నాకు తెలియని ఉదయభాను


ఈ పాట నిన్నే విన్నాను (చూశాను). ఉదయభాను తన అమ్మగారితో కలిసి ఈ పాట రాశారట. పాట రాయడం అటుంచి ఆమె పాడతారని కూడా నాకు తెలియదు. ‘నేను గతంలో చాలాసార్లు పాడాను’ అంటున్న ఆమెను చూసి ‘నిజమా’ అనుకుని హాశ్చర్యపోయేసి అందులోంచి తేరుకునే లోపు ఆమె పాడడం కూడా మొదలుపెట్టారు.

పాట ఒక్కోపాదం వినేకొద్దీ నా ఆశ్చర్యం అవధులు దాటింది. మధ్యలో తెలంగాణ యాసలో ఉన్న కొన్ని పదాలు తప్ప  చాలావరకు పాట అర్ధం అయింది. ఒక్కో పాదం ముగిసి కొత్తపాదం ఎత్తుకునే కొద్దీ నా మనసులో ఆమె పట్ల గౌరవం ఒక్కో మెట్టూ ఎక్కుతూ పోయిందంటే మీరు నమ్మాలి. అంత గొప్పగా ఉంది పాట.

ఉదయభానుగారు అంటే ఇన్నాళ్లూ నాకున్న అభిప్రాయం పూర్తిగా వేరు. ఆమెను ఎంటర్ టైనర్ గా మాత్రమే నేను ఎరుగుదును. శ్రోతలను, ప్రేక్షకులను ఆకర్షించగల నేర్పు తన సొంతం గనుక మంచి యాంకర్ గా తెలుసు. గతంలో ఒక్కోసారి ఆమె యాంకరింగ్ కొంత వెగటు పుట్టించిన మాట కూడా నిజం. ఈ మధ్య కాలంలో తన ఓవర్ యాక్షన్ తగ్గించుకున్నారని కూడా నేను అనుకున్నాను. ఆమె కొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్ లో డ్యాన్స్ చేశారని విన్నాను, కానీ చూడ్లేదు.

ఆమె పాడుతుండగా వినడం, చూడడం మాత్రం నాకు ఇదే మొదటిసారి. ‘గతంలో అల్లరి పాటలు పాడాను’ అని ఆమె వీడియోలో చెప్పారు. కానీ నేను ఎప్పుడూ వినలేదు. ఆ పాటలు వింటే బహుశా నా అభిప్రాయం ఎలా మలచబడి ఉండేదో తెలియదు గానీ, ఈ పాట వినకముందయితే ఆమెను ఉదయభాను అని మాత్రమే రాసేవాడినేమో. కానీ ఇప్పుడామెను ‘ఉదయభాను గారు’ అనకుండా ఉండలేకపోతున్నాను.

‘రేలా రేలా’ యాంకర్’ గా నాలుగు ఎపిసోడ్ల పాటు జానపద కళా, గీతకారులతో మెసలి వారి కళను అందిపుచ్చుకున్నారో లేక ఆమెకు మొదటి నుండి ఈ కళ ఉన్నదో తెలియదు గానీ, ఆమె రచనా పటిమకు అభినందనలు చెప్పి తీరవలసిందే.

ఈ పాట పాడిన తర్వాత ‘ఉద్యమ భాను అయిన ఉదయ భాను’ అంటూ ఏ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి ఒక ప్రత్యేక కధనం ప్రసారం చేసింది. దాన్ని కూడా నేను యూ ట్యూబ్ లోనే చూశాను. అందులో తాను ‘ఎవరినీ ఉద్దేశించి ఈ పాట రాయలేదు’  అని ఆమె చెప్పుకున్నారు. కానీ పాట మాత్రం అలా లేదు.

రాష్ట్రంలో నేటి పరిస్ధితిని పదునైన మాటలతో ఆమె తెగనాడారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలుకుతూనే ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ‘కలుపు మొక్కలు, రాకాసి బల్లులు, రావణాసురులు, కోడెనాగుల’ను ఆమె దునుమాడిన తీరు అద్భుతం. ‘రెండు పూటల్ పస్తులుండి నిండు ప్రాణాలెన్నో మింగి’న ‘గోండ్రు కప్పలు, గుంట నక్కల’ను సైతం ఆమె వదల్లేదు.

అచ్చ తెలుగు చీరకట్టుతో ఉదయభాను ప్రదర్శించిన విశ్వరూపం ఈ వీడియోలో చూడండి. వీడియో కింద  ఉన్న పాట పాదాలను ‘ఎంతెంతదూరం‘ బ్లాగ్ నుండి సంగ్రహించాను. సదరు బ్లాగర్ కిరణ్ గారికి ధన్యవాదాలు.

గంగ గరుడాలెత్తుకెళ్ళేరా.. ఇంక ఆంబోతులాట సాగేరా..

ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కండ్లు సూడు

భూమి బుగ్గై పోయె.. సూడు బొంద గడ్డల జోరు సూడు..

ఎవ్వారొ…

ఎవ్వారొ ముద్దు బిడ్డలు రా… ఎందుకనొ పరుగెట్టినారురా..

ఎవ్వారొ ముద్దు బిడ్డాలెందుకనొ పరుగెట్టినారురా..

ఎవ్వారొ ముద్దు బిడ్డలెందుకనొ పరుగెట్టినారు

ఎర్రనీ మడుగుల్ల మునిగి ముద్దలాయె ముద్దు బిడ్డల్

బోరు బోరుగ గండమోర్లు పెట్టి గుండె పగిలె తల్లులు

ఈ కడుపుకోతల నార్పెదెవ్వరురా

ఆ కలుపు మొక్కల కాల్చెదెవ్వడురా

రాకాసి బల్లులంతా రాజ్యమేలే రాజులంటా -2

రావణాసురులంత జేరి రోజుకొక్కా రచ్చ పెడితే..

పంట చీడను మట్టుపెట్టే పురుగు మందుల విందులాయె–2

ఎంత నెత్తురు ఏరులై నెవ్వాని దూప తీరదాయే

జాలి జూపర జంగమయ్యా జాగిలాలా జాతరాపర.. -2

కొండ దిగిరా కొమూరన్నా కొండముచ్చుల కోర్కెదీర్పర..

రెండు పూటల్ పస్తులుండీ నిండు ప్రాణాలెన్నొ మింగె -2

గోండ్రు కప్పలు గుంట నక్కలు కాకికూత కోడెనాగులు ..

గద్దె కొరకే గాడ్దికొడుకుల్ గత్తారాలేపేరురా

ఇది మారీచులాటరా నువ్ మర్మమెరుగర పామర –2

ఆడు తెస్తడొ, ఈడు తెస్తడు

అవ్వ ఇస్తదొ అయ్య తెస్తడొ -2

ఎవ్వడిచ్చెదేందిరా ఇది ఎవ్వనీ జాగీరురా.. -2

నీకు నువ్వే రాజురా నిన్నేలెటోడింకెవడురా-2

గంగ గరుడాలెత్తుకెళ్ళేరా ..ఇంక ఆంబోతులాట సాగేరా

ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కన్ను సూడు

భూమి బుగ్గై పోయె సూడు బొంద గడ్డల జోరు సూడు..

గంగ గరుడా… గంగ గరుడాలెత్తుకెళ్ళేరా

***          ***          ***

ఏ.బి.ఎన్ తో మాట్లాడుతూ ఉదయభాను గారు మరిన్ని పాటల్ని తాను రాస్తానని చెప్పారు. ఆమె ఇంకా ఏమి రాస్తారా అని ఎదురు చూసేలా ఈ పాట రాశారు. కాబట్టి ఆమె తదుపరి పాట కోసం ఎదురు చూద్దాం.

(అప్ డేట్: కింద వ్యాఖ్యాత వెంకట్ గారి సూచన మేరకు పాటలో తప్పుగా దొర్లిన ఒక పంక్తిని సవరించాను. వెంకట్ గారికి కృతజ్ఞతలు -విశేఖర్, 24/07/2013 5:48 PM)

25 thoughts on “నాకు తెలియని ఉదయభాను

 1. శేఖర్‌ గారు,
  ఉధయభాను గారు ఈ పాట రాసి, పాడారంటే నేను కూడనమ్మ లేక పొతున్నాను. నేను చెప్పాలని అను కున్నవి అన్నీ మీరు చెప్పేసారు. ఈ పాట చూ పినందకు దన్యవాదాలు.

 2. abba abba em gopppa em goppa …….. seriess of events chudakundaa andhraa babu lu telangan udayama banu em poguduthunnaru …. 1) motta modata udaya banu ku election lo palguguntudhani okaa nijamo ? rumaro ? bayataku vachidhi 2 ) andhra pradesh politrics gurunchi rayani ee blog lo CBN garu delhi lo chesinaa hungaama gurunchi poguduthu okaa article 3) udaya banu adbuthaminaa pataa datlo udamaniki nayakthvam vahinchi naa KCR nu banda boothulu thidothu okaaa pataa (aythee ee pata thane rasindhani thana thallli gari supprot thisikundhataa … evaru rasaro ? evaru rapicharo ? ) 4) tharuvathaa TV 9 lo interview datlo naku offer itchinaa party TDP ani narma grabaangaa velladi 5) CBN channell ( ABN channell antaro CBN channell abntaro naku antha gurthu ledu ) interview 6) malli mee blog lo udayma banu gurunchi …… enti telagana udhyamam veru telanagan nayakthavam veraaaa abba emi teilivi mee andhra valladhi ….. kCR nu demorale chesthe ayee pothadi Telanagan motham mana chethuloki vachinatte …… avunu KCR andhari prasthuthamunna rajakeeya nayakudu lanti vade ( mee communistt basha lo cheppalante burjuvaa nayakudu ) kani mee andhra party la kanna chala chala better ….. abba endhuku ko lagadapati upavasa lunapudu oka ru kudaa athamahatya cesukoledu …. enti athamahatyalaku KCR ye badyudaaa mee andhra nayakathavam kada ?? kallu teripicharu marichi poyaa mee udayama banu inkokaa angle ee link lo chudandi http://www.youtube.com/watch?v=LMemJFMlY4o

 3. చందు గారు, మీ మాటల్ని బట్టి, మీరు ఇచ్చిన లింక్ ను బట్టి మీకు మహిళలపై వివక్ష జాస్తిగానే ఉన్నట్లు కనిపిస్తోందని చెబితే మరోలా అనుకోవద్దు.

  ఉదయ భాను గారు డ్యాన్సర్. కనుక ఆ యాంగిల్ లో ఆమె అద్భుతంగా కనిపించారు. మీరు ఏ యాంగిల్ లో చూశారో, ఇంత అపహాస్యం చేస్తున్నారో నాకు తెలియదు.

  తనకు రాజకీయాలు నప్పవనీ, తనకా ఆలోచన లేదనీ ఎ.బి.ఎన్ ఇంటర్వ్యూలో ఆమె స్పష్టంగా చెప్పారు. అంత స్పష్టంగా చెప్పినా ఆమె నర్మగర్భంగా చెప్పారంటూ దానినే నమ్ముతున్నారు. మీ నమ్మకం మీది. కాని దానికి ఆమెను బాధ్యురాల్ని చేయడం తగదు. చిత్రం ఏమిటంటే ఎలక్షన్ లో పాల్గొంటారన్న సంగతి నిజమో, పుకారో తెలియదని మీరే అంటారు. మళ్లీ అదే చేత్తో నిర్ధారించేస్తారు?!

  ఇంతకీ సి.బి.ఎన్ ఎవరు? ఆయన ఢిల్లీలో చేసిన హంగామా ఏమిటి? దాని గురించి ఇక్కడ వార్త వచ్చిందా? ఈ సంగతేంటో నాకు అర్ధం కాలేదు. ఛానెల్ పేరు ఎ.బిఎన్నో, సి.బి.ఎన్నో తెలియకుండానే ఇన్ని నిర్ధారణలు చేయడం ఏమిటని?

  మీరు చెప్పిన నాయకులే బండబూతులు తిట్టడంలో గొప్ప అని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఉదయభాను పాటలో నాకు బండ బూతులు ఏమీ కనపడలేదు. బహుశా మీరు చెప్పిన నాయకుడి భాష అలవాటై బూతులు సామాన్య భాష గానూ, సామాన్య భాష బూతు గానూ మీకు అనిపిస్తోందంటారా?

  ఉద్యమం వేరు, ఉద్యమ నాయకులం అని చెప్పుకుంటున్నవారు వేరు కాకపోతే ఆ నాయకులు ఢిల్లీలో తిష్ట వేసి సకలజనుల సమ్మె ఆపమని హైద్రాబాద్ కి ఫోన్ల మీద ఫోన్లు ఎందుకు చేస్తారు? జె.ఎ.సి నాయకుడు కోదండరాం పైన విష ప్రచారం ఎందుకు చేస్తారు? ధర్నాలు, ఊరేగింపులు జరుగుతుంటే వాటిల్లో పాల్గొనకుండా ఇంట్లో ఎందుకు ఉంటారు? ఉద్యమ పార్టీని తీసుకెళ్ళి పచ్చి దోపిడీ పార్టీ కాంగ్రెస్ లో ఎందుకు కలుపుతానంటారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు నాకు తెలుసు. మీరు తెలుసుకోవలసిన అవసరం బాగా కనిపిస్తోంది.

  కె.సి.ఆర్ గారిని ప్రత్యేకంగా డీమోరలైజ్ చేసే అవసరం ఏమిటి చెప్పండి. ఈ బ్లాగ్ కి ఆ అవసరం అసలే లేదు. వాస్తవాలు సాధారణంగా కఠినంగా ఉంటాయి. కానీ స్వీకరిస్తే మంచి గుణపాఠాలు ఇస్తాయి. ఆల్ ది బెస్ట్!

 4. gadidha kodukulu ante banda boothu kada v shekaraaa garu …………..
  gadidhi kodukulannapudu pithrusvamyaa thittu kaadaaaa ame chesinaa natyamu lo em konamu kanipisthundhi shtree janodhrakaa …. enthaa amyakthvam natisthunnaru CBN ante Chandra Babu Nauyudu ani teliyadaa meeku … (oka velaaa telavakpoyeena delhi lo evaru vardaa badhithu hungaama chesaa ro teliyadaa ) JAC kodandaram meedha visha pracharam chesaraa KCR ?? sakalajannula samme apamani phonla meedha phone lu chesaraa ( meero forensic lo kuda cheraaraa Andhra media vachindhi kabatti nijamenataraa ) sare adhe nijamu anukundham nijangaa samme alage enni rojulu konsagedi anukuntunnaru …. ohoo asemblee muttadiki KCR bayataku raledaa …. TRS party em mathram try cheyaledaa ante KCR veru TRS veraa ?? :)) em em chyalo meeroka screept ivachu gaa ….. mee padalu chaduvuthunte poddunaa andhrajyothy paper chaduvuthuunnattu vundhi …..

 5. చందు గారూ పెద్ద వ్యాఖ్యలు రాసేటప్పుడు లేఖిని వాడండి. చదవడం కష్టంగా ఉంది.

  సి.బి.ఎన్ అని ఎందుకున్నారో ఇప్పుడర్ధం అయింది. అయితే ఉత్తరాఖండ్ వరద వార్తల్లో టిడిపి కృషిపై వార్తని మీరు అలా అర్ధం చేసుకున్నారా? కాని ఆ పార్టీ అసలు ఉద్దేస్యం కూడా ఆ టపాలో రాశాను కదా?

  ఉదయభాను గారి పైన మీ వ్యంగ్యం ఇంతటితో ఆపడం బాగుంటుంది. అది కరెక్ట్ కాదు.

  గాడిద కొడుకు బండబూతే అయితే కె.సి.ఆర్ గారి తిట్లు ఇంకెంత బూతు కావాలి? ఈ బూతు చర్చని ఇక వదిలేద్దాం. దాని వల్ల ఏ ఫలితమూ ఉండదు.

  జెమినీ న్యూస్ లో ఓసారి జనంతోనే సర్వే తరహాలో మాట్లాడించారు. ఆ ప్రోగ్రాం పేరు గుర్తు లేదు. పల్స్ అనుకుంటా. కోదండరాం పైన కె.సి.ఆర్ చేసిన ప్రచారం గురించి అందులో జనమే చెప్పారు. ‘మాట్లాడితే కోదండరాం పైన విషం కక్కుతాడు’ అని (తెలంగాణ) జనమే అన్నారు.

  సకలజనుల సమ్మె విషయం తెలంగాణ నాయకుల ద్వారానే నాకు తెలిసింది. ఆ సమ్మెలో చివరి వరకూ టి.ఆర్.ఎస్ పక్కనే ఉంది తప్ప యాక్టివ్ గా పాల్గొనలేదు. చివర్లో వచ్చి విగ్రహాలు కూల్చారు. అప్పుడు కె.సి.ఆర్ ఢిల్లీలో ఉన్నారు. ఇవన్నీ బహిరంగ రహస్యాలే అనుకుంటాను.

  పోతే మీరు ఆంధ్రజ్యోతిని బాగా కలవరిస్తున్నారు. నేను ఆ పత్రికా చదవను. ఛానెలూ చూడను. ఈ టివి 2 ఒక్కటే, అది కూడా వార్తలు మాత్రమే చూస్తాను.

 6. meeku artham kanidhi kadu prasthu tha samajeeka paristhulalo Oka rajakeeya party ela vuntayoo alaa ne vuntundhi ….dhani chittha shutthini telaganaga konam lo chudali kani ….. meeru erparchukunna frame lo dhanni pattinchalante kastam …. malala gurunchi adbuthamainaa article rasinaa mekku uday banu episode artham chesukovadam ..kastamaa cheappandi

 7. చందు గారు కింద ‘తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?’ అన్న మకుటం కింద లేఖిని కి లింక్ ఇచ్చాను చూడండి. ఆ పేజీకి వెళ్తే పై బాక్స్ లో తెలుగుని ఇంగ్లీష్ లిపిలో టైప్ చేస్తే కింద బాక్స్ లో అది తెలుగు లిపిలో కనపడుతుంది.

  మీరు చెప్పిన తెలంగాణ ఫ్రేమ్ లో కూడా కె.సి.ఆర్, టి.ఆర్.ఎస్ లు పట్టడం లేదు చందూ గారు. అదే నేను చెబుతున్నది. మీకు కష్టం అనిపించినా, టి.ఆర్.ఎస్ జనాన్ని నమ్ముకున్న పార్టీ కాదని చెప్పక తప్పదు. ఆ పార్టీ దృష్టంతా పైరవీలపైనే. కాని ఉద్యమాలు లేకపొతే పైరవీలు ఎందుకూ పని చేయవు. వై.ఎస్.ఆర్ ఉన్నపుడు టి.ఆర్.ఎస్ ఏ ఉద్యమమూ చేయలేకపోవడానికి కారణం ఏమిటి? టిడిపితో పొత్తు పెట్టుకున్నది కూడా టీ.ఆర్.ఎస్సే కదా.

  ఆ పార్టీ చిత్తశుద్ధి దాని పుట్టుకలోనే కాదు దాని ప్రతి అడుగులో కనపడాలి. మొదటి నుండి ఆ పార్టీ కాంగ్రెస్ ఎత్తుగడల్లో భాగం అవుతూ వచ్చింది. కాని తెలంగాణను మొదటి నుండీ మోసం చేస్తున్నది కాంగ్రెస్సే కదా. ఇప్పుడు కూడా ఎన్నికల ముందరి ఒక అనివార్య పరిస్ధితిలోనే కాంగ్రెస్ సిద్ధపడుతోంది తప్ప జనం కోసం కాదు. అలాంటి పార్టీలో కలిసే పార్టీ, అది తెలంగాణ కోసమే అయినా, గొప్ప పార్టీ కాజాలదని నా అభిప్రాయం.

  తెలంగాణ రాష్ట్రమే సర్వ సమస్యలకూ ఔషధం కాదు. దానివల్ల అక్కడి జనానికి సాపేక్షికంగా కొంత మెరుగైన పరిస్ధితి వస్తుంది, అంతే. ఈ వాస్తవం గ్రహించకపోతే రేపు నిరుత్సాహపడక తప్పదు.

  ఉదయభాను గారు టిడిపి తరపున పోటీ చేయదలిస్తే అది ఆమె హక్కు. కాని తనకా ఉద్దేశ్యం లేదని చెప్పినపుడు మనం నమ్మాలి కదా. ఇప్పుడిలా చెప్పీ తర్వాత పోటీ చేస్తే ఆమె అబద్ధం చెప్పింది అని అనుకుంటాము. ఇప్పటివరకైతే ఆమె చెప్పిందే స్వీకరించాల్సి ఉంటుంది.

 8. naku emi bramaalu emi levu telangana ragane …swargam dhigi vasthu ndhi …. alla palana pani chesthe swargam dhigi vasthundhi ani evarainaa cheppina nenu nammanu …. idhi nirantharaa pakriyaa …ninnati kanna nedu merugu ane siddanthane nenu nammuthanu ……. naa frame lo pettadam ledu anutune maali piravi laa party antunnaru em pirvai chesindho cheppaledu… nenu andhra jyothy eenadu chadavanu antune aa paper lo headings anni ikkada dhimputhunnaru … asalu piravee lu cheyanni party india lo okati vundhaa ………….enhtaa amaykangaa matladuthunnaru TRS jannani nammukunna party kada .. 2009 ku mundhu TRS veru tharuvathaa TRS veru appudu ………… ee theda nu gamanichali meeru…aa marpu ku karanam janamu lo vachinaa chitanyame oka karnam kaga shatruvu balihinapdadam inkoka karanam ilanti smaymulo TRS racha marhgamu vundagaa doddi darulu vethukovalisina avusramu ledu anukuntaa … malli cheputhunna TRS okaa Telangana ballangaa korukune boorjuvaa ( mee bashalo) party ( soory telugulo rayaleka pothunannu office nundi vellipothunna thondaralo …..)

 9. చెప్పిన మాటల్ని కాకుండా చెప్పని మాటల్ని నమ్మడం మీ అలవాటా చందు గారూ?

  మీరు చెప్పే మాటలు కూడా ఆంధ్ర జ్యోతిలో ఏదో హెడ్డింగ్ లో కనపడతాయి. అలాగని మీరే ఆ వార్త రాసినట్లా? లేకపోతే అక్కడ చూసి ఇక్కడ రాసినట్లా?

  నమ్మడం, నమ్మకపోవడం మీ యిష్టం. కాని మీ నమ్మకానికి నన్ను బాధ్యుడిని చేయొద్దు.

  మీకు అవసరం అయితే టి.ఆర్.ఎస్ లైఫ్ ని 2009 కి ముందూ తర్వాతా అని వేరు చేయొచ్చన్నమాట! మీకా స్వేచ్ఛ ఉన్నట్లే ఉదయభాను గారిని నటన-వ్యక్తిగతం అని వేరు చేసే స్వేచ్ఛ నాకూ ఉంటుంది.

  తెలంగాణకు లాబీయింగ్ అవసరం అని టి.ఆర్.ఎస్ నాయకులు చాలాసార్లు చెప్పారు. లాబీయింగ్ అంటే పైరవీ అనే కదా. కాదా?

 10. అద్భుతంగా రాసారు ఉదయ బను గారు, బాగా పాడారు. ఆ లిరిక్స్ చాలా పవర్ఫుల్ గ వున్నై.

  తెలంగాణా అంటే తెలుగు ని పాటలా గానం చేసే ప్రాంతం అన్న మాటకి అతికినట్టు వుంది ఉదయ బను గారి పాట .

  ” గంగ గరుడాలెత్తుకెళ్ళేరా.. ఇంక ఆంబోతులాట సాగేరా..”

  అక్షర సత్యం , యంతో గొప్ప వాస్తవిక మాటని అల పాటలా రాయడం చాలా బాగుంది. అల్ ది బెస్ట్ తో ఉదయ బాను గారు

 11. @chandu garu

  తెలుగు లో వ్రాయుటకు ఈ క్రింది సాఫ్ట్వేర్ వోపయోగిమ్చండి ఈజీ గ వుంటుంది , లేఖిని లో లాగా కాపీ పేస్టు చెయ్యనవసరం వుండదు.

  http://www.google.co.in/inputtools/windows/

  ఎంజాయ్ తెలుగు

 12. విశేఖర్ గారు అసలు ఈ విషయం ఎందుకు ఎక్కడ ప్రస్తావించారు? ఇదేమైన వార్తా?విశేషమా? ఇదేమైన గొప్ప విషయమా? గొప్ప సాహిత్యమా?

 13. తెలంగాణ రాష్ట్రమే సర్వ సమస్యలకూ ఔషధం కాదు. దానివల్ల అక్కడి జనానికి సాపేక్షికంగా కొంత మెరుగైన పరిస్ధితి వస్తుంది, అంతే. ఈ వాస్తవం గ్రహించకపోతే రేపు నిరుత్సాహపడక తప్పదు. ani akkada leaders ki teliyaali kadaa

 14. @moola garu

  ఇది వార్త కాదు కానీ గొప్ప విషయం , సాహిత్య పరంగా అదేదో ఇంతకుముందు యవ్వరూ రాయలేదని కాదు బట్ ఒకా సాధారణ యాంకర్ అలా రాసారు అంటే అది గొప్ప విషయం, నలుగురికి ఇన్స్పిరేషన్ ఆ పాట. సాధారణంగా యాంకర్స్ లోకం వేరేగ వుంటది , అంటే సాహిత్యం , ఉద్యమం ఇలాంటి వాటికీ దూరంగా ఉంటది. ఆ లోకం లో ఉన్నా కూడా ఇంత బాగా రాసారు అంటే అది మంచి విషయమే.

 15. సాయి భార్గవ్ గారు, ఈ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ వార్తావిశేషాలకై కేటాయించబడింది! కనుక ఆ దృష్ఠిలో అడిగాను! అంతే!

 16. http://www.screentalent.wordpress.com

  మాండలిక భాష సరిగ్గా తెలియకున్నా, భావావేశాన్ని అందరికీ పంచే అధ్బుత ప్రక్రియ పాట. ఈ పాట గురించి బాగా చర్చ జరుగుతుంటే చూడలేకపోయానే అనుకున్నా. చూపించినందుకు ధన్యవాదాలు.

 17. మూల గారు

  ఉదయ భాను గారి పాట గొప్పవారిని కీర్తించలేదు. డబ్బు కోసం రాసినది కాదు. ఆ పాటలోని పంక్తులను గమనించినట్లయితే అది అచ్చంగా ప్రజల కోసం, ప్రజల తరపున రాసిందని అర్ధం కావడం లేదా?

  జాతీయ, అంతర్జాతీయ విశేషాలు అంటే అవి ప్రజలకు దూరంగా ఉండేవి కాదు. ప్రజల బాగోగులు, సమస్యలు, పరిష్కారాలే జాతీయ, అంతర్జాతీయ విశేషాలు. ఈ విశేషాలు రాజకీయంగా, ఆర్ధికంగా మాత్రమే ఉండాలని రూల్ లేదు. సామాజిక, సాంస్కృతిక అంశాలు కూడా అందులో భాగమే. కాకపోతే అవి పరోక్షంగా ఉంటాయి.

  ఈ పాటలోనైతే రాజకీయాలు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే ఉన్నాయి. ఎంత ప్రత్యక్షంగా అంటే, ‘ఆమె త్వరలో ఒక పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు’ అని పుకార్లు వ్యాపించేంత.

  బహుశా ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఆమె కార్యకలాపాల వల్ల మీకు ఇదో పెద్ద విశేషమా అని అనిపించిందేమో. నిజానికి అందుకే ఇది విశేషం అయింది. ఎప్పుడూ నాన్-సీరియస్ గా కనిపించే వ్యక్తి ఇంత సీరియస్ పాట రాసి పాడితే విశేషం కాకుండా ఎలా ఉంటుంది.

  ఇన్నాళ్లూ ఉదయభాను గారి పైన తక్కువ అభిప్రాయం కలిగి ఉన్నట్లయితే అది సవరించుకోవాల్సిన సందర్భం ఇది అని నాకు తోచింది. అందుకే రాశాను. వ్యక్తులపై అంచనాలు అంత త్వరగా వేయకూడదు అనడానికి ఇది ఒక తార్కాణం కావచ్చు.

 18. మీరు ఈ పాట ని మీ బ్లాగ్ లో ప్రచురించినందుకు చాలా సంతోషం.

  ఈ పాట లో ఒక వాక్యం లో చిన్న సవరణ….

  “బోరు బోరుగ గండమోర్లు పెట్టి గుండె పగిలే తల్లులు” అని ఉండాలి….

  దయచేసి సవరించగలరు……

  Thank you,
  Venkat.

 19. Udayabhanu garu…. Is extremely talented person at the same time extremely sensitive.. Telugu vaaru andaru garvinchali udayabhanu garini chusi.. Kondaru CHANDUsavadulaku kalanu kalakarulanu gouravinchatam teleedu.. Oka sari kadu yennosarlu desham gurinchi samskaram gurinchi thanu matladatam vinnamu.. Nenu chalasarlu ascharya poyanu.. Oka chinna vishayam gamaninchandi… Link peduthunna.. Goreti venkanna patavintu thanu yela spandinchindo.. She is simply a great human… And rangam lo thana dance spellbounding.. Aa talent ki hats off..
  She is truly an inspiration.. God bless her. First five mints plz do watch .

  http://m.youtube.com/#/watch?v=FXYx8UjKYtg&desktop_uri=%2Fwatch%3Fv%3DFXYx8UjKYtg

 20. aa goppa udhya bhanu … kcr nu gadidhi koduka anni prjala koasam parthapinche udhya bhanu ee roju KCR CM ayeena tahruvatha pushpa gutcham itchiee thegaa sabara padi potundhi …. great anaylsis chesinaa maha medavulaku neerasha parchindhi 😦

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s