ఒక కదలికను గానీ, ఆ కదలికలోని వేగాన్నిగానీ పసిగట్టాలంటే కదిలే చిత్రాల -అనగా వీడియో- వల్లనే సాధ్యం అవుతుంది. ఒక స్టిల్ ఫోటోలో అందులోని పాత్రల కదలికను, వేగాన్నీ చూపించాడంటే ఆ ఫోటోగ్రాఫర్ కి బహుశా ఎంతో ప్రతిభ అవసరం అనుకుంటాను. ఫోటోలోని పాత్రలు కదలకుండా ఉన్నప్పటికీ అవి కదులుతున్నట్లుగా, పైగా వేగంగా కదులుతున్నట్లుగా చూపాలంటే కొన్ని మెళకువలు, మరి కొంత టెక్నాలజీ సహాయం తప్పనిసరి అవసరం కావచ్చు.
ఫోటోగ్రాఫర్లే మాంత్రికులుగా మారితే కట్టిపడేసే ఫోటోలు ఆవిష్కృతం అవుతాయని కింది ఫోటోలను చూస్తే తెలుస్తుంది. ఫిజి దేశపు నమోటు ద్వీపం ఒడ్డున పదుల మీటర్ల ఎత్తుకు ఎగసి పడిన అలపైన సర్ఫర్ చేస్తున్న విన్యాసం, కొండవాలును తాకుతూ మోటార్ సైకిల్ రైడర్ దుమ్ము రేపిన దృశ్యం, స్కేటర్ తో పాటు కదులుతూ రోడ్డు వెనక్కి వెళ్లిపోయే దృశ్యాన్ని చిత్రీకరించిన తీరు, మంచు కొండలపై వేగంగా జారిపోయే స్కేటర్, నీటి అడుగు నుండి చిత్రించిన సర్ఫర్ విన్యాసం… ఇంకా అనేక దృశ్యాలను కింది ఫొటోల్లో చూడవచ్చు.
‘రెడ్ బుల్ ఇల్యూమే ఇమేజ్ క్వెస్ట్’ ఫోటో పోటీల్లో వివిధ తరగతుల్లో బహుమతులు గెలుచుకున్న ఫొటోలివి.
ది అంట్లాంటిక్ అందించిన ఈ ఫోటోలు చూస్తే మనకి కూడా ఫోటోగ్రాఫర్ కావాలన్న ఆశ కలిగితే ఆశ్చర్యం లేదు.