పోల్: జగన్ బెయిలు దేనికి సూచన?


టి.వి ఛానెళ్ళు ప్రసారం చేస్తున్న వార్తల ప్రకారం కడప ఎం.పి వై.ఎస్.జగన్మోహన రెడ్డి జైలు నుండి విడుదల అయ్యారు. ఆయనకు స్వాగత సత్కారాలు అందించడం కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో చంచల్ గూడ జైలుకు చేరుకున్నారట. వారికి పోలీసులకు మధ్య వాదులాట, తోపులాట, ఘర్షణ గట్రా జరుగుతున్నాయట కూడా.

“నీకిది, నాకది” (క్విడ్ ప్రో కో) పద్ధతిలో జగన్ కి చెందిన అనేక కంపెనీల్లో వివిధ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయని, దానికి బదులుగా వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున భూములు, గనులు, అనుమతులు పొందారని ఆరోపించిన సి.బి.ఐ ఇప్పుడు చాలా కేసుల్లో ఆ పద్ధతిలో లావాదేవీలు జరిగాయనడానికి సాక్ష్యాలు లేవని చెబుతోంది.

దానితో ‘విచారణ పూర్తయినా జగన్, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని’ సి.బి.ఐ వాదించినా ఆ వాదనకు ప్రాతిపదిక లేకుండా పోయింది. ‘క్విడ్ ప్రో కో’ లేకుండా కోట్లాది రూపాయల ఆస్తుల జప్తుకు ఇ.డి (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఎందుకు పాల్పడినట్లు?

తాజా పరిణామాలు అనేకమంది ఊహించినవే. రాష్ట్రంలోని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల దగ్గర్నుండి జాతీయ పార్టీల వరకూ ‘త్వరలో జగన్ బెయిల్ పై విడుదల అవుతాడని, పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ లో కలిసి పోతుందని, తెరవెనుక జోరుగా బేరసారాలు నడిచాయని, చివరికి రాష్ట్రపతి వద్దకు జగన్ కుటుంబ సభ్యులు వెళ్ళడం కూడా ఇందులో భాగమేనని వివిధ నాయకులు ఆరోపిస్తూ వచ్చారు.

సాక్షాలు పకడ్బందీగా ఉండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరిపినా కూడా ఢిల్లీ అత్యాచారం కేసులో విచారణ పూర్తయ్యి శిక్షలు పడడానికి 8 నెలలు పైనే పట్టింది. ఇక జగన్ లాంటి రాజకీయ ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల పై మోపబడిన కేసులు ఎన్నాళ్లు సా…..గుతాయో ఇప్పటికే అనేక ఉదాహరణలు ఉన్నాయి. కర్ణాటకలో బంగారప్ప, బెంగాల్ కాంగ్రెస్ నేత ఘనీఖాన్ చౌదరి తదితర కేసుల్లో కేసులు దశాబ్దం పైనే సాగి చివరికి కొట్టివేయబడ్డాయి.

బోఫోర్స్ కేసు సంగతి చెప్పనే అవసరం లేదు. భోపాల్ విషవాయు ప్రమాదం కేసులో ఇక అరెస్టులే లేవు. దోషి యాండర్సన్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరీ స్వదేశం అమెరికాకు సాగనంపాయి. ఇక జగన్ కేసు ఎప్పటికీ తెల్లారేను?

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో జగన్ అభిమానులకు కొదవలేదు. తనను మించిన ఆకర్షణ కలిగినవారిని దగ్గరకు రానీయని ఆయన తత్వాన్ని చూసి ద్వేషించేవారికీ కొదవలేదు. ఈ నేపధ్యంలో ఈ పోలింగు ఒకింత ఆసక్తికరమే కావచ్చు.

8 thoughts on “పోల్: జగన్ బెయిలు దేనికి సూచన?

 1. నాకు భయమేస్తోంది.వెధవ మీద కాండ్రించి ఉమ్మేయలేని మన చేతకానితనం. విశృంఖల అవినీతికి సంఖుస్థాపన. రాజకీయనాయకులు ప్రతీ ఒక్కడినీ “….కొడకా” అని మొహం మీద ఉమ్మేసినా తుడుచుకుపోయేంత మన అలసత్వం.
  I am very much demoralized. How can a person and devil gang manage to get him bail in this …….. democracy. I am afraid. Country is going to dogs.

