గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తాను కప్పుకున్న ఒక్కో ముసుగూ విప్పి పారేస్తున్నారు. తాను వ్యాపారులు, కంపెనీల పక్షమే కానీ ప్రజల పక్షం కాదని చక్కగా చెప్పుకుంటున్నారు. తన గురించి పట్టించుకోవాల్సిన అంశం మతోన్మాదం కాదనీ, తన పక్కా ప్రజా వ్యతిరేక విధానాలే అనీ జనానికి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ‘మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం’ ఛారిటీ పధకం అనీ, ఓట్ల కోసం ఉద్దేశించిన అలాంటి పధకాలు తనకు ఇష్టం లేదనీ నరేంద్ర మోడి ప్రకటించారు. గ్రామీణ పేదల ఆర్ధిక స్ధాయిని గొప్పగా వృద్ధి చేసిందంటూ అద్వానీ సర్టిఫికేట్ ఇచ్చిన ఈ పధకం మోడి ప్రధాన మంత్రి అయితే రద్దు చేసేస్తారని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
నరేంద్ర మోడి ప్రకారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ గ్రామీణ అభివృద్ధి పధకాలు ఓట్ల కోసం ఉద్దేశించిన ‘దాన ధర్మాల’ కార్యక్రమాలు. వాటికి బదులుగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ధృఢమైన అభివృద్ధి పధకాలను (solid development work) అమలు చేయాలి. “గ్రామీణాభివృద్ధి గురించి మేము ఒక సంగతి చెప్పాము. అటువంటి పధకాల్లో బాధ్యత ఉండాలి. కానీ, ఈ రోజుల్లో, దేశంలో దాన ధర్మాలు చేసే ధోరణి పెరిగిపోయింది. ఎందుకంటే వారికి (కేంద్రం) ఎన్నికల్లో గెలవడం తప్ప మరో ఉద్దేశ్యమే లేదు” అని మోడి వాకృచ్చారు.
“దృఢమైన అభివృద్ధి జరగాలి. అలా అయితేనే ప్రజలు తమ కాళ్లమీద తాము నిలబడే విధంగా సాధికారత సిద్ధించి గ్రామ ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి కావడానికి దోహదం చేస్తుంది. అది జరగకపోతే గనక మనం ఎంత ఇచ్చినా మార్పు సాధ్యం కాదు’ అని మోడి వ్యాఖ్యానించారు. గాంధీ నగర్ లో ‘పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి’ అనే అంశం పైన జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారని ది హిందు తెలిపింది. 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన రైతులు ఇందులో పాల్గొన్నారట. ఆర్ధిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ, ఉపాధి కల్పించడం ద్వారా దారిద్ర్యాన్ని పారద్రోలడం కంటే మించిన పెద్ద కల ఏ ప్రభుత్వానికైనా ఉండరాదని తన ఉద్దేశ్యంగా మోడి చెప్పుకున్నారు.
మహాత్మా గాంధీ ప్రబోధించిన గ్రామ రాజ్యం, గ్రామ స్వరాజ్యంల గురించి కూడా మోడి తలచుకున్నారు. గాంధీ ఆశయాలను అమలు చేసినట్లయితే గ్రామాలు ఎన్నాడో పట్టణాలను దాటిపోయి ఉండేవని ఆయన చెప్పారు. కనీసం ఇప్పుడు అమలు చేసినా ఎవరూ గ్రామాలు వదిలి పట్టణాలకు పోయే ఆలోచన చేయరని మోడి నిర్ధారించారు. అయితే పదేళ్లుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడిని గాంధీ ఆశయాలను అమలు చేయకుండా అడ్డుకున్నదెవరో మోడి చెప్పలేదు.
దేశానికి లోక్ సభ ఎంత అవసరమో గ్రామాలకు గ్రామ సభ అంత అవసరం అని కూడా మోడి చెప్పారు. మరయితే గ్రామ సభల తీర్మానాలను తొక్కి పెట్టి లేదా గ్రామస్ధులు లేకుండా తూతూ మంత్రంగా గ్రామ సభలు నిర్వహించి గిరిజనుల గ్రామాలను, పొలాలను అడవులను తీసుకెళ్ళి కంపెనీలకు, ధనికులకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెపుతుంటే మోడి గారు ఎందుకు అడ్డు చెప్పలేదు? ఒరిస్సాలో పోస్కో ఉక్కు కంపెనీకి సంవత్సరం పొడవునా గిరిజనులకు జీవనోపాధి కల్పించే తమలపాకు తోటల్ని అప్పజెపుతుంటే ఆయన ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? మత్స్యకారుల గ్రామ సభలు వద్దు వద్దు అని నిరసిస్తున్నా వారి గుండెల మీద కూడంకుళం అణు కర్మాగార కుంపటి నిర్మింస్తుంటే మోడి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికైనా ఆయన కూడంకుళం వ్యతిరేక సంఘానికి మద్దతు ఇవ్వగలరా? పోస్కో వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వగలరా? స్వయంగా గుజరాత్ లోనే నర్మదా బచావో ఆందోళన్ సంఘం కింద వేలాది గ్రామీణులు సంవత్సరాల తరబడి ఆందోళనలు నిర్వహిస్తే మోడి గారు ఎందుకు పట్టించుకోలేదు? (గుజరాత్ అభివృద్ధి బండారం ఏమిటో ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడండి.)
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పధకం వలన తమకు తక్కువ ధరలకు కూలీలు దొరకడం లేదనీ, కాబట్టి ఆ పధకాన్ని పొలం పనుల సమయంలో రద్దు చేయాలనీ ధనిక రైతులు అనేక చోట్ల డిమాండ్ చేశారు. ధనిక రైతుల డిమాండ్లనే మోడి వల్లె వేస్తున్నారన్నది స్పష్టమే. దానికాయన గ్రామ స్వరాజ్యం అనే ముసుగు తొడుగుతున్నారు. తాను భారత దేశ గ్రామీణులకు, ముఖ్యంగా రెక్కలు ముక్కలు చేసుకునే కూలి జనం ప్రయోజనాలకు ఎంత వ్యతిరేకమో మోడి ఎన్నికల ముందే చెప్పుకోవడం ఒక విధంగా అభినందించవలసిన విషయం కావచ్చు. కానీ ఆయన ఉద్దేశ్యాలేమిటో జనానికి చేరేది ఎలా?
బి.జె.పి నాయకులు అద్వానీ మాటల్లోనే చెప్పాలంటే దేశంలో కోట్లాది గ్రామీణ ప్రజలకు గ్రామీణ ఉపాధి హామీ పధకం కల్పతరువుగా ఆవిర్భవించింది. ఆ పధకం వల్ల పల్లె ప్రజలకు ఎన్నడూ లేని విధంగా మేలు జరిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఈ గ్రామీణ ఉపాధి హామీ పధకమే అని కొందరు విశ్లేషించారు కూడా.
భారత దేశంలోని సో కాల్డ్ ప్రధాన స్రవంతి పార్టీలన్నీ కూడా అమలు చేసే ఆర్ధిక విధానాలు ప్రధానంగా ధనికులు, వారి కంపెనీలకు ఉద్దేశించినవే. భారత దేశ ధనికుల ప్రయోజనాలు భారత ప్రజల ప్రయోజనాలకు బదులుగా విదేశీ, స్వదేశీ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు అనుబంధించబడి ఉంటాయి. అందుకే ప్రజల కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా కొన్ని పధకాలు అమలు చేయడం, అవి పాపులిస్టు విధానాలుగా పత్రికలు ప్రచారం చేయడం, పాపులిస్టు విధానాలు అంటే ఆవేవో అమలు చేయకూడని విధానాలుగా ముద్ర వేయడం జరుగుతోంది. “దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు” అన్నదే నిజం అయితే ప్రజల కోసం అమలు చేసేది ఏ విధానం అయినా పాపులిస్టు అన్న ముద్ర పొందడం సరైంది కాదు. ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉండే పత్రికలు ఈ భాషను, భావజాలాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మోడి చెప్పినట్లు దృఢమైన ఆర్ధిక విధానం దేశంలో ఏమైనా ఉంటే వాటిల్లో మొట్టమొదటి స్ధానం ‘భూ సంస్కరణలదే’. ప్రభుత్వాల వద్దా, భూస్వాముల వద్దా, దళారీ పెట్టుబడిదారుల వద్దా, విదేశీ కంపెనీల వద్దా పేరుకుపోయిన కోట్లాది ఎకరాల మిగులు భూములను, సాగు భూములను, బంజరు భూములను భూమి లేని పేదలకు పంచి ఇవ్వడం కంటే మించిన ఆర్ధిక కార్యకలాపం ఈ దేశంలో మరొకటి ఉండబోదు. ఆ కార్యక్రమాన్ని మోడి అమలు చేయగలరా? చస్తే చేయరు!
