రాష్ట్ర విభజన: గతితర్క వివరణ –కార్టూన్


Uncut cake

రాహుల్ గాంధీకి ప్రధాని పదవిని పళ్లెంలో పెట్టి అప్పగించడానికే సోనియా గాంధీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు తలపెట్టిందని కానీ సీమాంధ్ర ఉద్యమం వలన అది ఆమెకు కష్టంగా మారిందని ఈ కార్టూన్ సూచిస్తోంది. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత టి.ఆర్.ఎస్ తో పొత్తు లేదా విలీనం ద్వారా తెలంగాణలో, వైకాపాతో పొత్తు లేదా విలీనం లేదా ఎన్నికల అనంతర కూటమి ద్వారా సీమాంధ్రలోనూ మెజారిటీ లోక్ సభ స్ధానాలను గెలుచుకోవచ్చని, తద్వారా రాహుల్ గాంధీ ని ప్రధానిగా చెయ్యడానికి తగిన సీట్లు చేజిక్కించుకోవచ్చని సోనియా/కాంగ్రెస్ పధక రచన చేసినట్లు ఈ కార్టూన్ పరోక్షంగా చెబుతోంది.

తెలంగాణ ఏర్పాటుకు సి.డబ్ల్యూ.సి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటిస్తూనే దిగ్విజయ్ సింగ్ టి.ఆర్.ఎస్ తో పొత్తు/విలీనం గురించి మాట్లాడడంతో సీమాంధ్ర ప్రజలకు కూడా చాలా తేలికగానే ఈ భావనకు వచ్చారు.

అలాగే అప్పటిదాకా ‘క్విడ్-ప్రో-కో’ జరిగిందని చెప్పిన కంపెనీల్లో అందుకు సాక్ష్యాలు దొరకలేదని చెప్పడం ద్వారా జగన్ బెయిలుకు సి.బి.ఐ సహకరించడం, బెయిల్ పై బైటికి వచ్చినప్పటి నుండి జగన్, కాంగ్రెస్/సోనియా ను పల్లెత్తు మాట అనకుండా టి.డి.పి/చంద్రబాబు లను టార్గెట్ చెయ్యడం, బెయిల్ వచ్చిన మరునాడే వై.ఎస్.విజయ సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పినట్లు ఆరోపణలు వచ్చినా వాటిని ఎవరూ ఖండించకపోవడం… వీటన్నిటితో సీమాంధ్రలో కూడా రాజకీయ లబ్దికి కాంగ్రెస్ వ్యూహం పన్నిందని జనం భావించడానికి ఆస్కారం ఏర్పడింది.

ఇది అవాస్తవం అని చెప్పడానికి కారణాలు ఏమీ లేవు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు రీత్యా తెలంగాణ ఏర్పాటుకి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ కేవలం రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ నిర్ణయం తీసుకుందంటే మాత్రం అది సత్యదూరం అవుతుంది. ఎందుకంటే కేవలం రాజకీయ లక్ష్యాలతోనే రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటే అవి జనంలోకి వెళ్లవు. ఆ నిర్ణయాలు జనం లోకి వెళ్లడానికి తగిన పరిస్ధితులు జనంలో ఉండి తీరాలి.

గతి తార్కిక భౌతికవాద తత్వ శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. “ఒక నిర్దిష్టం అంశంలోని మార్పులకు దానియొక్క అంతర్గత అంశాలే ప్రధాన చోదక శక్తులుగా ఉంటాయి. బాహ్య అంశాలు కేవలం ఉత్ప్రేరకంగా మాత్రమే పని చేస్తాయి” అని.

ఉదాహరణకు కోడి గుడ్డును పొదిగితేనే పిల్ల వస్తుంది తప్ప రాయిని పొదిగితే పిల్ల రాదు. అనగా గుడ్డులోని పిండం, దానికి కావలసిన ఆహార పోషకాలు, గాలి గది… ఇవన్నీ గుడ్డులోని అంగర్గత అంశాలు. కోడి దానిని పొదిగినపుడు తన శరీరం నుండి నిర్దిష్టం మొత్తంలో వేడిని గుడ్డుకు అందిస్తుంది. అవసరం అయినప్పుడల్లా గుడ్డును తన ముక్కుతో కిందికి మీదికీ తిప్పుతూ గుడ్డుకు అన్నివైపులా వేడి అందేలా తగిన జాగ్రత్త తీసుకుంటుంది. ఆ విధంగా 21 రోజుల పాటు చేశాక పిల్ల బైటికి వస్తుంది. కోడి అందించే వేడి గుడ్డు పిల్లగా మారడానికి అవసరమైన బాహ్య శక్తి. అనగా ఉత్ప్రేరకం.  కోడి ఇదే పని ఒక రాయికి చేస్తే పిల్ల రాదు. ఎందుకంటే రాయిలో గుడ్డులో ఉండే అంతర్గత అంశాలు ఏమీ లేవు కాబట్టి.

