని మతాల్లోనూ ఉన్నవే. అలాంటి మూక ప్రార్ధనలో క్రమశిక్షణ లేకపోతె ఏమవుతుందో దతియా దసరా తొక్కిసలాట చెబుతోంది.

  పాక్, యెమెన్, సిరియా, ఇరాక్ లపైన అమెరికా దాని తైనాతీలు చేసిన పరమ హింసాత్మక దురాక్రమణ దాడులు, ఈ దేశాల్లో కొనసాగుతున్న డ్రోన్ దాడులు, లక్షలాది అమాయక పౌరుల దుర్మరణాలు మీకు కనపడ్డం లేదా?

  మనిషికి మతం అవసరం లేనినాడే అసలు శాంతి. మతమూ ఉండాలీ, శాంతీ ఉండాలీ అంటే దుస్సాధ్యం. ఎందుకంటే మతాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగపెట్టడమే ఆధిపత్యవర్గాల నీతి కాబట్టి.

 5. క్రమశిక్షణమాటెలాఉన్నా ఇస్లాంలోని నియమాలు ఆలోచనలనూ, ఉద్వేగాలనూ కూడా నియంత్రించబడానికి అనువుగా ఉంటాయి. ఇప్పటికీ ఆపట్టును సడలించకుండా మనుష్యులపై ఉంచగలిగింది కేవలం ఇస్లామ్మాత్రమేనేమో! అందరికంటే ముందుగా స్త్రీలకు హక్కులగురించి మేమాలోచించాం అని డప్పుకొట్టుకోవడమే తప్ప, ఆచరణలో స్త్రీల పరిస్థితులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నది అందులోనే. ఇప్పటికీ ఎన్నికల్లో మతపెద్ద ఆదేశాలకు అనుగుణంగా ఓట్లుపడిపోవడం మనంచూస్తూనేఉన్నాం. ఈ తరహా ‘క్రమశిక్షణ’ ఎంతగా ముదిరిపోయిందంటే హిందువుమతపెద్దలుకూడా వాళ్ళకూ వారి మతస్తులపై అలాంటి నియంత్రణలేదే అని బాధపడిపోయేంత.

  దేవుడికి లంచాలివ్వడం, మతపెద్దలు కష్టజీవుల ఆర్జితంపై ఆధారపడి ఈతరత్రా పనులేమీ చేయనవసరంలేకుండా జీవించడం, మూఢనమ్మకాలు… అనేవి హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతాలన్నింటికీ వర్తిస్తుంది.

  మతానికీ, శాంతికీ పొసగదన్న మీమాట చాలావరకు నిజం. ఏపనుల్నైతే మన concious తప్పుపడుతుందో అవేపనులని మతంకోసం (ఇంకా దేశంకోసం, కులంకోసం) చెయ్యడం తప్పుకాదని మనుషులను రెచ్చగొట్టి, రక్తాలుపారించవచ్చు. చరిత్ర మనకు చెబుతున్నది అదే!

 6. అందుకే మతాలన్నీ గతాలవ్వాలి! ఇలాతలంలో మానవతాహేమం పండాలి! మతాన్ని ఒక చారిత్రక సందర్బంగా చూడాలి! మతం ఈరోజు సామ్రాజ్య వాదం కల్లుతాగిన కోతి చేతిలో ఆయుధం! అది దాన్ని ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు.

 7. మతం అనేది ఎవరికి వారికి పరిమితమైతే సమస్య లేదు. కానీ మా మతమే గొప్పది అంటూ బల ప్రదర్శనకు దిగడంతోనే సమస్య మొదలవుతుంది.
  అన్నట్లు కుంభమేళా, పుష్కరాల సమయాల్లో హిందువులు కూడా…లక్షలాది మంది ఒకచోటికి వస్తారు కదా…?

 8. అన్ని మతాలలోనూ మూలసూత్రం సమాజమే కానీ వ్యక్తిగతం కాదు, వ్యక్తి స్వేచని దూరం చేసి సమాజానికి లొంగి ఉండేలా చేయటానికే మతాలు వ్యవస్థీకృతం చేయబడ్డాయి. ఇక పోతే హిందూ ముస్లిం మతాల గురించి పోలిక ఈ వ్యాసంలో చర్చించారు కాబట్టి “సర్వేజనా సుఖినో భవంతు” అనే ధోరని హిందూ మతంలో అనేక ప్రార్ధనలలోనూ, మత క్రతువులలోనూ ద్యోతకమౌతుంది. ఇక గుళ్ళల్లో జరిగే అన్నదానాలూ, విద్యావిషయక వ్యాసంగాలూ ధార్మిక సంస్థలకు కొత్తేమీ కాదు. హిందూ గుళ్ళల్లో భక్తులు క్రమశిక్షణలేకుండా ప్రవర్తించడం అంతూ ఏమీ లేదు. ఉత్సవాల్లో ప్రవర్తన భిన్నమైనది. అది అన్ని మతాలలోనూ ఉంది ఇస్లాం లో కూడానూ.
  మత కోణం నుంచి మనుషుల ప్రవర్తనను పాక్షిక ధోరణిలో విష్లేషిస్తూ వచ్చిన ఈ వ్యాసం ఈ బ్లాగు స్థాయికి తగినది కాదు. ఇది విచారకరమైన అంశం.

 9. పొరపడ్డారు. మతం కోణం నుండి మనుషుల ప్రవర్తనను విశ్లేషించడానికి ప్రయత్నం ఇందులో జరగలేదు. సూత్రాలు మంచివి ఉన్నాయా లేదా అని కూడా చర్చించలేదు. రెండు మతాల్లో ప్రార్ధనా రీతుల్ని పోల్చడం మాత్రమే జరిగింది.

  మతం నేటి సమాజంలో అవిభాజ్యంగా ఉంది. కాబట్టి మతం అనుసరిస్తున్న పద్ధతుల్ని చర్చించడం స్ధాయి తగ్గడం కాబోదు. బహుశా వ్యాసంలోని అంశం మీకు నచ్చక స్ధాయి చర్చలోకి వెళ్ళినట్లున్నారు.

  క్రమ శిక్షణ తప్పకుండా ఉంటే మొన్న దతియాలో తొక్కిసలాట జరిగి ఉండేదా? వాస్తవాన్ని అంగీకరించడానికి బాధ ఉంటే ఉండొచ్చు గాక! కానీ నిరాకరించడం ఎందుకు?

 10. శివ గారు ఇవి ప్రాబ్లమ్స్ గా కాకుండా చర్చగా మాత్రమే చూస్తున్నాను. మీరూ అలాగే చూడగలరు. వ్యక్తిగత దూషణల్లోకి వెళ్ళనంతవరకు చర్చ ఎంత తీవ్రంగా అయినా జరగొచ్చు. ఒక్కోసారి తీవ్రత ఎంతగా ఉంటే వాస్తవికతకు అది అంత దగ్గరగా వెళ్లవచ్చు.