Asalu modiney Cong agent ani naaku doubt. If you think, now modi is created as the only alternative to cong!! Its like your childhood story. Enemy creates one guy as a good man, people trust him, then he dooms them by joining hands with the enemy!
ఉపాధి హామి పధకం చాలా వరకు వ్యవసాయ కార్యకలాపాల కూలి ధరలను పెంచడానికి దారి తీసింది. దాని ప్రబావం వలనే వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెరిగి ద్రవ్యొల్బణం రూపంలొ దాన్ని అనుభవిస్తున్నాం. ఈ పధకం ధనిక రైతుల సమస్య మాత్రం కాదు. ధనిక రైతు స్తొమతు కు తగ్గట్టు యంత్రీకరణ తొ సాగు చేస్తున్నారు. దీని వలన నష్టపొతుంది సన్నకారు రైతులు. కూలి ధరలకు తట్టుకులెక అయినకాడికి ఉన్న పొలం అమ్ముకొని నగరలాకు వలస పొతున్నారు. దీనికి తోడు ఆహర భద్రత చట్టం సరైన లబ్దిదారులకు కాకుండా అమలు చెస్తే వ్యవసాయం లొ సంక్షోభం మరింతగా ఉంటుంది. ఉపాధి హామి పధకం అమలులొ సరైన ప్రణాలిక లేకపోవడం వలనే ఈ ఫలితం. స్తానికంగా వ్యవసాయ పనులు లేనప్పుడు దీన్ని అమలు చెస్తేనే వ్యవసాయ కూలీల ఆదాయం లొ వ్రుద్ది చోటుచేసుకుంటుంది.
సురెష్ చావ గారు చెప్పింది నూరు శాతం నిజమె. ఒక సారి గ్రామాల్లొకి వెల్లి చూడండి. రైతు కూలీలు దొరక్క ఎంత ఇబ్బంది పదతున్నరొ. మాట్లడితె భూమి పంపకం అని వ్యఖ్యానలు కాదు. ఫ్రభుత్వం దగ్గర మిగులు భూమి ఎంత వుంది? ఎంత మంది భూమి లేని రైతు కూలీలు వున్నరు? దాన్ని పంచితె ఓక్కక్కరికి ఎంత భూమి వస్తుంది? ఆలా ఇచ్చిన భూమి ఆ రైతు కుటుంబ పొషనకు సరిపొతుంద? ఈ విషయం మీద ఎవరికైన అవగాహన వుంటె చెప్పగలరు.
సురేష్ గారు, మీరు వ్యక్తం చేసిన అభిప్రాయం పైపై పరిశీలన ఫలితం. ద్రవ్యోల్బణంకు కారణం కూలీధరలు పెరగడం అని ఇంతవరకూ ఎవరూ చెప్పలేదనుకుంటాను.
ద్రవ్యోల్బణం పెరగడం అంటే ద్రవ్య చలామణి ఎక్కువగా ఉండడం అని గ్రహిస్తే అది కూలీ ధరలు పెరగడం వలన జరగలేదు. కూలీ ధరలు ఎంత పెరిగితే వ్యవస్ధలో ద్రవ్య చలామణీ పెరగాలి? అమెరికా, ఐరోపాల్లో విపరీతంగా ఆర్ధిక ఉద్దీపన పధకాలు ఇస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు 0.25 శాతం. ఇ.సి.బి వడ్డీ రేటు 0.5 శాతం. ఇవి కాకుండా ఫెడరల్ రిజర్వ్ నెలకు 85 బిలియన్ డాలర్లు తమ ట్రెజరీ బాండ్లను తానే కొనుగోలు చేసి ఆర్ధిక వ్యవస్ధలోకి వదులుతోంది. ఈ డబ్బంతా ఎఫ్.ఐ.ఐలు, ఫండ్స్ ద్వారా ఇతర దేశాల మార్కెట్లలోకి వచ్చి చేరుతోంది. ఇది కాకుండా నల్లడబ్బు హవాలా మార్గంలో వేలాది కోట్లు దేశానికి తరలిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడానికి ఇవి ప్రధాన కారణం. మీరు చెప్పినట్లు కూలీరేట్లు కాదు. దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్ధలో కేవలం కొన్ని వందల కోట్లలో ఉండే కూలీ రేట్లు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం అని భావించడం కూలీలు శాశ్వతంగా దరిద్రంలో బతకమని శాసించే భావజాలానికి ప్రతిరూపం. ఇది గర్హనీయం. భారతీయులు ఎక్కువగా తినడం వల్లే ఆహార ధరలు పెరుగుతున్నాయని ఒబామా ఆరోపించడంతో సమానం ఇది.
ఉపాధిహామీ పధకం రద్దు చేయాలని డిమాండ్ చేసింది సన్నకారు రైతులు కాదు. సన్నకారు రైతుల పరిస్ధితి హీనంగా ఉండడానికి కారణం ఎరువులు, పురుగుమందుల ధరలు అందుబాటులో లేకపోవడం. పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధరలు లేక వారి శ్రమ దళారీ వ్యవస్ధ పాలు కావడం. ఇవేవీ పరిగణించకుండా అసలుకే తక్కువగా ఉన్న కూలీ రేట్ల మీద పడిపోవడం, ఏకంగా ద్రవ్యోల్బణానికి కూడా కూలీ రేట్లే అని చెప్పడం బాధ్యతారాహిత్యం అంటే మీరు మరోలా అనుకోకూడదు.
సన్నకారు రైతులు ఎప్పుడూ టి.వీల వద్దకు వచ్చి ఉపాధిహామీ పధకం గురించి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. ఆ పని చేసింది ధనిక రైతులే. ఇటు కోస్తా ప్రాంతం దగ్గర్నుండి అటు ఉత్తర భారతం వరకూ ఈ వాదన బలంగా వినిపించింది ధనిక రైతులే. ధనిక రైతులు చెప్పారు కాబట్టే అది ప్రబలంగా పత్రికలకు, ఛానెళ్లకు ఎక్కింది. సన్నకారులు చెప్పి ఉంటే ఛానెళ్లు, పత్రికలు తర్వాత సంగతి అసలు ఎవరూ వినిపించుకునేవారే కాదు. సన్నకారు రైతుల డిమాండ్లు ప్రధానంగా దళారీ వ్యవస్ధను రద్దు చేయాలనీ, గిట్టుబాటు ధరలు ఇవ్వాలనీను. ఈ డిమాండ్లు ఎవ్వరూ పట్టించుకోరు. ధనిక రైతుల డిమాండ్లు మాత్రం పతాక శీర్షికలకు ఎక్కుతాయి. వారికి ఉన్న పలుకుబడి అలాంటిది.
