కేశవ్ గారి మేజికల్ అప్పీల్ కి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?
భారత దేశ రాజకీయ నాయకులు ఈ దేశంలోని అత్యంత ధనికుడుగా పేరు పొందిన వ్యక్తి, రిలయన్స్ కంపెనీ అధినేత అయిన ముఖేష్ అంబానీతోనూ, ఆయన కంపెనీ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ తోనూ పాలు-నీళ్ళు లాగా ఎంతగా కలిసిపోయారో చెప్పగల ఇలస్ట్రేషన్ ఇంతకు మించి ఉంటుందా?
ఒకవేళ అర్ధం కాకపోతే ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ కంపెనీ లోగోనూ, ఈ కార్టూన్ నూ పక్క పక్కనే పెట్టి చూస్తే మర్మం బోధపడుతుంది.
భారత ప్రభుత్వంలో రిలయన్స్ కంపెనీ సాగించుకుంటున్న ఒంటి చేతి పెత్తనం గతంలో ఎన్నడూ కనీ, వినీ ఎరగనట్టిది. అత్యున్నత రాజ్యాంగ సంస్ధలను సైతం తృణీకరిస్తూ, రాజ్యాంగం ఆ సంస్ధలకు అప్పజెప్పిన అధికారాలను అపహాస్యం చేస్తూ కూడా బ్రిటిష్ రాణి తరహాలో దర్జా వెలగబెడుతున్న కంపెనీ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’, వ్యక్తి ‘ముఖేష్ అంబానీ.’
ఈ కంపెనీ తల లాభాల కోసం దేశ ప్రయోజనాలను నిర్లజ్జగా గాలికొదిలేస్తున్నా అడిగే నాధుడు ప్రభుత్వంలో లేదు. గత కాగ్ వినోద్ రాయ్ పుణ్యాన, సి.పి.ఐ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తా అలుపెరుగకుండా సాగిస్తున్న ‘పార్లమెంటరీ సంఘర్షణ’ వలన రిలయన్స్ నిలువు దోపిడీ వెల్లడయింది గానీ వారే లేకపోతే రిలయన్స్ లాభ దోపిడి నల్లేరు నడకే కదా.
రిలయన్స్ కంపెనీ వ్యాపారాన్ని, పెర్ఫార్మెన్స్ నీ ఆడిట్ చేయాలని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్) సంస్ధ గత మూడు నాలుగేళ్లుగా పోరకలాడుతోంది. కానీ ఆ సాకూ ఈ సాకూ చూపుతూ, కోర్టు ఆదేశాలను సైతం ఎడమ కాలితో తన్నేస్తూ రికార్డులు అప్పజెప్పడానికి నిరాకరిస్తూ వస్తోంది. ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందానికి తగినట్లుగా అభివృద్ధి చేసిన గ్యాస్ ఫీల్డ్ లో కొంత భాగాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా, హామీ ఇచ్చిన మేరకు గ్యాస్ ఉత్పత్తి చేయకుండా అనేక గ్యాస్ ఆధారిత విద్యుత్, ఎరువుల పరిశ్రమలను పస్తులు పెడుతోంది రిలయన్స్.
హామీ ఇచ్చిన మేరకు గ్యాస్ ఉత్పత్తి చేయకపోగా మూడో వంతుకూ, నాలుగో వంతుకూ గ్యాస్ ఉత్పత్తిని రిలయన్స్ తగ్గించేసింది. ఒప్పందం ప్రకారం గ్యాస్ తగినంత ఉత్పత్తి చేయకపోతే దానిని తగినట్లు ఖరీదును ప్రభుత్వం రికవరీ చేయాల్సి ఉంటుంది. దాదాపు 6 బిలియన్ డాలర్ల వరకూ రికవరీ చేయాల్సి ఉండగా దానిలో నాలుగో వంతయిన 1.5 బిలియన్ల రికవరీకి కూడా ఆర్బిట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ఏళ్ల తరబడి కాళ్లీడుస్తోంది ఘనత వహించిన మన్మోహన్ సర్కార్. అదే ఫిస్కల్ లోటు తగ్గించడానికి పెట్రోల్, గ్యాస్ రేట్లు పెంచమని చెప్పండి, ప్రతి రోజూ పెంచమన్నా వెనకాడరు మన ప్రభుత్వ నాయకులు! అసలు ప్రతి గంటా పెంచినా నష్టం ఏమిటట అని అడిగినా అడుగుతారు.
