హిందుత్వ నుండి మోడి పారిపోగలరా? -కార్టూన్


Bhag Modi Bhag

హిందుత్వను ప్రభోదిస్తూ దాన్నుండి దూరంగా ఉన్నారన్న భ్రమల్ని ప్రజల్లో కలిగించడం అంటే మాటలు కాదు. అలాంటి బృహత్కార్యాన్ని విజవంతంగా నిర్వహించినవారిలో ప్రముఖులు అటల్ బిహారీ వాజ్ పేయ్. హిందూత్వలో మోడరేటర్ గా ముద్ర పొందుతూనే అవసరం వచ్చినప్పుడు కరడు గట్టిన హిందూత్వను ప్రదర్శించడం వాజ్ పేయి కి మించినవారు లేరు. తాను కరకు ఆర్.ఎస్.ఎస్ వాడినని చెబుతూనే సెక్యులరిస్టులకు, హిందూత్వ నుండి దూరంగా ఉండదలచినవారికీ ఆయన ఆమోద యోగ్యుడు కాగలిగారంటే అది వాజ్ పేయి చాతుర్యమే అని చెప్పక తప్పదు. ఆయన చాటుర్యానికి తోడు కొన్ని చారిత్రకాంశాలు కూడా ఆయనకి కలిసి వచ్చాయి.

వాజ్ పేయి స్ధానాన్ని భర్తీ చేయడానికి అద్వానీ చేయని ప్రయత్నం అంటూ లేదు. వాజ్ పేయి తరహాలో మోడరేట్ ముద్ర సంపాదించి ప్రధాని పదవికి ఆమోదయోగ్యత పొందడానికి అద్వానీ ప్రయత్నించి ముక్కు, నెత్తి గాయపరచుకున్నారే గానీ సఫలం కాలేకపోయారు. జిన్నాకు గొప్ప సెక్యులరిస్టు అని సర్టిఫికేట్ ఇవ్వడం దగ్గర్నుండి తన ఉపన్యాసాల్లో హిందూత్వ పదును తగ్గించుకోవడం వరకూ అనేక పిల్లి మొగ్గలు వేసినా అవి ఆయనకు ఎదురు తిరిగాయి. తీరా ప్రధాని పదవి అందుబాటులోకి వచ్చింది అనుకున్న సమయానికి ఆయనకు నరేంద్ర మోడి సైంధవుడిలా అడ్డుపడ్డారు.

ఇపుడు వాజ్ పేయి చెప్పుల్లో కాళ్ళు దూర్చే పనిలో నరేంద్ర మోడి బిజీగా ఉన్నారు. బి.జె.పి పార్టీ నాయకులు ఆయనకు సహకరించడంలో బిజీగా గడుపుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన ‘సద్భావనా మిషన్‘ నిర్వహించినప్పుడే మోడి ఉద్దేశ్యం గురించి పత్రికలు పలు ఊహాగానాలు చేశాయి. అప్పటి నుండి మోడి తాను అందరికీ ఆమోదయోగ్యుడిని అని చెప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. మోడీకి అమెరికా వీసా ఇప్పించడానికి పనిగట్టుకుని లాబీయింగ్ నిర్వహిస్తున్నారు.

ఉత్తరాదిలో బి.జె.పి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలను ఎలుతోంది. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత (anti-incumbancy) పని చేసే అవకాశం ఉంది. దానిని అధిగమించాలంటే దక్షిణాదిలో కూడా బి.జె.పి చొరబడాల్సి ఉంటుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలు చారిత్రకంగా మతతత్వాన్ని దూరంగా పెట్టాయి. కర్ణాటకను ఎలాగో దక్కించుకున్నా అక్కడ ఈ మధ్యనే బి.జె.పి మట్టి కరిచింది. వింధ్య పర్వతాలను దాడుకుని దక్షిణాదిలో ప్రవేశించాలంటే మోడి ‘హిందూత్వ’ ట్యాగ్ వదిలించుకుని రావాలని, హిందూత్వ నుండి పారిపోయి రావాలని అధ్యక్షుడు రాజ్ నాధ్ మోడీకి సూచిస్తున్నారని కార్టూన్ సూచిస్తోంది. కానీ అదంత తేలికకాదు. గుజరాత్ మారణకాండ మోడీకి ఆభరణం. ఆ ఆభరణం తొలగించుకుంటే మోడి ఉన్న వెలుగు కోల్పోతారు. అలా జరిగితే హిందూత్వ ఓట్లు ఏమి కాను?

ఈ సంకట స్ధితి మోడిని వీడదు గాక వీడదు.