ఉపాధి హామీ పధకంలో బోలెడంత అవినీతి జరుగుతోంది. ఒక్కో కూలీకి వంద రోజులు కనీసం పని ఇవ్వాల్సి ఉండగా సగటున 50 రోజుల కంటే తక్కువే పని ఇస్తున్నారు. అందులో కూడా యంత్రాలతో పని చేసి కూలీలతో చేయించామని చెప్పి ఆ డబ్బు బొక్కుతున్నారు. దానికి సంబంధించిన వార్తలు అనేకం తెలుగు పత్రికల జిల్లా ఎడిషన్లలో కూడా వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఉపాధి హామీ పధకం కూలీ డబ్బు చేతికి రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. పరిస్ధితి ఇంత ఘోరంగా ఉంటే అన్నీ వదిలేసి కూలీ రేట్ల మీదికి రావడం చాలా దారుణం. కూలీలు ఎప్పటికీ దరిద్రంలోనే బతకాలని కోరుకోవడంతో సమానంగా ఈ వాదన ఉంది.
I think even Sekhar is also thinking wrongly. With these programs Govt. is making people lazy. They are demanding more wages, if they don’t fulfill their demand, they even go for strike, without considering the importance of necessity in the cultivation times. Small farmers are facing this problem much than the rich farmers. Even in cities also no laborer work for a daily wages less than Rs.450.00. They like to sit idle even.
This kind programs Govt. is making people idle and idler.
Coming to the point of land distribution, why should Govt distribute the land? I don’t understand. They should know the value of money and land. If at all they were given land they are ultmatly selling the land to rich, who buy from them. Again all the family members ask for land from Govt.
One thing Govt should do is give the uncultivable land to the industrial development. Industrialist can spend money get the land suitable for their industry.
If they buy from their hard earned money they will know the land value.
శేఖర్ గారు!
భరతీయ వ్యవసాయక్షేత్రాల సగటు కమతాల పరిమాణం 2 ఎకరాల కన్నా తక్కువ. ఇక మొత్తం రైతుల లొ 5 ఎకరాలకు తక్కువ భూమి వున్న వారు 85.9%.40 కోట్లకు పైబడి శ్రామిక శక్తి 64% జనాభా ఆదారపడి జీవిస్తున్న వ్యవసాయ సంక్షొభానికి గల అనేక కారణాల లొ ఇదీ ఒకటి అని మత్రమె అని భావించాను. నా భవన లొ ద్రవ్యొల్బణం నకు మొత్తం కారణం ఉ.హ.పదకం మత్రమే అని చెప్పదల్చుకోలేదు. ఏ రంగం లొనైన తక్కువ పెట్టుబడి తొ ఎక్కువ ఆదాయం పొందలంటె వీలైనంత ఎక్కువ యాంత్రీకరణ, సాంకేతికత చేపట్టాలి. చిన్న కమతాల లొ యాంత్రీకరణ దాదాపు కష్టం. అందుకని మానవ వనరులపైనే ఆదరపడాల్సి వస్తుంది.పొలం పనుల సమయం లొనే ఉపాధి హామి పనులు జరగడం తో శ్రామికులు కాయ కస్టానికి బదులు సులువుగా ఉండే పనిని ఎంచుకోవడం జరుగుతుంది. దీని మూలంగా చిన్న్న రైతులకు సాగు లో అదిక వ్యయం చేయాల్సివస్తుంది. రైతుల ఆర్దిక పరిస్థితి దిగజారిపోవడానికి ఇతర కారణాలు పరిశీలిస్తే
1) రైతులకు పరపతి సౌకర్యాలు కొరతగా ఉండటం.
2) కౌలు దారులకు గుర్తింపు లేకపొవడం.
3) భూ సంస్కరణల అమలు లోపభూయిష్టం గా ఉండటం.
4) వ్యవసాయ విద్య నిర్లక్ష్యం చేయబడటం.
5) కరువు, వరదల సమయం లొ రైతులను ఆదుకొవదం లొ తీవ్ర జాప్యం.
6) వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకునెందుకు సరైన శీతల గిడ్డంగిలు లెకపొవడం.
7) గ్రామీణ ప్రాంతలలొ మౌళిక సదుపాయాలు వృద్ది చెందకపోవడం.
ఇవే కాక మరెన్నొ అంశాలు వ్యవసాయాన్ని సంక్షోభం లొకి నెడుతున్నాయి. వీటన్నీటిని విడిచి కేవలం కూలి ధరలు పెరిగితె శ్రామికుల ఉన్నతి సాధ్యపడుతుంది అనుకోవడం పొరబాటు.
ఇక ఒబామా నిర్ణయం నా బావనా ఒకేల ఉందని చెప్పారు. భారతీయుల ఆహరపు అలవాట్లు, సాంప్రదాయాలు కూడా కొన్ని రకాల ఆహరోత్పత్తుల ధరలను ప్రభావితం చేయడం అనుభవపూర్వకంగా తెలిసిందే. వంటనూనెల ఉత్పత్తి లొ మన దేశం స్వయం సమృద్ది సాదించలేదు. కావున దిగుమతులు కూడా చేసుకుంటున్నాం. దీన్ని మనం ఆహరం లొ వినియొగానికె కాక దూప, దీప నైవేద్యాలంటూ అనుత్పాదక కార్యాలకూ వృదా జరుగుతుంది. కూరగాయల ధరలు అధికంగా ఉన్నప్పుడు సైతం ఏదొ ఒక దేవుని రూపం చెప్పి అలంకరించి ప్రదర్శించడం నిత్యం దినపత్రికల లొ చూస్తున్నాం. ఒబామా చెప్పినట్టు భారతీయుల తిండి కాకపొయిన ఆచార వ్యవహారాలు కారణం కాదనలెం.
ఈ వాదన చూస్తుంటే నాకు రావి శాస్త్రి గారి ‘ గోవులొస్తున్నాయి జాగ్రత ‘ ఒక నవల గుర్తొస్తుంది. అందులో కిరీటి రావు అనే పాత్ర ఇలానే మాట్లాడుతుంది. ‘ కూలీలు అనే వాల్లు పూర్తిగా చావా కూడదు బాగా బతకాకూడదు. వారికి కొన ఊపిరితొ బ్రతకడానికి అవకాశం ఇవ్వాలి అంత గంజి పోసి! బాగా అన్నం తిన్నట్లైతే పని చెయ్యడానికి బద్దకిస్తారు, అంతేకాక కూలిరేట్లు పెంచమంటారు. అందు వల్ల వాల్లని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి.’ అచ్చం ఇలానే కాదు గాని, ఆయన డైలాగ్ చెప్పలేము, ఈ అర్దం వచ్చేలా!
ఈ మద్య టి.వీ చానల్లో కూడా ఇలాంటి వాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. వ్యవసాయం దెబ్బతినటానికి కారణం గ్రామాల్లో వుండే కుల వ్యవస్త చెరిగి పోవటమే నట! ఆయా పనులు చేసే వాల్లు లేక గ్రామ వ్యవస్త దెబ్బ తినిందట! అందరూ మెరుగైన బ్రతుకు కావాలని ఆశపడుతున్నారట! అది వ్యవస్త కు మంచిది కాదట!
సురేష గారు పర్వాలేదు పాపం ‘ ఉపాధి హామీ పధకం ‘ ద్రవ్యోబలానికి దారి తీస్తుందని కొంచం నాగరికంగా చెపుతున్నారు. ఈ డబ్బు కాస్త కార్పొరేట్ కంపెనీలకు సబ్సిడి ఇవ్వటానికి మిగలవని! ‘ఉపాధి హామీ పధకంలో బోలెడంత అవినీతి జరుగుతోంది’ మీరుచెప్పటం కొసమెరులెండి. – అంటే వీల్ల వాదన దేశం లో ఆకలి చావుల్ను పెంచాలనేది తు చ తప్పకుండ పాటించాలని!
దీని వలన నష్టపొతుంది సన్నకారు రైతులు. కూలి ధరలకు తట్టుకులెక అయినకాడికి ఉన్న పొలం అమ్ముకొని నగరలాకు వలస పొతున్నారు. correct.
