రాజకీయ పార్టీలు తమకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నది సమాచారం ఇవ్వాలని సి.ఐ.సి (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్) కొద్ది వారాల క్రితం తీర్పు చెప్పడంతో పార్టీలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే అయింది. పారదర్శకత గురించి ప్రబోధించే ఈ పార్టీలకు అకస్మాత్తుగా పారదర్శకత రాజకీయ పార్టీల హక్కులకు భంగకరంగా కనిపించడం ప్రారంభం అయింది. అది ఎంతవరకూ వచ్చిందంటే పార్టీలన్నీ ఐక్యమై ఏకంగా సమాచార హక్కు చట్టాన్ని (ఆర్.టి.ఐ చట్టం) సవరించేంతవరకూ.
రాజకీయ పార్టీలు సి.ఐ.సి చెప్పినట్లుగా పబ్లిక్ ఆధారిటీలు కాదనీ, కాబట్టి అవి ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదనీ పార్టీలు వాదిస్తున్నాయి. ఈ మేరకు రాజకీయ పార్టీలను ఆర్.టి.ఐ చట్టం నుండి మినహాయిస్తూ చట్టానికి చేసిన సవరణను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ‘ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని కవి గారు ఊరకే అన్నారా?
సి.ఐ.సి వాదన ప్రకారం రాజకీయ పార్టీలకు ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. అవి కార్యాలయాలు తెరవడం కోసం దేశం అంతటా ప్రధాన నగరాల్లో అత్యంత ఖరీదయిన ప్రభుత్వ భూములు తీసుకున్నాయి. వివిధ సందర్భాల్లో ప్రభుత్వం పార్టీలకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ కారణం వలన రాజకీయ పార్టీలు కూడా ‘పబ్లిక్ ఆధారిటీలు’గా పని చేస్తున్నాయి. కాబట్టి అవి తమ నిధుల సమాచారం, ఎన్నికల్లో ఏ ప్రాతిపదికన అభ్యర్ధులను నిలబెడుతున్నదీ తదితర సమాచారాన్ని ప్రజలకు ఆర్.టి.ఐ చట్టం కింద ఇవ్వాలి. ఈ అవగాహన మేరకు కాంగ్రెస్, బి.జె.పి, ఎన్.సి.పి, సి.పి.ఎం, సి.పి.ఐ, బి.ఎస్.పి పార్టీలు ఆర్.టి.ఐ కార్యకర్తలు అడిగిన సమాచారం ఇవ్వాలని సి.ఐ.సి ఆదేశించింది.
కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ ప్రకారం సి.ఐ.సి వాదన నిజమే అయితే రైతులు, పారిశ్రామికవేత్తలు, తదితర రంగాల ప్రజలు కూడా ప్రభుత్వం నుండి పెద్ద మొత్తంలో సబ్సిడీ, పన్ను మినహాయింపులు పొందుతున్నారు గనక వాళ్ళు కూడా ఆర్.టి.ఐ కిందికి వస్తారని. రైతులకు ఇచ్చే సబ్సిడీ వివరాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి కనుక వాటిని రైతులు దాచిపెట్టుకోలేరు. ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందేది బడా పారిశ్రామికవేత్తలే కనుక వారి సమాచారం ఇవ్వడం ప్రభుత్వానికి అభ్యంతరం అవుతుంది కానీ ప్రజలకు కాదు. ఏయే పారిశ్రామికవేత్తకు ఎంతెంత సబ్సిడీ ఇస్తున్నదీ ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి, పారిశ్రామికవేత్తలకు ఉంది. ఆ లెక్కలు చెబుతామంటే వద్దనేది ఎవరు?
కుంటిసాకులు వెతుకుతున్న రాజకీయ పార్టీలు తమ రాజకీయ విభేదాలకు అతీతంగా ఒక్కటై ఆర్.టి.ఐ చట్ట సవరణ ద్వారా సి.ఐ.సి విసిరిన వలను ఎత్తుకుపోవడానికి నిర్ణయించుకున్నాయి తప్ప ప్రజల చేతికి చిక్కడానికి వాటికి ఇష్టం లేదు. ఇది చాలదా అవి ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పడానికి?
మరే…
రాజకీయాలు,దేశం లో, ఒక పెద్ద కార్పోరేట్ పరిశ్రమ !
ఎప్పుడూ లాభాలోచ్చే పరిశ్రమ !
కొనే ముడి సరుకు: ఓట్లు
ఉత్పత్తి వస్తువు : ‘ పదవులు’
వివిధ పార్టీలు : వివిధ బ్రాండ్ లు
‘ఉత్పత్తి ‘ ‘ సామర్ధ్యం’ కొద్దీ లాభాలు వస్తుంటాయి !
కేవలం లాభ శాతాలు కాస్త హెచ్చు తగ్గులవుతుంటాయి !
షేర్ విలువ ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది !
నష్టపోయేది ఎప్పుడూ, వినియోగ దారులే ( ప్రజలే ) !
కానీ వారు సహిస్తూ ఉంటారు.
‘ వస్తువు ‘ నాణ్యత ఏమాత్రం లేనిదైనా, దానిని వాడ డానికీ ‘ వాడుకో బడ డానికీ ‘ అలవాటు పడ్డారు !
ఎందుకంటే , అది ఒక వ్యసనం అయింది కనుక !
‘బ్రాండ్ ‘ విలువ, సమయానుకూలం గా , ప్రాంతానుకూలం గా మారుతూ ఉంటుంది !
అప్పుడు ఒక బ్రాండు లాభాలు , ఇంకో బ్రాండు లాభాలకోసం పనికొస్తాయి !
అవును మరి ! ‘ బ్రాండు ‘ ఫార్మ్యూలాలు ( రహస్యాలు ) తెలియ చేయ మంటే, ఎందుకు తెలియచేస్తారు ! అవి స్విస్ బ్యాంకు లాకర్ ల లో ఉంటాయి,లాభాల తో పాటు గా !
ఇక ‘ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త లందరూ ‘ ఆలస్యం చేయడం దేనికి , ఈ పరిశ్రమలో ‘ లాభాలు’ ఇంత స్పష్టం గా కనిపిస్తుంటే !
ప్రజలు వినియోగదారులు ఎలా అయ్యారు ఐతే నాయకులని తయారు చేసే ఉత్పత్తి దారులు అవుతారు
ఒకసారి ఈ లింకులోని 10 వీడియోని వీక్షించి కామెంట్ చేయాలని సూచన http://www.10tv.in/news-breakfast/Cabinet-approves-changes-to-RTI-Act-to-keep-Political-Parties-Out
rk గారూ , పదవుల లో ఉన్న వారు, అందించే ‘సేవలు ‘ తీసుకుంటున్నారు కాబట్టే, ప్రజలు వినియోగాదారులవుతారు !
ఈ రోజుల్లో ‘సేవలతో ‘ పాటుగా ( అసలు ఏమైనా చెస్తూ ఉంటే ) వస్తువులు కూడా అందిస్తున్నారు కదా !