ఓ సమైక్య మిత్రుడి ఆక్రోశం!


Roti, kapada aur makan 2

ప్రొద్దుటూరి అప్పారావు గారి వ్యాఖ్య ఇది. ‘పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి’ అన్న టపా కింద రాశారు. ఆంగ్లంలో రాసిన వ్యాఖ్యను తెనుగీకరించి ప్రచురిస్తున్నాను.

మనం సమైక్యాంధ్ర కోసం పోరాడొచ్చు. కానీ మార్గం సరైనది కాదు.

రాజకీయ నాయకులు (ఎం.ఎల్.ఏలు, ఎం.పిలు) అందరూ తమ జీత భత్యాలను వినియోగించుకుంటున్నారు.

ఒక ఎం.పి గారు (ఉద్యమంలో) పాల్గొంటూనే తిరుమల ఛైర్మన్ గా పదవిని అనుభవిస్తున్నారు.

రాజకీయ నాయకుల వ్యాపారాలన్నీ ఆటంకం లేకుండా చక్కగా నడుస్తూనే ఉన్నాయి.

రాజకీయ నాయకులు, ఉద్యోగుల పిల్లల చదువులు ప్రైవేటు స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోతున్నాయి.

నిజంగా బాధితులు ఎవరు?

చిన్న చిన్న సంస్ధల్లో పని చేసే రోజు కూలీలే.

ప్రభుత్వ పాఠశాలల్లోనూ, హాస్టళ్లలోనూ చదువుకుంటున్న విద్యార్ధులే.

ఒకటి మాత్రం చాలా అతి…………..

తమ ఇంటిని చీకటిలో ఉంచడానికి ఎవరూ ఇష్టంగా లేరు.

ప్రభుత్వ ఆసుపత్రులు ఔట్ పేషెంట్ (ఓ.పి) విభాగాల్ని మూసేశాయి. పేదలు వైద్యం కోసం ఎక్కడికి వెళ్ళాలి?

విద్యుత్ కోత వలన రైతులు ఎంతగా నష్టపోతున్నారో మీకు తెలుసా?

అనేక గ్రామాల్లో తాగడానికి నీరు లేదు.

ఎంతమంది చిన్న వేతనదారులు సమ్మెలోకి వెళ్ళాలి?

విద్యుత్ సమ్మెను ప్రజలు అర్ధం చేసుకున్నారని, అర్ధం చేసుకుని సహకరిస్తున్నారని విద్యుత్ జె.ఏ.సి నాయకుడు సోమవారం ప్రకటించారు. అది వాస్తవం కాదని ప్రొద్దుటూరి పాపారావు గారి ఆక్రోశం వెల్లడిస్తోంది. ఈ ఆక్రోశంలో నేనూ భాగం పంచుకుంటున్నాను. ఎందుకంటే విద్యుత్ తోనే నా ఆరోగ్యం ముడిపడి ఉంది. నా ఆరోగ్యం చాలా బలహీనం. విద్యుత్ శక్తి ద్వారా అందుతున్న కొన్ని సౌకర్యాలు లేకపోతే నా ఆరోగ్యం రెండు మూడు రోజుల్లోనే కొండెక్కుతుంది. యాదృచ్ఛికంగా నేను ఉండే పట్నంలో విద్యుత్ ఉద్యోగులు కొద్దిగా దయతలిచి పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు.

కానీ విజయనగరం, విజయవాడ తదితర చోట్ల విద్యుత్ లేక జనం రాత్రి వీధుల్లోకి వస్తున్నారని ఛానెళ్లు చెబుతున్నాయి. విజయనగరంలో మరీ ఘోరం. విద్యుత్ లేక వీధుల్లోకి వస్తుంటే కర్ఫ్యూ ఉంది కాబట్టి బైటికి రావద్దని పోలీసు బలగాలు హెచ్చరిస్తున్నాయి. జనాన్ని ఇళ్ళల్లోకి తోయడానికి బాష్పవాయు గోళాలు కూడా ప్రయోగించారని ఈ టి.వి-2 తెలిపింది. తమ సమ్మెను జనం అర్ధం చేసుకుని మద్దతు ఇస్తున్నారని విద్యుత్ జె.ఏ.సి నాయకులు ఏ ఆధారంతో చెప్పారో అర్ధం కాలేదు.

తెలంగాణ ఎన్.జి.ఓ ల నాయకుడు ఒకాయన సీమాంధ్ర విద్యుత్ సమ్మెను ఉన్మాదంగా అభివర్ణించారు. ఉన్మాదం కాకపోవచ్చు గానీ పాపారావు గారు చెప్పినట్లు ‘చాలా అతి’ అని మాత్రం చెప్పక తప్పదు. పాపారావు గానే చెప్పినట్లు ఈ సమ్మె వలన పేదలే ప్రధానంగా నష్టపోతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడం వలన పేదలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దు చేసేశారు. ఎక్స్ ప్రెస్ రైళ్లను మాత్రం డీజెల్ ఇంజన్లు పెట్టి మరీ నడిపిస్తున్నామని రైల్వే అధికారులు ప్రకటిస్తున్నారు.

ఇక రెండు నెలలుగా ఎర్ర బస్సులు ఎలాగూ తిరగడం లేదు. ధనికుల ప్రయాణాలు ఎక్కడా ఆగలేదు. ఆర్.టి.సి బస్సులు తిప్పకుండా ఆపేసి ప్రైవేటు బస్సులు మాత్రం తిప్పనిస్తున్నారు. అంటే ప్రైవేటు ధనికులు సమ్మెనుండి ఎంత లాభం పొందాలో అంతా పొందుతున్నారు.  పేదలు, రోజు కూలీలు, చిన్న చిన్న కూరగాయలు తదితర వ్యాపారులు ప్రభుత్వ ప్రయాణ సౌకర్యాలు లేక ఆటోలకు, వేన్లకు డబ్బు తగలేయాల్సి వస్తోంది. ఫలితంగా వారి రోజువారి మిగులు హరించుకుపోతోంది.