ద్రవ్యోల్బణం పెరగడం అంటే ద్రవ్య చలామణి ఎక్కువగా ఉండడం అని గ్రహిస్తే అది కూలీ ధరలు పెరగడం వలన జరగలేదు. కూలీ ధరలు ఎంత పెరిగితే వ్యవస్ధలో ద్రవ్య చలామణీ పెరగాలి?correct.
సన్నకారు రైతులు ఎప్పుడూ టి.వీల వద్దకు వచ్చి ఉపాధిహామీ పధకం గురించి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. i can’t accept.
5 ఎకరాలకు పైన భూమి ఉన్న వారు వ్యవసాయం చేస్తున్నది చాలా తక్కువ.కౌలు కు ఇస్తున్నారు.కౌలు కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే వ్యవసాయం చేసినా అంతే వస్తుంది. వడ్డీ వ్యాపారాలు,ఎరువులు, పురుగు మందుల వ్యాపారాలు చేసి బాగా కమాఇస్తున్నారు. కౌలు ముందే కడితేనే పొలంలో అదుగు పెట్టనిచ్చేది. పండినా ఎండినా నలిగెది కౌలుదారే. సిస్తులతో వచ్చిన ఆదాయం తమ పిల్లల ఎన్.ఆర్.ఐ. ఆదాయాలు తొ పొలాలు కొని వాటి ధరలు సామాన్య రైతుకు అందుబాటులో లేకుండా చేసారు.
ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నరైతులు కూలి పనికి వెళ్ళలేక ఆదాయం లేక ఊన్న పొలం అమ్మి పట్నాలకు వలస పోతున్నారు. రైతు కూలి భరించలేక ఇప్పటికే పాడి వదిలేసాడు.పల్లెటూళ్ళలో పాకెట్ పాలు కొనుక్కొంటున్నారు.
కారణం ఏదైనా రైతు కూలి రేట్లుకు భయపడుతున్నాడు. సన్నకారు రైతుల్ని ఎవర్ని అడిగినా ఇదే చెపుతున్నారు. ఈ రైతు కన్నా ఇంట్లో ఇద్దరు ముగ్గురు కస్టపడె కూలీల కుటుంబం పరిస్తితి మెరుగ్గా ఉంది.ఇప్పుడు మటుకు ఉన్న పొలం అమ్మి పిల్లల్ని చదివిస్త్తునారు. వారికి జాబ్ రాకపోతే పట్నాల్లో కూలీ కొరత తీరుతుంది.
ఆహార ధరలు ఇప్పటికే భరించలేకుండా ఉన్నాయి. ఉత్పత్తి పెరిగేలా చూసి,మార్కెటింగ్ సరిగా చేస్తే బెటర్.
ఉపాధి హామి పథకం కొన్ని పనులు దొరకని ప్రాంతాల్లో తప్పని సరి. ఐతే ఏదో ఓట్ల కొసం తప్ప సరైన ఉత్పాదక పనులపై చేస్తున్నది తక్కువ. కూలీ రేట్లు ఇప్పుడున్నంత ఉండాలి. ఈ పనుల్ని వారి స్తిరమైన ఉపాధి, తమ కాళ్ళపై నిలబడేలా సరైన దిసలో చేస్తే బావుంటుంది.
*ఉపాధి హామీ పధకంలో బోలెడంత అవినీతి జరుగుతోంది.*
నిజమే. ఆ పథకాలను పెట్టేదే అన్ని వర్గాల వారికి (రాజకీయ నాయకులు,కాంట్రక్టర్లు, ప్రభుత్వోద్యోగులు,కూలీలు ) చేతనైనంత డబ్బులు తినిపిస్తూ, వాటిని ఒక ప్రాసేస్ లాగా స్ట్రిం లైన్ చేసి,అన్ని వర్గాలలో ఓట్ బాంక్ నుకు భద్రంగా రక్షించుకొని, లాభం పొందటానికి ఉపయోగపడుతున్నాయి. పైకి పేదలను ఉద్దరించటానికి అనే చెప్పే ఈ పథకం మూడూ పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లటానికి, ఓట్లు తెచ్చి పెట్టటానికి కారణం అన్ని వర్గాల వారికి, ఏ పని ceయకుండానే డబ్బులు వచ్చిపడేలా చేయటం.
*మనం ఆహరం లొ వినియొగానికె కాక దూప, దీప నైవేద్యాలంటూ అనుత్పాదక కార్యాలకూ వృదా జరుగుతుంది. కూరగాయల ధరలు అధికంగా ఉన్నప్పుడు సైతం ఏదొ ఒక దేవుని రూపం చెప్పి అలంకరించి ప్రదర్శించడం నిత్యం దినపత్రికల లొ చూస్తున్నాం*
మీరు చెప్పినవి కొన్ని దశాబ్దాలుగా,ఇంకా చెప్పాలి అంటే శతాబ్దాలుగా ప్రజలు పైకార్యలు చేస్తున్నారు. మరి అప్పుడు ఆహరోత్పత్తుల ధరలు ఆకాశాన్ని ఎందుకు తాకలేదు? నేను అనుకోవటం ఫుచర్ ట్రేడింగ్ లో ఫుడ్ గ్రైన్స్ ను చేర్చటం వలన ధరలు విపరీతమైన ఒడిదుడుకులకు లోనౌతున్నాయి.
ఈ ఉచిత పథకాల వలన, కుటుంబ వ్యవస్థ కుప్ప కూలు తున్నాది. తాగటం ఎక్కువైంది. ఒక్క తమిళనాడు ప్రభుత్వానికి సుమారు 20వేల కోట్ల ఆదాయం మందు అమ్మకాలపై వస్తున్నాది. ఇదే డబ్బుతో ప్రభుత్వాలు ఉచిత పథకాలు అమలు చేయటం. ఇదొక విష వలయం గా తయారయ్యింది. దీనివలన బాధితులు చిన్నపిల్లలు. తాగుడు అలవాటైన తల్లిదండృలు, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ, డబ్బులు దొరకనపుడు పిల్లలను అమ్ముకొనేం తవరకు వెళ్లి పోతున్నారు.
చాలా మంచి పథకం లా అనిపించే ఈ పథకం, ఎక్కువకాలం అమలు చేస్తే దిగువ మధ్య తరగతి కుటుంబ వ్యవస్థకూడా దెబ్బతినటం ఖాయం. పెరిగిన కూలీ ధరలను మధ్య తరగతి కుటుంబీకులు భరించలేని పరిస్థితి కి వచ్చేశారు.
ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ, నిర్ణయం తీసుకొన్నందుకు మోడిని అభినందించాలి.
http://m.firstpost.com/politics/has-narendra-modi-just-scuttled-upas-food-bill-in-parliament-1028869.html
పైన రాసిన దానిలో కాంట్రక్టర్ లు పని చేస్తున్నారు గా అని అనుమానం రావచ్చు. వాస్తవమేమిటంటే వారేదో పెద్ద ప్రాజెక్ట్ కి పని చేస్టప్పుడు భారి ఎత్తున్న పెట్టు బడులు పెట్టి టిప్పర్లు కొంటారు. ప్రాజేక్ట్ పనులన్ని అయిపోయిన తరువాత, వారికి కోట్లు పెట్టికొన్న టిప్పర్ లు ఖాళిగా పడి ఉండేదుకన్నా ఎదో ఒక చోట అద్దెకి తిప్పితే కొంత డబ్బన్నా వస్తుంది కదా అని వారు అనుకొంటారు. అటువంటి వారికి ఈ పథకం వలన పని, డబ్బులు దొరికాయి.
ఉపాధి హామీ పధకం అమలు మొదలయింది 2007లో. అంతకు ముందు రైతులు వేలాదిగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకని? అప్పుడూ కూలీరేట్ల వల్లనేనా?
