తెలంగాణ: ఆం.ప్ర ఉభయ సభల అభిప్రాయం తప్పనిసరి -నిపుణులు


తెలంగాణ రాష్ట్ర విభజన కోసం ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి శాసన సభ మరియు విధాన సభలు రెండు తమ తమ అభిప్రాయాలు చెప్పడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ అభిప్రాయాలను తప్పనిసరిగా పాటించవలసిన అవసరం పార్లమెంటుకు లేదని కూడా వారు చెబుతున్నారు. లగడపాటి రాజగోపాల్ లాంటివారు ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. అధిష్టానం మనసు మార్చొచ్చు’ అని వ్యాఖ్యానిస్తున్న నేపధ్యంలో నిపుణుల అభిప్రాయాలను పరిశీలించడం ఉపయుక్తం కాగలదు.

లోక్ సభకు సెక్రటరీ జనరల్ గా పని చేసిన పి.డి.టి ఆచారి ప్రకారం భారత రాజ్యాంగం, 1949 లోని ఆర్టికల్ 3 ప్రకారం నూతన రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే పార్లమెంటులో సంబంధిత బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. రాజ్య సభ మాజీ సభ్యుడు ఆర్.షణ్ముగసుందరం ప్రకారం ఏ బిల్లునైనా ప్రవేశ పెట్టే అధికారం పార్లమెంటుకు ఉన్న హక్కు. ఈ హక్కును కోర్టులో సవాలు చేయడానికి వీలు లేదు.

నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మార్పిడి, సరిహద్దుల మార్పిడి లేదా సవరణ, ఉనికిలో ఉన్న రాష్ట్రాల పేర్ల మార్పు తదితర అంశాలపై రాజ్యాంగంలో ఉన్న సెక్షన్ ప్రకారం “రాష్ట్రపతి సిఫారసుతో తప్ప, బిల్లులో ఉండే అంశాలు ఒక ప్రాంతాన్ని గానీ, రాష్ట్రాల పేర్లను సరిహద్దులను గానీ ప్రభావితం చేస్తే తప్ప, సదరు బిల్లు ఆ రాష్ట్రం యొక్క చట్టసభల అభిప్రాయాల కోసం పంపిన సందర్భంలో, ఏ బిల్లునైనా పార్లమెంటు ఉభయసభలలో ప్రవేశపెట్టనవసరం లేదు.”

ఈ వాక్యాలు అయోమయంగా ఉన్నాయి. విషయాన్ని నేరుగా చెప్పకుండా తిరగేసి చెప్పిన విధంగా ఉన్నాయి. నేరుగా చెబితే ఇలా ఉండాలి. “రాష్ట్రపతి సిఫారసుతో వచ్చే ఒక బిల్లులోని అంశాలు ఒక ప్రాంతాన్ని గానీ, రాష్ట్రాల పేర్లను లేదా సరిహద్దులను ప్రభావితం చేసే విధంగా ఉన్నప్పుడు, సదరు బిల్లును ఆ రాష్ట్రం యొక్క చట్టసభల అభిప్రాయాల కోసం పంపిన సందర్భంలో దానిని పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి.”

ఆంధ్ర ప్రదేశ్ కు శాసన సభ (Legislative Assembly) మరియు విధాన సభ (Legislative Council) లు రెండూ ఉన్నందున తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అవి రెండూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సి ఉంటుందని పి.డి.టి.ఆచారి అభిప్రాయంగా ది హిందు తెలిపింది. తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి రాష్ట్రానికి చెందిన ఉభయ సభలకు నిర్దిష్ట గడువు ఇస్తారు. ఆ గడువు లోపల బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. రెండు సభలూ కొత్త రాష్ట్రం ఏర్పాటును తిరస్కరించినా, లేక ఒకటి ఆమోదించి మరొకటి తిరస్కరించినా, అలాంటి నిర్ణయానికి పార్లమెంటు కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. రాష్ట్ర చట్టసభల అభిప్రాయంతో సంబంధం లేకుండానే పార్లమెంటు తన ప్రక్రియను కొనసాగించవచ్చని ఆచారి తెలిపారు.

అలా ఏర్పడిన చట్టాన్ని, అది పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగిస్తే తప్ప, కోర్టులో సవాలు చేయడానికి వీలు లేదు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి ప్రకారం ఆర్టికల్ 371 కింద ప్రత్యేక సౌకర్యాలను గతంలో కల్పించారు. ఈ సౌకర్యాలను ఎన్నడూ అమలు చేసింది లేదు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ఏర్పాటు చట్టంలో ఈ సౌకర్యాలను తొలగిస్తూ పార్లమెంటు నిర్ణయం తీసుకోవచ్చు.

అయితే మరో రాజ్యాంగ నిపుణుడు, రాజ్యసభ సభ్యుడు అయిన ఆర్.షణ్ముగసుందరం పార్లమెంటుకు ఉన్న విశేషాధికారాలను నొక్కి చెప్పారు. ఈయన ప్రకారం ఏ బిల్లునైనా ప్రవేశపెట్టే హక్కు పార్లమెంటు సొంతం. దానిని కోర్టుల్లో సవాలు చేయడానికి వీలు లేదు. ‘పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగినట్లయితే’ అన్న షరతును ఆయన పట్టించుకున్నట్లు లేదు.

