సీమాంధ్ర ఉద్యమానిది కేవలం సెంటిమెంటు కాదు


(ఇది అవ్వారి నాగరాజు గారి వ్యాఖ్య.)

తెలంగాణాకు అనుకూలంగా నేనూ, వ్యతిరేకంగా నా మిత్రులూ మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిని పాఠకులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇది రాస్తున్నాను.

నా మిత్రుల వాదనలలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినవి నదీ జలాలను పంచుకోవడం, కొత్త రాష్ట్రాన్నీ, కొత్త రాజధానినీ నిర్మించుకోవడానికి కావలసిన నిధులు, ఆదాయాలూ- ఆస్తులూ వాటి పంపకాలూ ప్రస్తావనకు వచ్చాయి. నదీ జలాల విషయం ఒక్కొక్క నదినీ సోదాహరణంగా తీసుకొని అవి కేవలం ఒక్క ఆంధ్ర, తెలంగాణాలకు సంబంధించినవి మాత్రమే కావనీ అంతర్రాష్ట పరిధిలోకి వస్తాయనీ, వాటి పంపకం జల వనరుల సంఘం చూస్తుందని అన్నప్పుడు కర్నాటక కోర్టులను కూడా ధిక్కరిస్తూ వాడుకున్న ఉదంతాన్ని వారు ప్రస్తావనకు తెచ్చారు. ఇదే దోరణి రేపు తెలంగాణా అవలంబిస్తే మన పరిస్థితి ఏమిటని వారు అన్నారు.

అంతే కాక భారీ ప్రాజెక్టులను తెలంగాణాలో గోదావరి మీద వారి ఇష్టానుసారంగా కట్టుకుంటే రేపు వారు దయ తలిచి నీళ్ళు వదిలితేనే మనకు నీళ్ళు వస్తాయి. అందువల్ల ఆంధ్రాలోని దిగువ ప్రాంతాలు కరువు ప్రాంతాలు అవుతాయి. ఒక వేళ అధిక వర్షాలు కురిస్తే పైనున్న వాళ్ళు గేట్లు ఎత్తివేస్తే దిగువనున్న ప్రాంతాలు ఆకస్మిక ముంపుకు గురవుతాయి. అయితే కరువు లేకుంటే ముంపు అన్నట్టుగా మన పరీవాహక ప్రాంతాలు తయారవుతాయి అన్నది వారి వాదన. భారీ ప్రాజెక్టులు కాకుండా చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టుకుంటే ఈ సమస్య ఉండదు కదా అంటే అలా జరుగుతుందని గ్యారెంటీ ఏమిటీ అని ప్రశ్న.

అలాగే ఇంత పెద్ద రాష్ట్రానికి ఒకే నగరం ఉండడం, దాని చుట్టూ పెట్టుబడులు గుమ్మరించడం మంచిది కాదు, విభజన వల్ల మరో నగరాన్ని మనం ఊహించవచ్చు అన్నప్పుడు దానికి చాలా ఏళ్ళు పడుతుంది కదా, అలాగే దానికి కావలసిన వేల కోట్లు ఎవరిస్తారు? కేంద్రం అలా ఇచ్చిన దాఖలాలు లేవుకదా అన్నది అటు వైపు వాదన.

చిన్న రాష్ట్రాలవల్ల రిజర్వేషన్ అమలు మరింత ప్రభావవంతంగా జరుగుతుందనీ, మరింత మేలు కలుగుతుందని అంటే, రేపు విభజన జరిగాక మన సీమాంధ్రా వాళ్ళందరూ ఇటు వైపు వచ్చి పడితే ఉన్న పోష్టులు కూడా వాళ్ళకే సరిపోవు. పైగా సూపర్ న్యూమరీ పోష్టులు కల్పించాల్సి వస్తుంది. ఇదంతా జరగాలంటే కొన్నేళ్ళ పడుతుంది. అన్నేళ్ళ పాటూ కొత్త పోష్టుల కల్పననేదే ఉండదు. ఇక రిజర్వేషన్ల వ్యవహారానికి తావెక్కడ అన్నది వారి వాదన.

అంతే కాకుండా ఈ ప్రక్రియ అంతా సజావుగా జరుగుతుందని, ఉన్న వాటికి తోడు కొత్త సమస్యలు ఏర్పడవని ఏమిటీ గ్యారెంటీ? అందుకే అసలు విభజనే లేకుంటే ఈ సమస్యలే ఉండవు కదా అన్నది వారి ధోరణి.