26 thoughts on “హిందుత్వ నుండి మోడి పారిపోగలరా? -కార్టూన్

 1. modi గెలిస్తే హిందూ రాష్ట్ర ని ప్రకటిస్తాడు , ఒక వేల ప్రకటించకుంటే , ఇంకో 1000 మంది సావర్కర్ లు , ఆరోబిందో లు , లాల్-బాల్ -పాల్ లు , వినాయక్ రావు గాడ్సే లు పుడతారు , మోడీ కాకపొతే ఇంకొకడు , చివరికి హిందూ రాష్ట్ర వచ్చి తీరుతుంది, ఎర్ర కోట పై హిందూ జండా రెపరెప లాడుతుంది. ఏ దేశం లో లేనంత సౌక్యంగా, శాంతిగా మైనారిటీ లు బతుకుతారు. మతస్వేఛ్చ ఇప్పుడు ఉన్న దాని కంటే అదికంగా వుంటది. హిందూస్తాన్ హిందువులది, మా ప్రాణం పోయినా దీన్నిLeT లాంటి కుక్కల పాలు కానివ్వం, ఇంకో ఇస్లామిక్ స్టేట్ గా కానివ్వం

 2. secularism వీడి హిందుత్వ tag ఏ గనుక పట్టుకొని మోడీ దేశం అంటా పర్యటిస్తే హిందువుల నుంచి ఒక్క వోట్ కూడా మిగతా వాళ్లకి దక్కదు. హిందుత్వ మోడీ కి బారం కాదు , అదే అతని ఆయుధం

 3. మోడిగారి హిందూ రాష్ట్రలో మైనారిటీలు ఎంత శాంతిగా బతగ్గలరో ఆయన ఇప్పటికే రుచి చూపించారు.

  ఒక్క మైనారిటీలేనా? విశ్వ హిందూ పరిషత్ వాళ్లు కూడా ఆయనకి వ్యతిరేకంగా పని చేసేంత శాంతి గుజరాత్ లో రాజ్యమేలుతోంది.

  సొంత పార్టీ వాళ్లకీ, సొంత మతం వాళ్లకీ, హిందూత్వ సంస్ధలకీ సైతం మిగలని శాంతి మైనారిటీలకు లభిస్తుందని చెప్పడం కంటే మించిన హిపోక్రసీ ఉంటుందా?

  ఎవరో అన్నారు ‘గుజరాత్ లో శాంతి నిజమే. కాని అది భయంతో వచ్చిన శాంతి’ అని. స్మశానంలోనూ ఉండదా శాంతి? స్మశాన శాంతిని బహుశా హిందూత్వవాదులు కూడా కోరుకోరేమో!

 4. Where the Muslims are not happy:

  They’re not happy in Gaza.
  They’re not happy in Egypt.
  They’re not happy in Libya.
  They’re not happy in Morocco.
  They’re not happy in Iran.
  They’re not happy in Iraq.
  They’re not happy in Yemen.
  They’re not happy in Afghanistan.
  They’re not happy in Pakistan.
  They’re not happy in Syria.
  They’re not happy in Lebanon.
  They’re not happy in Indonesia.

  So, where are they happy?

  They’re happy in Australia.
  They’re happy in England.
  They’re happy in France.
  They’re happy in Italy.
  They’re happy in Germany.
  They’re happy in Sweden.
  They’re happy in the USA.
  They’re happy in Norway.
  They’re happy in India
  They’re happy in almost every country that is not Islamic!

  And who do they blame [for their unhappiness]?

  Not Islam…not their leadership…not themselves… They blame the countries in which they are HAPPY! And they want to change the countries in which they’re happy, to be like the countries they came from, where they were unhappy.

  Try to find logic in that.

 5. before blaming modi just go through some authentic research , go through this and study what muslims of gujarat ( who actually suffered victims) said about gujarat riots. the author of below article had no any relation with sangh parivar. he is women rights and democratic reforms activist and he personally visited those muslim victims , interviewed them and lot more persons who actually affected with gujarat riots. so please go through it before airing your voices without knowledge of ground realities. here is link. go through statements of those muslim brothers and sisters

  http://www.manushi.in/articles.php?articleId=1685&ptype=&pgno=1

 6. విశేఖర్‌గారూ

  సరేనండీ, మాటవరసకు హిందూ అన్నపదం ఉఛ్ఛరించతమే గొప్ప దేశద్రోహంగా ప్రచారం చేసే మేధావులమాటలే పట్టుకుని మోడీ చెడ్దవాడే ననుకుందాం. మోడీ అంటే హిండూటెర్రరిష్ట్ అన్నముద్రను ప్రచారం చేస్తున్న లౌకికవాద పార్టీలలో పథమగణ్యమైన మన ఘనతవహించిన కాంగ్రెస్ ఏ మాత్రం సెక్యులరిష్ట్? అవసరమైన చోటల్లా మతోన్మాదపార్టీలతో అధికారం కోసం‌ అంటకాగుతూ బ్రతికే కాంగ్రెసు నిజంగానే సెక్యులరిష్టు అని మన దేశపు మేధావులమని చెప్పుకునే వాళ్ళూ ఎందుకు నమ్ముతున్నారు? నమ్మని పక్షంలో కాంగ్రెసుమార్కు కుహనా సెక్యులరిజాన్ని ఈ‌ మేథావులు ఏమాత్రం మోతాదులో ఎండగట్టారూ?

  ఈ‌ మేథావులనే వాళ్ళు సెక్యులరిజం అంటే హిందూవ్యతిరేకత అనే అర్థం ఎందుకు నమ్మి ప్రచారం చేస్తున్నారు? వివిధమతాలూ వాటి జెండాలూ‌ ఎజండాలు మోసుకుని తిరిగే పార్టీలవాళ్ళ హిందూ వ్యతిరేక – ఇంకా పచ్చిగా చెప్పాలంటే – హిందూనిర్మూలన కార్యక్రమాలను చూసీ చూడనట్లు నటిస్తూ, అటువంటి పార్టీల అండకోసం తింగర తింగర వ్యాసాలు వ్రాసూ, అలాంటి ఉపన్యాసాలు దంచుతూ హదావుడి చేసే ఈ‌ మహామేథావులు మాత్రం ఏ మాత్రం‌ సెక్యులరిష్టులు?