మరో ఉదాహరణ అలారం గడియారం. పాత అలారం గడియారంలో కీ ఇచ్చి వదిలితే కావలసిన సమయానికి గంట మోగుతుంది. కీ ఇవ్వడం ద్వారా మనం మన శరీర శక్తిని గడియారంలో యాంత్రిక శక్తిగా భద్రపరుస్తాము. మనం పెట్టిన సమయానికి ఆ యాంత్రిక శక్తి ఒక్కసారిగా బైటపడి ధ్వని శక్తిగా మారుతుంది. అదే మనం ఒక రాయిని తెచ్చి ఓ రంధ్రం చేసి ఎంత కీ ఇచ్చినా అది అలారం గడియారం లాగా పని చేయదు. ఎందుకంటే గడియారంలో ఉండే అంతర్గత యంత్ర నిర్మాణం గడియారంలో లేదు కనుక.

దీనినే తెలంగాణకు అనువర్తించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ అవసరం ఏర్పడింది నిజమే. కానీ ఆ అవసరం తెలంగాణలోని అంతర్గత పరిస్ధితులు ఉండబట్టే తీరుతోంది తప్ప కేవలం దాని రాజకీయ అవసరం వల్లనే తెలంగాణలో అంతర్గత పరిస్ధితులు ఉత్పన్నం కాలేదు. అనగా తెలంగాణ ప్రజల్లో ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, ఆరు దశాబ్దాలుగా అక్కడి ప్రజల నీటి, ఉద్యోగ అవసరాలపై సాగిన వివక్ష, నిర్లక్ష్యాలు, వారి యాస, సంస్కృతుల పట్ల వివిధ మాధ్యమాల్లో వెలిబుచ్చిన చిన్న చూపు ఇవన్నీ తెలంగాణలో అంతర్గత పరిస్ధితులు. ఈ పరిస్ధితులు లేకుండా సోనియా గానీ, కాంగ్రెస్ గానీ ప్రత్యేక రాష్ట్ర నిర్ణయం తీసుకున్నా దానివల్ల ఫలితం ఉండదు. ఈ రోజు సోనియా గాంధీని దేవత లాగా అనేకమంది తెలంగాణ ప్రజలు ఆరాధిస్తున్నారంటే అది కేవలం కాంగ్రెస్ రాజకీయ నిర్ణయం వల్లనే సాధ్యపడుతుందా?

ఉదాహరణకి తమిళనాడులో కాంగ్రెస్ కి దశాబ్దాలుగా బలం లేదు. ఆ రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ ‘రాజకీయ నిర్ణయం’ తీసుకుంటే దాని బలం పెరుగుతుందా? ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా చేయాలని మాయావతి ప్రతిపాదించింది. ఆ డిమాండ్ ని అమలు చేస్తే కాంగ్రెస్ బలం పెరుగుతుందా? పశ్చిమ బెంగాల్ ని విభజిస్తే వస్తుందా?

కాబట్టి కాంగ్రెస్ తీసుకున్న రాజకీయ నిర్ణయం కేవలం బాహ్య అంశం మాత్రమే. తెలంగాణ రాష్ట్ర అవతరణలో ఆ నిర్ణయం ఒక పాత్ర పోషించిందే తప్ప అదే మొత్తం పాత్ర కాదు. సీమాంధ్ర ప్రజలు, నాయకులు విభజన నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్, సోనియాలను దుమ్మెత్తి పోస్తున్నారు తప్ప ఆ నిర్ణయానికి తెలంగాణ ప్రజల్లో పూర్తి మద్దతు ఉన్న అంశాన్ని తేలికగా విస్మరిస్తున్నారు. నిజానికి ఇక్కడ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష పట్ల తమ వివక్షను సీమాంధ్రులు ప్రదర్శిస్తున్నారంటే తప్పు కాబోదు. దాదాపు నాలుగేళ్లుగా ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాన్ని తేలికగా తీసేస్తూ కేవలం ఒక వైపు ప్రజల సమైక్య కోరికని మొత్తం రాష్ట్ర ప్రజల సమైక్య కోరికగా చెప్పడం ఎలా సంభవం? సహజ పరిశీలనా దృక్పధానికి కూడా ఇది విరుద్ధం కాదా?