అడగండి. కానీ అదే మాట రిలయన్స్ ని ఎందుకు అడగరు? ఇప్పటికీ దాదాపు మూడేళ్ళ నుంచి ఆడిట్ కోసం ఖాతా పుస్తకాలు తదితర రికార్డులు ఇవ్వమంటే రిలయన్స్ నిరాకరిస్తూ వచ్చింది. కోర్టులో కాలహరణ కేసులు పెడుతూ కాలయాపన చేస్తూ వచ్చింది. ఆడిట్ కి ఒప్పుకునేది లేదని ఒకసారి, ఆడిట్ కి ఒప్పుకున్నాక అడిగిన రికార్డులు ఇవ్వకుండా ఒకసారి, కోర్టు మొట్టికాయలతో ఇవ్వడానికి ఒప్పుకుని కూడా ఆడిట్ నివేదిక పార్లమెంటులో పెట్టడానికి వీలు లేదని మరొకసారి…. ఇలా ప్రజలనీ, కోర్టులను, పార్లమెంటును, రాజ్యాంగ సంస్ధలనూ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది రిలయన్స్.
“మోసపూరిత ప్రవర్తనతో ప్రజల్లో ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక ప్రైవేటు కంపెనీ, నేరుగా రాజ్యాంగం నుండే అధికారం పొందిన కాగ్ ను తేలికగా తీసిపారేస్తుందన్న అంశంలో నాకు అనుమానం లేదు. ఆడిట్ తగిన సమయంలో పూర్తి కావడానికి వీలుగా పూర్తి సమాచారాన్ని కాగ్ కి వీలయినంత త్వరలో ఆర్.ఐ.ఎల్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) ఇచ్చే విధంగా దానికి ఖచ్చితమైన ఆదేశాలివ్వాలని నేను పెట్రోలియం శాఖ కార్యదర్శి వివేక్ రాయ్ కి ఇప్పటికే లేఖ రాశాను” అని సి.పి.ఐ ఎం.పి గురుదాస్ దాస్ గుప్తా కాగ్ కి ఆదివారం రాసిన లేఖలో పేర్కొన్నారంటే రిలయన్స్ ప్రతిష్ట ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
గత మూడు సంవత్సరాల్లో హామీ ఇచ్చిన మేరకు గ్యాస్ ఉత్పత్తి చేయకపోవడం వలన విద్యుత్, ఎరువుల కంపెనీలకు వచ్చిన నష్టాన్ని కాగ్ అంచనా వేయాలనీ, గ్యాస్ ఉత్పత్తికి ఆర్.ఐ.ఎల్ కి ఎంత ఖర్చవుతోందో ఇంతవరకూ ఎవరూ లెక్క వేయలేదనీ కాబట్టి వాస్తవ ఉత్పత్తి ఖర్చునూ, కంపెనీ వాస్తవ లాభాలనూ కాగ్ లెక్కించాలని గురుదాస్ కోరారు. రిలయన్స్ కంపెనీకి చెల్లిస్తున్న గ్యాస్ ధరను రంగరాజన్ కమిటీ పేరుతో ప్రభుత్వం దాదాపు రెట్టింపు పెంచిన నేపధ్యంలో ఈ సమాచారం దేశానికి అవసరమని ఆయన కాగ్ ని హెచ్చరించారు. కాస్ట్ రికవరీ పేరుతో రిలయన్స్ దాచిన ఉత్పత్తిని లెక్కించాలనీ ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి కంపెనీకి ప్రభుత్వంలో మద్దతు ఇవ్వనివాడితే పాపం అన్నట్లుగా మద్దతు ఇస్తున్నారు. రిలయన్స్ అంటే కేవలం ముఖేష్ అంబానీ అనుకుంటే పొరపాటు. ఆయన అప్పులు తెచ్చింది వాల్ స్ట్రీట్ కంపెనీల నుండి. ఆయన కంపెనీలో పశ్చిమ బహుళజాతి కంపెనీలకే గాక అనేక రూపాల్లో వాల్ స్ట్రీట్ బ్యాంకులకు కూడా వాటాలున్నాయి. అంటే భారత ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న గ్యాస్ లాభాలు నింపేది వాల్ స్ట్రీట్ కంపెనీల కరెన్సీ గరిసెల్ని!
ఈ దేశంలో పారదర్శకత, జవాబుదారితనం, విలువలు కలిగిన సంస్థలు ఉండవా?! ఈ అడ్డుగోలు ఎందుకు? ఎవరికోసం?
@visekar garu
చాలా బాగా , సూటిగా వివరించారు., ఆ ప్రాజెక్ట్ ఏదో ప్రబుత్వ రంగ సంస్థ చేపడితే ఈ భాధ లన్ని ఉండవు కదా. they tells cock and bull stories like govt psu or organizations dont have required resources, then we should develop resources. we have iit’s, nit’s, 900+ engg colleges in AP itself ( all scrap except few). it doesnt mean iit’s are super, they have their flaws. in iit’s professors see only %’s of students but dont encourage students in research side
we dont have link beetween universities – industries – research bodies. we spend crores on iitians, they do mba in iim and then join banks in america, uk (whats use). i dont know about iit professors but iitians are world class students excluding few, if govt use them properly then we no need to depend on foreign countries for technology imports.
due to this fraud ambani —> fertilizer rates increasing ——> finally showing impact on common people.