 11. మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే , ఇంతకు ముందు వార్తల్లో ఇలాంటి తోక్కిసిలాట లు చాలా వచ్చాయి .
  football మ్యాచ్ లో తొక్కిసలాట ,
  సినిమా టికెట్ల కోసం తొక్కిసలాట .
  dilshuknagar లో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు కూడా తొక్కిసలాట జరిగింది .

  ఇతర మతాలలో కుడా తొక్కిసలాట జరిగి జనం చనిపోయినా సందర్భాలు ఉన్నాయి .

  http://www.namasthetelangaana.com/news/article.asp?category=1&subCategory=3&ContentId=62203

  ఇకా ప్రార్ధనలు చేసేటప్పుడు ఉండే క్రమశిక్షణ అంటారా , I agree with you .
  ఆర్ ఎస్ ఎస్ లో కుడా ఇలాంటి క్రమశిక్షణే కనిపిస్తుంది .

 12. విశేఖర్ గారూ….
  ముస్లింలు ఒకే చోట చేరినపుడు చాలా క్రమశిక్షణగా ఉండడం ప్రశంసనీయమే. ఐతే సామూహికంగా అలా ప్రార్ధనలు చేయడం అనేది వారి మత సంప్రదాయంలో ఉండడం వల్ల సాధ్యపడిందనుకుంటున్నాను. అటువంటి సామూహిక ప్రార్థన హిందూ మతంలో లేదు. కాబట్టి మనకు క్రమశిక్షణ అన్న ప్రస్తావనే లేదు.
  ఎవరో ఒకరు అంతా ఒక నిలబడాలి….కూర్చోవాలి..ప్రార్థన చేయాలి అని నిర్దేశిస్తే..భక్తులు తప్పకుండా పాటిస్తారు.

  ఉదాహరణకు తిరుపతికి లక్షల మంది భక్తులు వెళతారు. అంతా క్యూలైన్ లోనే వెళతారు. లక్షలాది మంది వెళుతున్నా తొక్కిసలాటలు జరగడం లేదు కదా..?
  మొన్న దతియా సంఘటన కేవలం భక్తుల్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లే జరిగిందంటారా…? నిర్వహణ లోపాల వల్ల జరిగిందని నేను అనుకుంటున్నాను.

  ఒక మతంలో క్రమశిక్షణ ఉందని…ఇంకో మతంలో లేదని మనం ఎలా నిర్ణయించగలం. ..?

 13. అనుభవమే! మనకి రోజూ ఎదురవుతున్న అనుభవాలే ఆ సంగతి నిర్ణయిస్తాయి. ఎవరో ఒకరు పూనుకుంటే పాటించడం సరే. కాని పూనుకోకపోయినా ముస్లిం ప్రార్ధనల్లో క్రమ శిక్షణ ఉంటోంది కదా.

  ‘ఒక మతంలో క్రమశిక్షణ ఉంది, మరో మతంలో లేదు’ అని చెబితే అది స్వీపింగ్ స్టేట్‌మెంట్ అవుతుంది. అది మతం మొత్తం గురించిన జడ్జిమెంటు అవుతుంది. నా ఉద్దేశం అది కాదు. ప్రార్ధనా పద్ధతి, పూజ సందర్భంగా భక్తుల వ్యవహరణ మొదలైన అంశాల గురించే నేను చెబుతున్నాను.

  మీరు చెప్పిన ‘సామూహిక ప్రార్ధనా పద్ధతి’ అనేది ఆలోచించవలసిన విషయం. కానీ కోలాహలం, ఆర్భాటం, డబ్బు, ప్రదర్శన… ఇవి కూడా ముస్లిం ప్రార్ధనల్లో కనిపించవు కదా.

  తిరుపతి నేను ఎప్పుడూ వెళ్లలేదు. తిరుమలలో చాలా ప్రశాంతత ఉంటుందని ఒకసారి వెళ్లమని నా నాస్తిక మిత్రులు కూడా చెబుతుంటారు. సాయిబాబా గుడుల్లో కూడా నాకు ప్రశాంతత కనిపిస్తుంది. కాని పండగ రోజుల్లో ఆ ప్రశాంతత ఇట్టే మాయం అవుతుంది.

  మసీదుల్లో హిందువులు కూడా వచ్చి అక్కడి పూజారుల వద్ద ఆశీర్వాదం తీసుకోవడం నేను చాలా చోట్ల గమనించాను. పల్లెల్లో అయితే కొన్ని రకాల జబ్బులకు మసీదుకి/దర్గాకి వెళ్లడం, మంత్రం వేయించుకోవడం సాధారణంగా జరుగుతుంది. నిజానికి హిందువులు-ముస్లింలు అనే తేడా జనంలో సహజ సిద్ధంగా ఉండదని నా భావన. స్వార్ధ ప్రయోజనాల కోసం బలవంతంగా ప్రవేశపెడితేనే ఆ తేడా వస్తుంది. లేకపోతే ఇరు దైవాలను ఒక అతీత శక్తిగా గుర్తించడమే కనిపిస్తుంది.

  నా పరిశీలన ఏమిటంటే హిందూ మతం పుట్టడంతోనే దోపిడీ వర్గాల మతంగా పుట్టింది. కానీ క్రైస్తవ, ముస్లిం మతాలు అలా కాదు. అణచివేతకు గురవుతున్న ప్రజల తిరుగుబాటుకు వ్యక్తీకరణలుగా ఆ మతాలు పుట్టాయని చరిత్ర చూస్తే అర్ధం అవుతుంది. (ఆ తర్వాత అవి కూడా దోపిడీవర్గాల సాధనాలుగా మారిపోయాయి) బహుశా అందువల్లనే హిందూ మతంలో ఎక్కువగా హంగూ, ఆర్భాటాలు, డబ్బు ప్రదర్శన ఉంటాయని నాకు అనిపిస్తుంది.

  ఇది నా పరిశీలన మాత్రమే. నిజం కావచ్చు, కాకపోనూవచ్చు. దయచేసి ఎవరూ నొచ్చుకోవద్దని మరోసారి కోరుతున్నాను.

 14. On February 4th, 2013, Vladimir Putin, the Russian president, addressed the Duma, (Russian Parliament), and gave a speech about the tensions with minorities in Russia.

  “In Russia live Russians. Any minority, from anywhere, if it wants to live in Russia, to work and eat in Russia, should speak Russian, and should respect the Russian laws.

  If they prefer Sharia Law, then we advise them to go to those places where that’s the state law. Russia does not need minorities. Minorities need Russia, and we will not grant them special privileges, or try to change our laws to fit their desires, no matter how loud they yell ‘discrimination’.

