అమెరికా రసాయన దుష్ట చరిత్ర -2


kim-phuc-phan_thi 02

(ఇది కూడా రామ్మోహన్ గారు రాసినదే.)

విలియం బ్లం చెప్పింది నేను పాక్షికంగానే రాశాను.

ఇరాక్ లో 1985 నుండి 1989 దాకా వివిధ రకాల విషపదార్ధాలను ఆయుదాల తయారీకి కోసం ఇరాక్ కు ఎగుమతి చేశారు.

  • బాసిలస్ ఆంత్రాక్స్ – ఆంత్రాక్స్ కోసం
  • క్లొస్ట్రిడియం బొటులినం -ఒక విషపదార్ధం.
  • హిస్ట్రొప్లస్మా కాప్స్లేటం- శ్వాశకొశం, మెదడు, వెన్నెముక, హృద్రోగాలు కలిగించే విషం ఇది.
  • బ్రుసెలా మెలిటిన్సి-అంగవికలురను చేసేపదార్ధం.
  • క్లొస్ట్రియం పెర్విజెన్స్- దీర్ఘకాలిక జబ్బులను కలిగించటానికి.
  • క్లొస్ట్రిడియం టిటాని- ప్రాణాలు తీసే మరొ విష పదార్ధం.

ఇరాక్ ఈ ఆయుధాలతో ఇరానియన్లు, కుర్దులు, షియాల మీద దాడులు చేసేటప్పుడు వీటిని ఉపయొగించి వీలైనంత ఎక్కువ మందిని చంపాలని అమెరికా ఉద్దేశం. 1992 వరకూ “సద్దాం హుసేన్ దగ్గిర ఏముందని దాచుకోవడానికి” అని వాదించింది.

1947-49 లలొ గ్రీస్ అంతర్యుద్దంలొ కలుగజేసుకుంది నాజీలకు వ్యతిరేకంగా వున్న వామపక్షవాదుల అణచివేతకు సాయం చేసింది. ఆతర్వాత గ్రీస్ దేశం 15 ఏళ్ళు అమెరికా ప్రవేట్ ఎస్టేటుగా మారింది. 1945-53 ఫిలిప్పైన్స్ వామపక్ష హుక్ దళాలు జపాన్ తో తలపడుతున్నప్పుడే అమెరికన్ దళాలు హుక్ తొ తలపడ్డాయి. యుద్దం తర్వాత హుక్లను అణచివేయటంలొ అమెరికా ఫిలిపిన్స్ కు అండదండలు అంధించింది. అక్కడి ఎన్నికలను తారుమారు చెయ్యటంలొ సిఐఎ కీలకపాత్ర పొషించింది. ఫలితంగా ఫర్టి నాండ్ మార్కస్ నిరంకుశ ప్రభుత్వం అధికారంలొకి వచ్చింది.

1953 లొ ఇరాన్ లో అమెరికా, బ్రిటషు సంయుక్తంగా చేసిన కుట్రలొ ప్రదాని మొసాడిక్ పదవీచ్యుతుడయ్యాడు. బ్రిటన్ కు చెందిన ఒకే ఒక చమురు కంపినీని జాతీయం చెయాలనుకొవటమే అతడు చేసిన నేరం. ఆతర్వాత షా అధికారంలొకి వచ్చాడు. అమెరికా బ్రిటన్ లకు చమురు కపెనీల్లో తగిన వాటా దక్కింది.

గ్వాటెమాలాలో 1953-60 లలొ ప్రజాస్వామికంగా ఎన్నికైన జాకబ్ ప్రభుత్వాన్ని C.I.A కుట్రచేసి కుల్చివేసింది. ఆతర్వాత రక్తసిక్తమైన నలభై యేళ్ళ నిరంకుశ ప్రభుత్వం పాలనలో రెండు లక్షలకన్నా ఎక్కువమంది మరణించారు. ప్రదాని జాకబ్ అమెరికాకు చెందిన ఫ్రుట్ కంపెనీ సాగుచెయ్యని స్ధలాన్ని వాపసు తీసుకున్నాడు. పైగా అప్పటి సోషల్ డెమొక్రాటిక్ ప్రభుత్వం నిలదొక్కుకుంటె అది ఇతర లాటిన్ అమెరికన్ దేశాలకు నమూనాగా మారే ప్రమాదం వుంది.