భారత దేశపు 29వ రాష్ట్రంగా తెలంగాణ మరో నాలుగైదు నెలల్లో (దిగ్విజయ్ సింగ్ లెక్కల ప్రకారం) ఏర్పడనుంది. గులాబ్ నబీ ఆజాద్ తదితరుల ప్రకారం ఈ సమయం 150 నుండి 210 రోజుల వరకూ (అనగా ఐదు నుండి ఏడు నెలల వరకు) పట్టవచ్చు. ‘ఇప్పటికైనా మంచింది లేదు’ అంటూ లగడపాటి రాజగోపాల్ ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటన సమైక్యాంధ్ర సెంటిమెంటును సొమ్ము చేసుకునేందుకా లేక నిజంగానే అంటున్నారా అనేది కొద్ది వారాల్లో తేలవచ్చు. ‘ఉద్యమాలు అవసరం లేదు’ అని కూడా ఆయన అంటున్నందున సమైక్యాంధ్ర ప్రజల్లో మిగిలి ఉన్న ఆగ్రహాన్ని ‘సేఫ్ ల్యాండింగ్’ చేయడంలో ఆయన ఉన్నారని భావించవచ్చు.

సీమాంధ్రోళనలు

తెలంగాణ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్రలో నిరసనలు జరుగుతున్నాయి. సమైక్యాంధ్ర విద్యార్ధి జె.ఎ.సి ఆధ్వర్యంలో 72 గంటల బంద్ నిర్వహిస్తున్నారు. మొదటి రోజైన బుధవారం నాడు (జులై 31) చాలా చోట్ల బంద్ విజయవంతం అయిందని ఛానెళ్లు చెబుతున్నాయి. విద్యా సంస్ధలు, వాణిజ్య సంస్ధలు మూసివేశారని, ఆర్.టి.సి బస్సులు తిరగలేదని ది హిందు తెలిపింది.

ముఖ్యంగా కడప, చిత్తూరు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో బంద్ జరుగుతోందని పత్రిక తెలిపింది. పలుచోట్ల ర్యాలీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల రాస్తారోకోలు నిర్వహించారని వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఆర్.టి.సి ముందస్తు జాగ్రత్తగా బస్సులు నడపలేదు. విధ్వంసక చర్యలేవీ పెద్దగా జరగలేదని తెలుస్తోంది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలను రాయల సీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో పెద్ద సంఖ్యలో దించారు. మూడో విడత పంచాయితీ ఎన్నికలు కూడా జరుగుతుండడంతో ప్రభుత్వం మరిన్ని బలగాలను దించింది.

10 thoughts on “తెలంగాణ: ఆం.ప్ర ఉభయ సభల అభిప్రాయం తప్పనిసరి -నిపుణులు

  1. No one, except students followed the bandh in Visakhapatnam. Most of the colleges are closed but shops and offices are open. All of the arts and engineering students evaded the classes. However, science students attended the classes since they need more concentration on the subject and also for practicals.

  2. తెలంగాణా వాదులందరికీ(ప్రత్యేకంగా)శుభాకాంక్షలు.సీమాంద్రులకు కొన్నికష్టనష్తాలు కలగవచ్చు(ముఖ్యంగా విద్యావకాశాలపరంగా,ఉద్యోగావకాశాలపరంగా)ఐక్యంగాఉండాలనుకోవాలనే భావన్ సరైనది కాదేమో!అలా అనుకోవడం వలన వైషమ్యాలు ఎక్కువయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయేమో!విడిపోవడమేగానీ మరలాకలవడానికి మనరాజ్యాంగంలో అవకాశంలేదేమొ!ఒకసారివిడిపోతే అలావైషమ్యాలు పెరుగుతయేగానే దగ్గరయ్యే పరిస్థితులు మనదేశంలో ఏ రెండు రాష్త్రాలమద్యనైనా జరిగాయా? మనకు(తెలుగు ప్రజలకూ) అదేగతి!

  3. కలిసుంటే కలదు సుఖం అనేది మాత్రమే ఇన్నిరోజులు విన్నాం.. కానీ ఇపుడు విడిపోతేనే కలదు సుఖం అంటే వింటున్నాం.. ఇక రాబోయే తరాలకు నీకు సౌఖ్యంగా ఉన్నట్లు మాట్లాడడమే సుఖం అని చెబుతారేమో.. ఏది చెప్పినా వినడమేగా ప్రజల పని.. మహా అయితే మారేది నాయకులే.. తలరాతలెలాగూ మారవుగా..

  4. ప్రవీణ్ గారు సీమాంధ్ర అంతే విశాఖ మాత్రమేనా? దానితోనే మిగతా ప్రాంతాన్నంతా సార్వత్రీకరించేస్తారా?

  5. నేరుగా చెపితే దేశాన్ని ఎప్పుడో అమ్ముకునే వాళ్ళు అందుకే అలా ఎవరికీ త్వరగా అర్ధం కాకుండా రాసారు

  6. I live in Visakhapatnam. I know that the yellow media is broadcasting misleading information on the happenings of my town. I hadn’t talked about other districts. However, it’s not difficult for the yellow media to do the hype propaganda even in the name of other districts.

  7. భాజపా, తెరాస, కోరారు,
    కాగల కార్యం, కాంగ్రెస్ వారే తీర్చారు !
    అంతా కలిసి వేశారు,
    మా తెలుగు తల్లి కి, ‘ చెవులో పూదండ ‘ !
    తెలుగు వారి ప్రగతి కి ‘ గుది బండ ‘ !

  8. దొరలు 1935 లో manaki అర్ధం కాకుండా రాసిన దాన్ని ఇంకా వాడుతూ ఉంటె ఎవరిki అర్ధం అవుతుంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s