మొన్న ఒక పెద్దాయన ఒక ఎ.టి.ఎంలో తారసపడ్డారు. ఆ రోజు సమైక్యాంధ్ర బంద్. ఆ ముందు రోజూ రాత్రే కేబినెట్ సమావేశమై తెలంగాణ నోట్ ఆమోదించినట్లు ప్రకటించింది. దాంతో ఉద్యమకారులు ఆవేశంలో ఉన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ కి వాళ్ళ ఊరు 20 కి.మీ ఉంటుంది. ఆయనకు అవసరమైన మందులు అయిపోయాయట. చేతిలో డబ్బు లేదట. బస్సులో వద్దామని బయలుదేరితే అవి లేవు. పోనీ ఆటోలో వద్దామంటే సమైక్యాంధ్ర ఉద్యమకారులు పట్టుబట్టి ఒక్క ప్రైవేటు వాహనాన్నీ అనుమతించలేదట. దానితో ఆయన ఆ 20 కి.మీ నడిచి వచ్చారట.

తీరా పట్నానికి వస్తే ఎ.టి.ఎం లు అన్నీ మూసేసి ఉన్నాయట. కాళ్ళీడ్చుకుంటూ రోడ్లన్నీ తిరిగి తిరిగి నేను వెళ్ళిన ఎ.టి.ఎం కి వచ్చారు. అది తెరిచి ఉండడం, అందులోంచి డబ్బులు కూడా వస్తుండడంతో పరమానందభరితుడయ్యాడు. ఆ ఆనందాన్ని దాచుకోలేక అక్కడ ఉన్న నాకు తాను పడిన కష్టం గురించి బడ బడా చెప్పుకున్నారు. ఆయన్ని మధ్యలో ఆపి ఎ.టి.ఎంలో డబ్బులు తీసుకోమని చెప్పి ఆ తర్వాత దూరంలో ఉన్న మందుల షాపుకి తీసుకెళ్లి దించాను. ఆ మాత్రానికే ఆయన చాలా సంతోషపడ్డారు. ఆయన తిరిగి తమ ఊరికి ఎలా వెళ్లారో తెలియదు గానీ బాగా గుర్తుండిపోయారు.

గుర్తిస్తే ఇలాంటి ఉదాహరణలు చాలా దొరుకుతాయి. సమ్మెలను, ఆందోళనలను తప్పు పట్టలేము. ఎందుకంటే తోలు మందం ప్రభుత్వాలకు, పాలకులకు పరిస్ధితి తీవ్రత తెలియజెప్పాలంటే జనానికి మరో మార్గాన్ని వారు మిగల్చలేదు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం ఒక విచిత్రమైన ఉద్యమం. తెలంగాణ ప్రజలు అనేక యేళ్ళ తరబడి పోరాడి, అనేకమంది త్యాగాలతో సాధించుకున్న డిమాండ్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఉద్యమం ఇది. విభజన ఫలితంగా వచ్చే కష్ట నష్టాలకు పరిష్కారాలు కోరడం మాని మూర్ఖంగా ‘సమైక్యాంధ్ర కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించబోమని’ ప్రకటించడం బొత్తిగా సమర్ధించలేనిది.

విభజన వల్ల వచ్చే కష్టాల కంటే సమ్మె వల్ల వచ్చే కష్టాలు భరించదగినవే అని ప్రజల తరపున నాయకులే సమాధానం ఇచ్చుకోవడం ఎలా సమర్ధనీయం. ఆ విషయానికే వస్తే ఆరు దశాబ్దాల పాటు తమ భూభాగం నుండే ప్రవహిస్తున్న రెండు ప్రధాన నదుల నుండి తగిన వాటా దక్కక, తమ చుట్టూ వెలిసిన కంపెనీల్లోని ఉద్యోగాలలో తగిన భాగం దక్కక వివక్ష, నిర్లక్ష్యాలకు గురై అనేక అవకాశాలు, అభివృద్ధి, జీవన పరిస్ధితుల మెరుగుదల కోల్పోయిన తెలంగాణ ప్రజలు ఇంకెంత ఉద్వేగం పొందాలి? ఈ విషయంపై సావధానంగా, నిస్పాక్షికంగా ఆలోచిస్తున్నవారు ఒక్కరూ కనపడడం లేదు.

నాకు తారసపడిన అనేకమంది సీమాంధ్ర ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు వినిపిస్తున్న వాదనల్లో ఏ కోశానా నిజాయితీ, స్వార్ధ రాహిత్యం కనపడకపోవడం ఒకింత ఆందోళన కలిగిస్తున్న విషయం. సాటి ప్రజల డిమాండ్లలోని తప్పొప్పులను విచక్షణతో పరిశీలించి సమర్ధనీయం అయితే సమర్ధించడం, వ్యతిరేకించాల్సినవాటిని వ్యతిరేకించడం అనే విమర్శనాత్మక దృష్టి కొరవడింది.

ఉదాహరణకి ‘ఇన్నాళ్లూ హైదారాబాద్ చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతం అయింది. అది ఒక పెద్ద తప్పు. కొత్త రాజధాని వలన ఆ తప్పు కొద్ది మేరకయినా సరిదిద్దబడుతుంది. కొత్త రాజధాని అభివృద్ధి అయితే ఆ మేరకు ప్రజలు లాభపడతారు’ అని చెబితే మిత్రులు చెప్పే సమాధానం ‘కొత్త రాజధాని అభివృద్ధి అయ్యేసరికి ఎన్నాళ్లు పట్టాలి? అన్నాళ్లూ హైదారాబాద్ వదులుకోవాలా?’ అని ప్రశ్నిస్తున్నారు.

కొత్త రాజధాని అభివృద్ధికి చాన్నాళ్ళు పడుతుంది కాబట్టి హైదరబాద్ కావాలనుకోవడం ఏమిటసలు? హైదారాబాద్ ఎక్కడికి పోతుందని? పరాయి రాష్ట్రంలో ఉన్న బెంగుళూరు, మద్రాసులకే అనేకమంది తెలుగువాళ్లు వెళ్ళగా లేనిది, చివరికి లండన్, న్యూయార్క్ లాంటి నగరాలకు కూడా వెళ్ళగా లేనిది హైదరబాద్ ఎందుకు వెళ్లలేరు? బొత్తిగా ఆలోచన లేకుండా వాదన చేయడమే తప్ప సావధానంగా ఆలోచించేవారే లేరు.

తెలంగాణ ఉద్యమం సందర్భంగా ‘ఆంధ్రోల్లు దోపిడిదారులు, అది లాక్కున్నారు, ఇది దోచుకున్నారు’ అంటూ అర్ధం పర్ధం లేకుండా కొంతమంది వాదించినట్లే ఇక్కడా వాదిస్తున్నారు, అపోహ పడుతున్నారు. ఈ విధంగా ప్రజలను అడ్డదిడ్డంగా చార్జి చేయడానికి ప్రధాన కారకులు స్వార్ధ రాజకీయ నాయకులు, స్వార్ధ ఉద్యోగ సంఘాల నాయకులే. వీరికి ‘మెరుగైన సమాజం కోసం’ అని చెప్పుకునే టి.వి చానెళ్లు తోడు కావడం అగ్నికి ఆజ్యం పోసినట్లు తయారయింది.