  We better learn from the suicides of America, England, Holland and France, if we are to survive as a nation. The Russian customs and traditions are not compatible with the lack of culture or the primitive ways of most minorities.

  When this honorable legislative body thinks of creating new laws, it should have in mind the national interest first, observing that the minorities are not Russians.”

  http://www.bnp.org.uk/news/national/putin’s-speech-feb-04-2013

  బహుశా మనదేశ కమ్యునిస్టులుకు/ ‘పరమ’ లౌకికవాదులకు ఇది రుచించక పోవచ్చు. కానీ భారతీయులకు అనిపించక మానదు, ఇటువంటి నాయకుడు మనకు వుంటే ఎంత బాగుండును అని. ఇక సనాతన ధర్మం (హిందూ)లో వున్నగొప్పతనం ఏంటంటే విమర్శల్ని ఆహ్వానించటం. ఎవరి అభిప్రాయాలు, నమ్మకాలు వారివని గౌరవించటం. ఇటువంటి దృక్పధం ‘మతాల్లో’ వుండదు. ఎందుకంటే ‘మతాల్ని’ పుట్టించిన వ్యక్తి/ ప్రవక్త/దేవదూత/మెసెంజర్ తమ ‘పుస్తకం’లో ప్రాధమికంగా చెప్పే సూత్రం ఏమంటే ‘Behead if anybody questions’. చరిత్ర చూసిన వారెవ్వరికైన ఇది అవగతం అయ్యిద్ధి. ఆ ‘దేవుని’ వాక్యాలను పాటించిన వాళ్ళు చరిత్రలో ఎన్ని లక్షల మందిని చంపారు, వర్తమానంలో ఎన్ని వేల మందిని చంపుతున్నారు, భవిష్యత్తులో ఎన్ని కోట్ల మంది చంపబడతారో కనిపిస్తుంది. ఎదురింటి నేతి బీరలోని నెయ్యి కోసం అర్రులు చాచే ముందు, మన ఇంట్లోని జున్ను పరిమళాలని ఆస్వాదించడం మంచిది.

 15. శ్రీనివాస రావు గారు, మీరు ఉటంకించింది పుటిన్ నిజంగా అనలేదు. అది పుకారు. స్నోడేన్ కి ఆశ్రయం ఇచ్చిన పుటిన్ అలాంటి మాటలు అనడం అసాధ్యం. ఆయన మీద పశ్చిమ రూమర్ మిల్స్ అనేక పుకార్లు సృష్టించి ప్ర చారం చేస్తున్నాయి. వాటిల్లో ఇది ఒకటి.

  ఫిబ్రవరి తేదీన డ్యూమాలో పుటిన్ అసలు ప్రసంగమే ఇవ్వలేదని కొన్ని పత్రికలు పరిశోధించి చెప్పాయి.

  ఆస్ట్రేలియా ప్రధానుల కూడా సరిగ్గా ఇదే తరహాలో స్పీచ్ ఇచ్చినట్లు గతంలో పుకార్లు వచ్చాయి. పుటిన్ పేరు స్ధానంలో జాన్ హోవార్డ్ పేరు ఉంచారు. ఆయన పదవీ విరమణ చేశాక కెవిన్ రడ్ ఆ మాటలు అన్నాడంటూ చేర్చారు. ఆయన తర్వాత జులియా గిల్లార్డ్ పేరు చేర్చారు. ఇప్పుడేమో పుటిన్ అన్నాడంటున్నారు.

  మీరు ప్రస్తావించిన వెబ్ సైట్ బ్రిటిష్ నేషనల్ పార్టీది. ఇది పచ్చి జాతివిద్వేష పార్టీగా బ్రిటన్ లో పేరు. దీనిని నిషేదించాలని కూడా డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పార్టీతో సంబంధాలు ఉండకూడదన్న నిషేధం ఉంది. అలాంటి పార్టీ వెబ్ సైట్ ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తే ఆశ్చర్యం లేదు. కానీ జాగ్రత్త వహించాల్సింది మీలాంటివారే.

 16. నిజమే. పల్లెటూళ్లల్లో హిందూ, ముస్లిం అన్న విభజన చాలా తక్కువ.
  మా ఊర్లో పీర్ల పండగను ముస్లింల కన్నా….హిందువులే బాగా జరుపుతారు. మా ఊళ్లో చాలా మంది హిందువులకు హుస్సేన్, సైదులు ( సైదా), కాశీం, లాంటి పేర్లున్నాయి.
  అలాగే మా నల్గొండ జిల్లాలో జానపహాడ్ అని ఓ దర్గా ఉంది. అక్కడకి వచ్చే వాళ్లలో ముస్లింల కన్నా….హిందువులే ఎక్కువగా ఉంటారు. దోపిడీ దారులకు అనుకూలంగా హిందూ మతం పుట్టిందనే మీ వ్యాఖ్యలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ మాటకొస్తే… క్రిస్టియన్ మైనారిటీలు కూడా…మత వ్యాప్తి చేసేది చివరగా కంపెనీల దోపిడీ కోసమేనని చరిత్ర రుజువు చేసింది కదా..?
  మతాలు ఏ ఉద్దేశంతో స్థాపించినా….అవి కింది వర్గాలను ప్రజలను దోచుకునేందుకే ఉపయోగపడ్డాయి.

 17. @ visekar gaaru – death due to stampede while circumscribing around kaaba, stone pelting ritual during haj is very very common phenomenon during every haj season. every time devotees dies here. in some years that toll is as high as 300. but i never heard devotees died due to stampede in tirumala queue. so depending on this small empirical study can you agree there is more discipline in hindu congregations???? (refereces – there are many such references, for name sake see this http://tiny.cc/x9wg5w, http://tiny.cc/gaxg5w). you bashed putins statement on minorities while world is saying he said that. better indian leftists should subscribe russian leftist idea on muslims.

 18. “should speak Russian” ఇదొక్కటి మినహా మిగతా ఇంగ్లీషు కామెంటులోని అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. మిగతావన్నీ మతాలనీ, మీదిమాత్రం ధ్రమమనీ పైగా అదేదో శాంతిని ఆచరిస్తున్నదనీ (ఆచరణకునోచుకోని బోధనలు లక్షైతేనేమి లాభము?) చెప్పే మీ అభిప్రాయంతో పూర్తిగా విభేదిస్తున్నాను.