వీటన్నిటినీ పరిశీలించినప్పుడు వాళ్ళు నాతో ప్రస్తావించిన విషయాలు:

1. నదీ జలాల విషయంలో గానీ, ఆస్తుల వాటాల పంపకం విషయంలో గానీ సమన్యాయం అనేది ఒకటి ఉండదు.

2. పరిపాలనలో అవకతవకలు జరగడం మామూలు కాబట్టి ఆ స్థితి ఏర్పడకుండా ఉంటే మేలు. వాటిని ప్రశ్నించడం కష్టం. వాటిని సరిచేసేసరికి చాలా మంది నష్టపోతారు.

3. ఉన్న సమస్యలను పరిష్కరించడానికి బదులుగా రెట్టింపు సమస్యలను విభజన ప్రక్రియ ముందుకు తీసుకరాబోతుంది.

ఈ అవగాహన రాజ్యం నుంచి ఎదురవుతున్న నిత్య అనుభవాల నుండే వచ్చాయన్నది స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఈ సమస్యలన్నింటికీ రాజ్యం పూచీ పడాలనీ, దాన్ని ప్రశ్నించాలనీ, సమన్యాయం అడగడం మన హక్కు అనే వైఖరి లేకపోవడం, దానికి తోడుగా ప్రత్యామ్నాయమైన, శ్రేయోదాయకమైన,పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు అనేవి ఒకటి ఉండాలనే సృహ లేకపోవడం అన్నింటికంటే ప్రధానమైన ఇబ్బందులుగా కనిపిస్తున్నాయి.

మొత్తంగా ఈ వాదనలు విన్నప్పుడు రాజ్యం, పాలకులు, రాజకీయాల మీద అపనమ్మకం, ప్రజాస్వామ్యం పట్ల పీత్తోలు మందానికి మించని ప్రవర్తనా ధోరణి, ప్రత్యామ్నాయ అభివృద్ధి పట్ల ఏమాత్రమూ అవగాహన లేకపోవడం, సమాచారానికీ, ఙ్ఞానానికీ పక్షపాతా ధోరణి ఉంటుందన్నసృహ లేకపోవడం నాకు కనిపించింది.

వ్యవస్థలతోటీ, రాజకీయాలతోటీ మనం పోటీపడి వేగలేము కాబట్టి ఉన్న తెలంగాణాను మన కిందే ఉంచుకోవాలి గానీ దాన్ని వదులుకోకూడదు అని వాళ్ళ వైఖరి.

వీటన్నింటినీ చూసినప్పుడు తెలంగాణా వ్యతిరేక ధోరణి సెంటిమెంట్, భావోద్వేగాల అంశం మాత్రమే కాదనీ దాని పునాదులలో చాలా అంశాలున్నాయని, మొత్తంగా వ్యవస్థ వైఫల్యమే ఉందని నాకనిపిస్తుంది. మరి మీరేమంటారు?

8 thoughts on “సీమాంధ్ర ఉద్యమానిది కేవలం సెంటిమెంటు కాదు

 1. ante inni rojula nundi telangana ki adikarikan ga chendavalasinavi kuda chendaledu anna mata…

  mari nagarjuna sagar ni 19 km enduku munduki jaripinattlu…?
  prasthutha CM, telanganaki ravalisina “Deputy CM & Home Ministry” adikaram thana daggara enduku pettukunnadu…

 2. గోదావరి కాలువలు వచ్చే అవకాశం లేని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఏ నీరు పేరు చెప్పి సమైక్యవాదాన్ని రెచ్చగొడుతున్నారు? సమైక్యవాదుల దగ్గర బోలెడన్ని కట్టు కథలు ఉన్నాయి, బోడి గుండుకి మోకాలుని అడ్డుగా చూపే కారణాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణానికి ఏడు కిలో మీటర్ల దూరంలోనే నాగావళి నది, ఐదు కిలో మీటర్లు దూరంలోనే వంశధార నది ఉన్నాయి. కానీ మునిసిపాలిటీవాళ్ళు ఆ పట్టణ ప్రజలకి అందించేది చెరువు నీరే. ఈ పట్టణ ప్రజలు తమకి 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదావరి నీటి కోసం సమైక్యాంధ్ర ఉద్యమం నడుపుతారా?