లేదంటే విజయవాడ ఎన్.టి.పి.సి ని బంద్ చేయించినవారు ప్రైవేటు సంస్ధలను ఎందుకు బంద్ చేయించరు? వందల కోట్లు నష్టాల్లో ఉన్న ఆర్.టి.సి ని పస్తులు పెట్టి ప్రైవేటు ట్రావెల్స్ ని మేపడం ఎలా సమర్ధనీయం? ఎ.బి.ఎన్ చానెల్ వాళ్ళు సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చినప్పటికీ కేబినెట్ నిర్ణయం అయ్యాక ‘ఇక సమైక్యాంధ్ర డిమాండ్ వదిలి ప్రజలను మభ్యపెట్టకుండా ఆచరణ సాధ్యమైన డిమాండ్ చేయాలి’ అని సలహా ఇస్తున్నారు. ఇది చాలా అభినందనీయం. మారిన పరిస్ధితులకు తగినట్లుగా ప్రజలకు, సంఘాలకు ఒక మార్గదర్శకత్వం వహించే మీడియా వైఖరి అంటే ఇలానే ఉండాలి.

సమైక్యాంధ్ర ఉద్యమం నేలవిడిచి సాము చేయడం మాని ఆచరణ సాధ్యమైన డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచాలి. సమ్మెకు దిగినవారు మొదట తమ డిమాండ్ లోనే న్యాయబద్ధత ఉండేలా చూస్తారు. లేకపోతే సమ్మె విఫలం అవక తప్పదని వారి ఎరుకలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ తెలంగాణ తీర్మానం ఆమోదించాక కూడా ‘సమైక్యాంధ్ర’ డిమాండ్ విడవకపోవడం బట్టి ఉద్యమ నాయకత్వాన్ని అనుమానించాల్సి వస్తోంది. ఆచరణ సాధ్యం కానీ డిమాండ్ చేయడం ద్వారా అటు ప్రజలను, ఇటు తమ సంస్ధ సభ్యులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది అంతిమంగా కొద్ది మంది రాజకీయ నాయకులకే లబ్ది చేకూర్చడానికే అన్న అనుమానాలు కలిగితే ఆ తప్పు అనుమానించేవారిది ఎంత మాత్రం కాబోదు.

31 thoughts on “ఓ సమైక్య మిత్రుడి ఆక్రోశం!

 1. ikkada chala vishayala tho ni ekiavisthune ….. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ‘ఆంధ్రోల్లు దోపిడిదారులు, అది లాక్కున్నారు, ఇది దోచుకున్నారు’ అంటూ అర్ధం పర్ధం లేకుండా కొంతమంది avi katinmainaa padalu kavachu kani …… telangana vanarulanu andhra use chesukovaledaa ?

 2. తెలంగాణలో ఇలాగే రాజకీయ పార్టీలు చేసిన సమ్మెలు ధర్నాలు జనాన్ని ఇబ్బంది పెట్టాయి. అప్పుడు మీ గొంతుక మూగబోయిందేమిటి మిత్రమా ? ప్రజల పక్షాన మాట్లాడే మనిషిగా ఓ చించేసుకుంటున్నారు కానీ మీ వాదన అంతా తెలంగాణకు అనుకూలంగా ఉంది తప్ప ప్రజల కన్నీళ్ల గురించే ఆలోచించేలా లేదు. రాజకీయ నాయకులకు విశేఖర్ గారికి అసలు తేడాయే కనిపించట్లేదు. తన బ్లాగు బాగు కోసం పిచ్చిరాతలు రోతలు ప్రదర్శిస్తున్నారు.
  నేను సామాన్యులకు ఇబ్బందిపెట్టమని కోరట్లేదు. స్వార్థపూరిత రాజకీయ నాయకులను వెనకేసుకురావట్లేదు. మీ వాదనలో నిజాయితీ పరమ చెత్తగా ఉంది. మీరు ఇదే మాట తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అని ఉంటే మీ సంస్కారానికి జోహార్లు చెప్పేవాడిని. కానీ మీకు తెలంగాణ ఏర్పాటవ్వాలన్న ఆకాంక్షకు అనుకూలంగా వాదనలు,అభిప్రాయాలు నిర్మించుకుంటున్నారే తప్ప వాస్తవికంగా నిజాయితీగా వ్యవహరించట్లేదు.

 3. సత్యము వచించితిరి.

  ప్రైవేటు సంస్థలకు ఎంతమాత్రమూ నష్టం కలక్కుండా తగుజాగ్రత్తలతో నడుస్తున్న ఉద్యమమిది. తెలంగాణా ఉద్యమంలో తొంగిచూసిన ఉన్మాదఛాయలన్నీ ఇందులోనూ ఉన్నాయి అవే తరహా సమర్ధింపులతో సహా.

  ఇరివురి అంగీకారంతోనే కలసి ఉండటం సాధ్యమౌతుంది. ఇద్దరిలో ఎవరు వద్దనుకున్నా విడిపోవడమే గతి. తరువాత మిగిలింది ఆస్తుల పంపకమ్మాత్రమే. మానవసంబంధాలక్కూడా వర్తించే ఇంత మౌలికమైన విషయాన్ని ఎలా విస్మరిస్తున్నారో అర్ధంకావడంలేదు. కలసి ఉండాలనేవారంతా సాంప్రదాయాలూ, సామెతలూ వల్లెవేస్తున్నారేగానీ విషయాన్ని ప్రాక్టికల్గా చూడటంలేదని నా అభిప్రాయం. వీళ్ళుచెప్పేవన్నీ వీళ్ళు నిజజీవితంలోకూడా ఆచరిస్తున్నట్లైతే కోస్తాంధ్రలో ఉమ్మడికుటుంబాలు విలసిల్లుతుండాలి. వీళ్ళలో ఎంతమంది తమతమ వ్యాపారాల్లో తమ భాగస్వామి మోసంచేస్తున్నారన్న అనుమానం ఒకసారి వచ్చాకకూడా అదే భాగస్వామితో కలిసి వ్యాపారంలోకొనసాగాలని కోరుకుంటారు? వీళ్ళు ఆవ్యాపారంలోంచి వైదొలగాలని నిర్ణయించుకొన్నప్పుడు, వారి భాగస్వామి ఎన్నాళ్ళుగానో కలిసి వ్యాపారంచేస్తున్నామన్న ఒక్కకారణంతో వారి నిర్ణయాన్ని గౌరవించడానికి ఒప్పుకోనప్పుడు వీరి స్పందన ఎలాఉంటుంది? తెలంగాణా ఉద్యమం నాకు తెలీదుకానీ, ప్రత్యామ్నాయాలను ఆలోచించడానిక్కూడా ఇష్టపడని సమైక్య ఉద్యమమ్మాత్రం purest of the purest sentiment and has reached it’s heights of ridiculousness.