  ఎవరా భారతీయులు? మీ కామెంటును మెచ్చినవాళ్ళుమాత్రమే భారతీయులా?
  హిందూధర్మమూ ఉందీ, హిందూమతమూ ఉంది. హిందూఇజాన్ని మతంకాదని, ధర్మమనీ చెప్పడానికి సింగిల్ కోట్లలో మీరు పడ్డతంటాలు చాలా వినోదభరితంగా ఉన్నాయి. గుళ్ళలో పూజాదికాలు ధర్మమా? మతమా?
  హిందువులకి రక్తపాతంగురించి ప్రవక్తలు బోధించకపోతేనేల? ప్రస్తుత నాయకులు బోధిస్తే చాలదా? బ్లాగుల్లో వెల్లివిరుస్తున్న అసహనం చాలదా? శైవ-వైష్ణవ తన్నులాటల సంగతేమిటి? బౌధ్ధులను తన్ని తగలెయ్యడం సంగతేమిటి? ప్రతిదానికీ విధివిధానాలు నిర్ణయించిన passive violence సంగతేమిటి? (బ్లాగులు చదవండి శృంగారసమయంలోకూడా ఏమంత్రాలు చదవాలో వివరించిపారేశ్శారుట).
  రక్తపాతానికి మూలకారణం ప్రస్తుతం జీవిస్తున్న మనుషుల ప్రాణాలకన్నా మతాన్నీ, ఎప్పుడో జీవించినవారి అభిప్రాయాలే విలువైనవన్న భావం. ఇలాంటి అవాంఛనీయధోరణులు హిందూమతంలో లేవా?

 19. విశేషజ్ఞ గారు,
  చాలా బాగా చెప్పారు! వాళ్లు రష్యా బాషలో చెప్పింది వారి భవిష్యుత్‌ ప్రణాలికండీ! విబేదించే వారెవరైనా భారత దేశంలో ఉండబోరు (వారి ప్రకారం) మరి అది పుతిన్‌ చెప్పినట్లు చెప్పబడుతున్నది వారికి ఎంత సంతోషాన్ని కలగ జేస్తుంది! అనుభవించనీండీ ఆ సంతోషాన్ని!

  మీరు కంచే ఐలయ్య గారు రాసిన ‘ హిందుమతానంతర భారత దేశం” చదివారా? అందులో ఇలా రాస్తారు: ” ఆత్మ హత్య భాటలో హిందుమతం ఆరాటం ” అంటారు. ఆయనతో మనాంగీకారాన్ని పక్కన పెడీతే, అల్లాంటిది ఏమైనా జరిగెతే దాని కారణం ఈ దేశం లో హిందు మతమో, లేక సామాన్య హిందు ప్రజలో కాబోరు.

 20. Adapted from Dr. Peter Hammond’s book: Slavery, Terrorism and Islam: The Historical Roots and Contemporary Threat.

  Islam is not a religion, nor is it a cult. In its fullest form, it is a complete, total, 100% system of life.

  Islam has religious, legal, political, economic, social, and military components. The religious component is a beard for all of the other components.

  Islamization begins when there are sufficient Muslims in a country to agitate for their religious privileges.

  When politically correct, tolerant, and culturally diverse societies agree to Muslim demands for their religious privileges, some of the other components tend to creep in as well..

  Here’s how it works:

  As long as the Muslim population remains around or under 2% in any given country, they will be for the most part regarded as a peace-loving minority, and not as a threat to other citizens. This is the case in:

  United States — Muslim 0.7%
  Australia — Muslim 1.5%
  Canada — Muslim 1.9%
  China — Muslim 1.8%
  Italy — Muslim 1.5%
  Norway — Muslim 1.8%

  At 2% to 5%, they begin to proselytize from other ethnic minorities and disaffected groups, often with major recruiting from the jails and among street gangs.
  This is happening in:

  Denmark — Muslim 2%
  Germany — Muslim 3.7%
  United Kingdom — Muslim 2.7%
  Spain — Muslim 4%
  Thailand — Muslim 4.6%

  >From 5% on, they exercise an inordinate influence in proportion to their percentage of the population. For example, they will push for the introduction of halal (clean by Islamic standards) food, thereby securing food preparation jobs for Muslims. They will increase pressure on supermarket chains to feature halal on their shelves — a long with threats for failure to comply. This is occurring in:

  France — Muslim 8%
  Philippines — 5%
  Sweden — Muslim 5%
  Switzerland — Muslim 4.3%
  The Netherlands — Muslim 5.5%
  Trinidad & Tobago — Muslim 5.8%

  At this point, they will work to get the ruling government to allow them to rule themselves (within their ghettos) under Sharia , the Islamic Law. The ultimate goal of Islamists is to establish Sharia law over the entire world.

  When Muslims approach 10% of the population, they tend to increase lawlessness as a means of complaint about their conditions. In Paris , we are already seeing car-burnings. Any non-Muslim action offends Islam, and results in uprisings and threats, such as in Amsterdam , with opposition to Mohammed cartoons and films about Islam. Such tensions are seen daily, particularly in Muslim sections, in:

  Guyana — Muslim 10%
  India — Muslim 13.4%
  Israel — Muslim 16%
  Kenya — Muslim 10%
  Russia — Muslim 15%

  After reaching 20%, nations can expect hair-trigger rioting, jihad militia formations, sporadic killings, and the burnings of Christian churches and Jewish synagogues, such as in:

  Ethiopia — Muslim 32.8%

  At 40%, nations experience widespread massacres, chronic terror attacks, and ongoing militia warfare, such as in:

  Bosnia — Muslim 40%
  Chad — Muslim 53.1%
  Lebanon — Muslim 59.7%

  >From 60%, nations experience unfettered persecution of nonbelievers of all other religions (including nonconforming Muslims), sporadic ethnic cleansing (genocide), use of Sharia Law as a weapon, and Jizya , the tax placed on infidels, such as in:

  Albania — Muslim 70%
  Malaysia — Muslim 60.4%
  Qatar — Muslim 77.5%
  Sudan — Muslim 70%

  After 80%, expect daily intimidation and violent jihad, some State-run ethnic cleansing, and even some genocide, as these nations drive out the infidels, and move toward 100% Muslim, such as has been experienced and in some ways is ongoing in:

  Bangladesh — Muslim 83%
  Egypt — Muslim 90%
  Gaza — Muslim 98.7%
  Indonesa — Muslim 86.1%
  Iran — Muslim 98%
  Iraq — Muslim 97%
  Jordan — Muslim 92%
  Morocco — Muslim 98.7%
  Pakistan — Muslim 97%
  Palestine — Muslim 99%
  Syria — Muslim 90%
  Tajikistan — Muslim 90%
  Turkey — Muslim 99.8%
  United Arab Emirates — Muslim 96%

  100% will usher in the peace of ‘Dar-es-Salaam’ — the Islamic House of Peace. Here there’s supposed to be peace, because everybody is a Muslim, the Madrassas are the only schools, and the Koran is the only word, such as in:

  Afghanistan — Muslim 100%
  Saudi Arabia — Muslim 100%
  Somalia — Muslim 100%
  Yemen — Muslim 100%

  Unfortunately, peace is never achieved, as in these 100% states the most radical Muslims intimidate and spew hatred, and satisfy their blood lust by killing less radical Muslims, for a variety of reasons.

