యు.పి: మంటలు ఆర్పు తున్నట్లా? ఎగదోస్తున్నట్లా?


Vote bank politics

ఉత్తర ప్రదేశ్ లో మరొకసారి మత విద్వేషపు మంటలు రగిలాయి. కాదు, రగల్చబడ్డాయి. బి.జె.పి ఒక ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టిందని సమాజ్ వాదీ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ కూడా అదే ఆరోపణలు చేస్తోంది. జరిగిన సంఘటనలు కూడా ఆ వాదనను నిజం చేస్తున్నాయి. బి.కె.యు అనే రైతు సంఘం నిర్వహించిన భారీ బహిరంగ సభలో బి.జె.పి నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లనే భారీ సంఖ్యలో (ఇప్పటివరకూ 40 మంది చనిపోయారని అంచనా) ప్రజల బలి అయ్యే స్ధాయిలో మత ఘర్షణలు చెలరేగాయని దాదాపు పత్రికలన్నీ చెబుతున్నాయి.

2014 ఎన్నికలు సమీపించేకొద్దీ ఇలాంటివి మరిన్ని జరగవచ్చని హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ రోజు (సెప్టెంబర్ 11) హెచ్చరించారు. తాము 16 ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. మత మారణకాండలే పెట్టుబడిగా అధికార లాభాలను సంపాదించేందుకు ప్రయత్నించడం బి.జె.పికి కొత్త కాదు. కానీ ఒకసారి అధికారం రుచి చూశాక దాన్ని నిలబెట్టుకోవాలంటే సెక్యులర్ నటన చేయక తప్పదని ఆ పార్టీ గ్రహించింది. సెక్యులరిస్టు ముద్ర పొందడం కోసం అద్వానీ చేసిన ప్రయత్నాలు, ముస్లింలను ఆకర్షించడానికి బి.జె.పి ఇటీవల చేస్తున్న ప్రయత్నాలు ఆ కోవలోనివే.

యు.పి ఎన్నికల సారధిగా నరేంద్ర మోడి అనుంగు సహచరుడు అమిత్ షా పగ్గాలు చేపట్టాక బహుశా ఉత్తర ప్రదేశ్ లో మత ఘర్షణలు చెలరేగడమే తరువాయి అన్న పరిస్ధితి ఏర్పడిందేమో! బి.జె.పి పార్టీ కుట్రలకు సమాజ్ వాదీ పార్టీ కూడా సహకరించింది అన్న కాంగ్రెస్ ఆరోపణలను కూడా కొట్టిపారేయడానికి వీలు లేదు. హిందువుల ఛాంపియన్ గా అవతరించడం బి.జె.పి అవసరం అయితే, ముస్లిం ప్రయోజనాల ఛాంపియన్ గా అవతరించడం ఎస్.పి అవసరం. ఈ సహకారంలో భాగంగానే మత ఘర్షణ జరిగిన తర్వాత కూడా ముజఫర్ నగర్ లో బి.కె.యు ర్యాలీ నిర్వహణకు ఎస్.పి అనుమతి ఇచ్చిందని వివిధ పార్టీలు, పత్రికల సంపాదకీయాలు దాదాపు నిర్ధారించాయి.

కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ, వారిని కనిపెట్టుకుని ఉండవలసిన ప్రతిపక్ష పార్టీలు ఇద్దరికీ కూడా మతఘర్షణలను ఆర్పడం కంటే ఎగదోయడంలోనే ఆసక్తి ఎక్కువ ఉన్నట్లయితే ఆశ్చర్యం అవసరం లేదు. మంటలు ఆర్పవలసినవారే ఎగదోయడానికి సిద్ధమయినప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి!

5 thoughts on “యు.పి: మంటలు ఆర్పు తున్నట్లా? ఎగదోస్తున్నట్లా?

 1. గొడవలకి కారణాలు బిజేపి అని ఎలా తెల్చేస్తున్నారో అర్ధం కావడం లేదు .

  ఒకటి : ఒక హిందూ అమ్మాయిని అల్లరి చేస్తున్నా ముస్లిం అబ్బాయిలని అడ్డుకున్న ఇద్దరు హిందు అబ్బాయిలని దారుణంగా చంపేశారు .
  రెండు : youtube లో ఒక offensive వీడియో , ఈ వీడియో బిజెపి , సమాజవాది పార్టీ సభ్యులు కూడా షేర్ చేసినట్టు వార్త వచ్చింది .

  మహా పంచాయితీ నుండి తిరిగి వస్తున్నా జనాల మీద అత్యంత క్రురంగా దాడి జరగడం మీరు ప్రస్తావించలేదు .
  నిన్న / మొన్న జరిగిన ముస్లిం ప్రార్ధన లు / సమావేశాల్లో బిఎస్పి , ఎస్పి నేతలు చేసినవి మీరు ప్రస్తావించలేదు .

  జనాలని పరామిర్సంచడానికి వచ్చిన ముఖ్యమంత్రి ముస్లిం కేప్ పెట్టుకుని రావడం అవసరమా ?

  ఇక్కడ తప్పు ఎవరిదీ ఉందొ మీరు కొంచెం కూడా ఎనాలిసిస్ చేయకుండా , కేవలం బిజెపి అని సింపుల్ గా తేల్చేయడం సబబు గా లేదు . గొడవలు జరిగిన ప్రాంతాలు లో ముస్లిం లు ఎక్కువ గా ఉన్నట్టు వార్త చదివాను .

  మైనారిటీ మెజారిటీ అని ఊహ జనితమైన పదాలు కాకుండా నేను డైరెక్ట్ గా కొన్ని పదాలు ప్రస్తావించాను .

  Please see this news..

  Qader Rana and Jameel Ahmed of the BSP and Saeed-uz-zaman of the Congress have been booked for inciting communal tension with their speeches in that meeting.

 2. The Hindu: Playing with fire

  Daily Bhaskar: EXPOSED: The conspiracy behind Muzaffarnagar riots

  NDTV: Muzaffarnagar riots

  NDTV వార్తలో మొదటి పేరా ఇది:

  Muzaffarnagar: The prelude to the riots that have ripped through Muzaffarnagar in western Uttar Pradesh killing 38 people unfolded in the village of Kawal, where in the last week of August, two Jat brothers killed a Muslim boy who was stalking their sister. Less than an hour later, they were lynched to death.

  అల్లరి అయింది ముస్లిం అమ్మాయి, అల్లరి చేసింది జాట్ లు. అది అడ్డుకున్నందుకు అమ్మాయి సోదరుడ్ని చంపేశారు. దానికి ప్రతీకారంగా ఇద్దరు జాట్ లను చంపారు. వాస్తవం ఇదయితే సురేష్ గారు దీనికి సరిగ్గా విరుద్ధంగా చెప్పారు. బహుశా ఆయన ఎక్కడో పొరబడ్డారు. లేదా ఆయనకి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉండాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s