  సరే! ఇప్పుడు ప్రభుత్వం దిగివచ్చిందనే అనుకుందాం. అప్పుడు ఇదే కల్లోలం కేవలం గీతదాటి తెలంగాణాకు వెళుతుంది. The govt. would be faced to deal with the same situation but from the different side of the line. Looks like both the places are doomed to reversal of development or that which has remained.

 4. @ అవసరా మీకు

  నీలాంటి తిక్క సన్నాసులకు తగిన సమాధానం ఇచ్చి చాలా రోజులవుతోంది. అందుకే పనికిమాలిన పైత్యాన్నంతా ఈ మధ్య తెగ విరజిమ్ముతున్నారు.

  అవునొరేయ్ నీకు కళ్ళేమన్నా నెత్తికెక్కాయా? నా బ్లాగంతా వడ పట్టేసినట్లు ఆ ఫోజులేంట్రా చచ్చు సన్నాసీ. పేరు చెప్పుకునే ధైర్యం కూడా లేని చచ్చుసన్నాసి గాడివి. తిక్కరాతలెందుకురా బడుద్ధాయ్. నీకు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా నా బ్లాగ్ వెతుకు. తెలంగాణ ఉద్యమ నాయకుల అసత్య ఆరోపణల్ని, ఉద్యమకారుల అపోహల్ని విమర్శిస్తూ కూడా టపాలు రాసాన్నేను. పేరు చెప్పుకునే మర్యాద ఉండదు, అవతలి వ్యక్తికి కనీసం మర్యాద ఇవ్వాలన్న సంస్కారం ఉండదు. కాని నా సంస్కారం గురించి ఒకటే ఆపసోపాలు!

  నీలాంటి పిరికి వెధవాయిలు నాకెప్పుడూ మిత్రమాలు కాదు. ఆ పదాల్నెందుకు అవమానిస్తావు. రాతల్లో విషం కక్కుతూ మిత్రమా అనడానికి వేళ్లెలా వచ్చాయ్ రా వెర్రి పీనుగా?

  ప్రజల కన్నీళ్ల గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే తెలంగాణకు మద్దతు ఇచ్చాన్రా బడుద్ధాయ్. అది నీలాంటి సన్నాసులకు ఎంత చెప్పినా అర్ధం అయ్యే సంగతి కాదు. కాబట్టి దాన్ని వదిలేయ్. పిరికి సన్నాసులకి పిచ్చి రాతలు కూడా తెలుస్తయా? తెలిస్తే ఈ రకంగా విషపు రాతలు రాస్తార్రా హృదయం లేని విషప్పీనుగా?

  చెత్తరాతలు రాస్తూ నిజాయితీ, ప్రజల ఇబ్బంది అంటూ కోతలా మళ్లీ? దరిద్రపు వెధవా! అసలు ప్రజలు ఇబ్బంది అంటే ఎమిటో నీకెప్పుడన్నా తెలిసిందట్రా? నీ అసలు రూపం చూపెట్టు జనం ఇబ్బంది ఏంటో వివరించి చెబుతా.

  నీ జోహార్లు నీలాంటి దద్దమ్మలకి అట్టే పెట్టుకో. ఇలా ఎక్కడంటే అక్కడ వదిలితే ఆ గబ్బును భరించలేం.

  తెలంగాణ ఏర్పాటు కావాలన్నదే నా కోరికరా పీనుగా. దానికోసం చక్కగా, ధైర్యంగా రాశాను. నీలాగా భయపడి దాక్కోలేదు. మళ్లీ ఇక్కడ చెయ్యి పెట్టావంటే……! జాగ్రత్త.

  ———————————————————————————————————————–

  మిత్రులకు, తిక్క తిక్కగా, అవమానించే రాతలు రాస్తే తగిన సమాధానం ఇవ్వడం నా విధానం. గత మూడు నాలుగు వారాలుగా ఇలాంటి సన్నాసులు పరమ చెత్త రాతలు రాస్తున్నారు. ఇంకా తెలంగాణకు మద్దతు ఇచ్చే ఇతర బ్లాగర్లను, వ్యాఖ్యాతలను కూడా తిడుతూ వ్యాఖ్యలు రాస్తున్నారు. అందుకే ఓపిక నశించి ఇలా బదులిచ్చాను. తప్పలేదు మరి!

 5. మీరు చేసిన పని నూటికి నూరుపాళ్లు సమర్థనీయం విశేఖర్ గారు.
  పేరు చెప్పుకొనే ధైర్యం లేని వాళ్లు….అవాకులు చెవాకులు రాయడమేమిటి….?
  వాళ్లు చెప్పేది…వాదించేది నిజమే ఐతే చర్చ పెట్టాలి. సందేహాలు అడగాలి. వివరించాలి. అంతేకానీ అడ్డమైన రాతలు రాస్తే ఎవరైనా ఊరుకుంటారా…?
  అదీ కాక బ్లాగులో ఏముందో , పోస్టులో ఏముందో చదవకుండానే వ్యాఖ్యలు రాసే ప్రబుద్దులు, అడ్డ గాడిదలు కూడా ఉన్నారు.
  అందుకే…..ఇటు వారైనా…అటు వారైనా ఎవరైనా మిత్రులారా…..మీ వాదనను చర్చల రూపంలో పెట్టండి. అనుమానముంటే ప్రశ్న జవాబు విభాగం కింద అడగండి.
  అంతే కానీ ఏది పడితే అది రాసి….చదువు నేర్పిన గురువును అవమానించకండి.