  ‘Before I was nine I had learned the basic canon of Arab life. It was me against my brother; me and my brother against our father; my family against my cousins and the clan; the clan against the tribe; the tribe against the world, and all of us against the infidel. — Leon Uris, ‘The Haj’

  It is important to understand that in some countries, with well under 100% Muslim populations, such a s France, the minority Muslim populations live in ghettos, within which they are 100% Muslim, and within which they live by Sharia Law. The national police do not even enter these ghettos. There are no national courts, nor schools, nor non-Muslim religious facilities. In such situations, Muslims do not integrate into the community at large. The children attend madrassas. They learn only the Koran. To even associate with an infidel is a crime punishable with death. Therefore, in some areas of certain nations, Muslim Imams and extremists exercise more power than the national average would indicate.

  Today’s 1.5 billion Muslims make up 22% of the world’s population. But their birth rates dwarf the birth rates of Christians, Hindus, Buddhists, Jews, and all other believers.. Muslims will exceed 50% of the world’s population by the end of this century.

  Adapted from Dr. Peter Hammond’s book: Slavery, Terrorism and Islam: The Historical Roots and Contemporary Threat

  @Nuthakki Vijay Sekhar, @THIRU Paul, @Viseshagna
  “నిద్ర పోయేవాడిని లేపొచ్చు, అప్పుడే కళ్ళుమూసుకున్న వాడిని లేపొచ్చు కానీ నిద్ర నటించే వాడిని లేపడం కష్టం” అని చిన్నప్పుడు మా మాష్టారు ఒకాయన అంటుండేవారు సందర్భానుసారం.
  ఇక మీయొక్క అందమైన, అద్భుతమైన వివరణలు ఎంత లౌకికంగా (సెక్యులర్) గా వుంటాయో పై వ్యాసం మీద, చదవడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.

 21. శ్రీనివాసరావు గారూ

  పీటర్ హమ్మండ్ గారి పాండిత్యానికి మీరు పరవశించినట్లే అందరూ పరవశిస్తారనుకోవద్దు. మీకు కావలసింది ఆయన చెప్పారు గాబట్టి ఆయన పాండిత్యం మీకు అద్భుతంగా తోచింది. మీ నమ్మకానికి వ్యతిరేకంగా ఏది చెప్పినా, అవి నిజాలయినా సరే, మీకు నిద్ర నటన గానే కనిపిస్తుంది.

  నాకు ఇందులో ముస్లిం విద్వేషం తప్ప ఏమీ కనపడలేదు. నాలుగంకెలు, మరో నాలుగు వూడూ సిద్ధంతాలు జోడించి చెబితే నమ్మడానికి మీరు సిద్ధంగా ఉంటే ఉండండి. నాకా తీరిక లేదు.

  మీకు పట్టిన ముస్లిం వ్యతిరేక మత్తు వదిలితే తప్ప మీకు నిజాలు అర్ధం అయ్యే అవకాశం లేదు. మీతో పాటు అందర్నీ ఆ మత్తు ఎక్కించుకోమని కోరడం అవాంఛనీయం.

  ఆత్రపడాల్సింది విద్వేషపు విషం కోసం కాదు, నాలుగు మంచి మాటల కోసం. అలాగే విద్వేషం కోసం ఇక్కడ ఆత్రపడొద్దు. అదిక్కడ దొరకదు.

  ఓ సంగతి మరిచాను. తిరుపాలు గారి పేరును మీకు తోచినట్లు మార్చడానికి మీకు హక్కు ఉందనుకుంటున్నారా? ముస్లిం వ్యతిరేకతకు తోడు క్రైస్తవ వ్యతిరేకత కూడానా?

  ప్రపంచంలో హిందూ మతం తప్ప మరొకటి బతగ్గూడదన్న మీ కోరిక ఇక్కడ వ్యక్తం అవుతొంది. అలాంటి మీరు ముస్లింలను ఎందుకు ఆడిపోసుకోవడం?

  మీ బావిలో కలకాలం బతకాలనుకోవడం మీ హక్కు. కాని మీకు పరిచయం లేని వ్యక్తుల మీద ఇలాంటి వ్యతిరేకత చూపడం కూడని పని.

 22. శ్రీనివాస రావు గారు చెప్పింది ఒకానొక చరిత్ర పుస్తకం నుండి , మీరు కూడా చరిత్ర పుస్తకం నుండి చెప్పిన మాటలే

  //నా పరిశీలన ఏమిటంటే హిందూ మతం పుట్టడంతోనే దోపిడీ వర్గాల మతంగా పుట్టింది. కానీ క్రైస్తవ, ముస్లిం మతాలు అలా కాదు. అణచివేతకు గురవుతున్న ప్రజల తిరుగుబాటుకు వ్యక్తీకరణలుగా ఆ మతాలు పుట్టాయని చరిత్ర చూస్తే అర్ధం అవుతుంది. (ఆ తర్వాత అవి కూడా దోపిడీవర్గాల సాధనాలుగా మారిపోయాయి) బహుశా అందువల్లనే హిందూ మతంలో ఎక్కువగా హంగూ, ఆర్భాటాలు, డబ్బు ప్రదర్శన ఉంటాయని నాకు అనిపిస్తుంది //

  మీరు చదివిన చరిత్ర మంచిది, అవతలి వాళ్ళు చదివిన చరిత్ర చరిత్రే కాదు అంటే ఎలా సర్ .
  మీరు ఏ చరిత్ర పుస్తకాలు చదివి హిందూ మతం దోపిడీ వర్గాల కోసం పుట్టింది అని, ముస్లిం , క్రైస్తవ మతాలూ అణిచివేతకి గురవుతున్న వర్గాల నుండి పుట్టాయని చెప్పారో, అలానే మిగతా వాళ్ళు కూడా వాళ్లకి పుట్టిన అభిప్రాయాన్ని చెప్తారు . వాళ్ళు కూడా చరిత్ర పుస్తకాలే చదివారు . మీరు కుడా మీ చరిత్ర నుండి సాక్ష్యాలు ఉదహరించండి . మీ అభిప్రాయనకి ఒక కారణం చెప్పండి .

  ప్రపంచం లో హిందూ మతం తప్ప , వేరే మతం బతకకూడదు అని భావించే ఏ హిందువు హిందువే కాదు . అలా అనుకుంటే కొన్ని వందల సంవత్సరాల పూర్వమే క్రిస్టియానిటీ ఇండియా లోకి అడుగు పెట్టేదే కాదు.
  మీ విమర్శ లో ఎంత అర్ధం ఉంటుందో, అవతలి వాళ్ళ విమర్శ లో కూడా అంతే అర్ధం ఉంటుంది . ఇన్నయ్య పుస్తకాలు చదివి తిరుపాలు గారు చెప్తే తప్పు లేనిది , శ్రీనివాసరావు చెప్పిన దాంట్లో తప్పు ఏం కనిపించింది . ఆయిన చెప్పింది తప్పో,ఒప్పో తెలియక పోయినా ఆయినా అభిప్రాయానికి కారణం చూపించారు.