  (CERTAIN PARTS ARE EDITED IN THIS COMMENT …విశేఖర్)

 2. తాము ఎంత బరి తెగించి ప్రవర్తించినా,జనం ఛీ కొడుతున్నా తాము అనుకున్నది చేసుకు పోతున్నారంటే, వోటర్లతో వోట్లు ఎలా వేయించుకోవాలన్నది పార్టీలకు,ముక్యంగా కాంగ్రెస్ మరియూ దాని పిల్ల పార్టీలకూ దారి తెలిసింది.

  పది.. ఇరవై రోజుల పాటు విచ్చల విడిగా పోలింగ్ ముందు మందూ, మద్యం జల్లడం కాంగ్రెస్ కు చాతనైతే, తాయిలాలు.. ఫించన్లూ, బియ్యం కార్డులూ, (పిల్ల పార్టీలు) ప్రజలకు విసిరీ.. ఓట్లేయించుకోవచ్చన్నది.. మూల సూత్రమ్ గా తెలుస్తున్నది…

  అవినీతిని జనం సపోర్ట్ చేయరు… కానీ తమకు ఇండువిడ్యుల్ గా ఈ పార్టీల వల్ల ఏ ఫించనో, ఆరోగ్యశ్రీ నో, ఫీజు రీ ఎంబార్స్మెంట్.. బెనిఫిట్ పొదినప్పుడు మాత్రం, ఇక వీళ్ళు ఎంతటి అవినీతి అయినా సమాజంలొ సహజం.. అన్న రీతిలో, మాట్లాడ్డం మొదలెడతారు!

  ఎంత దైర్యం లేకపోతే? కేసును హడావిడిగా మూల చుట్టేసి, మమా అనిపించేస్తారు? దేశ దేశాల నుంచి వచ్చి చేరిందన్న హవాలా డబ్బు గురించి ఇక పరిశోధన మూల పడ్డట్టే? ఇవేవీ మన ప్రజలకు పట్టకపోవడం..? కళ్ళెదుట కనబడుతున్న ఆస్తులను చూసి కూడా, పిచ్చి వెధవల్లా కాన్వాయ్ వెంట పరిగెడుతున్నారంటే?

  చదువుకున్న వాళ్ళు కూడా కొన్ని కారణాలతొ, ఇంత విశ్రుంకులమైన అవినీతిని సమర్ధించడమ్, ఈ దేశాన్ని మరిన్ని అరాచకాలు చుట్టు ముట్టబోతున్నయ్, అనడానికి సంకేతమ్ గా భావించవచ్చు. ఇన్ని ఛండాలపు పనులు చేస్తూ, రాహుల్ గాంధీ దేశాన్ని మార్చేస్తానంటున్నాదు? పూర్తి స్థాయి అవినీతి దేశంగా మార్చడం తప్ప, ఈ తల్లీ కొడుకూ ఇంకేం చేస్తారు… ఈ దేశంలో కాంగ్రెస్ ను పూర్తిగా సమాధి చేయాలి! చాలా వర్గాల ప్రజలు, మిగతా పార్టీలను వేర్వేరు కారణాలతో విబేదించడం, కాంగ్రెస్కు కలిసి వస్తుంది!

  ఈ కేసులోనయినా సరయిన తీర్పు వచ్చి, భవిష్యత్తులో మరెవరూ అవినీతి చేయడానికి సాహసించరు… అన్న ధీమా కలుగుతుందేమో అనుకున్నామ్… కాంగ్రెస్ ను తిట్టాలంటే, ఏ రకమయిన నీచమయిన భాష అయినా చాలా తక్కువే!! ఈ దేశాన్ని రక్షించాలంటె…కాంగ్రెస్ ను సమాధి చేయడమొక్కటే దారి!

