మహిళా పోలీసుకే ధైర్యం లేకపోతే నాకెలా ఉంటుంది –ఫోటో జర్నలిస్టు


(ముంబై ఫోటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం పట్ల టైమ్స్ ఆఫ్ ఇండియా ఫోటో జర్నలిస్టు ఉమా కదం స్పందన ఇది. ది హిందు పత్రిక దీనిని ప్రచురించింది. ఉమా కదం గత 13 యేళ్లుగా టైమ్స్ గ్రూపులోని వివిధ పత్రికలకు ఫోటో జర్నలిస్టుగా పని చేస్తున్నారు.)

నేను ఫోటో జర్నలిస్టుగా నా కెరీర్ ని 2001లో ప్రారంభించాను. అప్పట్లో నగరంలో ఉన్న అతి కొద్దిమంది మహిళా ఫోటోగ్రాఫర్లలో నేను ఒకరిని. మొదటి రెండు లేదా మూడు సంవత్సరాల వరకూ ఈ మగవారి కోటలో నేను చాలా పిరికిగా, భయం భయంగా గడిపాను. కానీ పరిస్ధితులు నన్ను మార్చాయి. పోరాటంతో ముందుకు సాగడానికి వీలుగా నన్ను నేను దృఢపరుచుకున్నాను. కానీ ఐదుగురు మగాళ్లు నాపై దాడి చేస్తే ఏం చేయాలని ఇప్పుడు డోలాయమానంలో పడిపోయాను.

విధి నిర్వహణలో నిర్మానుష్యమైన చోటికో లేదా సున్నితమైన ఏరియాల్లోకో మేము వెళ్ళినపుడు సమస్యలు ఎదుర్కొంటాము. ఒక మహిళగా అటువంటి చోట్ల కనపడడం వల్ల  ఇతరుల దృష్టి మాపై పడడం ఎలాగూ తప్పదు. చేతిలో కెమెరా ఉంటే పరిస్ధితి మరింత దిగజారుతుంది. మిల్లులు మూతపడుతున్నపుడు నేను అనేకసార్లు ఫోటోలు తీశాను. నగరంలో నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. సియోన్ ఫోర్ట్, మజ్గావ్ డాక్ లాంటివి. కొన్ని సంవత్సరాల క్రితం సియోన్ ఫోర్ట్ వద్ద కొందరు పురుషులు నన్ను వెంబడించడం నాకింకా గుర్తుంది. అది భయానకం, కానీ ఎలాగో త్వర త్వరగా అక్కడి నుండి బైటపడ్డాను.

మరొక సమస్య ఏమిటంటే మగ ఫోటోగ్రాఫర్ల నుండి ఎదురయ్యే వెకిలి చేష్టలు. సరైన కోణంలో ఫోటో సంపాదించడం కోసం ఫోటోగ్రాఫర్లందరూ తరచుగా ఒకే చోట దగ్గర దగ్గరగా నిలబడి ఒకరిమీద ఒకరం పడాల్సి వస్తుంది. కొంతమంది ఫోటోగ్రాఫర్లు నేను వారికి శారీరకంగా దగ్గరగా ఉండడాన్ని అవకాశంగా తీసుకున్నా, మరి కొందరు నేను వారికి కొంత దూరంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ విధంగా చూసినా నేను ఆడదాన్ని కాబట్టి అక్కడ ఉండడానికి తగినదాన్ని కాదని గుర్తుచేస్తున్నట్లుగా ఉండి నిస్పృహ వచ్చేస్తుంది.

నా ఉద్యోగం స్వభావం రీత్యా వేళ కానీ వేళల్లో అనేక రకాలైన చోట్లకు వెళ్లాల్సి ఉంటుంది. అనేకసార్లు ఉదయం 2 గంటలప్పుడు ఒంటరిగా ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు భయం కలుగుతోంది. ఈ అత్యాచారం జరిగిన తర్వాత మా అమ్మ ఎంతగా భయపడిందంటే మునుపటిలా (ఎప్పుడంటే అప్పుడు) బైటికి వెళ్లొద్దని కోరుతోంది. కానీ నాకు ఎంతగానో సంతృప్తి కలిగించే పనిని నేనెలా ఆపగలను? ఇటీవలే ఒక మహిళా పోలీసు నాతో కలిసి ట్రైన్ లో ప్రయాణిస్తూ ఈ నగరంలో తనకు భద్రత ఉందని ఎంతమాత్రం అనిపించడం లేదని చెప్పింది. ఒక పోలీసుకే ధైర్యం లేకపోతే నాకెలా ఉంటుంది?