రైతులకి ఆర్ధిక వ్యవస్ధ తీరుతెన్నులు పూర్తిగా అర్ధం కాకపోవచ్చు. వాళ్ల దృష్టిలో వాళ్లు నియంత్రించగలిగేది కూలి రేట్లనే. పురుగు మందుల ధరలు అన్నీ ఫిక్స్ డ్ రేట్లు. ఎరువుల ధరలూ అంతే. ఇక మిగిలింది కూలి రేట్లే. మిగతావి వారి చేతుల్లో ఉండవు. కూలి రేట్లు మాత్రమే వారి చేతుల్లో ఉంటాయి. అందువలన కూలీ రేట్లు ఎక్కువగా ఉంటే తమ కోపాన్నంతా కూలీలపైనే వెళ్లగక్కుతారు. కోపం వెళ్లగక్కడానికి పురుగు మందుల కంపెనీవాడూ, ఎరువుల కంపెనీవాడూ కళ్లెదుట ఉండరు కదా. వాళ్ళు అరేయ్, ఒరేయ్ అనగలిగేది ఒక్క కూలీలనే. అందుకని సర్వ కష్టాలకూ కారణంగా వాళ్లకి కూలీలు కనపడతారు.
కాని కాస్త ఆలోచన ఉన్నవారు అన్ని పరిస్ధితులనీ ఆలోచించాలి. ఉపాధి హామీ పధకం కూలి రోజుకి వంద నుండి నూట పాతిక మాత్రమే. అది కూడా పూర్తిగా ఇవ్వరు. లంచాలు కొంత మింగుతారు. సంవత్సరానికి వంద పని దినాలు ఇవ్వాలని చట్టం చెబుతుంటే సగటున 43 రోజులకి మించడం లేదని ఇటీవలే కాగ్ లెక్క తేల్చింది. ఆ రోజులు కూడా ఇంకా తగ్గిపోతున్నాయని చెప్పింది. 2007 నుండి 2012 వరకూ 1,25,000 కోట్లు ఈ పధకం కింద లక్షంగా పెట్టుకుంటే అందులో 30 శాతం మాత్రమే ఖర్చు చేశారని కాగ్ చెప్పింది. అంటే సంవత్సరానికి సరాసరి 3125 కోట్లు. దాదాపు అరవై లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ మూడు వేల కోట్లు ద్రవ్యోల్బణం కలిగిస్తోందనీ, రైతులకు శాపంగా మారిందనీ (రైతులకు మాఫీ చేసిన రుణాల విలువ 2009లో 60,000 కోట్లు) వాదించడం ఎంతవరకు సబబు?
సన్నకారు రైతుల కష్టాలకు కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఆర్ధిక విధానాలు. ఈ విధానాల ద్వారా రైతులు పంటలు పండించకుండా దివాలా తీయించి భారత మార్కెట్ ను పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పాలని లక్ష్యంగా పాలకులు పెట్టుకున్నారు. అందుకోసం ఎరువుల సబ్సిడీ క్రమంగా తగ్గించి పూర్తిగా ఎత్తేయబోతున్నారు. విత్తన మార్కెట్ ను తీసుకెళ్ళి బిటి కంపెనీలకి ఇప్పటికే అప్పజెప్పారు. రుణాలు ఇవ్వడం మానేశారు. ఇవన్నీ వదిలేసి కూలీరేట్ల మీద పడితే, ఇక కూలీలు బతకడానికి వీల్లేదా? రైతుకు అమ్ముకోడానికి పొలం అయినా ఉంటుంది. కూలీలకు అది కూడా ఉండదు కదా?
రైతులు, కూలీలు అంతా కలిసి ప్రభుత్వ విధానాల పైన పోరాడాల్సిన సందర్భం ఇది.
రైతులు, కూలీలు అంతా కలిసి ప్రభుత్వ విధానాల పైన పోరాడాల్సిన సందర్భం ఇది.
vaallani poraadamani kondaru cash(vote) chesukuntaaru
ఉపాధి హామీ పధకం ఉచిత పధకం అన్న అపోహ నుండి ముందు బైటికి రావాలి. అదేమీ రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ లాంటిది కాదు. కూలీలు పని చేస్తే ఇస్తున్నది. అది కూడా అరకొరగా.
దేశానికి వస్తున్న బడ్జెట్ అంతా శ్రమ జీవుల వల్లనే అని గుర్తిస్తే అందులో ప్రధాన భాగం శ్రమ జీవుల పరిస్ధితులు మెరుగుపడడానికి వెళ్లడమే న్యాయం అని అర్ధం అవుతుంది. వాళ్లు రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, మేధో శ్రమ చేసే ఉద్యోగులు కావచ్చు. డాక్టర్ల లాంటి సేవల శ్రమలు కావచ్చు. ఇవన్నీ శ్రమలే కనుక అవి చేసేవారంతా శ్రమ జీవులే.
కానీ బడ్జెట్ లో సింహభాగం కంపెనీలకు, పెట్టుబడిదారులకి, మాఫియాలకీ, దళారులకీ వెళ్తోంది. దీనిని అరికట్టి ప్రజలకు జమ చేయిస్తే దేశం శుభ్రంగా ఉంటుంది. అసలు సమస్యల్ని వదిలేసి కేవలం మూడువేల కోట్లు విదిల్చే ఉపాధీ హామీ పధకం మీదకు వచ్చి పడడం అసలు సమస్యలనుండి పక్కకు మరల్చడమే. ఆ పని మోడి లాంటి వారు దశాబ్దాలతరబడి చేస్తున్నారు. కాని శ్రీరామ్ లాంటి ఆలోచనాపరులు కూడా వారి బుట్టలో పడడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకింత బాధను కూడా కలిగిస్తోంది. స్విస్ బ్యాంకుల డబ్బు దేశానికి తిరిగి తెచ్చే మాట మాని ఉపాధి హామీ పధకం పైకి రావడమే ఒక మోసం. ఆ మోసాన్ని ఆమోదించడం ఆలోచనాపరులకు తగదు గాక తగదు.
66ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత కూడా దేశ ప్రజలు ఎంత దారిద్యం లో వున్నది , మరీ ముఖ్యంగా ఇటీ వలి గ్లోబలైజేషన్ తరవాత పేదరికం పెరిగి పోతున్న సంగతీ మన గ్రహింపులో వున్నదే! దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగానే దారిద్య రేఖకు కాకి లెక్కలిచ్చింది ప్రభుత్వం- గ్రామాల్లో 27.2, పట్టణాల్లో 33.3 రూపాయలని చెప్పటం!
ఒకవైపున గ్రామాల్లో సంవత్సరానికి 60 రోజుల కంటే ఎక్కువ పనులు దొరకటం లేదని ప్రభుత్వ ఆర్దిక గణాంకాలే చెపుతున్నాయి. మరో వైపు ఇంటద్దెలు, విధ్య, వైద్యం, విధ్యుత్తు, ఆహార పదార్దాలకు, ఏ మాత్రం రెక్కలోచ్చాయొ (డాలర్ మారకం లో పతనం) మనకు తెలుసు. ఈ విధంగా చూస్తే దారిద్యం తరగక పోగా పెరుతుందని తెలుస్తుంది. ఒక్క గుజరాత్ విషయానికి వస్తే 1980-81 కంటె 1990-91 లో 2.9 శాతం, 2000-01 లో కంటె 2008-09 లో 8.1 శాతం, 2005-06 లో కంటె 2009-10 లో 2.2 శాతం ప్రజల కొనుగోలు శక్తి పడిపొయింది.
గుజరాత్ భావనగర్ యూనివర్శిటి వైస్ చాన్సలర్, ఆర్ఢిక శాస్త్రవేత్త ఐన విధ్యుత్ జోషి ప్రకకారం గుజరాత్ లోని 5 ఏళ్ల పిల్లలోపు సగమంది పోషకాహార లోపం తోను నాలుగింట ముగ్గురు యనీమియతో నూ వున్నారని “యూనిసిఫె “2012 నాటి నివేదిక ప్రకటించింది. స్త్రీ పురుష గణనీయమైన మార్పు లొచ్చాయి.