మరి సీమాంధ్ర ప్రజలు కూడా ఉవ్వెత్తున ఉద్యామిస్తున్నారు కదా? అన్న ప్రశ్న వేయవచ్చు. అదే చెబుతోంది. ఎవరితోనైతే కలిసి ఉండలేము అని తెలంగాణ ప్రజలు చెబుతున్నారో వారు మాత్రమే సమైక్యం అంటే సరిపోతుందా? సీమాంధ్ర నుండి వలస వెళ్ళి తెలంగాణలో స్ధిరపడిన వారు కూడా సమైక్యాంధ్ర అంటే సరిపోతుందా? సమైక్యాంధ్ర, తెలంగాణ డిమాండ్లతో ఇరు ప్రాంతాలు ఇప్పటికే విడిపోయి ఉన్నారు. ఇక మిగిలింది సీమాంధ్ర ప్రజల భయాందోళనలను తగిన రీతిలో ఆచరణాత్మక చర్యలతో చల్లార్చడం మాత్రమే.

కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో అత్యంత ఘోరమైన మోసపూరిత పాత్ర పోషిస్తోంది. తమ పార్టీలోనే అనేక ముఠాలను, గ్రూపులను ప్రోత్సహిస్తూ ప్రజలను పూర్తిగా అయోమయంలో పడేస్తోంది. ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి ఉద్యమంలోకి దింపే ముఖ్యమంత్రిని ఒకవైపు వెనకేసుకోస్తూ, మరోవైపు సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి సమాధానమూ ఇవ్వకుండా సమస్యను ఇంకా ఇంకా రేగిన పుండుని కేలికినట్లు కెలుకుతోంది. ఇది మోసం, దగా, వంచన. ప్రజల వాస్తవ సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కారం చూపకుండా ఎగవేయడానికి వేసిన ఎత్తుగడ. ప్రజల మధ్య తగువులు పెట్టి తమాషా చూసే శాడిస్టు దోపిడీ మెంటాలిటీ. ఇలాంటి పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిందే.

కానీ తోటి తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను తిరస్కరించడం, హేళన చేయడం, చిన్న చూపు చూడడం అప్రజాస్వామికం అవుతుంది. ప్రజలు కూడా రాజకీయ పార్టీల దుర్మార్గపు ఎత్తుగడల్లో కొట్టుకుపోవడమే అవుతుంది. ఇలా కొట్టుకుపోవడం ఏవైపు నుండి జరిగినా ఖండనార్హమే.

అందువలన ఈ కార్టూన్ లో వ్యక్తం అవుతున్న భావన పాక్షిక సత్యం మాత్రమే. ఇంకా చెప్పాలంటే వాస్తవాన్ని పక్కదారి పట్టించే భావన కూడా.

10 thoughts on “రాష్ట్ర విభజన: గతితర్క వివరణ –కార్టూన్

 1. sorry , I would like to come to the Starting point in this issue. Is it really not possible to solve telangana problems without division , without crating new big problems ? who neglected Telagana region ? Seemandhra People ? No. The same political parties whom Telangana region people elected ? why the Telangana people not demanded for developement in the last 60 years ? had they really asked/demanded for developement with their full efforts , they would have got what they wanted , in the long back. But waht happened actually, they were diverted towards the demand of new state . For the failure of Telanga region political party leaders , Seemandhra people are going to pay penalty. Telangana people are diverted in a wrong direction by thier politicains for their selfishness and employment. Every one has forgot one major thing in this issue that Andhra Pradesh is such a state , where Fair bifurcation is not possible . Either one region has to loose a lot. This point has been ignored by BJP also.Thay are simply saying that ” we have suceeded in 3 states without issues” .But ‘copy and paste’ technique will not work always. Small States will create new problems always.
  sorry , if I have hurted anyone, my only intention is State bifurcation is not the correct solution for regional development.