3 thoughts on “మహిళా పోలీసుకే ధైర్యం లేకపోతే నాకెలా ఉంటుంది –ఫోటో జర్నలిస్టు

 1. సమాజ దృష్టి కోణంలో(ఆడవారి విషయం)ఉన్న లోపం ఇది.ఆడవారందరిలో తన తల్లిని చూడగలిగితే ఇటువంటి భయాలుతొలగి పోతాయి.

 2. ఇన్వెస్టి గేటివ్ జొర్న లిజం , స్త్రీలకే కాక , పురుషులకూ , ప్రమాద కరమైనదే ! మాఫియా ల గురించి రాస్తున్న ఒక పురుష జొర్న లిస్టు ను ఏడాది క్రితం మహారాష్ట్ర లో హత్య చేశారు, పట్ట పగలే ! ఇప్పటి వరకూ హంతకులను పట్టుకున్నట్టు వినలేదు !
  సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ తప్పని సరిగా తీసుకోవాలి జొర్న లిస్టు స్త్రీలూ , పురుషులూ కూడా !అంతే కాకుండా , వారు ఇన్వాల్వ్ అయే ప్రతి ఎసైన్మెంట్ కూ , ఒక నమ్మ దగిన బ్యాకప్ ముందే ఏర్పరుచుకోవాలి ! అంటే కనీసం రెండు మూడు మైళ్ళ దూరం లో తమ టీం మెంబర్ ను అప్రమత్తం చేసి ఉంచడం !
  ముఖ్యం గా, వ్యక్తి గత భద్రత కు అనేక ఎలెక్ట్రానిక్ పరికరాలు లభ్యం అవుతున్నాయి మార్కెట్ లో ప్రస్తుతం , వాటిని నిర్బంధం గా జొర్న లిస్టు లందరూ ఉపయోగించాలి ! పత్రిక మేనేజ్మెంట్ వారు ఆ బాధ్యత తీసుకోవాలి , వారి ఉద్యోగులను బలి పశువులు గా చేయకుండా !
  నివారణ చర్యలలో , కేవలం పోలీసులను నిందించి లాభం లేదు ! ఎందుకంటే, వారు ప్రత్యక్షం అయేదే , అంతా జరిగిన తరువాత కదా !
  రోగాల కు చికిత్స లేక మరణాలు సంభవిస్తున్నాయి ఎక్కువ గా అనే అందరూ సహజం గా అనుకుంటూ ఉంటారు ! కానీ ప్రపంచం మొత్తం లో కేవలం స్మోకింగ్ రిలేటెడ్ మరణాలే ప్రతి ఏడాదీ అరవై లక్షలు ! భారత దేశం లో ప్రతి ఏడాదీ తొమ్మిది లక్షల మంది స్మోకింగ్ సంబంధించిన రోగాల వల్ల మరణిస్తున్నారు ! అట్లాగే జొర్న లిస్టు లు నేరాల మీద నిరంతరం రాస్తూ ఉన్నా కూడా నేరాలు ఏవీ తగ్గట్లేదు కదా ! మనుషుల ఆలోచనా ధోరణి మారాలి ! అత్యా చారాల విషయం లో కానీ, నేరాల విషయాలలో కానీ , వారి ఆరోగ్య విషయాలలో కానీ !
  అది జరగనంత కాలం ( భారత దేశం లో ) జీవితాలు, దైవాధీనం సర్వీసులే ! అప్పుడు కర్మ సిద్ధాంతం ఎట్లాగు ఉంది కదా , స్వాంతన కలిగించడానికి !