  హిందువుగా పుట్టినందుకు గర్వపడమని వివేకానందుడు చెప్పినదాన్ని మీరు మతోద్రేకప్రలాపం‌అంటారా ధైర్యంగా? హిందువుగా పుట్టినందుకు హిందువులందరూ సిగ్గుతో చచ్చిపోవాలని ఈ మేథావి వర్గం ఉద్దేశమా?

  మీరు నమ్మండీ నమ్మకపోండి, ఇలాంటి కుహనా మేథావి శకునుల పుణ్యమా అని ఒకనాడు మన దేశంలో, ఈ నాడు మైనారిటీలో‌ఉన్న మతం ఇస్లాం అవలంబించే వారి సంఖ్య 50.00001 % ఐన తక్షణం, ఈ భారతదేశం పేరు మారుతుంది! ఈ దేశం ఇస్లామిక్ దేశం అవుతుంది. శాంతం‌పాపమ్‌ ఆ నాడు, కూడా ఈ‌ కుహానావారసుల సంతతివాళ్ళు, మెజారిటీ మతం వారి అబిమతానికి అనుగుణంగా ఇస్లామిక్ దేశం‌ అవటంలో దోషం ఏముందీ అంటారు. మైనారిటీ హిందువులకు అన్ని రకాల ఇబ్బందులూ వస్తే అవి హిందువుల స్వయంకృతాపరాధాలకు శిక్షలూ – తప్పులేదే అంటారు.

  నేనేదో మోడీని సమర్థిస్తున్నానని పొరబడకండి. నాకు మోడీమీత అనుకూలతా లేదు, వ్యతిరేకతా లేదు. కేవలం‌ మోడీ (కాకపోతే మరొకాయన) హిందువూ, కరుడుకట్టిన హిందువూ, కాబట్టి అతడు ప్రమాదకారీ అని వాదించటం నీచం అని చెప్పదలుచుకున్నాను. అంతే!

 7. Thanks for the link Saibhargav.
  This is very interesting. Wonder what is the reaction of intellectuals!!

  In a recent interview with me, film script writer Salim Khan made an interesting comment: “Does anyone remember who the chief minister of Maharashtra was during Mumbai riots which were no less deadly than the Gujarat riots of 2002? Does anyone recall the name of the chief minister of UP during Malliana and Meerut riots or Bihar CM when the Bhagalpur or Jamshedpur riots under Congress regimes took place? Do we hear the names of earlier chief ministers of Gujarat under whose charge hundreds of riots took place in post-Independence India? Some of these riots were far more deadly than the 2002 outburst. The state used to explode into violence every second month? Does anyone remember who was in-charge of Delhi’s security when the 1984 massacre of Sikhs took place in the capital of India How come Narendra Modi has been singled out as Devil Incarnate as if he personally carried out all the killings during the riots of 2002?”

  Why just distant riots, does anyone remember the fate of hundreds of thousands of Bodos and Muslims who were uprooted from their villages in July 2012 because their homes were torched and destroyed? As of 8 August 2012, over 400,000 people had taken shelter in 270 relief camps, after being displaced from almost 400 villages.The Assam chief minister delayed deployment of the Army by 4 days even though large number of Army units are stationed right there Assam. Thousands are still living under sub human conditions in refugee camps. Why are those riots already forgotten?

 8. బిజెపి ఎదుగు దలకు శ్యామలీయం గారు కాంగ్రెస్ మార్క్ సెక్యులర్ రాజకీయాలే కారణం. ఆంధ్రాలో మహా అయితే బిజెపికి 2 సీట్లు వస్తే ఎక్కువ,దాని వలన వచ్చేది పొయేది ఎమీ లేదు. అదే పనిగా మోడి ని విమర్సించే విమర్శకులకు సమయం వృథా.
  భారత రాజకీయాలలో కాంగ్రెస్ పార్టి హయాం లో ఎన్ని మత కలహాలు జరిగాయో అందరికి తెలుసు. కాంగ్ర్స్ మార్క్ సెక్యులరిజం తో ప్రజలు ఎంత విసిగి పోయారో కొంతమంది మేధావులకు అర్థం కావటంలేదు.
  డాలర్ విలువ పడి , ప్రతి వస్తువు ధర ఆకాశానికి అందుతుంటే ప్రజలు బతకలేక చస్తున్నారు. అది వదిలేసి మోడి అధికారంలోకి వస్తే సెక్యులరిజానికి ముప్పు అని వాదించటం అన్నిటి కన్నాపెద్ద తప్పు. అలా వాదించే వారు, ఈ దేశ ప్రజల ముందు ఇంక ఉన్న ఆప్షన్ ఎదో చెప్పాలి. సుమారు మూడు నాలుగు వారులు గా టమోటాల ధర కిలో అరవై రూపాయలు. బియ్యం 45. తిండిగింజల రేట్లు ఆకాశానికి అందుతుంటే, అమర్త్యాసేన్ మోడి అభివృద్ది మోడల్ విమర్శించటం టి వి షోలలో పెద్ద పోగ్రాం. అమర్త్యాసేన్ వర్క్ వలన ఈ దేశ ప్రజలకు చేసిన మేలు ఇప్పటివరకు రోజు పేపర్ చదివే నాలాంటి వారికే తెలియదు. ఆయన సెక్యులరరిజం గురించి మాట్లాడుతాడు. ఇతని ద్వంద నీతి గురించి చెప్పలసిన పని లేదు.