‘ప్రాజేక్ట్ పనులన్ని అయిపోయిన తరువాత, వారికి కోట్లు పెట్టికొన్న టిప్పర్ లు ఖాళిగా పడి ఉండే దుకన్నా ఎదో ఒక చోట అద్దెకి తిప్పితే కొంత డబ్బన్నా వస్తుంది కదా అని వారు అనుకొంటారు’ ఇది చాలా సాధారన మాట ఐనట్లు చెపుతున్నారు. ఇది కూలి జనాల ఎన్ని రోజుల కూలి దినాలను తి నేస్తుందో , దొరికే పని సవంత్సరాని 60 రోజులు ఐతే అది కూడా లేకుండా చేయటం కాదా?. ఇదేదో యు పి ఎ ప్రభుత్వం చేస్తుంది కనుక దానికి గండి కొట్టటం కాదు. అది కూడా ప్రజలపై ప్రేమతో చేస్తున్నది కాదు, వాల్లకి ఓట్లకి ఓట్లు వస్తాయి, అటూ అసంతృప్తి నుండి ప్రజల్ని దారి మల్లించి నట్లు ఉంటుంది. ఈ రాజకీయం తెలియదేమో!
“స్విస్ బ్యాంకుల డబ్బు దేశానికి తిరిగి తెచ్చే మాట మాని ఉపాధి హామీ పధకం పైకి రావడమే ఒక మోసం”
ప్రభుత్వం నల్లధనం తీసుకు రావటానికి పెద్దగా ప్రయత్నం చేయకపోయినా (అది చేస్తే చాలా త్వరగా పని పూర్తౌతుంది) , దానిని ఎలాగైనా తిరిగి తీసుకు రావాలనే పట్టుదలతో, పట్టు విడవకుండా సుబ్రమణ్య స్వామి, అతని టీంలో చాలా మంది మేధావులు పనిచేస్తున్నారు. అదొక ప్రాసెస్. దానిని అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రారంభించారు. క్రమం తప్పకుండా ఫాలో అప్ చేస్తున్నారు. ఆ డబ్బు తప్పక త్వరలో తిరిగి వస్తుంది. ఇంకొక విషయమేమిటంటే ప్రపంచవ్యాప్తం గా పెరిగిపోయిన ఈ నల్లధనం వలన (ఇది ఎవరికి ఉపయోగపడటంలేదు, వంద సం|| ఎవరు క్లైం చేయకపోతే అది బాంక్ కి వెళుతుంది) ఫైనాన్సియల్ సిస్టం రిడిజైన్ చేయాలని చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి. వాటిని కూడా ఆర్ధిక శాస్త్ర నిపుణులు పరిశీలిస్తున్నారు. మనదేశంలో నల్లధనం గురించి ప్రజలలో తప్పుడు అభిప్రాయం ఉంది, కాని పశ్చిమదేశాల వారికి ఇది రహస్యమే కాదు. దాదాపు ప్రతి అంతర్జాతీయ బాంక్ టక్స్ హేవెన్ లో ఒక శాఖను పెట్టుకొంది. వాటి లెక్కలన్ని ప్రభుత్వాలకు తెలుసు. వాటి మీద ఆర్టికల్స్ అక్కడి పేపర్లలో వస్తూంటాయి. చాలా మంది ఆర్ధిక నిపుణులు అకేడేమిక్ స్టడి చేసి పుస్తకాలు రాసి యునివర్సిటిలలో సెమినార్లు పెట్టి, టి వి షోలలో చర్చిస్తారు కూడాను. ఇటువంటి వారు ఫైనాన్సియల్ సిస్టం రిడిజైన్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. రానున్న కాలంలో మార్పులు వస్తాయని ఆశిద్దాం.
మోడి సంగతి వదిలేయండి.
ఉపాధి హామీ పథకం, ఉచిత బియ్యం పథకం వలన వ్యవసాయ రంగానికే కాదు, నిర్మాణ రంగానికి కూడ కార్మికుల కొరత తీవ్రంగా ఉంది.
దేశ ప్రజల ఉత్పాదక శక్తిని తగ్గించే ఇలాంటి పథకాలవల్ల ఓట్లు రాలతాయేమోకాని, GDP పెరగదు.
అంతగా ఈ ఉపాధిహామి పథకాన్ని కొనసాగించాలనుకుంటే, ఈ పథకం మహిళలకు మాత్రమే అని మార్పు చేస్తే బాగుంటుంది.
బోనగిరి గారూ, మరొకసారి గమనించండి! ఉపాధి హామీ పధకం ఉచిత పధకం కాదు. అది పని దొరకని వారికి ప్రభుత్వమే పని కల్పించే పధకం. పని జరగడం అంటే ఉత్పత్తి జరగడం లేదా ఒక విలువ సృష్టించబడడం. కాబట్టి పని జరిగినప్పుడు తప్పనిసరిగా జి.డి.పిలో చేరిక ఉంటుంది. కాకపొతే ఆ పనిని మెరుగైన ఉత్పాదకతలోకి వినియోగించడం ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లో ఉంటుంది. అడ్డదిడ్డమైన పనులు చేయిస్తే అది యంత్రాంగం తప్పవుతుంది తప్ప కూలీల తప్పు కాదు. వాళ్లు పని చేయకుండానే కూలీ ఇవ్వమని అడగడం లేదు. నిజానికి పని చేసినా సంవత్సరాల తరబడి కూలీలు ఇవ్వని ఉదాహరణలు ఈ పధకంలో అనేకం ఉన్నాయి. దానివలన కొన్నిచోట్ల ఆత్మహత్యలు కూడా చోటు చేసుకున్నాయి.
దేశ ప్రజల ఉత్పాదక శక్తిని ఈ పధకం ఎలా తగ్గిస్తుంది? ఉపాధి పధకం వల్ల ఉత్పాదక శక్తి తగ్గడం ఏమిటి?
పైన చెప్పినట్లు ఉపాధి హామీ పధకం వలన సంవత్సరానిక్ పని దొరుకుతున్నది సగటున 43 రోజులు మాత్రమే అంటే ఇంకా 322 రోజులు కూలీలు ఖాళీగానే ఉంటారు. కాబట్టి వ్యవసాయానికి, నిర్మాణ రంగానికీ కూలీలు దొరకడం లేదని చెప్పడం నిజం కాదు. పధకం లక్ష్యం ప్రకారం వంద రోజులు పని ఇచ్చినా ఇంకా 265 రోజులు కూలీలు ఖాళీగానే ఉంటారు.
అసలు సమస్య ఏమిటంటే ఈ పధకం వలన కూలీ రేట్లు వంద రూపాయల కంటే ఎక్కువ అడగడం. అంత ఇవ్వడం ఇష్టం లేక కూలీల కొరత అంటూ అసంబద్ధ వాదనలు చేస్తున్నారు. ఒకవేళ కూలీల కొరత ఉంది అనుకుంటే ఎక్కువ కూలీ ఇచ్చి పిలిపించుకోవడం అనాదిగా ఉంటున్నదే. అదేదో ఇప్పుడు పుట్టిన కొత్త సమస్య లాగా చెబుతూ కాస్త పని దొరుకుతున్న పధకాన్ని వద్దని చెప్పడం అన్యాయం, స్వార్ధ పూరితం. కూలీలు ఆ మాత్రం కూడా బతక్కుండా చేయడం అంతిమంగా సమాజానికే చేటు.
దేశానికి అపార నష్టం చేస్తున్న అవినీతి, మాఫియా, నల్లడబ్బు, దోపిడి అనేవి ప్రధాన సమస్యలు తప్ప కూలీల కొరత కానే కాదు. దేశంలో 120 కోట్లమంది జనం ఉన్నారు. వారిలో 70 శాతం గ్రామాల్లోనివారే. వారిలోనూ దరిద్రులు సగానికి పైగా ఉన్నారు. కాబట్టి కూలీల కొరత ఉండడం అసంభవం. ఎంతిస్తే అంత తీసుకుని కుక్కిన పేనుల్లా పని చేసే కూలీలు దొరక్కపోవడమే అసలు సమస్య.
