జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తలు, విశ్లేషణలు – National, International News & Analysis in Telugu

స్పెయిన్ ప్రమాదం: విధ్వంసం-రుధిరం-దుఃఖం పెనవేసుకుని…


ఎంత సేపని! ఈ ప్రమాదం మొదలయ్యి పూర్తి కావడానికి అయిదంటే అయిదే క్షణాలు పట్టింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపు 78 ప్రాణాలు హరీమన్నాయి. మృతులు ఎంత హృదయ విదారకంగా మరణించారంటే, 80 మంది మరణించారని చెప్పిన అధికారులు ఆ తర్వాత సంఖ్యను 78కి తగ్గించుకున్నారు. ఈ సంఖ్య మళ్ళీ మారవచ్చని కూడా వారు తెలిపారు. అంటే పెరగవచ్చు, లేదా తగ్గవచ్చు. ప్రమాదంలో విధ్వంసం ధాటికి మృత దేహాల శరీర భాగాలు తునాతునకలై పోవడం వలన ఈ పరిస్ధితి ఏర్పడింది.

ఫోరెన్సిక్ నిపుణులు వివిధ శరీర భాగాలను ఒక చోట చేర్చి ఒక్కో శరీర భాగాన్ని దగ్గరికి చేర్చుతూ మృత దేశాలను పునర్నిర్మిస్తూ మృతుల సంఖ్య తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒక చోటికి చేర్చి లెక్కించాల్సిన మృత దేహాల భాగాలు ఇంకా ఉన్నందున అంతిమ లెక్క తేలలేదు. లెక్కించవలసిన భాగాలు ఇప్పటికే లెక్కించినవారికి చెందినవో లేక లెక్కపెట్టని వారికి చెందినవో శాస్త్రీయంగా అంచనా వేయనందున మృతుల సంఖ్య పెరగొచ్చు లేక తగ్గవచ్చు అని చెబుతున్నారు.

ప్రమాదం సమయంలో విధుల్లో ఉన్న రైలు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పక్కటెముకలు విరగడంతో చికిత్స చేస్తున్నారు. ప్రమాదం జరిగిన మరుక్షణమే ఆయన కదల్లేని పరిస్ధితిలో ఉండి కూడా రైల్వే అధికారులకు, పత్రికలకు ఫోన్లు చేసి ప్రమాదం సంగతి చెప్పాడు. తాను 190 కి.మీ వేగంతో వెళ్తున్నానని పత్రికలకు చెప్పింది ఆ సందర్భంగానే. “ఎవరూ చనిపోలేదని ఆశిస్తున్నాను. చనిపోతే గనుక వారి మరణం నన్ను జీవితాంతం వెంటాడుతుంది” అని ఆయన పత్రికలతో మాట్లాడుతూ దుఃఖించారట.

నిపుణుల ప్రకారం ప్రమాదానికి వేగం ఒక్కటే కారణం కాకపోవచ్చు. పట్టాలు తప్పిన ట్రాక్ భాగం హై స్పీడ్ రైళ్లు ప్రయాణించడానికి అనువుగా మార్చకపోవడం వల్ల ఇక్కడ గతంలోనూ చిన్నపాటి ప్రమాదాలు జరిగాయట. పట్టాలు, సిగ్నల్ వ్యవస్ధ తదితర మౌలిక నిర్మాణాలు హై స్పీడ్ రైళ్ళకు అత్యవసరం. హెచ్చరికలను డ్రైవర్ గమనించకపోతే ఆటోమేటిక్ గా ఆగిపోయే వ్యవస్ధ పట్టాలకు అమర్చాల్సి ఉంటుంది. అయితే హై స్పీడ్ రైళ్ళకు తగినట్లుగా మౌలిక నిర్మాణాలను మార్చడం అత్యంత ఖర్చుతో కూడిన పని. ఒక్క కి.మీ మేర ఆ నిర్మాణాన్ని ఎగవేసినా కాంట్రాక్టర్ కంపెనీకి పెద్ద మొత్తంలో డబ్బు మిగిలిపోతుంది.

