ముస్లింల జనాభా: అభిప్రాయాలూ – దురభిప్రాయాలు


భారత దేశంలో హిందువులు, ముస్లింల జనాభా వృద్ధి విషయంలో వివిధ వేదికల పైన అనేక వాదనలు, ప్రతి వాదనలు జరుగుతుంటాయి. వీటిలో హిందూ అతివాద శక్తులు సాగించే దుష్ప్రచారం కలిసిపోయి ఉంటుంది. ఈ దుష్ప్రచారంతో ప్రభావితులై అనేకమంది సామాన్య ప్రజలు కూడా అవే వాదనలు నమ్మి తమకు తెలియకుండానే నోటి మాట ద్వారా ప్రచారం చేస్తుంటారు. ఒక్క క్షణం నిలబడి ఈ వాదనలు నిజామా కాదా అని ప్రశ్నించుకుని వాటికి ఖచ్చితమైన సమాధానాలు వెతకడానికి ప్రయత్నిస్తే తాము నమ్ముతున్న అంశాల్లో చాలా వరకు నిజం కాదని తెలుస్తుంది. కాస్తో, కూస్తో నిజం ఉంటే అది స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా ట్విస్ట్ చేయబడి ఉందని కూడా గ్రహింపుకు వస్తుంది.

భారత దేశంలో హిందువులు, ముస్లిం మతాలకు చెందిన జనాభా వృద్ధికి సంబంధించి జరుగుతున్న కొన్ని ప్రచారాలను పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.

ప్రచారం లేదా దుష్ప్రచారం లేదా పుకార్లు ఏదైనా అనండి: ప్రధానంగా వినిపించేది ఏమిటంటే, హిందూ జనాభా కంటే ముస్లిం జనాభా వేగంగా వృద్ధి చెందుతోందని. ఒక్కో ముస్లిం పురుషుడికి నలుగురు భార్యలను కలిగి ఉండే హక్కు షరియా ప్రకారం ఉన్నది కనుక ఎక్కువ మంది పిల్లలు పుడుతున్నారని, తమ సంఖ్యను పెంచుకోడానికే ముస్లింలు కుటుంబ నియంత్రణను పాటించరనీ, 2050 నాటికల్లా లేదా అంతకు ముందే గానీ, తర్వాత గానీ ముస్లింల సంఖ్య, హిందువుల సంఖ్యను మించి పోతుందనీ ఈ ప్రచారంలో భాగంగా ఉంటుంది. దీని వెనుక పాకిస్ధాన్ కుట్ర ఉన్నదనీ, అసలు ఖురాన్ లోనే అలాంటి ఏర్పాట్లు ఉన్నాయనీ ఇంకా అలాంటివేవో ఈ ప్రచారంలో వినపడుతోంది.

వాస్తవానికి జనాభా పెరుగుదల అనేది సామాజికంగా పరిశీలించాలి తప్ప మతపరంగా కాదు. ఆర్ధిక దృష్టితో కూడా పరిశీలించి తదనుగుణమైన చర్యలను ప్రభుత్వాలు తీసుకోవచ్చు గానీ మతపరంగా చూస్తే గనుక అనేక విపరిణామాలు తప్పవు. మత విద్వేష కోణంలో లేదా మత దురభిమానం కోణంలో చూస్తే రక్తపాతం అనివార్యం. ఇటువంటి సున్నితమైన అంశాలను పరిగణించకుండా దురభిప్రాయాలు వ్యాపింప జేస్తే అది దేశానికీ, సమాజానికీ ఏ మాత్రం మేలు చేయకపోగా కీడు చేసినవారం అవుతాము.

ఇప్పుడు లెక్కల్లోకి వస్తే…. 1951 నుండి 2011 వరకూ భారత ప్రభుత్వం సేకరించిన జనాభా లెక్కల ఆధారంగా ముస్లింల జనాభా పెరుగుదలను కింది పట్టికలో చూడవచ్చు.

సంవత్సరం మొత్తం జనాభా ముస్లిం జనాభా శాతంలో హిందు జనాభా (శాతంలో)
1951 361,088,090 35,856,047 9.93% అ.లే*
1961 439,234,771 46,998,120 10.70% 83.50
1971 548,159,652 61,448,696 11.21% 82.70
1981 683,329,097 77,557,852 11.35% 82.60
1991 846,427,039 102,586,957 12.12% 82.40
2001 1,028,737,436 138,159,437 13.43% 80.50
2011 1,210,193,422 172,210,523 14.23% అ.లే
2100 1,780,000,000 320,000,000 18.50% అ.లే

*అందుబాటులో లేవు.

