పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి


విజయనగరంలో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయ్యాయని ది హిందు పత్రిక ఒక వార్త ప్రచురించింది. ఆ వార్త కింద సయ్యద్ మునిరుద్దీన్ అనే ఒక పాఠకుడు వ్యాఖ్యానంగా ఈ కింది పిట్టకధ రాశారు. ఈ పిట్టకధని ఆయన చిన్నప్పుడు విన్నారట. తెలంగాణ-సమైక్యాంధ్ర ఉద్యమాలను చూసి తనకా కధ గుర్తుకొస్తోంది అని చెబుతూ రాశారు. చాలా తమాషాగా ఉంది చదవండి!

అనగనగా ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు ఒక రోజు ఒక నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటూ వెళ్తుండగా వారిలో ఒకరు నదిలో పెద్ద దుప్పటి తేలుతూ వెళ్ళడం గమనించాడు. వెంటనే ఆ దుప్పటి తెచ్చుకుందామన్న ఉద్దేశంతో అతను నదిలో దూకేసాడు. కానీ ఒడ్డుపైన నిలబడిన వ్యక్తి కొంతసేపటికి దుప్పటీ, ఆ దూకినతనూ కలిసి నదిలో వెళ్లిపోతూ కనిపించారు.

దానితో ఒడ్డున ఉన్న వ్యక్తి కంగారుగా అరిచాడు, “ఆ దుప్పటి వదిలి పెట్టి వచ్చెయ్యి” అని. దానికి దూకిన వ్యక్తి ఇలా బదులిచ్చాడు, “నేను ఎప్పుడో వదిలిపెట్టాను. కానీ ఆ దుప్పటే నన్ను వదిలిపెట్టడం లేదు” అని.

కారణం ఏమిటంటే అది నిజానికి దుప్పటి కాదు. ఒక ఎలుగు బంటి. నల్లగా నిగనిగలాడుతూ అల్లినట్లు ఉన్న వెంట్రుకలను చూసి దుప్పటిగా భ్రమించి తెచ్చుకుందాం అనుకున్నాడు. కానీ ఆ దుప్పటే ఇతన్ని పట్టుకుని తీసుకెళ్ళడం ప్రారంభించడంతో బైటపడడం ఎలాగా అన్న మీమాంసలో పడిపోయాడు.

‘సమైక్యాంధ్ర’ ఉద్యమం కూడా ఇప్పుడు ఆ దుప్పటి లాంటి ఎలుగుబంటి లాగానే తయారయింది. సమైక్యాంధ్ర తేలికగా అందుబాటులో ఉందనుకుని మన మిత్రులంతా ఉద్యమంలోకి దూకేశారు. తీరా చూడబోతే అది తేలికగా అందకపోగా కేంద్ర ప్రభుత్వ నిశ్చయాత్మక అండతో మర్రిమానులా స్ధిరపడిపోయింది. ఈ వాస్తవాన్ని విస్మరించిన నాయకులు ‘సమైక్యాంధ్ర’ తప్ప మరొకటి తమకు సమ్మతం కాదంటూ వీరాలాపాలు పలికి తీరా ఇప్పుడు ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక సతమతం అవుతున్నారు.

శాంతియుతంగా ఉద్యమం సాగుతుందని ఎన్.జి.ఓ లు ప్రకటించింది నిజమే. కానీ ఉద్యమకారులు ఏమీ ప్రాణం లేని వస్తువులు కాదు కదా. వారికి భావోద్వేగాలను అంటించాక వారికంటూ స్వంతగా ఒక గమనం, గమ్యం ఏర్పడిపోతుంది. ఉద్యోగులైతే తమ అదుపులో ఉంటారు కాబట్టి అవసరం అయినప్పుడు ఆందోళన విరమించవచ్చు అనుకున్నారేమో. నిజానికి ఉద్యోగుల్లో కూడా సెంటిమెంటు బలంగా నాటుకుపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఆందోళన విరమణ అంటే ‘లొంగుబాటు’ గా అర్ధం చేసుకునే పరిస్ధితి ఏర్పడింది.

ఫలితంగా కేబినెట్ ఆమోదం అయినప్పటికీ అసంబ్లీలో ఓడిస్తాం కదా అంటూ ఎన్.జి.ఓ లతో పాటు ముఖ్యమంత్రి కూడా చెబుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం ఓడిపోతే కేంద్రం ఎలా ముందుకెళ్తుంది అని కూడా అశోక్ బాబు ప్రకటిస్తున్నారు. కానీ అసెంబ్లీ అభిప్రాయమే తప్ప తీర్మానం అవసరం లేదని కేంద్ర సచివులు మొదటి నుండి చెబుతున్నారు.