 6. నాకు ఒక విషయం నిజంగా తెలియక అడుగుతున్నాను. తెలంగాణ సెపరేట్ అయితే తెలంగాణాలోని సామాన్య మానవుడికి ఎలా లాభం.మీరే చెప్తున్నారు ఆంధ్రా వాళ్ళు హైదరబాద్ గురించి ఎందుకు వర్రీ అవుతున్నారు చెన్నై వెళ్ళినట్లో ,బెంగళూరు వెల్లినట్లో హైదరాబద్ వెళ్ళవచ్చు అని.అంటే ఒక ఆంధ్రా అతను వెళ్ళి తెలంగాణవాళ్ళ స్థలం కొనుక్కొని ఒక హోటల్ పెట్టుకోవచ్చు కదా.అందులో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్నయించదు కదా.అతను అతని బంధువులని తెచ్చుకొని ఉద్యోగం ఇచ్చుకుంటే ఎవరూ ఏమీ అనలేరు కదా. అది చట్ట విరుద్దం కాదు కదా.ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలలోనే లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. అది ఇప్పుడు కూడా ఉంది కదా.ప్రైవేట్ రంగంలో లోకల్ రిజర్వేషన్ లేనంతవరకు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నా సెపరేట్ అయినా ఒక్కటే.

 7. తెలంగాణ సెపరేట్ అయితే తెలంగాణాలోని సామాన్య మానవుడికి ఎలా లాభం అని అడిగితె ఆయన చెప్పలేడు చెపితే అక్కడ ఊరుకోరు trs bonda pedutundi andhra vaallani akkada nunchi evaroo pampaleru aina vaallaaki kaavalsindi cm mla postlu

 8. ప్రత్యేక రాష్ట్రంలో సామాన్య మానవునికి లాభం ఏమిటి…అనే ప్రశ్న తెలీక అడిగారో….చర్చను పక్కదోవ పట్టించడానికి అడిగారో కానీ….
  ఇప్పుడు సమైక్యాంధ్రప్రదేశ్ లో ఉన్న లాభాలకన్నా ఎక్కువే లాభం అన్న సంగతి గ్రహించండి.
  రామాయణం అంతా విని రామునికి సీత ఏమవుతుందని అడిగినట్లుగా…..సామాన్యుడికి లాభం ఏమిటి…అని అడగడం అతి తెలివిని ప్రదర్శించడమే.

  ఇప్పుడు సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో ఏఏ లాభాలు ఐతే ఉన్నాయో, ఆ లాభాలే ప్రత్యేక రాష్ట్రంలో అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఉంటాయి.
  అంతే కాకుండా ఇప్పుడు సమైక్య రాష్ట్రం వల్ల ఏయే నష్టాలు ఉన్నాయో అవి మాత్రం ఉండవు.
  కావాలంటే చూడండి.
  1. సమైక్య రాష్ట్రం పేరు చెప్పి తెలంగాణ కు న్యాయబద్దంగా రావాల్సిన నీళ్లు తెలంగాణకే వస్తాయి. అప్పుడు ఇక్కడ కూడా వ్యవసాయం పెరుగుతుంది. వ్యవసాయానుబంధ ఉత్పత్తులు, పరిశ్రమలు, వాటి ఆధారంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అప్పుడు రాయలసీమ ప్రజలకు కూడా రావాల్సిన నీళ్లు ఏమిటో…ప్రస్తుత సమైక్య రాష్ట్రంలో ఆ నీళ్లు ఎటు పోతున్నాయో నిజం వెలుగుచూస్తుంది. ఒక పక్క రాష్ట్రంలో ఒక్క పంటకే దిక్కు లేక రైతులు కష్టాలు పడుతుంటే…మూడో పంట కోసం ఇతర ప్రాంతాలు ముంచైనా సరే ప్రాజెక్టులు కట్టే అన్యాయం ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉంది. అలాంటి దోపిడీకి అడ్డు కట్ట పడుతుంది. తెలంగాణ ప్రజల పోరాటం నుంచి స్ఫూర్తి పొంది అటు ఉత్తరాంధ్ర ప్రజలు, ఇటు రాయలసీమ ప్రజలు తమ వాటా తమకు కావాలంటారు. అప్పుడు కేవలం మూడు నాలుగు జిల్లాలే కాక, అన్ని జిల్లాల్లోనూ అభివృద్ది జరుగుతుంది.

  2. రాజకీయ నాయకులు తమకు అందుబాటులో ఉండేందుకోసం అన్నీ హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుతో ఇక నుంచైనా …పరిశ్రమలు, ఇతర సంస్థలను ఒక్క చోట కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు రేపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ లో ఉంటే…..ఇంకో ప్రధాన సంస్థ వరంగల్ లోనో, ఇటు మహబూబ్ నగర్ లోనే ఏర్పాటు చేస్తారన్న మాట. అలాగే అటు సీమాంధ్రలోనూ రాజధాని ఒక చోట అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉంటే హైకోర్టో మరోటో రాయలసీమ కు వస్తుందన్న మాట. పరిశ్రమలు కూడా ఒక్క చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. అప్పుడు అన్ని జిల్లాల వారికీ ఉపాధి లభిస్తుంది.
  ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని హైదరాబాదో, ముంబాయికో పోవాల్సిన దుస్థితి తప్పుతుంది.

  3. ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి రావడానికి అటు అనంతపురంలోని వారికో, ఇటు శ్రీకాకుళం వారికో వందల కిలోమీటర్లు ప్రయాణించే బాధ తప్పుతుంది.

  4. తెలంగాణలో 610 జీవోను ఇంతకాలం అమలు కాకుండా అడ్డుకున్నారు కదా. తెలంగాణ రాష్ట్రం వస్తే….ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి వారికే వస్తాయి.
  సమైక్య రాష్ట్రంలోని సెక్రటేరియట్లో తొంభై శాతం మంది ఉద్యోగుల స్థానంలో తెలంగాణ సెక్రటేరియట్ లో ఇక్కడి ప్రజలకే ఉద్యోగాలు వస్తాయి. అలాగే అటు సీమాంధ్ర జిల్లాల్లోనూ ఆమేరకు కొత్త ఉద్యోగాలు వస్తాయి.

  5. గ్రూప్ వన్, గ్రూప్ టూ, ఇంకా ఎపీపీఎస్సీ నిర్వహించే అనేక పరీక్షల్లో ఒక్క జిల్లా వారికే, ఒక్క కులం వారికే కాకుండా …అన్ని వర్గాల వారికీ ఉద్యోగాలు వస్తాయి.

