సందర్శకులకు ఓ చిన్న విన్నపం!
‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగు కోసం కొత్త టెంప్లేట్ ను అమర్చాను. ఇది పాఠకులకు అనుకూలంగా ఉన్నదని నా అంచనా. కానీ పాఠకులకు అనుకూలంగా ఉందా లేదా అన్న సంగతి ప్రధానంగా పాఠకులు చెప్పాలి తప్ప నేను కాదు. అందుకే మీ సూచనలను ఆహ్వానిస్తున్నాను.
చూడగానే 1 నుండి 5 నంబర్లు కనపడుతున్నాయి. వాటిపైన క్లిక్ చేస్తే మొదటి ఐదు తాజా టపాలు కనిపిస్తాయి. ఇది ఫీచర్డ్ పేజీ. దాని కింద వరుసగా నాలుగు టపాలు కనిపిస్తాయి. వీటికి ఫోటో, టపా శీర్షిక తప్ప మేటర్ కనిపించదు. క్లిక్ చేస్తే మొత్తం టపా చూడొచ్చు.
ఆ తర్వాత భాగం పైన ఉదహరించిన తొమ్మిది టపాలు కాకుండా తదుపరి 3 నుండి 5 టపాలు కనపడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కానీ అలా సెట్ చేయడం ఎలాగో ఇంకా నాకు అర్ధం కాలేదు. అర్ధం అయ్యాక అది కూడా అమర్చుతాను. ఈ టెంప్లేట్ లో ఇంకా ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. సంభషణలు జరిపే (ఛాట్ చేసే) అవకాశం, చిన్న చిన్న సందేశాలను మధ్య మధ్య చొప్పించే అవకాశం… ఇంకా ఏవేవో. అవన్నీ ఎలా అమర్చాలో తెలుసుకున్నాక పాఠకులకు అందుబాటులోకి తెస్తాను.
ఈ లోపు ఈ మార్పులు అలవాటు పడిన పాఠకులకు కొత్తగా, కొంత అసౌకర్యంగా కూడా అనిపించవచ్చు. అందుకనే ఈ టపా!
భ్లాగ్ డిజైన్ బాగుంది. అలానే ఉంచండి.
ఆ ఎర్ర రంగు భయంకరం గా ఉంది దానికి తోడూ ఆ నలుపు చూడలేక పోతున్నాం ఏవన్నా లేత రంగులు వాడండి కొంచెం కూల్ గా వుంటుంది
మరీ అంత గొప్పగా ఏమీ అన్పించటంలేదు, అక్షరాలు స్పష్టంగా చదివేందుకు అంత అనువుగా లేదు, కాబట్టి ముదురు రంగులు అక్షరాలకూ, లేత రంగులు వెనుక డబ్బాలకు వేస్తే సరిపోతుంది.
నాకైతే బాగా అనిపించడం లేదు. ఎందుకంటే బ్లాగ్ ని చూసిన వెంటనే 5 లేదా 6 పోస్టులు
ఒకే పేజీలో కనిపించడం ఏయే అంశాలపై పోస్టులు ఉన్నాయి అని వెంటనే కనిపించాయి. ఇక్కడా కూడా పోస్టులు కనిపిస్తున్నప్పటికీ మొదటిదానికి ఉన్న ప్రయారిటీ తదుపరి వాటికి లేదు. అలాగే అక్షరాల సైజు తగ్గిపోయింది.
అక్షరాల ఫాంట్ సైజు పెంచితే బాగుంటుంది, ఇంతకి ముందు టెంప్లేట్ ఒక ఆర్డర్ లో వుండేది , ఈ టెంప్లేట్ సరిగ్గా సెట్ చేసాక బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఒక ఆర్డర్ లో లేకుండా తికమకగా ఉంది.
1. వర్గాలు టాప్ లెఫ్ట్ లో ఉంటే చూడగానే బాగుంటుంది, వార్త కి సంబందించిన ఫోటో సైజు మరీ పెద్దదిగా వుంది
2. look, కలర్ మటుకు ప్రెసెంట్ టెంప్లేట్ ఏ బాగుంది. చాట్ బాక్స్ bottom right లో వస్తే బాగుంటుంది, టపాలు అన్ని ఒకే స్టైల్ లో ఉంటే బాగుంటుంది,టపాలు ఎలాగో పాత టపాల లిస్టు లోకి వెళ్ళిపోతాయి కద
చూడగానే తాజా పోస్టులు 5 ఫొటో వివరణతో పాటు కనిపిస్తేనే బావుంటుంది. ఇటీవలి జాబులు అన్న చొట 4 మాత్రమే కనిపిస్తున్నాయి. 12 పొస్టులు 3 వరుసల్లొ ఉండేలా చూడండి. సైడ్ బ్లాక్ కలర్ టాబ్స్ సైజు తగ్గించి రెందు వైపులా అలాంటి టాబ్స్ పెట్టండి.ఆ బ్లాక్ కలర్ మార్చండి.