  Only Christian faith schools are acceptable: Amartya Sen
  Jul 27, 2006, 07.02pm IST
  http://articles.economictimes.indiatimes.com/2006-07-27/news/27431235_1_christian-schools-faith-schools-religion

  ఇక దిగ్విజయ్ సింగ్ లాంటి వారు ఈదేశాన్నిఎమి చేద్దామనుకొంట్టున్నారు? అన్ని విషయాలు పరిశీలించి ఇచ్చిన కోర్ట్ తీర్పుకి వ్యతిరేకంగా మాట్లాడటం లో ఆయన ఉద్దేశం ఎమిటి?

  Digvijay Singh sticks to his stand, says Batla House encounter fake
  http://in.news.yahoo.com/digvijay-singh-sticks-stand-says-batla-house-encounter-154604071.html

  యంకౌంటర్ లో చనిపోయిన శర్మ కి చనిపోయేరెండు రోజుల ముందు నిద్దరలేదు. కారణం ఆయన కొడుకు ఆరోగ్యం సరిగాలేక , ఆసుపత్రిలో చేరి ఉంటే కొడుకు ను అట్టిపెట్టుకొని పగలు రాత్రి సేవలు చేస్తుండే సమయంలో, తీవ్రవాదులు ఒక ఇంట్లో ఉన్నారు అన్న విషయం తెలిసిన పోలిస్ డిపార్ట్ మెంట్ వారు, పైవారు, అతను సమర్ధుడని అక్కడికి అతనిని పంపటం జరిగింది. బ్రతికిఉన్నపుడు ఆయనని చాలా దగ్గర గా పరిశీలించిన కొంతమంది జర్నలిస్ట్ లు, అతని విషయం తెలుసుకొని ఎంతో బాధతో , కన్నిరు మున్నిరు పర్యంతం అవుతూ ఆరోజులలో వ్యాసాలు రాశారు. అతను డ్యుటి లేకపోతే ఇంట్లో కొడుకికి పాఠాలు చెప్పుకొనే బాధ్యత గల ఒక మంచి తండ్రి, భర్త. హాస్యప్రియుడు. సమర్ధుడైన ఆఫీసర్. ఇటువంటి వారిని డిల్లి పోలిసులలో ఊహించుకోలేము అని రాసిన వ్యాసాలు ఆరోజుల్లో వచ్చాయి

 9. ఇంత తమాషా కార్టున్ హిందూలో వస్తుందనుకోలేదు. బిజెపి దక్షిణాన హిందుత్వాను వదిలించుకొని రావాలని చెప్పటం హాస్యాస్పదం. హిందుత్వా ఉన్నాలేకున్నా దానికి అదనంగా దక్షిణ భారతంలొ వచ్చే సీట్లు ఎమిలేదు. ప్రస్తుత పరిస్థితిలొ అంతో ఇంతో బలం ఉన్న తెలుగుదేశం పార్టికె ఆంధ్రాలో దాని భవిషత్ అర్థం కావటంలేదు. బిజెపి లాంటి పార్టి ని ఆంధ్రాలో పట్టించుకొనేది ఎవరు? తమిళ నాడు,కేరళ సంగతి తెలిసే ఉండే. హిందుత్వాని వదలించుకొంటె బిజెపి కి సౌత్ లో సీట్లు వస్తాయనుకొంటే అంతకన్నా తమాషా ఎమిలేదు. బేసే లేని చోట సీట్లు ఎలాగెలుస్తుంది. ఇదొక చెత్త కార్టున్ .

 10. @ sai bhargav & venkat

  మధు కీశ్వర్ ఆర్టికల్ మోడికి సర్టిఫికెట్ గా మీరు భావిస్తున్నట్లుంది. మోడి వ్యతిరేకతను ఆమె బ్యాలన్స్ చేయడానికి ప్రయత్నించినమాట నిజమే. కాని మరొకసారి జఫార్ సరేష్వాలా సాక్ష్యం మనసు పెట్టి చూడండి.

  భారత దేశంలో ముస్లింలు ఎంత దుర్భర పరిస్ధితుల్లో ఉన్నారో ఆయన మాటలు చెప్పడం లేదా. గుజరాత్ లో అన్ని అర్హతలు ఉన్నా ముస్లింలకు బ్యాంకులు లోన్లు ఇవ్వవు అని చెప్పిన మాటలు మీ దృష్టికి రాలేదా? గుజరాత్ రాష్ట్రం అంతటా ముస్లింల పట్ల వివక్ష ఉందని ఆయన చెప్పలేదా?