ఈ పట్టికను చూస్తే మొత్తం దేశ జనాభాలో హిందువుల సంఖ్య కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తే, ముస్లింల జనాభా కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తోంది. చివరి వరుసలో 2100 సంవత్సరానికి ఇచ్చిన అంకె సచార్ కమిటీ ఇచ్చిన అంచనా. భారత దేశంలో ముస్లింల స్ధితిగతులను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం సచార్ కమిటీని నియమించింది. సదరు కమిటీ జనాభా లెక్కలను ఆధారం చేసుకుని కొన్ని విలువైన విషయాలను తెలియజేసింది. వివిధ కోణాల్లో ముస్లింల పరిస్ధితులను అధ్యయనం చేసి ముస్లింల జనాభా వేగంగా పెరుగుతోందనడంలో నిజం లేదనీ వాస్తవంలో ముస్లిం జనాభా వృద్ధి రేటు పెరుగుదల (ముస్లిం జనాభా పెరుగుదల కాదు) క్రమంగా తగ్గుతోందని సచార్ కమిటీ నిగ్గు తేల్చింది. ఆ వివరాలకు తర్వాత వద్దాము.

సచార్ కమిటీ అధ్యయనం ప్రకారం ముస్లింల జనాభా 2100 నాటికి కూడా హిందువులను అధిగమించకపోగా అనేకమంది ఊహించినట్లు కనీసం వారి దరిదాపుల్లోకి కూడా రాదని స్పష్టం అవుతోంది.

ఇదే అంశాన్ని రాష్ట్రాల వారీగా కింది పట్టికలో చూడవచ్చు. ఈ పట్టికలను గత సంవత్సరం ఒక నివేదిక నుండి సేకరించాను (స్క్రీన్ షాట్). ఆ నివేదిక ఎక్కడిదో నాకు గుర్తు లేదు. ఇండియా సెన్సస్ వెబ్ సైట్ గణాంకాలతో ఇవి సరిపోయాయి గనుక ఈ పట్టికను నమ్మవచ్చు. ఈ పట్టిక తయారు చేసే నాటికి 2001 జనాభా లెక్కలు విడుదల కాలేదు. కాబట్టి 2001 లెక్కలు లేవు. 1901 నుండి మతపరంగా జనాభా విభజన ఈ పట్టికలో చూడవచ్చు. 1947లో దేశ విభజన జరిగి భారత్, పాకిస్ధాన్ లు ముస్లిం, హిందువులను పరస్పరం మార్పిడి చేసుకున్న అనంతర పరిణామాలు కింది పట్టికలో 1951 నుండి ఇవ్వబడిన అంకెల్లో స్పష్టంగా చూడవచ్చు.

Religious composition of Indian Union 1901-1991

పై పట్టికలో Indian R అంటే ఇండియన్ రెలిజియన్స్ అని అర్ధం. అంటే హిందూ మతంతో పాటు బౌద్ధ, జైన మతాలు కలిసి ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే 1901లో హిందువుల జనాభా మొత్తం జనాభాలో 86.64 శాతం ఉంటే 90 సంవత్సరాల తర్వాత 1991 లో వారి భాగం మొత్తం 85.088 శాతం ఉన్నది. అంటే కేవలం 1.552 శాతం మాత్రమే హిందువుల భాగంలో తేడా కనిపిస్తోంది.

అదే ముస్లిం జనాభా తీసుకుంటే 1901లో మొత్తం జనాభాలో 12.209 శాతం ఉంటే 90 యేళ్ళ తర్వాత 1991లో వారి భాగం 12.590 శాతం మాత్రమే పెరిగింది. అంటే కేవలం 0.381 శాతం మాత్రమే ముస్లిం జనాభా భాగం (షేర్) యొక్క వృద్ధి కనిపిస్తోంది. ఇలాంటి వృద్ధితో 2050 కల్లా హిందువులతో ముస్లింల జనాభా సమానం అవుతుందనీ, 2100 కల్లా ముస్లింలే ఎక్కువగా ఉంటారనీ జరుగుతున్న ప్రచారంలో ఎంత తప్పు ఉన్నదో అర్ధం అవుతుంది. వాస్తవాలకు భిన్నంగా జరుగుతున్న ప్రచారం ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతున్నట్లయితే అది క్షమార్హం కాదు. 

పాకిస్ధాన్

పొరుగునే ఉన్న పాకిస్ధాన్ లో జానాభా వృద్ధి ధోరణిని మతాల వారీగా పరిశీలిద్దాం. ఐక్యరాజ్య సమితి నుండి ఈ జనాభా గణాంకాలను సేకరించారు. అక్కడ హిందువులు మైనారిటీ అని ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి.

Religious composition of Pakistan 1901-1991

పై పట్టిక ప్రకారం భారతీయ మతాల జనాభా భాగం మొత్తం జనాభాలో 1901లో 15.932 శాతంగా ఉంటే అది 1991లో 1.649 శాతానికి తగ్గిపోయింది. ఇంత భారీ తేడా దేశ విభజన వల్ల వచ్చిందని 1951 లెక్కలని బట్టి చూడవచ్చు. కానీ 1951 నుండి 1991 వరకూ చూసినట్లయితే హిందువుల భాగం 1.596% నుండి 1.649% కు పెరిగిందని గమనించవచ్చు.  అంటే 0.053% పెరుగుదల.

