అంటరానితనం భారత దేశంలో లేనే లేదని చెప్పుకోవడానికి కొంతమందికి చాలా యిష్టం. లేదా భారత దేశంలో అంటరానితనం ఇంకా కొనసాగుతున్నదన్న నిజాన్ని ఒప్పుకోడానికి వారికి మా చెడ్డ చిన్నతనం. ఇతర మతాల లోపాలతో పోల్చుతూ హిందూమతం గొప్పతనం గురించి ఊదరగొట్టుకోవాలంటే దళితులపై సాగుతున్న అమానవీయ వివక్ష లేదని చెప్పుకోవడం వారి అవసరం మరి! దురదృష్టం ఏమిటంటే ఎంత దాచాలని ప్రయత్నించినా వాస్తవాలు దాగవు. ఒడిషాలోని ఓ గ్రామంలో అగ్రకులాల బోరు నీళ్ళు పట్టుకుందని ఒక దళిత మహిళను చావబాదిన ఉదంతం ఈ కోవలోనిదే.
పోనీ ఆ బోరేమన్నా సొంత వాడకానికి తవ్వుకున్నదా అంటే, కానే కాదు. అది ప్రభుత్వం తవ్వించిన బోరు భావి. తాగు నీటి వినియోగానికి ఆ దళిత కాలనీకి అందుబాటులో ఉన్న ఒక్క బోరు బావి ఎండిపోవడంతో నెల రోజుల నుండి వారు నానా అగచాట్లకు గురవుతున్నారు. చెరువులోని మురికి నీరు తాగలేక అగ్రకులాల ఇళ్ల దగ్గర ఉన్న ప్రభుత్వ బోరు బావి నుండి నీరు కొట్టుకుని తీసుకుందని అగ్రకులస్ధులు ఆమె బకెట్ లాక్కుని చావబాదారు.
కేంద్రపర జిల్లాలో జరిగిందీ సంఘటన. జిల్లా కేంద్రానికి 25 కి.మీ దూరంలో ఉన్న పికిరాలి గ్రామంలో సోమవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో కేవలం 10 మాత్రమే దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. వారి కోసం ప్రత్యేకంగా ఒక బోరు బావి తవ్వారు. కానీ అది నెలరోజులుగా పని చేయడం మానేసింది. దానితో షెడ్యూల్డ్ కులానికి చెందిన 10 కుటుంబాలకు తాగు నీరు అందుబాటులో లేకుండా పోయింది. దగ్గరలో చెరువు అయితే ఉంది గానీ అందులోవి మురికి నీళ్ళు. తాగడానికి ఏ మాత్రం పనికిరావు. ఐనా నెలరోజులుగా ఎలాగో అవే తాగుతూ నెట్టుకొచ్చారు.
చెరువు నీళ్ళు ఇక ఎంతమాత్రం తాగడానికి వీలుగా లేకపోవడంతో సోమవారం కల్పనా సేధి అనే ఒక దళిత మహిళ ధైర్యం చేసి అగ్రకులాలు నివసించే చోటికి వెళ్లింది. ఒక అగ్రకుల వ్యక్తి ఇంటిముందు ఉన్న బోరు బావి నుండి నీరు తీసుకోవడానికి ఉపక్రమించింది. దానితో ఆ ఇంటిగలాయనకి (భమర జెనా) ఆగ్రహం తన్నుకొచ్చింది. ఆయనతో పాటు ఇంకా కొంతమంది అగ్రకులస్ధులు అక్కడికి వచ్చి ఆమెను తిట్టడం మొదలు పెట్టారు. కులం పేరుతో దూషిస్తూ ఆమె బకెట్ లాక్కున్నారు. ఆ తర్వాత చేయి చేసుకున్నారు.
దానితో కమలా సేధి పోలీసు స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. అగ్రకులానికి చెందిన కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు నీళ్ళు పట్టుకోకుండా దళితులను నిరోధిస్తూ భయభ్రాంతులను చేస్తున్నారని ఈ సందర్భంగా కమలా సేధి తెలిపింది. మహిళలు, పిల్లలను బోరు బావి దగ్గరకు రానివ్వకుండా అనేకసార్లు అడ్డుకున్నారని, ఎవరన్నా వస్తే తీవ్రంగా కొట్టిన ఘటనలు గతంలోనూ జరిగాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పలుకుబడి కలిగిన వ్యక్తులకు భయపడి ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ది హిందు తెలిపింది.