 23. తిరుపాలు అంటే క్రిస్టియన్‌ పేరాండీ! ఇన్ని రోజులుగా నాకా విషయం తెలీనే తెలిదు. నా పేరు ఇంగ్లీషులోనె రాసానే స్పెల్లీంగు ప్రకారం తిరుపౌల్‌ కాదు. నిజమైన హిందువులకు ఈ పేరు కొత్త కాదు. తెలుగు, తమిళం లాంటి దక్షినాది భాషలు ద్రావిడ కుటుంబానికి చెందుతాయి. తమిళం ప్రకారం తిరుపాలు అంటే పాల కడలిలో పవ్వలించిన శ్రీమన్నారాయునునిగా పేర్కొంటారు.దివ్య ప్రబందాలు తెలిసిన వారికి ఈ విషయం తెలుసు.

 24. @visekar – u write an article and posted a baseless statement indirectly terming hindu congregations as not much discipline. you seems anti hindu. your perspective on islam is not correct. your marxism or socialism or womens rights had and will dont have a place in sharia law or islam. they will kick out marxist atheists. there is no place for atheism in islamic countries. its just not a religion but it has a political ideology ( they tells u it has divine sanction). if u scold rama, krishna or else hindu god, people laugh and ignore here or dont cares you at all. but if u critisize mohammed or allah, next movement u, ur marxism will hangs on death rope. i am not just saying it with some bookish knowledge or with some bias. i literally studied them , how they think, what is their ideas on god, atheism, their sharia law. i suggest u, before you to come to some conclusion, discuss with muslims, study sharia law, study saudi arabia where quran, mohammed life is constitution of country. they strictly interpret both of them in every walk of their life. then only you can understand islam better but not from marx perspective of religion

 25. Srinivas,
  My comment was on an effort to prove that Hindusim is any different from Islam or for that matter any holier. I agree with Peter’s observations. But the point is why that Hinduism has not been blamed for it’s inhuman practices towards majority of the people in the name of cast system? Why is that the violence being caused by Hindu leaders is being condoned by the poeple while at the same time the same violence when perpetrated by Islam is being condemned. Why this bias?

  @sai bhargav :

  I agree with your observatiuons about Islam. But do you beleave Hinduism is any tolarent of the things you have mentioned. Have you ever read the blogs of the so called Hindus and tried to knows about the topics you have mentioned? Let me tell you that you have no less number of Hindu people wanting the secularists, independent women, atheists to be hanged. Wht is your say on that? Are you trying to prove the tolerence by an appeal to the scriptures which have been tossed aside when it came to the practise and will be a hundred times if the need be?

  Coming to the analogy of the sleeping and the acting to be sleeping, I beleave times to shatter your dreams of the tolarence of Hindus are to be shattered on the first day a Hindu govt were to be formed. And if that day were to come, I’m sure all your voices would undergo a change to support why such an intolerence should be condoned.

 26. సురేష్ గారూ, తిరుపాలు గారిని THIRU Paul అనడం కూడా చరిత్రే అంటారా?

  ఇన్నయ్య పుస్తకాలు చదివి తిరుపాలు గారు చెప్పినట్లు మీరు ఎలా చెబుతున్నారు? ఐలయ్యగారు అన్నమాటలను ఆయన ఉటంకించారు. బహుశా ఐలయ్యగారు అనబోయి ఇన్నయ్య అన్నారా? ప్రస్తుతానికి అలాగే అనుకుంటాను, మీరు ఖండించేవరకూ.

  చరిత్ర ఎవరికైనా ఒక్కటే అన్న సంగతి ముందు గుర్తించాలి. కాకపోతే చూసే చూపును బట్టి అది రక రకాల రూపును సంతరించుకుంది. ‘విభజించి, పాలించడం’ బ్రిటిష్ వాడి నీతి. అందుకని వాడు భారత చరిత్రను మతాల చరిత్రగా విడదీశాడు. తన పాలనను మనపైన రుద్దడానికి వీలయిన విధంగా చరిత్రకి భాష్యం చెప్పి మనపైన రుద్దాడు.

  చరిత్ర అంటే రాజుల, పాలకుల చరిత్ర కాదు. ప్రజలు, వారి ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి సాధనాలు ఏయే వర్గాల అధీనంలో ఉన్నదీ, నిజంగా ఉత్పత్తి (శ్రమ) చేసేవారు ఎవరూ… ఇత్యాది అంశాలను వివరించేదే నిజమైన చరిత్ర. అది ప్రజల చరిత్ర. దేశం అంటే మట్టి కాదు, మనుషులు అని అంగీకరిస్తే ప్రజల చరిత్రే దేశ చరిత్రలు. ప్రజలే చరిత్ర నిర్మాతలు.

  ఇందుకు భిన్నంగా ఉన్న చరిత్ర ఏదయినా అది రాసుకున్న వర్గాల ప్రయోజనాల కోసం భాష్యం చెప్పబడిన చరిత్ర అవుతుంది.

  ఉదాహరణకి ఆఫ్ఘనిస్ధాన్ టెర్రరిస్టులకు నిలయం అని చెప్పడం అమెరికా, ఐరోపా రాజ్యాలకు ఇష్టం. అలా చెబితేనే ఆఫ్ఘనిస్ధాన్ పై దాడికి వాటికి హక్కు లాంటిది వస్తుంది మరి! అలా చెబితేనే జనం కూడా నమ్మి దానికా హక్కు (లాంటిది) ఇచ్చేస్తారు. కాని వాస్తవం ఏమిటి? ఆఫ్ఘనిస్ధాన్ లో జనం ఉన్నారు. వారు శతాబ్దాలుగా అనేక దాడులకు, దండయాత్రలకు, అణచివేతలకు గురవతూ వచ్చారు. వారు నడిచే నేల వారికి కాకుండా చేసారు. వారు పీల్చే గాలిని గంధకం ఆవిర్లతో నింపేసారు. వారి పంటల్ని మాదక ద్రవ్యాలతో నింపి ఆ నెపాన్ని కూడా వారిపైకే నెట్టారు.