  కాకపోతే ఆ వివక్షకు నరేంద్ర మోడి ఎలా బాధ్యుడు అని ఆయన అడిగారు అదొక్కటే తేడా. కాంగ్రెస్ ఏలుబడిలో కూడా అంతకుమించిన మత కల్లోలాలు జరిగాయనీ, గుజరాత్ 2002 హత్యాకాండలో కూడా కాంగ్రెస్ వాళ్లు పాల్గొన్నారని ఆయన చెప్పాడు. ఇది మోడికి సర్టిఫికెట్ కాదు. మోడి తో పాటు కాంగ్రెస్ కూడా దోషి అని ఆయన సాక్ష్యం రుజువు చేస్తోంది.

  ఈ బ్లాగ్ లో నేను అనేకసార్లు ఆ సంగతి చెప్పాను. మెజారిటీ మతతత్వం విషయంలో బి.జె.పికి కాంగ్రెస్ ఏ మాత్రం తక్కువ కాదు అని. సెక్యులరిజం ముసుగులో ఉంటూనే అవసరం వచ్చినపుడు హిందూ మతోన్మాదులకు సహకరించడంలో కాంగ్రెస్ దిట్ట. హైద్రాబాద్ మతకల్లోలాలకు సంబంధించి ప్రధాన దోషి ఎప్పుడూ కాంగ్రెస్సే. హిందూ మతోన్మాదం చెలరేగినపుడు దానిని సొమ్ము చేసుకోవడానికి బి.జె.పి, కాంగ్రెస్ లు పోటీ పడతాయి. అంతెందుకు పి.వి నరసింహరావు సహకారం లేకుండా బాబ్రీ కూల్చివేత జరిగేది కాదన్నది బహిరంగ రహస్యం.

  ఒక అంశంపైన చర్చ జరుగుతున్నపుడు ఎన్ని రాసుకున్నా ఆ అంశానికే చర్చను పరిమితం చేయాలి. దొరికిందే అవకాశం అన్నట్లుగా అనవసరమైన విషయాలన్నీ తెచ్చి చర్చను కంగాళీ చేయడం మంచి పద్ధతి కాదు. సాయి భార్గవ గారికి ప్రత్యేకంగా ఈ విషయం చెప్పదలిచాను. ఒక అంశంపై నా స్పందన పూర్తి కాకముందే, కొన్ని సార్లు అసలు ప్రారంభం కాకమునుపే సంబంధం లేని విషయాలు ఆయన ప్రస్తావిస్తున్నారు. ముస్లింలపైనా, దళితుల రిజర్వేషన్ల పైనా విషం కక్కుతున్నారు. (ఆ వ్యాఖ్యలను నేను ప్రచురించలేదు) ఈ వర్గాలవారిని అవహేళన చేయడం వలన చర్చ జరక్కపోగా పక్కదారి పడుతుంది. ఇది గమనించాలని కోరుతున్నాను.

  మోడిని సమర్దించడం లేదని ఒక పక్క చెబుతారు. కానీ రాసేదంతా ఆయనకి సమర్ధనే. ఆయన్ని సమర్ధిస్తే మాత్రం ఏమిటి నష్టం? కాకపోతే చర్చలో హేళన రాకుండా చూడాలి. పదే పదే మేధావులు అంటూ హేళన చేయడం మానుకోవాలని వ్యాఖ్యాతలను కోరుతున్నాను. మేధావులం అనుకుని ఎవరూ ఇక్కడ చర్చించడం లేదు. నాతో సహా తమకు తెలిసిన విషయాన్ని తమ తమ దృక్కోణాల్లో వ్యాఖ్యాతలు రాస్తున్నారు. స్వీకరిస్తే స్వీకరించండి. లేకపోతే వదిలేయవచ్చు. చర్చించదలిస్తే మాత్రం దానికి కొన్ని పద్ధతులు పాటించాలి.

 11. Dear Visekhar,
  My point was only to refer to the “selective” highlighting of issues by the media or various other forums. To note that, i copied those notes from the article. Though it doesn’t mean we should forget about Gujrat riots, but it surely is surprising that more bigger and more horrific incidents which are larger in scale like the recent Assam and northeast issues are not even discussed with such rigor.
  Hate him, Love him, I guess one simply can’t ignore Modi!

 12. వెంకట్ గారూ

  అవును. మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. అస్సాం అల్లర్ల గురించి నేనయితే రాశాను. దానికి కారణాలు కూడా చర్చించాను. మీరది చదివే ఉండాలి.

  ఒక్క మతకల్లోలాలే కాదు. ఈ దేశంలో విస్మరణకు లోనవుతున్న సమస్యలు కోకొల్లలు. ఆకలి, దరిద్రం, అవినీతి, కులం, అణచివేత, ఆశ్రిత పక్షపాతం, ప్రజాస్వామ్యం అని ఏమాత్రం చెప్పలేని ఎన్నికలు… ఎన్ని లేవు! అసలు ఇప్పటి వ్యవస్ధే ఒక సమస్య. దీనిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఈ వ్యవస్ధ ఇలానే ఉంచి ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు వెతకడం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడంతో సమానం అనేది నా అవగాహన.

  అవును మోడిని ఇగ్నోర్ ఎలా చేయగలం? చేయొద్దనే చాలామంది చెబుతున్నది.