నిజానికి ఇందులో కేంద్రం తప్పు కూడా ఉంది. తెలంగాణపై నిర్ణయాన్ని ఎన్నికల ముందువరకూ వాయిదా వేయడానికి నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ మొన్నటివరకూ అసెంబ్లీలో ఏకాభిప్రాయం కావాలంటూ ఒకటే ప్రకటనలు గుప్పించారు. తీరా ఇప్పుడేమో అసెంబ్లీ ఏకాభిప్రాయం తర్వాత సంగతి అసలు తీర్మానమే అవసరం లేదనేసరికి జనంలో అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. బూర్జువా రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ఉద్యమాలు వారి ప్రయోజనాలకే తప్ప తమ కోసం కాదని జనం గ్రహించాలి. కొన్నిసార్లు తెలంగాణ లాంటి ప్రజల ప్రయోజనాలు కొద్దో, గొప్పో ఉండే ఉద్యమాల్లో కూడా రాజకీయ నాయకులు ప్రవేశిస్తారు. అలాంటప్పుడు వాటికి ఉన్న పరిమితులను గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

ఏదేమైనా, అందరూ కలిసి జనాన్ని పిచ్చోళ్లని చేయడమే తీవ్ర అభ్యంతరకరం!

4 thoughts on “పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి

 1. నీచ రాజకీయాలకు పరాకాష్ఠ! అందుకే ఈ అందోళనలు.తమ భవిష్యత్ ఏమిటి?అని వృత్తివిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు?మన రాష్ట్రానికి,పరాయి రాష్ట్రానికి తేడాలేదా?ఆ భావనను ఎవరు పోగొడతారు?ఎలా పోగొడతారు?జొనల్ వ్యవస్థ సంగతేమిటి?రాజధానికి దూరంగా ఉండే ప్రాంతం,సౌకర్యాలకు నోచుకోని ప్రాంతం,వివక్షలకు గురైన ప్రాంతం విడిపోతే అంత వ్యతిరేకత రాదు!కానీ,ఇక్కడి పరిస్థితిని ఏ విధం గా సమర్ధించాలి? సీమాంధ్ర ప్రాంత నాయకులు ప్రాప్తకాలఙ తను ప్రదర్శించడాన్ని ఎలా సమర్దించాలి?ఈ ప్రాంతప్రజల ఆకాంక్షతలను గాలి కొదిలేసినపుడు ఇటువంటి ప్రతిస్పందనలను అనుభవించక తప్పదు! చాలమంది అడుగుతున్నరు ఇంతకాలం సమైక్యంధ్ర ఉద్యమం ఎందుకు చేయలేదని?దానికి సమాదానం ఈ రాజకీయనాయకులను నమ్మడమే!అందుకే ప్రస్తుతం ఈ ఉద్యమం జరుగుతుంది! నేను ఇంతకు ముందు సమైక్యాంధ్ర ఉద్యమం చల్లారడానికి కేంద్రం ఏం చేయాలని?దానికి సమాదానం గా ఏమీ చేయనక్కరలేదని చెప్పారు! ఇప్పుడు మీరుదానిని ఎలా సమర్దిస్తారు?జులై 30 తర్వాతైనా మాచేతిలో ఏమిలేదని ప్రజలను విభజనకు సిద్దం చేశారా?లేదు!నైతికతకు విలువ ఇచ్చి రాజీనామా చేయడమో,ప్రజలను క్షమించమని అడగడమో చేశారా?లేదు!సరికదా ప్రజలను మభ్యపెట్టడానికో,తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికో చూశారు! అందుకే ఇప్పుడీ సెగ!కావలసిందే!వీళ్ళమీద జాలి,దయ,సానుభూతి చూపించాల్సిన అవసరంలేదు!

 2. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్ పాసైన తరువాత కూడా కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం ఉందని అశోక్ బాబు ప్రచారం చేస్తాడు. పార్లమెంట్‌లో పాసైన బిల్‌ని కొట్టివేసే అధికారం సుప్రీం కోర్ట్‌కి ఉందని ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌కి ఉంది కనుక ఆ బిల్‌ని కొట్టివేసే అధికారం సుప్రీం కోర్ట్‌కి లేదు. చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌కి లేకపోతేనే ఆ బిల్‌ని కొట్టి వెయ్యడం సాధ్యమవుతుంది.

 3. పింగ్‌బ్యాక్: పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి | thazakhabar

 4. we can struggle for samaikhaya andhra, but the way is not correct.
  All the politicians [MLAS MPS] are claiming their salaries.
  one MP is partcipating and enjoying in Tirumala as a chairmen.
  All businessesses of politicians are running smooth and well.
  All politicians and Employees childrens education is going smoothly in private schools and colleges.
  Who are the sufferers ?
  Daily wages labourers. who are working in small establishments.
  The childrens who are studying in govt schools and hostels.
  ONE THING IS TOOMUCH……………………….
  Nobody is willing to kept their house dark in night .
  Govt hospitals closed OPs .where should poor people go for treatment ?
  By power cut how the formers are suffering you know ?
  So many velleges are not having drinking water.
  How many small earning employees should go on strike ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s