 3. నీఇళ్లు నాఇంటికి ఎంత దూరమో నా ఇళ్లుకూడా నీ ఇంటికి అంతే దూరం. కాదా? మన కష్టాలు నష్టాలు మనకు తెలిసినపుడు వాళ్ల కష్టాలు వాళ్లకీ తెలుస్తాయి కదా? ఎవరు ఎవరు మీద పడి ఏడవాలీ?

  ఇన్నాళ్లు తెలాంగాణ సెంటిమెంట్ ఉంది, లేక లేదు అనుకుంటూ కాలం గడిపి ఇప్పుడు మాత్రం శీమాంద్ర సెంటిమెంటే కాదు వాస్తవం కూడావుంది అంటే ఏమి లాభం? రెండు వైపుల సమస్యలున్నాయి,రెండు వైపులా బాధ వుంది. ఎవరికి సమస్య లేకుండ ఎలా పరిష్కరిస్తారు? తెలాంగణ ఉధ్యమం మొదలైనప్పటినుండీ ఇప్పటి వరకు సిమ్హసనం ఎక్కిన ప్రభువుల వారు ఎవరైనా ఆ దిశగా సమస్య పరిష్కారనికి ప్రయత్నం చేసారా? ఇన్ని రోజులు విభజన ఉండదు లే అని సీ మాంద్ర రాజకీయులు,విభజన తప్పని సరి అని తెలాంగాణ రాజయులు ప్రజలని మభ్య పెట్టారు? మల్లీ ఈ రోజు ప్రజల్నే ఎగదోస్తున్నారు.

  తెలాంగాణ ఉధ్యమం రాజు కున్న అప్పుడే దాన్ని పరిష్కారానికి ఏ మత్రం చిన్న ప్రయత్నం చేసినా పరిస్తితి ఇలా ఉండేది కాదేమో?

  మేము మాత్రం నష్ట పోతామని ఎవరూ సిద్ద పడరు కదా?

 4. okavela vasthe vallaku ee nastam jaruguthadi ani ankuntnnappudu..present valla paripalana valla telangana vallu nastapovatleda..eppudu valla nastam gurinche na alochana..vallaku hyd pothadi, nidhulu pothay, water pothadi, anni vallakena poyedi..innni rojula nundi telangana prajalu enni pogottukoledu..

  Vallade ruling, vallade pettubadulu vallade adikaram..tinedi kuda vallae..ippude maa intla memu vandukuntam ante vaddu andanki vadevadu….total ga selfish…

 5. పాఠకులకు విన్నపం:
  నేను తెలాంగాణాకు అనుకూలంగా ఒక స్పందనగా మాత్రమే రాసాను . ఇది రాయడానికి కారణం “సెంటిమెంట్” ను మించిన కారణాలున్నాయని నేను గుర్తించడమే.
  సీమాంధ్ర పజల స్పందనలన్నింటినీ ఒక్క ప్రశ్నతో కొట్టివేయవచ్చు. వర్తమానంలోనూ, గతంలోనూ తెలంగాణా ప్రజానీకం ఎదుర్కొన్న అసమానతలనూ, ఇబ్బందులను, వివక్షతనూ పట్టించుకోకుండా, ఎప్పుడో కొన్ని ఊహాత్మక సమస్యలను ముందుకు తెచ్చి, భవిష్యత్తులో ఇవి రానున్నాయని తెలంగాణాను అడ్డుకోవడం సమంజసమేనా? అని వాళ్ళను నిలదీయవచ్చు.
  అయితే నేను ప్రస్తుత సందర్భానికి మాత్రమే పరిమితం కాకుండా, ప్రజల మనస్తత్వం రూపొందడంలో రాజ్యం, బ్యూరోక్రసీల పాత్ర ఏమిటి? ప్రజలను ఇంత సంకుచితులుగా, మూకగా తయారు చేయడంలో ఇమిడి ఉన్న రాజ్యం దుర్మార్గాన్ని గుర్తు చేయడం కోసమే నేను ఈ వ్యాఖ రాసాను. ఇలాంటి చర్చ వర్తమానంలోని ఉధ్విగ్న వాతావరణలో నిలబడదని, ఒకోసారి అపోహలకు కూడా లోనవుతుందని తెలిసినా భవిష్యత్తులో అయినా ఉపయోగపడుతుందని రాసాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s