“ఫిర్యాదుదారు దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ మేరకు ఐ.పి.సి సెక్షన్లు 354, 294, 341, 509 ప్రకారం, అలాగే ‘షెడ్యూల్డ్ కులాలు, తెగలపై అత్యాచారాల నిరోధక చట్టం’ లోని సెక్షన్ 3 ప్రకారం ఎఫ్.ఐ.ఆర్ లోని నిందితులపై కేసు నమోదు చేశాము. కేసును పరిశోధిస్తున్నాం” అని కేంద్రపర సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నృసింగ్ చరణ్ స్వైన్ తెలిపాడని పి.టి.ఐ తెలిపింది. ఈ వార్తను దాదాపు ఆంగ్ల పత్రికలన్నీ కవర్ చేశాయి. ఏ పత్రికా ఇంతకు మించిన వివరాలు ఇవ్వలేదు.
1990ల్లో దర్బన్ (సౌత్ ఆఫ్రికా) లో జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో భారత దేశంలోని కుల సమస్యను లేవనెత్తాలని ఇక్కడి నుండి వెళ్ళిన దళిత ప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలను హిందూ సంస్ధలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వారి లాబీయింగ్ ఫలితంగా భారత ప్రభుత్వం కూడా కుల సమస్యను లేవనెత్తకుండా అడ్డుపడింది. కుల వివక్ష జాతి వివక్ష కిందికి రాదని వారు వాదించి దర్బన్ సదస్సులో కులం గురించి చర్చ జరగకుండా అడ్డుకోవడంలో ఆ విధంగా సఫలం అయ్యారు. కానీ ఆ తర్వాత కుల వివక్ష నిర్మూలించడానికి ప్రభుత్వాలు గానీ, సో కాల్డ్ హిందూ పరిరక్షకులు గానీ కృషి చేసిన దాఖలాలేవీ లేవు. పైగా ఒకటి ఆరా ఉద్యోగాలు, సీట్లు ఇచ్చే రిజర్వేషన్ సౌకర్యం తీసేయాలని డిమాండ్ చేసేదీ వీళ్ళే.
ఎన్నికల్లో చూసినా, కోర్టు కేసుల్లో చూసినా, చివరికి ఆఫీసుల్లో చూసినా కులం ప్రస్తావన లేకుండా ఒక్క పోటీ గానీ, కేసు నిర్వహణ గానీ, సామాజిక కార్యక్రమాల నిర్వహణ గానీ జరగవు. ప్రభుత్వ రంగ సంస్ధల్లో కార్మికుల యూనియన్లలో కూడా కులాలకు అతీతంగా ఎన్నికలు జరగని పరిస్ధితి రాజ్యమేళుతోంది. తమిళనాడులో దళిత యువకులను ప్రేమించవద్దంటూ ఏకంగా ఒక రాజకీయ పార్టీయే ప్రచారానికి దిగిన దారుణ పరిస్ధితి కొనసాగుతోంది. ఈ హీన పరిస్ధితి ఇంకా ఎన్నాళ్లు?
కులంపట్టింపు అంతత్వరగా రూపుమాపడం జరగక పొవచ్చు!కులాంతరవివాహాలు చేసుకొన్నవారికి ప్రభుత్వంప్రత్యేక సౌకర్యాలను(వారిసంతానానికి ప్రభుత్వ ఉద్యోగం,నివాససౌకర్యం,ప్రయాణాలలో రాయితి మో,,)కల్పించినప్పుడు కులాంతర వివాహాలుచేసుకోవడానికి ముందుకువస్తారు! వీటితోపాటు కులాన్ని నీచరాజకీయాలుకు వాడకుండా కులనిర్మూలనకై విస్త్రుత ప్రచారకార్యాలను రూపొందుంచుకొని అమలుజరపాలి.
why you always mentions it as hindu problem and exaggerate it, i think then only souls of marxists will get some calm satisfaction. caome here in tamilnadu i will show you discrimination in churches, untouchability in churches, what about untouchability in gurudwars of punjab and many masjids in uttar pradesh. i think marxists feel its their birth right to defame hinduism. well go on, soon our hindu rashtra will come and we will kick all marxists out from our land