 13. విశేఖర్‌గారూ,
  మోడిని కేవలం హిందువు అని సంబోధిస్తే, మీలాంటి మేథావులకు తృప్తిగా ఉండదని ఆవెంటనే కరుడుకట్టిన హిందువూ అన్న భావనతో మీరు మోడీని ప్రమాదకారి అని భావిస్తున్నారని స్పష్టంగా చెప్పటం నా ఉద్దేశం.
  మీకు, మీ అభిమాన మేథావులకూ ‘హిందూ మతోన్మాదం’ అనేది నిత్యం కంసుడికి సర్వత్రా కనిపించిన కృష్ణపరమాత్మలా, పరమ భయంకరంగా కనిపిస్తూనే ఉంటుంది, కలలో కూడా. అదేం చిత్రమో మీ అందరికీ “ముస్లిం మతోన్మాదం” అన్నది పొరపాటునకూడా కనిపించనే‌కనిపించదు కదా? అవును లెండి, ఎలా కనిపిస్తుందీ? సగటు హిందువు నా కెందుకూ‌ అని నిర్లిప్తంగాఊరుకుంటాడు. సగటుముస్లిం ఎవరూ “ముస్లిం మతోన్మాదం” అన్న మాట మీబోటి వారు అంటే అలా ఊరుకుంటాడా మరి!

 14. @visakar గారు

  ముస్లింలపైనా, దళితుల రిజర్వేషన్ల పైనా పరుషంగా మాట్లాడాను అని మీరు ఒక judgement కి వచ్చేయడం సబబు కాదు. ఒకే context మీద ఒకొక్కరికి ఒక్కో అభిప్రాయం వుంటుంది , కాశ్మీరీ మిలిటెంట్ కొన్ని వర్గాలకి హీరో అయ్యున్డచు , కాని దేశాన్ని ముక్కలు చేసే ఆలోచన ఉన్న ఎవరైనా నాకు దేసద్రోహే.

  ఇస్లామిక్ టెర్రరిస్ట్ లని, జిహాది లని , ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్న వారిని సాధారణ innocent ముస్లిమ్స్ తో పొంతన వద్దు . నేను వ్యతిరేకించేది ఇస్లామిక్ FUNDAMENTALIST లు , మరియు DAR-UL-ISLAM (ABODE OF ISLAM) ని స్థాపించాలి అనుకునే ముస్లిమ్స్ లోని ఎక్స్ట్రీమ్ వర్గాన్ని , మరియు అందుకు సహకరించే వారిని మాత్రమె అని చెప్పదలచాను.

  ఇక రిజర్వేషన్స్ ని ఆర్దిక, URBAN /RURAL అనే ప్రాతిపదికన ఉంటె బాగుంటది అన్నదే నా ఆలోచన + కాస్టిసం అంతం అవ్వాలి అనుకోడం దళితుల మీద విషం కక్కడం, అవహేళన చేయడం ఎలా అవుతుంది. అదేగా అంబేద్కర్ కుడా ఆశించింది.

  ధన్యవాదాలు

 15. శ్యామలరావు గారూ, మీ ఉద్దేశ్యం సరే. తేడా ఏమిటో చెప్పనే లేదు మీరు.

  అదే చిత్రం! నేను ముస్లిం మతోన్మాదం గురించి రాసినవి అస్సలు మీకు కనిపించనే కనిపించవు. ఎప్పుడన్నా హిందూ అన్నానంటే సరి, కత్తీ, డాలు పట్టుకుని వచ్చేస్తారు తమబోటి పెద్ద మనుషులు!

  అవున్లెండి, ఎలా కనిపిస్తుందీ? ఏదో పెద్దాయన కదా అని నిర్లిప్తంగా ఉండిపోతున్నాను కదా.

  అటు అస్సామ్ నుండి ఇటు గుజరాత్ దాకా ఎన్ని హత్యాకాండలు జరిగినా ‘హిందూ మతోన్మాదం’ అన్నమాటే ఉఛ్ఛరించరాదు మేము?!

  అప్పుడు చెవుల్లో సీసం పోశారు. ఇప్పుడు బ్లాగుల్లో దండకం చదువుతున్నారు.

 16. @sai bhargav

  మరే! judgement ఇచ్చే హక్కు మీ సొంతం కదా మరి!

  ఓసారి మీ వ్యాఖ్యలను వెనక్కి తిరిగి చూసుకోండి. ఎన్ని జడ్జిమెంట్స్ ఇచ్చేసారో. ఉపఖండం అంటే హిమాలయాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతాలకు ఇటువైపు ఉన్నదే అని ఇన్నాళ్లూ అనుకున్నాం. దాన్ని మలేషియా, ఇండొనేషియాలకు కూడా విస్తరించి జడ్జిమెంట్ ఇచ్చింది మీరు కాదా?

  మక్కాలో గుడి అంటూ విచిత్ర వాదన చేస్తూ ముస్లింలందరిపైనా తీర్పు ఇచ్చేసింది మీరు కాదా?

  హిందువులందరి తరపునా వకాల్తా పుచ్చేసుకుని రాబోయే భవిస్యత్తు అంతటికీ హామీ ఇచ్చేసింది మీరు కాదా?