  ఈ చరిత్ర తెలిస్తే ఆఫ్ఘన్ ప్రజల పట్ల మనకు సానుభూతి వస్తుంది. వారి పోరాటం న్యాయం అనిపిస్తుంది. ఆ దేశం పై దాడి అన్యాయం అంటాం. వారి నేలను ఆక్రమించినవారికి అది ఇష్టం ఉండదు. కాబట్టి అబద్ధాలతో ఆఫ్ఘన్ చరిత్ర రాసి పత్రికలు, పుస్తకాలు నింపుతారు. అవి చదివి నిజమే అని నమ్ముదామా?

  ప్రజల చరిత్రని వారి జీవితావసరాలు నడిపిస్తాయి. ఆ అవసరాలను తీర్చేది ఉత్పత్తి సాధనాలు. అనగా భూములు, వనరులు, పరిశ్రమలు. కాని అవి కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఉత్పత్తి సాధనాలను సొంతం చేసుకున్నవారు శ్రమ చేయడం లేదు. చేయిస్తున్నారు. చేయించి ఆ శ్రమని సొంతం చేసుకుంటున్నారు. అది జనానికి తెలియకుండా ఉండడానికి రకరకాల భావాజాలాల ముసుగులు కప్పారు. అందులో మతం ఒకటి. మతం అనేది శ్రమజీవి వాస్తవ బాధల నుండి తాత్కాలిక ఊరటనిచ్చి దోపిడీదారుడి సంపదలను న్యాయబద్ధం చేస్తుంది.

  దుర్భర దారిద్రానికి కంటికి ఎదురుగా కనిపించే శ్రమ దోపిడీ కారణం అని కాకుండా కర్మ సిద్ధాంతాలు చెప్పి దోపిడీకి పరిష్కారం కొరకుండా శ్రమజీవిని నిద్ర పుచ్చుతుంది. ఏ మతం చూసినా ఇదే కనపడుతుంది.

  ‘దోపిడిదారుల కోసం హిందు మతం పుట్టింది, ఇతర మతాలు అలా కాదు’ అని నేను చెప్పడం వెనుక ఉన్న అవగాహన ఇదే. దీనిని నాలుగు మాటల్లో వివరించడం సాధ్యం కాదు. వీలయినప్పుడు టపాగా రాయడానికి ప్రయత్నిస్తాను.

  ముస్లింల సంఖ్యను బట్టి వారి ధోరణిపైన తీర్పు ఇచ్చేయడం చరిత్ర ఎలా వుతుంది? ముస్లింల సంఖ్యను బట్టి వారి ప్రవర్తనను నిర్ణయిస్తే మరి క్రైస్తవుల సంఖ్యను బట్టి నిర్ణయించవద్దా? హిందువుల సంఖ్యను బట్టి నిర్ణయించవద్దా? దానికీ చరిత్రకూ ఏమన్నా సంబంధం ఉన్నదా?

  “మీ విమర్శ లో ఎంత అర్ధం ఉంటుందో, అవతలి వాళ్ళ విమర్శ లో కూడా అంతే అర్ధం ఉంటుంది”

  ఇదేమిటో నాకు అర్ధం కాలేదు. అదే అర్ధం ఉంటే ఇక సమస్య ఎక్కడ? అసలు ఆయన విమర్శలో ఉన్న అర్ధం గురించే కదా నేను రాసింది! మీ సమస్య ఏమిటి?

 27. visekhar sir,
  one thing is, many times in the year there are festivals celebrated around India by Hindus.
  For example as some one said above, we know how well Tirupati festivals are maintained.
  ఎక్కడైనా క్రమ పద్ధతి ఉండటానికి కారణం అక్కడి వాళ్ళు చేసే మౌలిక సదుపాయాల కల్పన and proper organization by those governing bodies.
  One more example is the maha kumbh mela where crores of people gather and is regarded as largest historic peaceful gathering of people.

 28. విశేషజ్ణ గారు మీరు రాసింది చదివితే, ఇతర మతాలతో పోల్చి హిందూ మతంలో కూడా అసహనం ఉంది అని చెప్పటానికి చేసిన ప్రయత్నం గా అనిపిస్తున్నాది.
  (1) శైవ-వైష్ణవ తన్నులాటల సంగతేమిటి?
  ఇదెప్పటి సంగతి? ఈ శైవ-వైష్ణవ తగవుల గురించి చరిత్ర పుస్తకలలో ఉంది. మన రోజువారి వారు అనుభవంలో ఎక్కడైనా ఎవరికైనా ఎదురౌతున్నాదా? ఇప్పుడు ఎక్కడైనా కొట్టుకొని చంపుకొంట్టున్నారా? అదే సున్ని, షియాల మధ్య తగవులు వారి మతం మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కొనసాగుతున్నాయి. ఎప్పుడో ముగిసిపోయిన అంశాన్ని తీసుకు వచ్చి మనలో లోపాలు లేవా అంట్టు ప్రశ్నిస్తే ఎలా?

  (2) బౌధ్ధులను తన్ని తగలెయ్యడం సంగతేమిటి?
  హిందువులకు బౌద్దూల తో అంత తగవులు, తన్ని తగలెయ్యడాలు ఉండి ఉంటే, బౌద్దమతానికి చెందిన దలైలామాకు దేశంలో ఆశ్రయం ఇవ్వటం సాధ్యపడేదా? ఒకవేళ ప్రభుత్వం రాజకీయ కారణాల వలన వారికి ఇచ్చరనుకొన్న, హిందువులు బౌద్దులు ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రాణాలుతీసుకొనే విధంగా కొట్టుకొని చంపుకొన్న సంఘటనలు నేడు ఉన్నాయా?

  (3) ప్రతిదానికీ విధివిధానాలు నిర్ణయించిన, శృంగారసమయంలోకూడా ఏమంత్రాలు చదవాలో వివరించిపారేశారు అంట్టున్నారు. అసలికి ఆ మంత్రాల గురించి ఈదేశ జనాభాలో ఎంత మందికి తెలుసు? కనీసం రాసుకొన్న వర్గాల వారిలో అయినా ఎంత మందికి తెలుసు. విధి విధానాలు పాటించకపోతే ఎవరైనా వచ్చి నిలదీస్తున్నరా?

  గతంలో తప్పు చేశామని హిందువులు భావించినపుడు వాటిని సరిదిద్దుకొవటానికి ప్రయత్నించారు, అందులో చాలా వరకు సఫలం అయ్యారు కూడాను, ఆ విషయం గుర్తించాలి, గతాన్ని తీసుకొచ్చి వర్తమానం లో ఇతర మతాలలో జరిగే సంఘటనలతో పోల్చటం సరి కాదు.