 2. State bifurcation is that easy? What about the development of hyderabad. Why no telangana leaders or people objected the development of hyderabad. Why didnt they questioned why all the investments r brought to hyderabad. Who is going answer for all these issues. In that case why everybody from ao called telangana jac is very particular of asking rights on hyderabad fully to telangana?

 3. Hi balaji,

  There is no need to be sorry. After all, it’s your opinion! But, let your opinion carry some credible thoughts of your own.

  So, you accept that there had been no development in Telangana for last 60 years, but it was only due to failure of people theere in demanding development!

  If you remember, it seems you don’t know or fail to apprise, there were wide spread agitations against lack of development activities viz. irigation projects, drinking water, employment etc. They were brutally crushed by ruling classes with police force. Hundreds of people perished. As a result of such agitations there were sops provided in the form of 610 GO, Mulki rules, Six point formula and so on. But such sops and agreements were simply forgotten from the very next day.

  Right before the formation of AP there was a gentleman aggrement. There was a forumula to share CM and Dyputy CM posts. All those are simply neglected from the very next day. Some of the Seemandhra leaders even mocked the gentlemen agreement saying Dy.CM post is nothing but a sixth fingure. Such was the worth given to agreements and sops promised to Telangana to satisfy the disgruntled Telangana politicians and people.

  As a united state, so called modern temples like Nagarjuna Sagar dam belong to AP. In practice, only Seemandhra regions benefitted while Telangana region left over with mere pride that Sagar dam was from their state. Now the CM says 10 lakh acres are irrigated in Mahaboobnagar dist from Sagar dam, of course, it was the actual targeted figure. In practice, hardly 3 to 4 lakh acres of Mahaboobnagar did get water from Sagar whereas Andhra region got irrigated upto 13 lakh acres. For outsiders Sagar dam was AP’s project. If Telangana was there there woule be a legal obligation to supply water to reach total targeted figure of 10 lakh acres.

  Some months back the govt said 35 out of 86 projects were allotted to Telangana under ‘JALAYAGNAM.’ Out of Rs. 67,802 cr Rs. 30,000 cr was allotted to Telangana it was said, which is worked out to be nearly 45 per cent.

  But the difference occurs when it comes to achievement of targets. For ex., under completed projects of JALAYAGNAM only 6.82 lakh acres target was fulfilled where it was 14.54 lakh acres in Seemandhra region (Seema – 4.84 + Andhra – 9.7) as per govt figures. Who knows how much of these figures are actually achieved (both regions)? We can see in the form of CBI cases where the majority of that money has gone!

  Repairs are undertaken every year for irigation projects. Even here also there has been negligence for Telangana projects where as Andhra projects receive prompt attention. It is because the major positions in the govt are occupied by Andhra people, whether it be politicians or beaurocracy or ministerial posts. When there are Telangana people they were tackled with proper methods (this should be the curse of Telangana). For example the hero of 1969 movement, Chenna Reddy. Everybody knows how he was tackled. The same goes among beaurocratic people. From the people’s perspective, that is how exploitative ruling classes and their govts work.

  There were many other irrigation projects in Telangana that were totally neglected for decades. Alamatti was originally designed during Nizam for parts of Karnataka (then part of Nizam rule) and Telangana. But after formation of AP, it was limited to Karnataka only. Telangana lost from it.

  Bhima irrigation scheme was totally neglected. Nobody even talks about it but for lip service. Jurala scheme was actually planned to store 17 tmcft of water. But after completion it could store only 5 tmcft in utter disregard to Bachawat award. There was an attempt to divert water from Rajolibanda Diversion Scheme to Tungabadhra, from there to KC canal due to which Mahaboobnagar ryots were affected.

  Everybody knows that one of the major water sources in Telangana has been tanks due to lack of irrigation projects. But in 53 years i.e during 1956-2009 Telangana lost 5 lakh acres of tank irrigation due to govt’s neglegance. Between 1956 to 2009 while the total state of AP lost 8.93 lakh acres of tank irrigation, Telangana’s share in that loss is 5 lakh acres. Such was the neglect towards Telangana.