  ఓసారి పైన చూడండి గాజా నుండి ఇండొనేషియా దాకా హిందువులు సంతోషంగా లేరనీ, ఆస్ట్రేలియా నుండి ఇండియా దాకా వాళ్లు సంతోషంగా ఉన్నారనీ… ప్రపంచ ముస్లింల రాజకీయ-ఆర్ధిక-సామాజిక చరిత్రలన్నింటినీ చాప చుట్టేసి చంకలో ఇరికించుకున్నట్లు రెండు మూడు ముక్కల్లో తేల్చిపారేసింది మీరు కాదా?

  దేశం అంటే సరిహద్దులేననీ, అందులో ఉన్న జనం, వారి బాగోగులు కాదని గుడ్డిగా నమ్మేవారు ఎవర్నీ చూసినా నాకు పరమ చిరాకు అని నేనూ చెప్పొచ్చు. కాని అందువల్ల ఉపయోగం ఉండదు కదా? చర్చిస్తే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయన్న నమ్మకంతో ఈ చర్చ నడుపుతున్నాను. అంతవరకు పరిమితం అవుదాం.

 17. శేఖర్ గారు,
  మిమ్మల్నిఒక ప్రశ్న అడుగుతాను. స్వాతంత్ర పోరాట సమయం లో హిందు అణగారిన వర్గం నుంచి అంబేద్కర్ లాంటి వారు జాతీయ స్థాయిలో నాయకుడిగా ప్రముఖ పాత్ర పోషించారు. ముస్లిం ల లో కూడా ఎన్నో తెగలు,పేద, ధనిక అంతరాలు ఉన్నాయి. ఎప్పుడు జిన్నా, అజాద్, లియాకత్ అలీఖాన్ మొద||వారి పేర్లే వినిపిస్తాయి. వీరు సంపన్నులు, భుస్వాములు. ఒక అంబేద్కర్ లాంటి వారు ఎవరైనా ముస్లిం వర్గంలో ఉన్నారా? మీరు ఎన్నో పుస్తకాలు చదువుతూంటారు, కనుక ఈ ప్రశ్నను అడుగుతున్నాను. ఒకవేళ లేకపోతే కారణాలు ఎమై ఉండవచ్చో చెప్పగలరా?

 18. నమ్మశక్యంగా ఉంది! మన దేశపు మేథావి వర్గంవారు, ముస్లిం మతోన్మాదం కూడా వ్రాస్తారని మీరంటుంటే. క్షమించాలి – నాదృష్టికి రాలేదు. అహర్నిశం మీ బ్లాగు చదువుతూ కూర్చోను కదా. ఎప్పుడైన ఇలాంటీ డిఫెన్సుకోసమనైనా మీరు ముస్లిం మతోన్మాదం గురించి కొంచెం సుతారంగా వ్రాసారేమో!

  ఏదో పెద్దాయన కదా అని నిర్లిప్తంగా ఉండిపోతున్నాను అన్నారు. సంతోషం అండీ నా మర్యాద నిలబెట్టినందుకు. ఇందులో నా జోలికొస్తే జాగ్రత అన్న బెదిరింపు కూడా చాకచక్యంగా జోడించబడి ఉందనుకోండి. అది వేరే విషయం.

  తప్పకుండా అన్ని రకాల మతోన్మాదాలగురించి నిర్భయంగా వ్రాయండి. తప్పు లేదు. కాని ఒక హిండూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుని వ్రాయవద్దని మాత్రమే నా అభిప్రాయం.

  బ్లాగు ప్రపంచంలో కూడా హిండూ అన్న పదం వినిపించరాదని మీరు భావిస్తున్నట్లుగా ధ్వనిస్తున్నాయి మీ మాటలు.

  ఏతావాతా తేలేది ఏమంటే, మీ‌ మేథావివర్గం వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళ అభిప్రాయంలో హిందూ అన్న పదం కూడా అభ్యంతరకరమే. హిందువుగా జన్మించటమూ, అలా చెప్పుకోవటమూ, అలా బ్రతకటమూ కూడా మీరు తప్పు అనుకుంటే అది పొరపాటు. కాని మీరు మేథావులు కదా, మీ‌ పొరపాటు మీరు ఒప్పుకోరు, ఇంకొకరు ఆక్షేపిస్తే మీకు వారు ఉన్మాదులక్రిందకే‌ లెక్క. ఇంకెలాగండీ?

  నాకూ ఇంక వాదించే ఆసక్తి లేదు. కాబట్టి మీరెలా స్పందించినా ప్రతిస్పందించబోను.

 19. అసలు “మోడీని వ్యతిరేకించాలీ/సపోర్టు చెయ్యాలి” అనే భావన ఎందుకు మొదలైయ్యింది? ఈ ప్రశ్నతో కనుక మన సెక్యులర్ వాదులని స్కానింగు చేస్తే, ఇవాళ మోడీకి పేరు రావటానికి కారణం దోంగ సెక్యులర్ వాదులే అని తేలిపోతుంది. ఎంతో మంది కరుడుగట్టిన ఇతర మతవాదులు, మతనాయకులు అడ్డంగా మాట్లాడుతూ ఉన్నా వారి మతస్తుల నుండే కాదు, “సెక్యులర్ వాదుల” నుండి కూడా ఎటువంటి వ్యతిరేకతా రాలేదు. అలాంటప్పుడు మోడీని మాత్రం ఎందుకు వ్యతిరేకించాలి? తాడిగడప శ్యామలరావు గారు చెప్పినట్లు “ఈ‌ మేథావులనే వాళ్ళు సెక్యులరిజం అంటే హిందూవ్యతిరేకత అనే అర్థం ఎందుకు నమ్మి ప్రచారం చేస్తున్నారు?