 29. SriRam గారు ముగిసింది అని మీరన్నారు నిజమే. కానీ అదికూడా జరిగిందన్న విషయం మర్చిపోకూడని నేనన్నాను. ఇదే విషయం బౌధ్ధుల విషయంలోనూ జరిగింది. నేదు జరుగుతూండనంతమాత్రన ఇవన్నీ జరగలేదనికాదు, అలాంటి భావనలకు హిందూమతం అతీతమనీ కాదు. రక్తాలుపారించైనా మతాన్ని నిలబెట్టాలనే హింసాత్మక భావనలను ప్రోత్సహించేతీరు హిందువుల్లోనూ ఉంది. దీనికి కేవలం ముస్లిముల్ని తప్పుబట్టేముందు హిందువులూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నది నాఉద్దేశ్యం.

  “అసలికి ఆ మంత్రాల గురించి ఈదేశ జనాభాలో ఎంత మందికి తెలుసు? కనీసం రాసుకొన్న వర్గాల వారిలో అయినా ఎంత మందికి తెలుసు. విధి విధానాలు పాటించకపోతే ఎవరైనా వచ్చి నిలదీస్తున్నరా?”
  తెలియకపోవడానికి కారణం మతవిద్య మనకు తప్పనిసరికాకపోవడమే (దీనికి కారణం పాశ్చాత్యవిద్యావిధానాల ప్రభావమని నేననుకుంటున్నాను). నిలదీయలేకపోవడానికికారణమ్మాత్రం (overall గా)లౌకికప్రభుత్వాలే ఇంతవరకూ రాజ్యమేలుతుండటం. మతపరమైన నియంతృత్వమో, రాచరికమో ఏర్పడ్డప్పుడుమాత్రమే మీరన్నపోకడలు పోవడం ఏమతానికైనా సాధ్యమవుతుంది. మీరు గమనించినట్లయితే ఇస్లాంలోకూడా ఇస్లామిక్ ప్రభుత్వాల్లోనే ఈ నిలదీయడమూ, దండించడమూ ఉంటాయి పాశ్చాత్యదేశాల్లో వీరి ఆటలు సాగవు.

  “గతంలో తప్పు చేశామని హిందువులు భావించినపుడు వాటిని సరిదిద్దుకొవటానికి ప్రయత్నించారు, అందులో చాలా వరకు సఫలం అయ్యారు కూడాను, ఆ విషయం గుర్తించాలి, గతాన్ని తీసుకొచ్చి వర్తమానం లో ఇతర మతాలలో జరిగే సంఘటనలతో పోల్చటం సరి కాదు.”

  ఆప్రయత్నాలను వ్యతిరేకించిందికూడా హిందువులే. వారు సఫలమవ్వడనికి కారణం ప్రధానంగా వారి పోరాటపటిమ, వారికి ప్రభుత్వబలగం ఉండటం, అన్నింటికన్నా ముఖ్యంగా మెజారిటీ హిందువుల్లో మతమౌఢ్యం లేకపోవడం, హిందువుల్లో మతంకన్నా కులానికే ప్రాధాన్యత ఉండటం అనంటాను. గతం-వర్తమానం విషయానికొస్తే హిందూమతంతో పోల్చిచూస్తే, మిగతా మతాలన్నీ కుర్రమతాలు. హిందూమతానికున్నంత వయసు వాటికీ వచ్చేలోపల అవికూడా వాటి లుకలుకల్ని అదుపులోపెట్టుకోగలవేమో ఆలోచించాలి మీరు. Given enough time, they too could show perhaps the same level of liberality. కులాల నేపధ్యంగా నేటికీ కొనసాగుతున్న అవాంఛిత, అమానవీయ హింసాత్మక కాండలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ఆలోచించండి. ఇంకాకొన్ని సంఘటనలు వర్తమానపు ఖాతాలోనే ఉన్నట్లులేదూ! ఆసంఘటనలకు కారణాలు మతం కాదంటారా?

 30. మతం హింసని ప్రోత్సహించినా, ప్రోత్సహించకపోయినా అది కేవలం ఒక అంధ విశ్వాసమే. తెల్లవారకముందే పళ్ళు తోముకోకుండా బెడ్ కాఫీ తాగేవాడు కూడా నమాజ్ చేసే ముందు కాళ్ళూ, చేతులూ శుభ్రంగానే కడుక్కుంటాడు. మతం మనిషికి భక్తి విషయంలో అయితే శ్రద్ధని నేర్పిస్తుంది కానీ వ్యక్తిగత విషయాలలో శ్రద్ధని నేర్పిస్తుందని చెప్పలేము.

 31. విశేషజ్ఞ గారు,
  హిందుమతంలో సంస్కరణొధ్యమాలు చాలానే వచ్చాయి. ఆ సంస్కరణ ఉధ్యమాలు మౌలిక సమస్యల విషయాల్లో పెద్దగా మార్పు తీసుకొచ్చినట్లు లేవు. సంస్కరణ వాదులు కూడా హిందు వ్యతిరేక ముధ్ర వేపించు కున్నవారే!
  బ్రిటిషు వాల్లు మన దేశానికి రాక పోయి ఉన్నట్లైతే ఇక్కడ లౌకీక వాదం కూడా వేళ్లూనుకొని ఉండి ఉండదు.

  ఈ దేశంలో వేల్లుకొని పోయిన హిందుమతం ఎవరికి కొత్తగా నేర్పించవలసిన అవసరం లేదు. పుట్టిన ప్రతి మనిషి కి హిందు మతాన్ని వేరుగా భొదించాల్సిన పనిలేదు. ఆ మనిషి ఎదిగే క్రమంలో అతనికి తెలిసినా తెలియక పోయిన ఆ విధంగా తాత్వీకరించబడి ఉంటారు. సంస్కృతీకరించబడి ఉంటారు.మతాంతీకిరించబడీ ఉంటారు. అది జీవన విదానంగా రూపుదిద్దుకొని ఉంటుంది – అతని / ఆమె సబ్‌ కాన్షియస్‌ మైండ్‌ లో . దానికి క్రైస్తవులు కూడా అతీతం కాదు. దానికి లేకపోతె కుల వ్యవస్త ఇంత పెద్దాగ వేళ్లూనుకొని ఉండి ఉండదు.

  కానీ, దానికి అతీతంగా, లౌకింగా ఆదునికంగా మీ( మన) బోటి వాళ్లు మాట్లాడు తున్నారంటే బయటి నుండి ఒక ప్రత్యేక చైతన్యం సంతరించుకోవడం వల్లే.పరిస్తితులు కొంత దోహదం చేస్తున్నాయి.
  ఏమైనా ప్రజాస్వామ్యరీకరించ బడని ఏ మతమూ, ఏవ్యవస్థ శాస్వతీకరించ బడదు.

 32. ఇక్కడ చర్చ ప్రధానగా మతాల గురించి జరుగుతున్నాది కనుక దానికి సంబంధించిన వివరాలు రాయటం జరిగింది. చర్చ మతం నుంచి కులం వైపుకు వెళుతున్నాది, మరెప్పుడైనా చర్చించుదాం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s