యూరోజోన్ ఎక్స్ ప్రెస్: గాస్ప్! (ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న శబ్దం)
పీతలు: “పాపం! వాళ్లింకా ఒడ్డున పడనేలేదు”
–
ఐరోపా ఖండంలోని 28 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ (ఇ.యు) గా ఏర్పడగా అందులోని 17 దేశాలను యూరో జోన్ అని పిలుస్తారు. ఈ 17 దేశాలు తమ తమ జాతీయ కరెన్సీలను వదిలేసుకుని ఒకే కరెన్సీ ‘యూరో’ ఏర్పాటు చేసుకున్నాయి. యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) తప్ప మిగిలిన ప్రధాన దేశాలన్నీ యూరోజోన్ సభ్య దేశాలే. 2008-09 లో ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాత యూరో జోన్ దేశాలు ఋణ సంక్షోభంలో కూరుకుపోయాయి.
గ్రీసు తో మొదలుకుని యూరోజోన్ దేశాలు వరుసగా ఈ ఋణ సంక్షోభంలో ఒక్కొక్కటిగా కూరుకుపోతున్నాయి. మొదట గ్రీసు, ఆ తర్వాత పోర్చుగల్, అనంతరం ఐర్లండ్, స్పెయిన్, ఇటీవల సైప్రస్ అధికారికంగా ఋణ సంక్షోభంలో ఉన్నాయి. అధికారికంగా అనడం ఎందుకంటే యూరోపియన్ కమిషన్-యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్-ఐ.ఏం.ఎఫ్ లు సమ్క్యుక్తంగా ఏర్పరిచిన ఋణ నిధి నుండి సహాయం ఇవ్వాలని కోరిన దేశాలు ఇప్పటివరకూ ఈ అయిదే. అయితే ఇటలీ, ఫ్రాన్సు, యు.కె, చివరికి జర్మనీ కూడా తర తమ స్ధాయిల్లో ఋణ సంక్షోభానికి దగ్గరగా ఉన్నాయి.
జర్మనీ జి.డి.పి 2013 మొదటి రెండు త్రైమాసికాల్లో స్వల్ప జి.డి.పి వృద్ధిని నమోదు చేసింది. ఆ మాత్రానికే ‘హమ్మయ్య!’ అని నిట్టూర్పు విడుస్తున్నారు. యూరో జోన్ ఇక సంక్షోభం నుండి బైటపడడం ‘ప్రారంభం’ అయినట్లే అని సంతోషిస్తున్నారు. ప్రారంభం అయినట్లే అంటే ఇంకా పూర్తిగా బైటపడలేదని, ఇప్పుడిప్పుడే బైటపడుతోందనీ అర్ధం. అసలు ఈ సంక్షోభం నుండి ఎలా బైటపడాలా అన్న విషయంలో ఐరోపా, అమెరికాలు తగువులాడుకుంటున్నాయి.
అతిగా పొదుపు విధానాలు అమలు చేయడం వల్ల ఆర్ధిక వ్యవస్ధలు ఇంకా కుచించుకుపోయి జి.డి.పి పడిపోతోందనీ, అలా కాకుండా మరింత ఆర్ధిక ఉద్దీపనలు ఇచ్చి ముందు వృద్ధి వైపు దృష్టి సారించాలని అమెరికా వాదిస్తోంది. కానీ జర్మనీ అందుకు అంగీకరించడం లేదు. జి.డి.పి తగ్గిపోయినా సరే ముందు అప్పుల భారం తగ్గించుకోవాలనీ, దానికి పొదుపు విధానాలు వినా మార్గం లేదని జర్మనీ గట్టిగా వాదిస్తోంది. స్టిములస్ ఇవ్వాల్సి వస్తే జర్మనీ పైన అధిక భారం పడడం ఖాయం.
మొత్తం మీద జర్మనీతో సహా యూరో జోన్ అంతా ఇప్పటికీ సంక్షోభంలో కూరుకునే ఉన్నదని ఈ కార్టూన్ చెబుతోంది. దీనిని బ్రిటన్ వీక్లీ ‘ది ఎకనమిస్ట్’ ప్రచురించింది.
అతిగా పొదుపు విధానాలు అమలు చేయడం వల్ల ఆర్ధిక వ్యవస్ధలు ఇంకా కుచించుకుపోయి జి.డి.పి పడిపోతోందనీ, అలా కాకుండా మరింత ఆర్ధిక ఉద్దీపనలు ఇచ్చి ముందు వృద్ధి వైపు దృష్టి సారించాలని అమెరికా వాదిస్తోంది. (That is wrong). కానీ జర్మనీ అందుకు అంగీకరించడం లేదు. జి.డి.పి తగ్గిపోయినా సరే ముందు అప్పుల భారం తగ్గించుకోవాలనీ, (No one wants debt to pile up or rise) దానికి పొదుపు విధానాలు వినా మార్గం లేదని జర్మనీ గట్టిగా వాదిస్తోంది.( that is correct) స్టిములస్ ఇవ్వాల్సి వస్తే జర్మనీ పైన అధిక భారం పడడం ఖాయం. one has to save his skin.