  -నాలుగే జిల్లాలున్న రాయలసీమలో మూడు మెడికల్ కాలేజీలు. పది జిల్లాలున్న తెలంగాణలో అది హైదరాబాద్ ను కలుపుకొని మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అదే ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇక్కడ కూడా ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజీలు వస్తాయి. ఇక్కడ విద్యార్దులకు కూడా అవకాశాలు పెరుగుతాయి.

  -నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రజలకు…తమ పక్కనే ఉన్న నాగార్జున సాగర ప్రాజెక్టునుంచి తాగేందుకు నీళ్లు లభిస్తాయి.
  ఐతే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అన్ని సమస్యలకు విరుగుడు అని ఎవరూ అనడం లేదు.
  వి శేఖర్ గారు కూడా తెలంగాణ ప్రజల న్యాయబద్దమైన డిమాండ్ ను సానుభూతితో అర్థం చేసుకుని మద్దతు తెలిపారు.
  అలాగని ఆయన సీమాంధ్ర ప్రజల ఉద్యమాన్ని ఎప్పుడూ కించపరుస్తూ రాయలేదే..?
  నిజంగా మీలో ప్రశ్నించాలనే ఆరాటం, సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలన్న తపనే ఉంటే….ఒకప్పుడు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చి… ఇప్పుడు మాట మార్చి
  తమ ఇంట్లోనో, ఢిల్లీలోనో దీక్షలు చేస్తున్న వారిని ప్రశ్నించండి….?
  అసలు మీరు తెలంగాణకు అనుకూలమా…వ్యతిరేకమా అని రాజ్ దీప్ సర్దేశాయి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని దుస్థితి ఒక మాజీ మఖ్యమంత్రిది. ఆయనకు ఎటు మద్దతు ప్రకటించాలో తెలియని దుస్ధితి.
  ఇటువంటి పరిస్థితిలో ఇరు ప్రాంతాల ప్రజలు కలిసుండడం ఎలా సాధ్యం.?

  తెలంగాణ ప్రజలు అరవై ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం కావాలని అడుగుతూనే ఉన్నారు.
  కనీసం పదమూడు సంవత్సరాలుగా నిర్విరామంగా పోరాడుతున్నారు. టీఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకున్నపుడు….వైఎస్ ను ఓడించకుండా అధికారంలోకి తెచ్చారు.
  అంటే అర్థం ఏమిటి…? అప్పుడు సీమాంధ్ర ప్రజలకు విభజన అనేది పెద్ద విషయం కాదు.
  కనీసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకునే దాక కూడా సీమాంధ్ర ఉద్యమం లేదు.
  మరి అలాంటిది ఒక్కసారే ఎక్కన్నుంచి వచ్చింది. ఎవరి ప్రయోజనాలకోసం వచ్చింది…..?
  రాష్ట్రాల ఏర్పాటు అనేది మన దేశంలోనే కాదు ఏదేశంలోనైనా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ.
  మన రాష్ట్రంలో ఇప్పడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణతో ఇంకో రాష్ట్రం వస్తుంది అంతే. కొంపలు మునిగిపోతున్నట్లు, దేశం విడిపోతున్నట్లు హడావిడిచేస్తూ, గుండెలు బాదుకుంటున్న వారంతా….ప్రజలు విడిపోతున్నారని కాదు, తమ దోపిడీ ఇకనుంచి సాగదని, హైదరాబాద్ లో తమ ఆటలు సాగవని.
  దోపిడీ దారుల ఆటలు సాగలేదంటే ప్రజలకు లాభమే కదా…
  ఇప్పటికైనా అర్థమైంది…సామాన్యుడికి లాభమో…నష్టమో..?

  @ ఇక ఆర్కే గారూ…మీ అభిప్రాయం మీరు చెప్పకుండా….సంబంధం లేని రాతలు రాస్తారెందుకు…?
  మీరన్న ప్రకారమే ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక దోపిడీ జరుగుతుందన్న మాట.
  మరి ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో దోపిడీ జరగడం లేదా….? మీరు దోపిడీని ప్రశ్నించాలి కానీ….ఉద్యమాల్ని అవమానించేలా రాతలు రాయకండి.

 9. చందు తులసిగారు
  తెలంగాణ కావాలనే వారు ఒక్క హైదరాబాద్ ని వదులుకొని (కొద్ది సేపటికి అది ఆంధ్రా ప్రాంతం వారికి కూడా ఇవ్వకుండానే) రాష్ట్రం ఏర్పాటు చేసుకోమనండి. ఎవరూ వద్దనరు. దానికి తెలంగాణ కావాలనే వారు ముందుకు వస్తారా? అలా అయితే ఆంధ్రా ప్రాంతం వారంతా సహకరిస్తారు. తెలంగాణ వారు కాని, సీమాంధ్ర ప్రాంతం వారు కాని ఈ రోజు కావాలనుకునేది హైదరాబాద్ నే. కాదంటారా? హైదరాబాద్ పై తెలంగాణ వారికే హక్కు ఉంటుందని ఎలా చెప్పగలరు? అది విడిచిపెట్టి తెలంగాణ ఏర్పాటు చేసుకోండి.

 10. ఆంధ్ర ప్రదేశ్ పై సోనియా, మన్ మోహన్, షిండే, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, ఆజాద్, వీరప్పమోయిలీ వీరందరి పెత్తనం ఏమిటి? అది రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవలసిన విషయం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనుకునే , సమైక్యంగానే ఉంచాలనుకునే విషయాలపై వారి పెత్తనం ఉండకూడదు. ఈ విషయాలను తేల్చాల్సింది జయపాల్రెడ్డి కావచ్చు , కావూరి కావచ్చు, కెసీఆర్ కావచ్చు, కిరణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు వీరంతా కలిసి నిర్నయించుకోవాలి కాని వారి పెత్తనం సాగకూడదనేది నా అభిప్రాయం. వీరందరు కలిసి నిర్ణయించుకోకపోతె ప్రజలు ఎన్నికల ద్వారా నిర్ణయిస్తారు. అంతే కాని పై వారి పెత్తనాన్ని ఎప్పుడూ ఆమోదించకూడదు.