పని మనుషులు దొరకడం లేదు అని సిటీల్లో తరచుగా వినిపిస్తుంది. కాని అందులో ఉండే అసలు నిజం ఏమిటంటే తాము అనుకునే బడ్జెట్ లో పనివాళ్ళు దొరకడం లేదు అన్నది మాత్రమే తప్ప అసలుకే పని మనుషులు దొరక్కపోవడం కాదు. అలాగే ఉపాధి హామీ పధకం వల్ల కూలీలు దొరక్కపోవడం అనేది అవాస్తవం.
పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు తదితర వ్యవసాయ సరుకులు తయారు చేసే కంపెనీలకు తాము అనుకున్న రేటుని ‘గరిష్ట చిల్లర ధర’ పేరుతో అమ్ముకునే సౌకర్యం ఉంది. కానీ రైతులకి ఆ సౌకర్యం లేదు. కాబట్టి వారు వ్యవసాయ సరుకుల్లో మిగుల్చుకునేది లేక, గిట్టుబాటు ధరలు పొందే అవకాశాలు కనపడక తమ చేతుల్లో ఉండే ఏకైక కూలీ రేట్లు తగ్గితే బాగుడ్ను అని కోరుకుంటారు. అది పైకి సరైందిగా కనిపించినా కూలీల జీవన పరిస్ధితుల గురించి ఆలోచించేవారు అలాంటి ఆలోచన చేయలేరు.
రైతుల కష్టాలకి ప్రధాన కారణం అధిక ధరలకి సరుకులు అమ్మే కంపెనీలు, ఆరుగాలం కష్టించి తీసిన పంటను గద్దల్లా తన్నుకుపోయే దళారీలు, ఏ మాత్రం సహకారం ఇవ్వని ప్రభుత్వాలు. ఇవన్నీ వదిలేసి కనీస ఆరోగ్య, విద్యా సౌకర్యాలు కూడా అందించలేని కూలీ రేట్లను తగ్గించాలనడం, కొరత అని చెప్పి వారికి అందుతున్న కాస్త పనిని కూడా వారికి లేకుండా చేయాలనడం అత్యంత దారుణం, ఘోరం, అమానుషం, అన్యాయం.
శ్రీరామ్ గారూ, సుబ్రమణ్యస్వామి వలన నల్ల ధనం దేశానికి తిరిగొస్తుందని మీరు నమ్ముతున్నారా? నాకయితే ఆ నమ్మకం లేదు. అసలు దానికి తగిన భూమికే మన ప్రభుత్వ యంత్రాంగంలో లేదు. ఈ యంత్రాంగం ధనికుల కోసం, ధనికుల వలన, ధనికుల చేత సృష్టించబడిన యంత్రాంగం. ఈ ధనికులు ఒక్క భారత దేశానికి పరిమితం అయినవారు కాదు. వారు ప్రతి దేశంలోనూ ఉన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల ధనికుల మధ్య కనపడని నెట్ వర్క్ ఉంటుంది. వారంతా కలిసి నిర్మాణం చేసుకున్న స్విస్ బ్యాంకు వ్యవస్ధలను వారే కూల్చుకుంటారా? భలే తమాషా చేస్తున్నారే?
సుబ్రమణ్యస్వామి ఏమీ పులుగడిగిన ముత్యం కాదు. ఆయన కూడా వాళ్లలో ఒక మనిషే. కాకపోతే కాంగ్రెస్ వ్యతిరేకి. మొత్తం ధనికుల పెత్తనం సాగే వ్యవస్ధకి ఆయన వ్యతిరేకి కాదు. ఆ పెత్తనంలో తగిన వాటా కోసం పోరాడుతున్న వ్యక్తి మాత్రమే ఆయన. ఆయన మీద మీరు పెద్ద నమ్మకమే పెట్టుకున్నారు. ఆయనకి తెలిస్తే ఆయనే ఆశ్చర్యపోయేంత నమ్మకం. ఆయన తరపున మీరు ఇస్తున్న హామీ ఇంకా తమాషాగా ఉంది!
ఫైనాన్షియల్ రీ డిజైన్ అనేది ఒకటంటూ జరిగితే, వారి సంపదలు ప్రజల కళ్లబడకుండా మరింత పకడ్బందీగా ఎలా దాచిపెట్టుకోవాలన్నదానిపైనే కేంద్రీకరించి జరుగుతుంది. అంతే తప్ప అంతా బయటేసుకుని ‘మావన్నీ ఇక మీవెలే’ అనేమీ అనరు. మీరేదో కలలో నుండి అప్పుడే బైటికొచ్చి పై వ్యాఖ్య రాసినట్లు నాకు అనుమానంగా ఉంది. (సరదాకే లెండి.)
2008 ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం వచ్చిన తర్వాత స్విస్ బ్యాంకులు లాంటి టాక్స్ హేవెన్స్ ని అరికట్టడానికి చట్టాలు తెస్తామని పశ్చిమ దేశాలు జి20 లాంటి సమావేశాల్లో తెగ వాగ్దానం చేసాయి. ఆ అంశంలో ఒక్క అంగుళం కూడా ముందడుగు పడలేదు. పైగా పన్నుల డబ్బు తీసుకెళ్ళి వివిధ ఉద్దీపన పధకాలతో తీసుకెళ్ళి అలా దాచిపెట్టుకున్నవారికే పంపకాలు చేసారు. అదీ సరిపోక పొదుపు విధానాల పేరుతో వేతనాలు, పెన్షన్లు తెగ్గోసి కంపెనీలకు పంపకాలు చేసారు. మళ్లీ ఆ భారం అంతా తెచ్చి జనం పైనే వేస్తున్నారు. ఇంత జరుగుతుంటే మీరేమో త్వరలోనే ఫైనాన్షియల్ రీడిజైన్ జరుగుతోంది. త్వరలో అంతా బాగవుతుంది అనడం నాకయితే చాలా తమాషాగా ఉంది.
సెమినార్లలో చర్చలు, పుస్తకాలు, అధ్యయనాలు ఇక్కడ జరగడం లేదనా మీ ఉద్దేశ్యం? అయ్యో రామ! మన మీడియాల్లో ఇలాంటి చర్చలకు కొదవ లేనే లేదు. ప్రాంతీయ భాషల ఛానెళ్లు, పత్రికలు కూడా పుంఖాను పుంఖాలుగా చర్చలు చేస్తున్నాయి.
విదేశాల్లో నల్లధనం గురించి ప్రభుత్వాలకు తెలుసు అని ఎలా చెబుతున్నారు? మరయితే ‘ఆక్యుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమం ఎందుకు వచ్చినట్లు? అమెరికాల్ ఫిస్కల్ క్లిఫ్ మాటేమిటి? అమెరికా, ఐరోపాల్లో అప్పులు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఐరోపాలో రుణ సంక్షోభం ఎందుకు వచ్చింది? క్రెడిట్ క్రంచ్ మాటేమిటి? అమెరికా ఫెడ్ ఇంకా వడ్డీ రేటు 0.25 శాతం వద్దా, ఇ.సి.బి యేమో 0.5 శాతం వద్దా ఎందుకు కొనసాగిస్తున్నట్లు? ఫెడ్ (ఫెడరల్ రిజర్వ్) నెలకి 85 బిలియన్ డాలర్లు స్టిములస్ ఇస్తున్న సంగతి మీ దృష్టిలో ఉందా?
వీటన్నింటి అర్ధం ఏమిటంటే నల్లధనాన్ని వెలికి తీసి దేసానికి ఉపయోగించే ఉద్దేశ్యం వారిలో ఎవరికీ లేదనే. కాబట్టి మీ నమ్మకానికి వీసమెత్తు కూడా ఆధారాలు లేవు. ఇక్కడా లేవు, విదేశాల్లోనూ లేవు.