  When AP was formed Telangana was less educated due to feudal past. So Andhra industrialists brought people from their area to work their employees. This disparity continued even after Telangana is educated. It is natural to become dissatisfied when one sees employement opportunities around them are filled with people from other regions. This disparity should be corrected if the govt is well minded. It didn’t happen even after violent outbursts.

  Hence the demand for separate Telangana.

 4. విశేఖర్ గారు..చాలా వివరణాత్మకంగా…ఉదాహరణ సహితంగా తెలియజేశారు. అశోక్ గారు చెప్పినట్లే మెయిన్ పోస్టు గా చేర్చండి.

  నిజమే. మీరు కార్టూన్ పై వ్యాఖ్యానించినట్లుగా….తెలంగాణ ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తేనే….ఇన్నాళ్లకు అదీ ఎన్నికల ముందు తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అంతే కానీ రాహుల్ ని ప్రధానిని చేయడం కోసమే తెలంగాణ ఏర్పడడం లేదన్న సంగతి కొందరు గ్రహించాలి. రాహుల్ ను ప్రధాని చేయడం కోసమే ఐతే సోనియాకు సీమాంధ్ర ఓట్లు కూడా ముఖ్యమే కదా. ఆ మాటకొస్తే తెలంగాణ కంటే సీమాంధ్రలోనే, ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి. మరి సీమాంధ్ర ప్రజల డిమాండ్ కు సోనియా అంగీకరిస్తే ఎక్కువ సీట్లు వస్తాయని (?) సోనియా భావించాలి కదా… తెలంగాణ కన్నా సీమాంధ్ర వైపే మొగ్గు చూపాలి కదా.
  కానీ సోనియా అలా చేయలేదు ఎందుకంటే ప్రజల్లో ఆ భావన ఉండాలి.

  ఈ విషయం కేసీఆర్ కు కూడా వరిస్తుంది. కొందరు కేసీఆర్ వల్లే తెలంగాణ డిమాండ్ వచ్చిందనుకుంటారు. కేసీఆర్ తెలంగాణ డిమాండ్ ఆధారంగా పార్టీ స్థాపించారు, అంతే కానీ కేసీఆర్ తోనే తెలంగాణ డిమాండ్ ప్రారంభం కాలేదు. అంతకు ముందు చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డి, నరేంద్ర….విజయశాంతి ఇలా చాలామంది తెలంగాణ కోసం పార్టీలు స్థాపించిన సంగతి మర్చిపోకూడదు. కేసీఆర్ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడల కారణంగా మిగతా వారికంటే ముందుకు పోయి ఉండవచ్చు అంతేకానీ కేసీఆర్ వల్లే తెలంగాణ డిమాండ్ వచ్చిందనుకోవడం అమాయకత్వమే కాదు అజ్ఞానం కూడా.

  ఇంకొందరు వైఎస్ బతికుంటే తెలంగాణ డిమాండే వచ్చేది కాదనుకుంటారు. అంతే కానీ ప్రత్యేక రాష్ట్రం భావన తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకుపోయిందన్న భావన మాత్రం గ్రహించరు.
  వైఎస్ అధికారంలోకి రావడానికి తెలంగాణ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నాడని….చంద్రబాబును ఓడించేందుకు తెలంగాణ నాయకులతో ఢిల్లీకి బృందాలు పంపిచాడన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. 2014 తర్వాత తెలంగాణ డిమాండ్ ను ఎవరూ ఆపలేరని వైఎస్ బతికుండగా తన సన్నిహితులతో అనేవారని చాలామంది రాజకీయ నాయకులు చెబుతున్నారు కదా. కనుక ఉద్యమాల్ని ఏ రాజకీయ నాయకుడు సృష్టించలేరు. ఉద్యమాలే నాయకుల్ని సృష్టించుకుంటాయి.
  అలా ప్రజల డిమాండ్ ను ఎవరో ఒక నాయకుడు ఉద్యమంగా మల్చుకుంటారు. ఇప్పుడు ఇటు తెలంగాణలోనూ, అటు సీమాంధ్రలోనూ కొత్త తరం నాయకులు రావడాన్ని మనం గమనించవచ్చు.

  కాబట్టి మీరన్నట్లు ఆ కార్టూన్ అర్థసత్యమే.

