సమైక్యగీతిక అనబడు బిస్కెట్టు కవిత


బలవంతపు ప్రేమ

బలవంతపు ప్రేమ

(రచన: అవ్వారి నాగరాజు)

ఈ రోజు ముఖంలో ముఖం పెట్టి
అంటోంది ప్రేమించవేం ప్రియా ?
“సమైక్యం” గా ఉందామని

ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్ గోరటోని లాగా
అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక-

చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ
ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి
ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి బలవంతప్ప్రేమ లాగా

చీచ్చీ ఒళ్ళు తెలియడంలేదు సుమీ
తలుచుకుంటే కొన్ని సార్లు ఒళ్ళు అదుపు తప్పుతుంది సుమీ
ఎండాకాలపు ఒరిపిడిలోనూ ఇగరని జీర పాటల ప్రవాహ సవ్వడి సుమీ తెలంగాణం

స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక! స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక!

నిజంగానే ముఖంలో ముఖం పెట్టి మాటాడుదాం
రావేం ప్రియా అని బతిమాలుడుదాం
విడిపోతే ఎలా మనం అని విరహాలు పాటిద్దాం

కవి గాయక వైతాళికులను రండోయ్ రారండోయ్ అని నినదిద్దాం
ఒక ప్రణయ గీతికను రాయించి నీ కోసం ప్రత్యేకం అని కన్ను గీటుదాం
చెలియలికట్ట దాటకు చెలీ అని గొంతుక మీద కాలునలాగే కొనసాగిస్తూ మురిపెంగా బుజ్జగిద్దాం
అదీ కాపోతే చరిత్ర తెలియదా అని శపిద్దాం
పొంగుకొచ్చే బాన కడుపులను అల్లరిగా కాసేపు దాపెట్టి ఒక్క బిస్కెట్టు కూడా ముట్టలేదు సుమీ అప్పటి నుండి అని అతిశయంగా గారాలు పోదాం

జనం ఎటూ పైకెగయని గొంతుకలు కదా
గాలి పారాడని ఆవరణంలో ముముక్షువులై ముడుచుక పడుకున్న జెండాలు కదా
పొద్దునే లేచి లెక్కలేసుకొని జీవితాన్ని జేబులో పొందికగా మడిచి పెట్టుకో జూసే అకాల స్వప్నాలు కదా
చదువుకొని శిక్షణలు పొంది కనీస్టూబుల్లలాంటి పంతుల్ల సాంగత్యంలో కారాగారాల్లాంటి కలల్ని కావలించుకొని పడుకొనే అర్భక ప్రాణులు కదా

ఇంకా ఇక ఉద్యోగాలుండవని అరుద్దాం
నీళ్ళుండవ్ నేలుండదు చివరాఖరుకు ‘గు_’ మీద గోసి గుడ్డకూడా అని గావు కేకలు పెడదాం
జనం మీద జనాన్ని బంధిఖానా మీద బంధిఖానాను పోటీగా నిలబెడదాం
జారి పోకుండా ఉండేందుకు అందరమూ కలిసి సామూహిక ప్రణయ గీతిక రాద్దామని కాణిపాకం వినాయక సామ్మీద సత్యప్రమాణాలు తీసుకుందాం

నిజంగానే ఒక్క ప్రేమలేఖయినా రాద్దాం
కాలపు రేఖలమీద ఐక్యతను విడగొడుతూ “సమైక్యత”నొక ప్రతీకగా నిలబెడదాం

ఈ రోజుటి ముఖమ్మీద తాగి పడేసిన సీసా గాజుముక్కతో వికృతంగా గజిబిజిగా ఒక్క ప్రేమ లేఖనయినా-

One thought on “సమైక్యగీతిక అనబడు బిస్కెట్టు కవిత

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s