మాది కడప జిల్లా లోని ఓ మారుమూల పల్లె. వివిధ రిపోర్టులు,గణాంకాల సంగతి పక్కన పెడితే, ఉపాధి హామీ పధకం వల్ల గ్రమీణ పేదరికం, పల్లెలనుండి పట్నాలకు వలసలు గణనీయంగా తగ్గాయనేది పల్లెలకి కనీసం అప్పుడప్పుడైనా వెల్లేవారెవరూ కాదనలేని సత్యం. ఆ రకంగా చూస్తే ఈ పధకం దాదాపు విజయవంతమైనట్లే లెక్క. కాకపోతే, అధికార గనం లోని అవినీతి( ఇతర పధకాల్తో పోల్చుకుంటే , దీనిలో అవినీతి తక్కువే, డబ్బుల్ని డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లకి ట్రాన్స్ఫర్ చేయడం లాంటి అంశాల వల్ల), పనుల్ని గుర్తించడంలో వైఫల్యం, అనాసక్తి, అశ్రద్ధ లాంటివి లేకపోతే ఈ పధకం ఇంకా చాలా విప్లవాత్మక మార్పులకి నాంది పలికేది. తాను అధికారం లోకి వస్తే దీనిలోని లోపాల్ని సరిదిద్దుతానని చెప్పకుండా.. మొత్తం పధకాన్నే విమర్శించడం మోడీ ‘దేడ్ దమాఖ్’ తప్ప మరోటి కాదు.
@దేశ ప్రజల ఉత్పాదక శక్తిని తగ్గించే ఇలాంటి పథకాలవల్ల ఓట్లు రాలతాయేమోకాని, GDP పెరగదు.@
వెట్టిచాకిరి ఇంకా ఏదో ఒక రూపం లో కొనసాగుతున్న దేశం లో కార్మికుల కొరత వుందంటె నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. అయితే ఉత్పత్తి జరుగుతున్నది ఎవరి వల్ల? అంటే దేశం లో 90% జనాభా కోటీశ్వుర్లా?అలా అయితే అవుట్ సోర్సింగ్ పెరుతో జరుగుతున్న తతంగమంతా ఎలా కొనసాగుతుంది? బలే తమాషాగా వుందండి!
జాతీయ మీడీయాలో చర్చలను కొన్నిటిని చూశాను. పై పైన అంశాలు స్ప్రుసితూ చర్చలుగాముగిస్తారు. అవి సమగ్రమైన చర్చలు కావు. మన తెలుగు మీడియాలో చర్చించిన వీడియో లింక్ లు ఉంటే ఇచ్చేది. మీ అభిప్రాయన్ని నేను ఖండించను. కాకపోతే సమయం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి. మారుతుంది. వేచి చూద్దాం.
ఇక్కడ ఒక విషయం చెప్పి ముగిస్తాను. 120 కోట్ల భారతదేశంలో సుబ్రమణ్యస్వామి టీం ఈ అంశాన్ని పట్టించుకొంది. ఫాలో అప్ చేస్తున్నాది. జాతీయ మీడీయాలో ఈ అంశం గురించి చర్చించే ఏ మేధావి కూడా టి వి లో చర్చ అయిన తరువాత,ఈ అంశం పై ఫాలో అప్ చేసిన విషయం నా దృష్ట్టికి రాలేదు.
In my opinion,one and only best program in india is MGNREGA. if we implement it properly we can create great resources for india and we can provide atleast some employment to unskilled persons in villages
సురేష్ గారు, రెండు ఎకరాలు, ఐదు ఎకరాలు భూమి ఉన్న రైతులు కూలీలని పెట్టుకోరు, వాళ్ళు తమ కుటుంబ సభ్యుల చేత పనులు చెయ్యించుకుంటారు. మా ఊరిలో కూలీలు దొరక్కపోవడానికి కారణం అక్కడ ఎక్కువ మంది సొంత భూమి ఉన్న రైతులు కావడం, అంతే కానీ ఉపాధి హామీ పథకం కాదు. మా ప్రాంతాన్ని పారిశ్రామీకరించి అక్కడి జనానికి ఉపాధి కల్పిస్తే అక్కడ ఒక్క వ్యవసాయ కార్మికుడు కూడా మిగలడు. అలాగని నేను పారిశ్రామీకరణని వ్యతిరేకించాలా?
చారితీ అంటే ఉచితంగా డబ్బులు ఇవ్వడం. పనులు చెయ్యించి ఇచ్చేది చారితీ కాదు. పెట్టుబడిదారుడు కూడా ఒక ఫాక్తరీ కట్టి వంద మందికి ఉపాధి ఇస్తాడు. 1750 తరువాత ఇంగ్లాంద్‌లో జరిగిన పారిశ్రామీకరణ అంతా చారితీయేనా?
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాలు వచ్చి వేలాది మంది వ్యవసాయ కూలీలు పొలం పనులు మానేసారు. కర్మాగారాల వల్ల రైతులకి కూలీలు దొరకరని దేశంలో ఎక్కడా కర్మాగారాలు పెట్టకూడదంటామా? వ్యవసాయ కూలీ పని లాభదాయకం కానివాళ్ళు అది మానేసి ఇంకో పని చూసుకుంటారు. అది ఉపాధి హామీ పథకం పని అయినా అది చెయ్యడం తప్పు కాదు. దానికి మనం అభ్యంతరం చెప్పకూడదు.
2009లో చంద్రబాబు ఉచితంగా డబ్బులు ఇస్తానన్నప్పుడు ఈ తెలుగు దేశం, బి.జె.పి. అభిమానులెవరూ అభ్యంతరం చెప్పలేదు. కాంగ్రెస్ పెట్టిన ఓ పథకం విషయంలోనే ఆ అభ్యంతరం ఎందుకు? 2009లో చంద్రబాబు చేసిన ఉచిత డబ్బుల పంపిణీ వాగ్దానాన్ని ఎవరూ నమ్మలేదు. 2014లో తెలుగు దేశం వందిమాగధ పత్రికలు కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చెయ్యడం వల్ల చంద్రబాబు గెలిచాడు.
సురేష్ గారు, ద్రవ్యోల్బనం అంటే కరెన్సీ ముద్రణ పెరగడం. అదేమీ కూలీ ధరలు పెరగడం వల్ల రాదు. కరెన్సీ ముద్రణ పెరిగితే కరెన్సీ విలువ తగ్గిపోతుంది కానీ కార్మికుల జీతాలు పెరిగితే కరెన్సీ విలువ తగ్గదు. మా చిన్నప్పుడు ఒక అగ్గి పెట్టె 25 పైసలకి దొరికేది, ఇప్పుడు అది రూపాయి (100 పైసలు)కి దొరుకుతోంది. కరెన్సీ ముద్రణ పెరగడం వల్ల 25 పైసలకి విలువ లేకుండా పోయి ఆ ధరకి ఏమీ దొరకడం లేదు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తెచ్చినట్టు రూపాయి విలువని పావలా స్థాయికి దిగజార్చడమే ద్రవ్యోల్బనం అంటే. దానికి కూలీ ధరల పెరుగుదలతో సంబంధం లేదు.
సింగపూర్‌కి విదేశీ పర్యాటకుల తాకిడీ ఎక్కువ కనుక అక్కడ hotel tariff ఎక్కువగా ఉంటుంది, hotel workers జీతాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మరి ఎవరూ దాన్ని ద్రవ్యోల్బనం అనడం లేదే. ఇందియాలో స్కూల్ పుస్తకాలలో ఆర్థిక శాస్త్రం గురించి వ్రాయరు కాబట్టి ఇక్కడ చాలా మందికి ద్రవ్యోల్బనం అంటే ఏమిటో తెలియదు.