aaa గారు
ఇది వర్డ్ ప్రెస్ వాళ్లు ముందుగా సెట్ చేసిన డిజైన్. దీనిని మన అవసరాలకు వీలుగా మార్చడం కుదరదు. వారు ఉచితంగా అందించే డిజైన్స్ లో మన అవసరాలకు తగ్గదాన్ని ఎంచుకొని ఉపయోగపెట్టుకోవడమే మనం చేయగలిగింది. సి.ఎస్.ఎస్ కోడ్ తెలిస్తే కొన్ని మార్పులు చేసుకోవచ్చని చెబుతారు గానీ అది నాకు తెలియదు. మీరేమన్నా చేయగలరా?
1. Navigability is important: It is not so good in this site.
2. The color schemes are not good
3. This blog’s main agenda (Analysis of international THINGS) does not go good with this color scheme and layout of the navigable items
4. I strongly feel “Journalist” template is good for you. Please see if you like it.
5. For a webpage, the screen’s real estate is important. But this template is wasting that space.
6. When a window is Restored or Maximized the template should fluidly adjust itself. I dont think it is doing so. (I did this in Chrome, Mozilla, Safari and IE). IE is not rendering well. IE is mostly used browser still.
7. As the main theme of this site is noble, please avoid strong colors and strong bordered themes.
Change is good always. Good luck.
snowden గురించి , ఫ్రీడమ్ గురించి తెగ బాధపడే మీరు మీ బ్లాగ్ లో ఇతరుల అభిప్రాయాలని delete చెయ్యడం యంత వరకు నైతికమో మిరే ఆత్మవిమర్శ చేసుకోండి. కాశ్మీర్ పై మీకు తోచిన ప్రతిదాన్ని వక్రీకరించి రాసారు. దాన్ని నిలదీస్తే మీకు పట్టరాని కోపం వచ్చి కామెంట్ delete చేసారు. బహుసా సోషలిస్ట్ దేశాల్లో ఇంతకుమినిచి ఫ్రీడమ్ ఉండదనుకుంటా!!!!
శాయి భార్గవ్
మీ ఊహల్ని, కల్పితాలని వాస్తవాలుగా భ్రమించే హక్కు మీకుంది. మీరు ప్రకటించేవే గొప్ప భావాలు మిగిలినవన్నీ తక్కువ అని నమ్మితే మీరు నమ్మండి! దానికి నేను చేయగలిగేది ఎమీ లేదు.
కాని ముస్లింల పైన పచ్చి విద్వేషం కక్కుతూ, గుజరాత్ ముస్లింల హత్యాకాండని కూడా సమర్ధిస్తూ రాసే మీ వ్యాఖ్యలు ప్రచురించడం సాధ్యం కాదు. పరమత సహనం భారత సంస్కృతి అని గొప్పలు ప్రకటించే మీలాంటివారే ఒక పక్క పరమత విద్వేషాన్ని కక్కుతూ మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి వాపోవడం ఒక దౌర్భాగ్యం.
ఈ బ్లాగ్ లో వ్యాఖ్యలు రాయాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. అవేంటో కామెంట్స్ పాలసీలో చూడండి. ఇంటర్నెట్ లో ‘తెలుగువార్తలు’ వెబ్ సైట్ తప్ప మరొక సైటే లేదన్నట్లుంది మీ ధోరణి. మీ విచ్చలవిడితనాన్ని అనుమతించే సెక్షన్ తెలుగు బ్లాగుల్లో దొరక్కపోదు. మీ విద్వేషపూరితమైన తీర్పులు చెల్లేచోట మీ యిష్టం. ఇతరుల బ్లాగుల్ని కబ్జా చేయాలని ప్రయత్నించడం భావప్రకటనా స్వేచ్ఛ కాదు.
మళ్ళీ మీకు సమాధానం ఇవ్వడం ఉండదు. దూషణలకు దిగడం మంచి పద్ధతి కాదు. ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుందని గుర్తించండి!
మీరు చెప్పే ఆత్మ విమర్శ అవసరం మీకు చాలా ఉందనిపిస్తోంది.
వి.శేకర్ గారు ఈ టెంప్లేట్ కొంచం ఇబ్బంది గా అనిపించడానికి కారణం ఆర్టికల్స్ క్రమం సరిగ్గా కనిపించడం లేదు . పాత టెంప్లేట్ గొప్పదం అన్నిటిని ఒకే వరసలో చుపించించేది.
idi meeru design chEsina website anukunnaanu. anduke anni maarpulu kOrEsaanu. naaku aa koding teleedu.