సెలెక్టా ధీమ్ మెజారిటీ పాఠకులకు నచ్చలేదని అర్ధం అయింది. ఒక్క తిరుపాలు గారు తప్ప ఇతర మిత్రులంతా బాగాలేదనే చెప్పారు. ముఖ్యంగా చందుగారు చెప్పినట్లు బ్లాగ్ లోని వివిధ టపాలకు తేలికగా ప్రవేశం ఉండేలా డిజైన్ ఉండడం చాలా అవసరం. అది సెలెక్టా ధీమ్ కి లేదని అర్ధం అవుతోంది.
ఈసారి ఆక్సిజన్ ధీమ్ ని అమర్చాను. బహుశా ఇది బాగుందనుకుంటాను. దీని పైన కూడా మిత్రుల అభిప్రాయాలను కోరుతున్నాను.
మార్చిన టెంప్లేట్ నచ్చనివాళ్ళలో నేనూ ఒకణ్ణి. వ్యాఖ్య రాసేలోపు మీరు టెంప్లేట్ మార్చేశారు!
ఏ టెంప్లేట్ లోనైనా రివర్స్ అక్షరాలు చదవటం (బ్లాక్/ రెడ్ నేపథ్యం) పాఠకులకు ఇబ్బంది. కళ్ళకు చాలా శ్రమ కూడా. పైగా అక్షరాల స్వరూపం స్పష్టత కోల్పోతుంది,
ఇప్పుడు పెట్టింది జస్ట్… పర్వాలేదు. టైటిల్ ఫొటో చిన్నదైపోయింది. వైట్ స్పేస్ ఎక్కువ కనపడటం వల్లనేమో, పూర్తి సంతృప్తికరంగా అనిపించటం లేదు.
మునుపటి (ఈ రెండు రకాలు కాదు) టెంప్లేటే బాగుంది. ఎందుకంటే హోమ్ పేజీలోనే బొ మ్మలతో లేటెస్ట్/ బాగా ప్రాచూర్యం పొందిన టపాలు కనబడతాయి…
విశేఖర్ గారు.. ఉదయం బ్లాగ్ చూసి తర్వాత కామెంట్ రాద్దామనుకునేలోపే టెంప్లేట్ మార్చారు. కాని ఇది కూడా బోసి పోయినట్లు అ(క)నిపిస్తొంది.
ఐతే మార్పు అవసరమే.
ముఖ్యంగా కొత్తదనం కావాల్సిందే.
చివరగా మీకు కొన్ని అభిరుచులు ఉంటాయిగా.
మీ సౌకర్యం కూడా చూసుకోండి.
ఇంతకు మునుపు ఉత్తమ టపాలతో పాటుగా, క్రిందటి టపాలు ఒక వరుస క్రమంలో ఉండేవి. ఈ పద్ధతి నాలాంటి అడపా దడపా పాఠకులకు టపాలను మిస్సవకుండా తోడ్పడేది. ప్రస్తుతం ఆ సదుపాయం లేదు. రీసెట్ పాత టపా ఒక్కటే కనిపిస్తోంది. విరివిగా రాసే మీ లాంటి వారిని టపాల ప్రాధాన్యత బట్టి ఎంపిక చేసుకోవడం ఈ పద్ధతి ద్వారా కష్టం. ఉత్తమ టపాలు, పాఠకులూ మెచ్చిన టపాలూ రెండూ ఒకటే కదా. పునరుక్తి దోషంలాగా ఉంది. పాత టపాలను వరుసక్రమంలో “ఇవి కూడా చూడండి” స్థానంలో అమర్చితే బాగుంటుంది.
వేణు గారు టైటిల్ (బ్యానర్) మార్చాను. ఇప్పుడు బాగుందా?
నాగరాజు గారు పాతటపాలకు ప్రాముఖ్యత ఉందని నా గమనంలో లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్లు చేసాను. పదిహేను వరకు పాత టపాలు ఉండేలా సెట్ చేసాను.
చందుతులసి గారు, నా కంటే ముందు పాఠకులకు సౌకర్యంగా ఉండాలని నా ఆలోచన. ఒకసారి అలవాటయితే నాకు కూడా తేలికవుతుంది. కష్టం ఎమీ ఉండదు.