కోస్టారికా 1970-71 ప్రసిడెంట్ జాస్ ఫిగరెస్ ను పదవీచ్యుతుడిని చెయ్యడానికి ప్రయత్నించింది. కారణం మద్య అమెరికాలో సొవియట్ యూనియన్ తో దౌత్య సంభందాలు ఎర్పరుచుకున్న తొలిదేశం కొస్టారికా.

ఇండొనోషియాలో 1957-58 వాసర్ లాగానే సుకర్నో మరొక బడుగుదేశం నాయకుడు. అమెరికాకు ఇలాంటి వాళ్ళంటె పట్టదు. అమెరికా కన్నా దేశ ప్రయొజనాలే ముఖ్యమనుకునే వాళ్ళు అమెరికాకు శత్రువులు. ఆయన విదేశీ కంపెనీలను జాతీయం చేయ ప్రయత్నించాడు. కమ్మ్యునిస్టు పార్టీ మీద ఆక్షలు విధించలేదని అతడి మీద స్కాండల్స్ ప్రచారం చేశారు. సైనిక తిరుగుబాట్లు చేశారు.

ఇక బాంబింగ్ విషయానికొస్తే తక్షణమే కాకుండా పర్యావరణానికి దీర్గకాలికంగా నష్టం కలిగించే వాటినికుడా మారణాయుదాలంటున్నారు. ఈ నిర్వచనం ప్రకారం మందుపాతరలూ, క్లస్టర్ బాంబులూ మారణాయుద్ధాలే. యురేనియం ఆయుధాలు పేలిన తర్వాత ఎంతోకాలం దాకా నిలచివుండే రేడియొదార్మికతను వదులుతాయి. ఒక అమెరికన్ బాంబింగు వల్ల ఇరాక్ లో 10000 మంది మరణించారు.

యురేనియం రెండు రకాలుగా ఉపయొగిస్తారు ఒకటి ఎన్రిచడ్ (enriched). దీనితొ అణు రియాక్టర్లూ, ఆయుదాలూ తయారు చేస్తారు. మరొకటీ డిప్లిటిడ్ యురేనియం (Depleted Uranium -DU). దీనితో ట్యాంకుల తూటాలూ, బాంబులు, రాకెట్లూ, మిసైళ్ళూ తయారు చేస్తారు. డియు సాంద్రత స్టీలుకన్నాఎక్కువ. అందువల్ల ఇది ట్యాంకులనుకుడా చిద్రం చెయ్యగలదు. కానీ దీని రేడియో ధార్మికత చాలా హానికరం. రసాయన పరంగా విషగుణాలను కలిగివుంటుంది. లక్ష్యాలను తాకినప్పుడు దాని కణాలు గాలిలొ కలిసి ఊపిరితిత్తులతొపాటు శ్వాశకొశాల్లొ, మూత్రపిండాల్లొ ప్రవేశిస్తాయి. దీనివలన క్యాన్సర్, మూత్రపిండాల వ్యాదులు, జన్యుపరమైన వ్యాదులూ అనేక ఇతర ప్రాణాంతక వ్యాదులు వస్తాయి.

గల్ఫు యుద్దంలొ అసంఖ్యాకమైన ఇరాకీలు, అమెరికన్ సైనికులు ఈ దూళిని పీల్చుకున్నారు. ఫలితంగా వింత వింత రోగాలకు, చావులకు గురయ్యారు. ఒక అద్యాయనం ప్రకాం 10,050 మంది అమెరికన్ సైనికులు అంతుపట్టని కొత్త రోగాల బారిన పడ్డారు. అంటే డియు ప్రబావం అమెరికన్ సైనికులకూ చెప్పలేదు. ఇంగ్లాండ్ లో జరిగిన మరొక అద్యయనం ప్రకారం ఇరాక్, కువైట్ లలో మిగిలిపోయిన డియు అవశేషాలవల్ల ఐదు లక్షల మందికి క్యాన్సర్ సొకే ప్రమాదం ఏర్పడింది.

ఇలాంటి విషయాలు వందలు ఉన్నాయి. నాకు ముఖ్యమనుకున్న వాటిని మాత్రమే ఇక్కడ రాశాను. పెట్టుబడిదారీ సమాజం మిగతా సమాజాలకన్నా ఎంత భయంకరమైందొ పైవిషయాలు మనకు తేటతెల్లం చేస్తున్నాయి. దాని లాభాల వేటలొ మనుషుల ప్రాణాలూ, మిగతా జీవరాశుల ప్రాణాలూ గడ్డి పొచతో సమానం. కార్మికవర్గం ఎంత త్వరగా మేలుకుని తన సంకెళ్ళు తెంచుకుంటే అంత మంచిది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s