 11. @ అశోక్ గారూ…
  ఆంధ్ర ప్రదేశ్ పై సోనియా, మన్ మోహన్, షిండే, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, ఆజాద్, వీరప్పమోయిలీ వీరందరి పెత్తనం ఏమిటి?….
  ఈ ప్రశ్న మీరు భావోద్వేగంలో ఉండి అడుగుతున్నారేమో కానీ…..సోనియా, మన్మోహన్, షిండే…వీళ్లంతా ఎవరో మీకు తెలీదా….?
  మన రాష్ట్రంపై వాళ్ల పెత్తనం ఏమిటా….?
  మీరు భలేవారే వారే . మనరాష్ట్రంపైనే కాదు….దేశంలో ఏప్రాంతంపైనైనా మన్మోహన్ అండ్ పార్టీ పెత్తనం సాగుతుంది.
  ఎందుకంటే మనం వాళ్లని మన ప్రభుత్వ ప్రతినిధులుగా ఎన్నుకున్నాం.
  మీరో, నేనో ఓటు వేయకపోయి ఉండవచ్చు. కానీ….మెజారిటీ ప్రజలు యూపీఏ కూటమికి ఓట్లేసి ఓ ఐదు సంవత్సరాలు పరిపాలించమని పగ్గాలు అప్పగించారు.
  వ్యక్తులుగా వాళ్లూ ఏ రాష్ట్రానికి చెందినా ప్రస్తుతం వారు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలపైనా హక్కులుంటాయి. దాన్ని ఏ రాష్ట్రమూ, ఏ రాష్ట్ర ప్రజలూ కాదనలేరు.
  రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన అధికారాలన్నీ రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికే అప్పగించింది. కాబట్టి రాష్ట్రం విడదీయాలన్నా, రెండు రాష్ట్రాలను కలపాలన్నా కేంద్రానికి పూర్తి అధికారాలు ఉంటాయి. ఇప్పుడు కేంద్రం అంటే యూపీఏ. యూపీఏ అంటే సోనియా, మన్మోహన్, మొయిలీ, షిండేనే కాబట్టి వాళ్ల అధికారం మనపై ఉంటుంది.

  ఇక మన రాష్ట్రం గురించి కావూరో, జైపాల్ రెడ్డో, కిరణో, జగనో, చంద్రబాబో నిర్ణయించాలి కానీ సోనియా మన్మోహన్ లు కాదనే వ్యాఖ్యకు కూడా పై సమాధానమే వర్తిస్తుంది.
  కిరణ్ ను ముఖ్యమంత్రి చేసింది వాళ్లేనని…కావూరికి, జయపాల్ రెడ్డికి, పదవులు ఇచ్చింది…రేపు జగన్ బాబు, కేసీఆర్ లు కాంగ్రెస్ లోని కలిసిపోతారని గుర్తించాలి.
  కిరణ్, చంద్రబాబు, జగన్, కేసీఆర్ లే కాదు…..వాళ్లపైన వాళ్లను ఆడించేవాళ్లున్నారని గుర్తించాలి.
  ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం.

 12. >>ఆంధ్ర ప్రదేశ్ పై సోనియా, మన్ మోహన్, షిండే, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, ఆజాద్, వీరప్పమోయిలీ వీరందరి పెత్తనం ఏమిటి?

  నేను కటినంగా అంటున్నానని అనుకోకపోతే ఒక విషయం. సీమండ్రులు మద్రాసు నుండి విడిపోవటానికి జరుగుతున్నా పోరాటంలో నెహ్రు పెత్తనం ఏంటి, వాళ్ళ పెత్తనం ఏంటి అని ఎగిరి పడితే సీమండ్రులు ఆ మద్రాసులోనే మగ్గి పోయే వారు.

  ఇంకా చెప్పాలంటే…… తెలంగాణా ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్రా ష్టంలో ఉండాలో, విదిపోవాలో అని తేల్చు నిర్ణయంలో సీమంద్రకు చెందినా కిరణో, జగనో, చంద్రబాబో, కావూరి ల పెత్తనం ఏంటి? అది తెలంగాణా వాళ్ళు తేల్చుకోవలసిన విషయం అని నేను అంటే ఎలా ఉంటుంది?

  ఎవరు చెయ్యాల్సిన పని వారే చేస్తారు. రాష్ట్రాల ఏర్పాటు లో రాష్ట్ర ప్రతినిధుల జోక్యం అవసరం లేదని చట్టం. వారు జాతీయ ప్రబుత్వ ప్రతినిదులుగా తమ పనులు తాము చేస్తున్నారు.

 13. తెలంగాణ ప్రజలు విడిపోవాలనుకోవడాన్ని నేను వ్యతిరేకించడంలేదు. అది గమనించాల్సిందిగా కోరుతాను. ఇక ఢిల్హీ పెద్దల సంగతి. నెహ్రూ ఆరోజు మెజారిటీ ప్రజల అభిప్రాయానికి ఒకే అన్నారనుకుంటాను. అంతేగాని తనకు ఇష్టం ఉన్నట్టు చేయలేదు. ఆమాటకొస్తే ఆయన తెలంగాణని ఆంధ్ర ప్రాంతంతో కలపడాన్ని వ్యతిరేకించాడనుకుంటాను. కాని అతను తను అనుకున్నట్లు చేయలేదు. ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒక రాష్ట్ర విభజనపై సి.డబ్ల్యూ.సి. రెండు గంటలలో నిర్ణయించింది. ఇక యుపిఏ ఇరవై నిమిషాలలో తేల్చింది. ఇక మొన్న కేబినెట్ అసలు నోట్ ని చూడకుండానే (టేబిల్ నోట్) ఆమోందించింది. ఇది ఇంత చిన్న విషయమా? ఏదైనా విషయంపై తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజలు కలిసి ఒక నిర్ణయం చేయలేనపుడు కేంద్రం ఆపని చేయకూడదని నేను అనడం లేదు. మనం చట్టాల ప్రకారం ఆ అధికారం వారికి లేదనడం లేదు. కాని వారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే వారు ఆ పనికి తగిని వారుగా కనిపించడంలేదు. రేపు 2014లో ఇక్కడి ప్రాంత ప్రజలు ఇచ్చే తీర్పు చూడవచ్చుకదా? అప్పటిదాకా ఆగరాదా? ఇన్నాళ్ళు ఆగినవారు ఇంక కొద్ది రోజులు ఆగడంలో ఓపిక లేదా? ఆంధ్ర ప్రాంతం వారు 1972లేనే విడిపోతామన్నారు. అప్పుడే విభజించితే ఈరోజు ఇలా జరిగేదా? హైదరాబాద్ పై పెంచుకున్న ప్రేమను కాదనడం ఎంతవరకు న్యాయం?

 14. >> హైదరాబాద్ పై పెంచుకున్న ప్రేమను కాదనడం ఎంతవరకు న్యాయం?