వాసవ్య గారు, అవును. పాత డిజైన్ అన్నిటికి అనుకూలంగా ఉంది. కాని మార్పు అవసరం అన్న దృష్టితో మార్చాను. గత రెండు మూడు వారాలుగా మార్పుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుత టెంప్లేట్ ఎలా అమర్చాలో నాకు ఒక పట్టాన అర్ధం కాలేదు. వేరే బ్లాగ్ లో అనేకసార్లు ట్రయల్స్ వేస్తే గానీ ఒక కొలిక్కి రాలేదు. కాని కలర్ ఫుల్ గా ఉంటే బాగుంటుందేమో అని క్రితంది మొదట ట్రై చేసాను. ఎవరికీ నచ్చలేదు. ఇందులో మొదటి ఆరు టపాలు పైనే ఉంటాయి. ఆ తర్వాతవి మూడు బొమ్మలతో ఉంటాయి. ఆ తర్వాత పది టపాలు కేవలం టైటిల్ వరకే ఉంటాయి. అంటే మొత్తం పంతొమ్మిది టపాలు ఫ్రంట్ పేజిలోనే ఉంటాయి. అయితే నేవిగేషన్ విషయమే చూడాలి. అది కష్టంగా ఉంటే మళ్ళీ పాతదానికే వెళ్లక తప్పదేమో!
బ్యానర్ ఓకే. పోస్టులను స్లైడ్ షో గా పెట్టటం ఏమంత బాగున్నట్టు లేదు. ‘ఇల్లు’ (హోమ్ పేజ్) ఎక్కువ అంశాలు కూరినట్టు… clumsy గా కనిపిస్తోంది. విడిగా ఒక్కో టపా చూస్తుంటే మాత్రం కొంత బెటర్ గా ఉంది.
అవును. clumsy గా ఉంది. దీన్ని మెరుగుపరచవచ్చేమో చూసి కుదరకపోతే పాత దానికే మారడం బెటర్ అనిపిస్తోంది. ఇంకా మంచిది ఉందేమో చూసి లేకపోతే అదే చేస్తాను.
విశేఖర్ గారు, మన మిత్రులు చెప్పినట్లు పేజీ చిన్నది అయిపొయినట్లు కనిపిస్తుంది. టపా లోని ముఖ్య సమాచారం 50% కన్నా తక్కువగా ఉండి ఇతర విషయాలు, లింకులు, వైట్ స్పేస్ డామినేట్ చెస్తున్నాయి. ముఖ్య సమాచారం పేజీకి కనీసం 75% అయినా ఉండాలి. టపా లొని ఫొటొ సైజు టెంప్లేట్ లొ ఫొటొ స్పేస్ కి పొంతన కుదిరినట్లు లేదు.లెఖిని కి లింక్ కుడా కనబడలేదు. ఖాళీ స్పేస్ కి ఆస్కారం లేకుండా మొత్తం స్పేస్ ని వినియొగించుకుంటే అమరిక బావుంటుంది.
పైగా వ్యాపారం వంటి లింకు ద్వారా వెళ్లినప్పుడు టపాలు లిస్ట్ పద్దతిలొ ఉన్నాయి. గ్రిడ్ అమరిక లో మొత్తం సమాచార విహంగ వీక్షణం లభిస్తుంది ( పాత టెంప్లేట్ లో లాగా)
అంతే కాకుండ మేము do pdf తొ మీ టపాలను సేవ్ చెస్తున్నాము. గత 3 అమరికలలొ comments are running over several pages. 00 లు వస్తున్నాయి. పేజీ స్పేస్ వౄధా అవుతొంది. అది కూడ సరిచూడగలరు
ప్రతి టపా లొనూ “మరిన్ని వ్యాసాలు” లాగ “అనుబంధ పాత టపాలు” కి కూడ లింక్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఉదాహరణ కు ‘సిరియా యుద్ధనికి అమెరికా సెనెట్ ఆమొదం’ అన్న టపా చివరి లొ ‘రసాయన దాడి మా పనే’,’ఒంటరైన ఒటమైనా..’, ‘సిరియా పై దాడి వార్తలు- రూపాయి పతనం ‘ ‘సిరియా లొ యుద్ధనికి అమెరికా దుస్సహసం’, ‘సిరియ పై సామ్రజ్యవాద పంజా’…. వంటి లింకులు ఇవ్వండి . అది కూడ advertisement కి ముందు ఇవ్వాలి.
We are very thankful for 1). Provide such a site for us
2). The advice being asked by you.
and
This template is pleasure for eyes.