  గుజరాత్ అల్లర్లకి ముందరే దేశంలో అనేక మతస్తులు, అనేక మతకల్లోల అల్లర్లలో, వేల మంది చనిపోయారు. ఆ అల్లర్లని ఎవరూ ఎందుకు ప్రస్తావించరు? ప్రతిదీ రాజకీయ కోణంతోనే కాకుండా సామాజిక కోణంతో కూడా చూడవలసి ఉంటుంది. గుజరాత్‌లో కేవలం మోడీ వచ్చాకే ఉన్నట్లుండి వచ్చిన అల్లర్లు కావు.

  దేశం దాకా ఎందుకు, మన ఆంధ్రాలోనే గుంటూరులో, ప్రకాశం జిల్లా కంభంలో,వినుకొండలలో, హైదరాబాదు పాత బస్థిలో, అదిలాబాదు జిల్లా భైన్సాలో, నెల్లురులో ఇలా ఒకటేమిటి అనేక ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నడుస్తునే ఉన్నాయి. వాటిని ఇప్పటివరకూ గుర్తించనట్లే నటిస్తున్నారు/ప్రవర్తిస్తున్నారు. వీటికి కారణం కుహనా లౌకికవాదుల ద్వందనీతే. ఇలాంటి కారణాలే పెద్దవైతే, ఉన్నట్లుండి “లోకికవాదులు చెప్పే గుజరాత్” అవటానికి ఆంద్రాలో కూడా బోలెడు అవకాశాలున్నాయి.

  కేవలం గుజరాత్‌ని మాత్రమే ఉదాహరణగా తీసుకొని మోడీ పనికి రాడంటే..కాశ్మీరు ఉదాహరణగా తీసుకొని ఆ మతం వారికి రాజ్యాధికారం ఇవ్వకూడదని అనగలమా? పంజాబు అల్లరులని దృష్టిలో పెట్టుకొని వారికి అవకాశాలని ఇవ్వటం మానారా? అతి చిన్న మైనారిటీగా ఉన్న ఓ మతం వారైన, మతమార్పిడులు చేసే వాళ్ళని రాజ్యాధికారానికి దూరంగా ఉంచారా? మోడికే ఎందుకు రచ్చ? దేశ చరిత్రలో హిందువులు ఒకరి నాయకత్వం క్రింద పనిచేసిన దాఖలాలు లేవు., కానీ, సెక్యులర్ వాదుల రచ్చ వలన, హిందువుల మొత్తానికి మోడీ నాయకుడు అయ్యే అవకాశం ఉన్నది.

 20. @visekar gaaru

  i too dont loose interest to talk here anymore , as you are preoccupied with some ideology which is far away from reality and hindu legacy. if 23 % muslims, 33% christians in world have 100’s of theocratic nations (although some wear mask of secularism ), hindus too will soon declare officially india as hindu rashtram. jayathu jayathu hindu rashtram. no socialism / secularism can stop it . i am not anymore interested to reply or respond to any comments

 21. @ Sai bhargav

  It’s always upto you. But, don’t try to throw stones on me. If you loose interest here that will only be due to your preoccupations, not mine. Your ‘interest loosing comment’ itself is showcasing what your preoccupations are.

  Still, you and people like you are always welcome to discuss here, provided minimum respect is extended to the views of other participants. If you want to heckle others with your judgements in the name of views and criticism, and if you expect others to accept right away whatever rot you say… I’m so sorry.

 22. శేఖర్ గారు, పాకిస్థాన్ విభజన పుస్తకం గురించి మీరు అంబేద్కర్ ఆర్గ్ వారికి రాసిన మైల్ కి ఏమైనా బదులు వచ్చిందా? వస్తే వివరాలు తెలియజేయగలరు.

 23. ఇతరులని దూషించి తే తప్ప (తక్కువ చేస్తే తప్ప)తమకు గొప్పతనం లేదనే వారికి అంబేద్కర్‌ ఏమి రాస్తే ఎమిటి?. ఇది మనమెంతో గొప్పది అను కుంటున్న ఈ సంస్కృతి లో బాగమే! ఈభావలోంచి కాదా కులవ్యవస్త పుట్టుకొచ్చింది? ఈ రాజకీయ బావజాలం తనకు కూడా మర్యాద మన్నన తెలుసునని బుకాయిస్తుంది. దీన్ని ఎండకడితే కానీ ఈదేశం లో బహూ జనులు బాగుపడరు. కులవ్యవస్త అంతం కాదు. అది ప్రజాస్వామ్య బావ జాలం నుండి తప్ప మీకు కూడా హక్కుల బిక్షం పెడతాము లెండి అంటే రాదు. దేశంలో ఉన్న కొద్దో గొప్పో ప్రజా స్వామ్య భావజాలనికి గండి కొడుతుంది.

 24. మనోహర్ గారూ, నాకు సమాధానం రాలేదు. మళ్లీ ఆ పుస్తకానికి లింక్ పంపించారంతే. తిరుగు టపాలో మళ్లీ తేడా గురించి అడిగాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s