 3. స్త్రీలు ఇక్కడ మానసికంగా, బౌతికంగా, రూపొందించబడినవారు – , సహజంగా పెరిగిన వారు కాదు.
  అది ఈ సమాజ అంతర్గతనిర్మాణంలోనే వుంది.
  1.మానసికంగా సామాజిక నమూనా చట్రంలో చెక్కబడి లేక మలచబడి వారి సైకాలజి వుంటుంది. ముందు కుటుంబ వ్యవస్తా దాన్ని ఇముడ్చుకొనే సమాజం.అంతకు మించి స్త్రీ మనస్తత్వం వుండదు- కొన్ని మినహయింపులు కొందరి విషయంలో వున్నప్పటికి.

  2. శరీరనిర్మాణం కూడా అందుకు అనుగుణంగానే పెంచబడింది- బొన్సాయి మొక్కల లాగా. పురుషుని చేతి లో వదిగి పొయ్యేలాగా. పురుషునిపై తిరగబడకుండా వుండేందుకు అనుగునంగా.
  ఇందుకు ఉదాహరణ మనసమాజం ఆడపిల్లలని తగినంత, మగపిల్లలకి సమానంగా, ఆహారం ఇవ్వకపోవడమని గమనించాలి. అది ఈతరములో కాక పోయినా ముందు తరాల వాల్లు ఆడ పిల్లల్ని పెంచే విధానం మనకు తెలుసు. ఇది తరతరాల అణచివేతలో బాగంగానే అనుకోవాలి.

  ఈ విషయం జన్యు శాస్త్రం నిరూపిస్తుంది (ఒక ఉదాహరణ: మహశ్వేతాదేవి గారి ‘రుడాలి ‘ కదల పుస్తకానికి ముందుమాటలో చెపుతారు: బ్రెజిల్‌ పౌష్టికహార సంస్థ వ్యవస్తాపకుడు D.ఖాస్ట్రొ ‘ది జాగ్రఫీ ఆఫ్‌ హంగర్‌ ‘ అనే పుస్తకం లో తీవ్రమైన పౌష్టికాహార లోపం మనుషుల్ణి, జంతువుల్ని శారీర కంగా ఎదగకుండ గిడసబారుస్తుంది. షెట్‌ లాండ్‌ ద్వీపంలో కనబడ్డ పిగ్మీ (పొట్టి) గుర్రాలను అమెరికాలో అమ్మకానికి తీసుకెల్లగ, వాటికి అక్క్డడ మంచి పుష్టికరమైన మేత దొరికే సరికి అవి తిరిగి ఎదగడం ప్రరంబించాయి. మూడు తరలు గడిచేప్పటికల్ల అవి ఇతర గుర్రాలవలె ఎత్తుగా, దృడంగా మారి పోయాయి . ఎమిల్‌ టార్డీ అనే మానవశాస్త్రవేత్త ఆఫ్రికాలోని భూమధ్య రేఖా ప్రాంతంలో చాలా పొట్టిగా వుండే పిగ్మీలను కనుగొన్నాడు. అయితే ఆ ప్రాంతం వ్యవసాయికంగా అభివృద్ది చెంది, అక్కడి వాతావరణం లో మార్పులొచ్చాక పిగ్మీలు క్రమంగా సాధారన మానవుల పరిమానాన్ని సంతరించుకొన్నారు.)

  తరాల అణచి వేత తరువాత, అసూర్యం పశ్యలైన తమ ఆడ వారిని బయటి ప్రపంచంలోకి పంపక తప్పని అధునిక సామాజిక పరిస్తితులు.(అయితే శ్రామిక మహిల ఎప్పుడు సమాజ ఉత్పతికి తనవంతూ కృషి జరుపుతూనే ఉంది) ‘ ఆడది ‘నే మాట వింటేనే అందమైన బొమ్మగా వినిపించే సమాజంలో స్త్రీ పోలిసు అయితే ఏమీ, మిలిట్రీ అయితే ఏమీ మగవాడి కళ్లు మూసుక పోవటానికి?.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s