ప్రమాదం జరిగిన చోట 5 కి.మీ మేర ఈ విధంగా పాత పట్టాల వ్యవస్ధనే ఉంచారని తెలుస్తోంది. అంటే హై స్పీడ్ రైలు ప్రయాణానికి అనువుగా మార్చలేదు. సిగ్నల్ వ్యవస్ధను అసలే ముట్టుకోలేదు. మరికొద్ది నిమిషాల్లో శాంటియాగో నగర స్టేషన్ కు, రైలు చేరాల్సి ఉన్నందున రైలు ఎలాగూ వేగం తగ్గించుకోవాలనీ, అందువలన పట్టాలను మార్చలేదని ఇప్పుడు కాంట్రాక్టర్లు, రైల్వే విభాగం వాళ్ళు సమర్ధించుకుంటున్నారు. నెపాన్ని రైలు వేగం పైకి నెట్టి వారు తప్పించుకుంటున్నారు. కానీ వేగం వల్లనే ఇలాంటి ప్రమాదం జరగదని, పట్టాలు, సిగ్నల్స్ ఆధునీకరణను చేపట్టకపోవడంతో ప్రమాదం జరగడానికి అనువైన పరిస్ధితి ఏర్పడి ఉన్నదనీ, వాస్తవానికి ఇలాంటి భారీ ప్రమాదం జరగడానికి ఈ పరిస్ధితులు ఎదురు చూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రమాద తీవ్రతను చూపుతున్న ఈ ఫోటోలను బోస్టన్ పత్రిక అందించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

Information

This entry was posted on జూలై 28, 2013 by in ఇతరములు and tagged .

మార్గదర్శిని

బ్లాగు గణాంకాలు

  • 1,616,232 hits

ఇటీవలి వ్యాఖ్యలు

దొండపాటి. లోకేశ్వర్… on కస్టమర్ డేటా అమ్మేస్తున్న రిలయ…
Dr.Sivababu on బేయర్, మాన్ శాంటో విలీనం: మహా…
balakishanm on బేయర్, మాన్ శాంటో విలీనం: మహా…
moola2016 on సామ్ సంగ్ నోట్ 7: నెత్తురు కక్…
srikanth on ఐఎస్ స్ధాపకుడు ఒబామా -ఫ్రమ్ ద…
Kalyani SJ on బ్రటిస్లావా నుండి వచ్చే రోడ్డు…
విశేఖర్ on బ్రటిస్లావా నుండి వచ్చే రోడ్డు…
Kalyani SJ on సిరియా: విచక్షణ లేకుండా బాంబుల…
Kalyani SJ on బ్రటిస్లావా నుండి వచ్చే రోడ్డు…
Kalyani SJ on నాతొ వస్తే సిగ్గుకు అర్ధం నేర్…
Praveen Kumar on జర్మనీ సిక్కులపై ఇండియా కోసం గ…
moola2016 on స్వాతిని నేను చంపలేదు -మల…
moola2016 on WTO: అమెరికా చేతిలో ఇండియాకు మ…
Praveen Kumar on బేయర్, మాన్ శాంటో విలీనం: మహా…
pragath on WTO: అమెరికా చేతిలో ఇండియాకు మ…

కూడలి: పాఠకులకు సూచన

కూడలి అగ్రిగేటర్ మూతపడినందున 'జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ' బ్లాగ్ సందర్శించేందుకు కొన్ని సూచనలు.


1. బ్రౌజర్ ఓపెన్ చేశాక అడ్రస్ బార్ లో teluguvartalu.com అని టైప్ చేసి 'Enter' నొక్కండి చాలు. బ్లాగ్ లోడ్ అయిపోతుంది. 


2. 'బ్లాగ్ వేదిక' 'శోధిని' అగ్రిగేటర్లలో మాత్రమే నా బ్లాగ్ టపాలు కనపడతాయి.
 

3. ఈ మెయిల్ ద్వారా సబ్ స్రైబ్ అయితే నేరుగా మీ ఇన్ బాక్స్ నుండే బ్లాగ్ కి రావచ్చు. సబ్ స్క్రైబ్ కావడం కోసం బ్లాగ్ ఫ్రంట్ పేజీ కింది భాగంలో "Follow blog via Email" వద్ద మీ ఈ మెయిల్ ఇవ్వండి. 


4. గూగుల్/యాహూ/బింగ్ సర్చ్ లో teluguvartalu.com కోసం వెతికినా చాలు. 


---అభినందనలతో,
విశేఖర్

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 2,345గురు చందాదార్లతో చేరండి

జూలై 2013
సో మం బు గు శు
« జూన్   ఆగ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

కేటగిరీలు

నెలవారీ…

మిత్రులు

%d bloggers like this: