మోడీకి అమెరికా వీసా కావాలట!


Modi & Rajnath

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి అమెరికా వీసా కావాలి. ఈ మేరకు తాము అమెరికాను కోరనున్నట్లు బి.జె.పి జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ స్వయంగా తన మనసులో మాట వెలిబుచ్చారు. న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాజ్ నాధ్ సింగ్ అక్కడ ఒక పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు.

అమెరికా వీసా తమకు ముఖ్యం కాదని బి.జె.పి నాయకులు ఎప్పుడూ చెబుతుంటారు. మోడీకి అమెరికా వీసా నిరాకరించినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం ఏమీ లేదనీ, అదసలు పెద్ద విషయమే కాదని వారు తరచుగా చెప్పే మాట. అలాంటిది బి.జె.పి అధ్యక్షుడే మోడి వీసా విషయమై అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నానని చెప్పడం అమెరికాకు ఆ పార్టీ ఇచ్చే ప్రాముఖ్యత ఏమిటో ఇట్టే అర్ధం అవుతోంది.

“గుజరాత్ ముఖ్యమంత్రికి వీసా మంజూరు చేయాలని నేను అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను” అని రాజ్ నాధ్ సింగ్ అన్నారని ది హిందూ (పి.టి.ఐ ద్వారా) తెలిపింది. 2002లో గోధ్రా రైలు దహనం అనంతరం జరిగిన ముస్లింల హత్యాకాండ దరిమిలా మోడి వీసాను అమెరికా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి మోడి అమెరికా వెళ్లలేకపోయారు.

అమెరికా వీసా కోసం మోడి ఏమీ వెంపర్లాడడం లేదని కూడా బి.జె.పి నాయకులు చెబుతారు. అయితే మోడీకి వీసా నిరాకరించడం పట్ల అమెరికా ప్రభుత్వాన్ని సుతిమెత్తగా విమర్శిస్తారు. నరేంద్ర మోడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ముఖ్యమంత్రి అని, దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని, అలాంటి నాయకుడికి వీసా నిషేధం విధించడం అప్రజాస్వామికమని వారు విమర్శిస్తారు.

కానీ బి.జె.పి విమర్శలను అమెరికా ఎప్పుడూ పట్టించుకున్నట్లు లేదు. పట్టించుకోలేదు అనడం కంటే అమెరికాకు ఇంకా ఆ అవసరం రాలేదు అనడమే కరెక్టు. ఎందుకంటే అమెరికా వీసా నిరాకరణ కేవలం అలంకార ప్రాయమే. తాను మానవ హక్కులను పట్టించుకుంటానని, అసలు మానవ హక్కులను పాటించడంలో తానే ఛాంపియన్ ని అనీ చెప్పుకోవడం అమెరికాకు ఇష్టం. ఊరికి చెప్పుకుంటే చాలదు. అందుకు తగిన ఆచరణ ఉండాలి. అలాంటి ఆచరణ కోసమే ఇలాంటి అలంకార ప్రాయమైన హక్కుల ఫోజులు అమెరికా పెడుతుంది.

బ్రిటన్ ఇప్పటికే మోడిపై విధించుకున్న నిషేధాన్ని తొలగించింది. బ్రిటన్ రాయబారులు మోడితో ఒక సిటింగ్ కూడా వేసేశారు. బహుశా త్వరలో అమెరికా కూడా బ్రిటన్ ను అనుసరించే అవకాశాలు ఉన్నాయి. అందుకు తగిన ఏర్పాట్లు రాజ్ నాధ్ సింగ్ పర్యటన సందర్భంగా జరుగుతున్నాయని రాజ్ నాధ్ సింగ్ ప్రకటన తెలియజేస్తోంది.

ఇటీవల (మార్చి నెల) ‘వార్టన్ ఇండియా ఎకనామిక్ ఫోరం’ వాళ్ళు నిర్వహించిన సెమినార్ లో వీడియో లింక్ ద్వారా నరేంద్ర మోడి ప్రసంగించాల్సి ఉండగా అది చివరి క్షణాల్లో రద్దయిపోయింది.  ‘యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా’ లోని కొందరు మోడి ఉపన్యాసానికి అభ్యంతరం చెప్పడంతో నిర్వాహకులు మోడి ప్రసంగాన్ని రద్దు చేశారు. అందుకు ప్రతీకారంగా ఫోరం సమావేశాన్ని స్పాన్సర్ చేసిన ‘అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్’ స్పాన్సర్ షిప్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. సమావేశంలో ప్రసంగించాల్సి ఉన్న శివసేన నాయకుడొకరు కూడా ఉపసంహరించుకున్నారు.

వార్టన్ ఫోరం ప్రహసనం మోడీకి నష్టం కంటే మేలే ఎక్కువ చేసిందని కొందరు భావించగా, అసలు మోడీకి వీసా నిరాకరించడం కూడా సరికాదని భావించిన మోడి వ్యతిరేకులు కూడా ఉన్నారు. వార్టన్ ఫోరం సమావేశానికి ముందూ ఆ తర్వాతా అమెరికా, ఇండియాల్లో పత్రికలు జరిపిన చర్చల ద్వారా మోడీకి బోలెడు ప్రచారం దక్కడం ఒక వాస్తవం.

ఇదిలా ఉండగా రానున్న సాధారణ ఎన్నికల్లో బి.జె.పి కూటమి విజయం సాధిస్తే మోడియే ప్రధాని అని రాజ్ నాధ్ సింగ్ దాదాపు చెప్పకనే చెప్పారని ది హిందూ తెలిపింది. తనను తాను ప్రధాన మంత్రి పోటీ నుండి తొలగించుకున్న రాజ్ నాధ్, మోడిని తాను ప్రచార కమిటీ సారధ్య బాధ్యతల్లో నియమించిన సంగతిని గుర్తు చేశారు. బి.జె.పి అధ్యక్షుడే ప్రధాని అభ్యర్ధి కావాలన్న నియమం లేదని చెబుతూ ఆయన ఎన్నికలకు 7 నెలల ముందు తాను మోడీకి ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిపారు.

One thought on “మోడీకి అమెరికా వీసా కావాలట!

  1. అమెరికా వీసా తమకు ముఖ్యం కాదని బి.జె.పి నాయకులు ఎప్పుడూ చెబుతుంటారు. మోడీకి అమెరికా వీసా నిరాకరించినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం ఏమీ లేదనీ, అదసలు పెద్ద విషయమే కాదని వారు తరచుగా చెప్పే మాట. అలాంటిది బి.జె.పి అధ్యక్షుడే మోడి వీసా విషయమై అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నానని చెప్పడం అమెరికాకు ఆ పార్టీ ఇచ్చే ప్రాముఖ్యత ఏమిటో ఇట్టే అర్ధం అవుతోంది.

    ప్రాముఖ్యత కాదు నా బొంద కాదు రాజనాథ్ మోడీ ని ఇరికించాడు ఇంకా చాలా మంది ఆ పార్టీ వాళ్ళే ఇరికిస్తారు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s