  తెలంగాణా వాళ్ళు వారి హక్కులు కోల్పోతున్నాం అన్నప్పుడే స్పందించి ఉంటె ఎప్పుడి దుర్స్తితి ఉండేది కాదేమో !!

  >> ఇక యుపిఏ ఇరవై నిమిషాలలో తేల్చింది.

  అంటే ఇంతకూ మునుపు ఎలాంటి కసరత్తు లేకుండానే ఆ ఇరవై నిముషాలలో తెల్చేసిన్దంటారా? మీది అమాయకత్వమా ?

  >>ఇక మొన్న కేబినెట్ అసలు నోట్ ని చూడకుండానే (టేబిల్ నోట్) ఆమోందించింది.

  అందులో చూడటానికి ఏముంది అసలు? ఎవరికీ తెలియని విషయం అది?

  >> రేపు 2014లో ఇక్కడి ప్రాంత ప్రజలు ఇచ్చే తీర్పు చూడవచ్చుకదా?

  ఏ ప్రాంతం వారు ఇచ్చే తీర్పు? తెలంగాణా వారా ? లేక సీమంద్ర వారా ? గతంలో పదేళ్లుగా అన్ని పార్టీలు తెలంగాణా అనుకూలంగా ఎన్నికలకు వెళ్లారు కదా? మళ్ళి ఏంటి కొత్తగా ? తెలంగాణా ప్రజలంటే అంత తమాషాగా ఉందా? సరే ఈ సారి ఎన్నికలు కూడా అయినాక మళ్ళి ఇంకోసారి ఇంకెవరో మళ్ళి ఎన్నికలకు పోదాం అని అనరని గ్యరెంటి ఏంటి? పదేళ్లుగా టైం లేని సీమంద్ర జనాలకు ఎప్పుడు వచ్చిందా సమయం తమ భాదలు చెప్పుకోవటానికి?

 15. తెలంగాణా కి అనుకూలం గా వెళ్ళాయి కాని ప్రత్యెక తెలంగాణా ఇస్తాం అని ఎవరూ మేనిఫెస్టో లో పెట్టలా అనుకూలం అంటే రాష్ట్రం ఇవ్వటమా

 16. తెలంగాణ ఇస్తాం అంటే అసలు రాజశేఖర్రెడ్డి cm అయ్యేవాడు కాదు మొదట 2004 lo src అని తర్వాత 2009 lo రోశయ్య కమిటీ అన్నారు తెలంగాణా అనలేదు

 17. ప్రత్యెక రాష్ట్రం లో (తో) వ్యాపారం చేసే వాళ్లకి తప్పకుండా లాభాలే వస్తాయి లాభాల కోసమే కదా ఇదంతా

 18. సంబంధం లేనివి రాస్తే ఈ బ్లాగ్ ఓనర్ డిలీట్ చేస్తాడు కాబట్టి సంభంధం లేనివి నేను ఇక్కడ రాసే ఛాన్స్ లేదు విదిపోతాం అనే వాళ్లకి అన్నీ సంబంధం లేకుండా నే ఉంటాయి అంతా దోపిడీ లాగే ఉంటుంది సెపరేట్ అయాక అనీ తెలుస్తాయి time will answer all questions

 19. On the Telangana issue, the Congress Party pledges to honour the stand taken
  by the Government on the floor of the House. The Congress Government has
  already constituted a Committee of Members of both the Houses under the
  Chairmanship of senior Congress leader Sri K.Rosaiah. The report is awaited. అనే మేనిఫెస్టో లో ఉంనది ప్రత్యేక రాష్ట్రం ఇస్తామ అని చెప్పారా కాని తెలంగాణా లో వోట్ లు ఎందుకు వేసారు

 20. ఏమి తెలివీ ! ఏమి తెలివీ !

  <<తెలంగాణా కి అనుకూలం గా వెళ్ళాయి కాని ప్రత్యెక తెలంగాణా ఇస్తాం అని ఎవరూ మేనిఫెస్టో లో పెట్టలా అనుకూలం అంటే రాష్ట్రం ఇవ్వటమా?<<

  దీని అర్ధం సురులకు తప్ప మానవమాత్రులకి తెలీదు. కాదు కాదు. అది రాజ కీయ పరి భాష!
  తొందర్లోనే, ఎమ్మేల్యే అవుతారు. లేక లోక సభకు పోటి య్యండీ!

 21. ఇంత దాకా ఏమీ మాట్లాడకండా ఉన్న నా బోటి వాళ్ళకి కూడా…సమైకాంధ్రుల మెంటల్ వాదనలు …మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కే పొగరు చేష్టలు చూస్తుంటే ఎక్కడో కాలుతోంది.సెంటిమెంట్ కబుర్లు తప్ప ఒక్కటంటే ఒక్క జెన్యూన్ రీజన్ వీళ్ళు కలిసివుండటానికి చూపించలేకపోతున్నారు.

 22. సమైక్యవాదులు చేస్తున్నది తప్పే కానీ “మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కారు” అని పురుషాధిక్యతని ధ్వనింప చేసే సామెతలు ఉపయోగించడం అవసరమా? “వాళ్ళకి కొమ్ములు మొలిచాయి” లాంటి metaphors అయితే ఉపయోగించొచ్చు.

 23. ఏమైనా హైదరబాద్ (రాజధాని) తెలంగాణ లో లేకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంత రచ్చ చేసేవారే కాదు. హైదరబాద్ కి వచ్చే మిగులు బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వ జీతాలతో సమానంగా పొందొచ్చు. త్వరగా ప్రమోషన్ పొందొచ్చు అనే అత్యాస ఉద్యోగులది.
  610 అమలు చేయక పోవడం అనే పాలకుల నిర్లక్ష్యానికి ఇవాళ సామాన్యులకి సమస్య వచ్చింది.ఉద్యోగాలు దోచుకున్నది ఆంధ్ర ప్రాంత ప్రజలు కాదు. రాజకీయ నాయకులు. అందులో మేం కూడ బలి అయ్యాం

 24. చందు తులసి, విశేఖర్, Green_Star గారలకు,
  నేను మీతో ఏకీభవించలేను. నేను భావోద్వేగానికి ఎప్పుడూ గురి కాలేదు. నేను రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటాను, కాని విడిపోయినంత మాత్రాన ఏదో జరగకూడనిది జరిగిపోతుందే అని బాధపడే వాడినీ కాదు.

 25. పింగ్‌బ్యాక్: 2013లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ -సమీక్ష | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s