 5. చందుతులసి గారూ, మీరూ, అశోక్ గారు చెబుతొంది పైన నా ఆంగ్ల సమాధానం గురించా? పోస్ట్ గురించయితే అది మెయిన్ పోస్ట్ గానే ఉంది కదా?

  “ఉద్యమాల్ని ఏ రాజకీయ నాయకుడు సృష్టించలేరు. ఉద్యమాలే నాయకుల్ని సృష్టించుకుంటాయి.”

  వెల్ సెడ్!

 6. సీమాంధ్ర ప్రజల డిమాండ్ కు సోనియా అంగీకరిస్తే ఎక్కువ సీట్లు వస్తాయని (?)మిగతా విషయాలొదిలేస్తే…సీమాంధ్రులు పూర్తిగా జగనిజం…లో ఉన్నారు…విజయనగరం లాంటి చిన్న జిల్లాల్లో అయితే…చిన్న గ్రామం వెళ్ళినా…తమ ఇంటిని చూపిస్తూ…వైఎస్సే…కద బాబూ ఇది కట్టించాడు అంటారు…కాంగ్రెస్ ఇక్కడ పూర్తిగా ఎప్పుడో తుడుచుపెట్టుకు పోయింది…ఆ పరిస్థితులు కూడా..కాంగ్రెస్ ను తెలంగాణా ప్రజలనైనా ,తన వైపు నిలబెట్టుకోవాలన్న కోరికకు పురికొల్పిందంటారు…ఇక్కడి చిన్న నాయకులు…ఇక్కడ జరుగుతున్న.. వాటికి… విరుద్దమైన వార్తలు…వస్తున్నాయి…వివరించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ..అర్ధం చెసుకునె పరిస్థితి లేదు..ఖండించడం తప్ప…ఉదాహరణకు…బొత్స..ఇక్కడో ప్రకటనా…అధిష్టానం దగ్గర మరో మాటా మాట్లాడుతున్నారు అన్నది..ఇక్కడ విస్త్రుతం గా ప్రచారమయ్యి…(తెలంగాణా ఇచ్చినా రెండు మూడ్రోజుల్లో అల్లర్లు సర్దుకుంటాయని హామీ ఇచ్చాడు…లాంటివి…) విజయనగరం లో బొత్స వర్గం తో నానా యాతనా పడ్ద వాళ్ళు…ఒక్కుమ్మడిగా…ఆయన పై ఉన్న ఆగ్రహన్ని చూపించారు…బొత్స ఎంతటి అపఖ్యాతి మూట కట్టుకున్నాడో ఇప్పుడు ఆయనకు అర్ధమయ్యి…జిల్లా ప్రాజానీకంతో ఇకనయినా మంచిగా మసులు కుంటాడా?రాజకీయాల్లో ఉన్న వాళ్ళెవరూ వాత్సవాలను ఒప్పుకోరు…బొత్స కూడా తమ బాచ్ జిల్లా ప్రజల్ను ఇంతగా వేధించినట్తు ఒప్పుకోడానికి ఇష్టపడరు!!వాస్తవాలు ఇలా ఉంటే.. క దీనికి…సీఎం,లగడపాటి, హైద్రాబాద్ నుండి…రాళ్ళు పంపించారనట్టు హైద్రాబాద్ నాయకులు ప్రకటనలు గుప్పించారు!!:)ఇలా ఎన్నో విషయాలు…జరుగుతున్న వాటికీ…వాటిపై…వస్తున్న కధనాలకూ…సంబంధం లేకుండా…ఉండి…నోరుమూసుక్కూర్చోవడం…ఉత్తమమన్నట్టు అనిపిస్తున్నాయి…:)

  సీమాంధ్రలో కాంగ్రెస్ ఎప్పుడో ఫినిష్ అయిపోయింది…తెలంగాణా ప్రకటన రాక ముందే…సర్పంచులు గెలవచ్చేమో గానీ…ఎమ్మెల్యేలను.ఎంపీ లను.. కాంగ్రెస్ గెలిపించుకోవట…అసాధ్యం!!అప్పటికే!!

  ఈ విషయాలను అప్పట్లొనే…ఇక్కడి జనం ఎనలైజ్ చేసారు..

  http://kvsv.wordpress.com/2013/07/30/%E0%B0%9C%E0%B1%88-%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9C%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%95%E0%B1%8A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s