 3. మన దేశం ముందుకి వెలుతుంది అనేధానికి ఇదే నిదర్సనం…సి బి ఐ కాంగ్రెస్ చెప్పుచేతుల్లో నడుసుంది.. మనం మారలి మన సమాఔన్ని మార్చలి..

 4. పెజలారా .. నేను ఎవరనుకుంటున్నారు? జగన్ ని. ఆంధ్ర నాటక సూత్ర దారిని. ఈ జైల్స్ కి, బెయిల్స్ కి అతీతుడిని. మొత్తం నీనే.

  ఒక పాలి ఆలోచించండి .. మీ సిబిఐ కి వాటికి లోన్గేవాడినే అయితే కాంగ్రెస్ లో నించి ఎందుకు బైటికి వస్తాను? ఇంట రిస్క్ ఎందుకు దీస్కుంటాను?

  వొక సంవస్తరం గాదు ఐదేళ్ళు పెట్టిన తగ్గన్ గాక తగ్గాను.

  అసలు కాంగ్రెస్ లో నించి బైటికి వచ్చిందే ముక్యమంత్రి ఆయిందుకు, కదా? ఈ తొక్క కేసులు, జైళ్ళు, కోర్టులు, పచ్చ బాబు , పచ్చ పార్టి నా కో క లెక్కా?

  తెలంగాణా లో అయీపని కాదు. కాబాటి, నేను కే సి ఆర్ ఒక ఒప్పందం కి వచ్చాం. తెలంగాణా కే సి ఆర్ దే. నేను తెలంగాణా అంగడి కే సి ఆర్ కి అమ్మేసా. సీమంధ్ర నాది. ఆ తర్వాత మే మంతా కాంగ్రెస్ / రాహుల్ ని పీ ఎం ని చెయ్యాలి గదా?.
  ఇది జరగాలంటే ఏ పి స్ప్లిట్ అవ్వాలి కదా. మీరు నా ఇబ్బంది గమనించు కోవాల.

  ఈ సోనియ్యమ్మ మొదట్లో గొంత బెట్టు చేసిది. దారికి తెచ్చేందుకు చావ తన్పులయిందిబో. మొత్తం మీద ఎట్లో వోగట్ల కుమ్మకయాం అనుకో. అది వేరే సంగతి.

  మధ్యలో ఈ ఏ పి ఎన్ గీ వో లు చాల ఇబ్బంది పెట్టేస్త వుండారు. ఏటబ్బా వీలన్ని దారిలోకి తేవాల?

  మీ రందరు, అన్ని మరిచి పోయి, వూట్లన్ని నాకేస్సయండి. అప్పుడు మీ కో న్ని ముక్కలు విసిరుతాన్ గదా. ధన యజ్ఞం, సమాజ అనారోగ్య శ్రీ, అనవసర పించన్లు, కాంట్రాక్ట్లు గట్రా లాంటివి అన్న మాట. అవి దినుకున్టావుందండి.

  ఈ లోపకల, నేను, నా తోపు గాళ్ళు, సీమంధ్రను, హైదరాబాద్ ను. బెంగుళూరు ను అన్నిటిని చక్కపెడతా. పురాణాల్లో వొకాయన ఉన్నదే – అయిన పేరెంధబ్బ – ఆ వోయిన – వామనుడు. ఆ లెక్కన – మొత్తం ఇండియానీ చుట్టి జేబులో బెట్టుకుంట.

  గాని, ఇదిగో చెబ్తా వుండ, ఈసారి ఈ మాది రి తప్పులు చెయ్యను గాక చ్చెయన్ను అబ్బాయో.
  – “నీ కిది నా కది గాదు” గాదు “మొత్తం నాకే”.
  – సిబిఐ గాదు, ఇంటర్ పోల్ గుఉడా మన దగ్గరికి రాకూడదు. ఆ, అంత పక్కా గా జేస్తా మరి, చూస్కో.

  ఏంది.. అందరు వొక పాలి అనండి
  – జై జగన్ ..

  ఆ అద్ది మరి. ఉంటా .. ఎలక్షన్ తర్వాత మీ ముందుకు సమైక్యాంధ్ర ముక్య మంత్రి గా గలుస్త ..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s