ముస్లింల భాగం చూస్తే 1901 లో 83.875% నుండి 1991కీ 96.796% కి పెరిగింది. కానీ 1951 నుండి చూస్తే 97.119% నుండి 96.792% కి తగ్గిపోయింది. అంటే 0.327% తగ్గుదల.  అంటే 1951 నుండి పాక్ లో హిందువుల భాగం పెరుగుతూ రాగా ముస్లింల భాగం తగ్గుతూ వచ్చింది. దీనిని బట్టి పాకిస్ధాన్ లో మెజారిటీ కావడానికి, ఎంత తక్కువగా అయినా, హిందువులు ప్రయత్నిస్తున్నారని అనవచ్చా? అనలేము. కారణం ఏమిటో తదుపరి భాగంలో చూద్దాము.

27 thoughts on “ముస్లింల జనాభా: అభిప్రాయాలూ – దురభిప్రాయాలు

 1. The US views on ‘Indian Islam’ and its interpretation had found place in one of its diplomatic cable, leaked by WikiLeaks.Referring to various ‘contacts’ in India, the cable says that most of them believe that the official figure ( Census 2001) of over 138 million Muslims in India is “under representative” as actual number is “substantially higher” — closer to 160 to 180 mil lion.

  hahaha that sachar report is a political stunt by congress. by following dubious empirical methods any one can prepare reports according to their interests. so please dont take stuff from such report.

  ok , by following above table i infer this

  from table 5 ( focussing on 1941-1951), indian R in pakistan decreased by 18.091 %, whereas muslims in india ( focussing on 1941-1951) decreased by 2.950% only . here comedy is pakistan created on religion basis, but 10.430% (13.380-2.950) i.e 70.6 % of total muslims in india remained here only whereas only 5% hindus(indian R) stayed at pakistan, that means more than 94% of hindus(Indian R) were forced to leave pakistan, but by following table4 increase in hindus (indian R) between 1941-1951 in india is 2.799% only , where is remaining 15.292% or 851458.56 hindus or even more were missing or brutally killed by muslims in pakistan.

  pakistan was given as jinnah (muslim league) demanded separate pakistan for muslims but 70% of muslims stayed here only so pakistan creation itself is void, as transfer of muslims was not done but lakhs of hindus were killed. wow what a political stunt, jinnah, gandhi, nehru together crossed hitler. i feel happy if gandhi, nehru alone died doing fast to not divide country rather than lakhs of innocents .

 2. nenu ayana evaro percentage rasadani complete data adigite meru raasaaraa asalu janaanni hindu muslim christian lu gaa vidagotti lekkalu veyatam avasaramaa ee lekkaale kondaru naayakulaki aayudhaalu avutaayi mee data prakkaram pak lo 1951 lo indian religion 0646 1991 lo 2018 ante number increase avutundi kadaa ninna okaru akkada jati moyyaanni champutunnarani rasaru % lekka kaadu number mukhyam

  nenu aa table tappuga chooste delete this

 3. Acording to 1998 census,minorities account for 3.7% of pakistan population.But some reports say minorities are more than 6%.Where come this differnce?Due to growing blasphemacy cases and rapid victimization they are either converted to islam or not revealing their own religious identity due to fear of attack from radicals.Christians are also equally targeted in akistan along woth hindus.Their girls are abducted and raped and converted to islam.Ex-rinkle kumari and so on..Even the muslim brothers who went from india to pakistan dreaming a bright future during partition were also harassed there.They are called as ahmadiya muslims.They are not allowed to recite kalma,take muhammad as suffix intheir name&to write holy quoran on their graves.They are treated as second citizens.

 4. according to constitution of pakistan , ahmadiyas are not muslims. lol, they too are kafirs (non believers). if a muslim guy marries rich hindu girl there (in pak) , it is considered as great achievement, in that way demographic changes is super fast in pakistan. wow. durga going muslims are also not muslims because it comes under idol worship, music, dance, acting, are also forbidden things according to islam.

  hindus religious freedom in pak,bangladesh vs muslims religious freedom in india is incomparable. hindus condition in pakistan, bangladesh is pathetic, miserable.
  i beg all socialists to concern hindus in pak too by educating us on their life, so that message can reach right bodies

 5. విశేఖర్ గారూ,
  అసత్య ప్రచారాల ద్వారా మన సమాజాన్ని మత ప్రాతిపదకన విభజించి, శాంతి యుతవాతావరణాన్ని దెబ్బదీసే పొటెన్షియల్ ఉన్న ఇలాంటి అంశాన్ని చర్చకు పెట్టి, నిజానిజాల్ని వెలికితీసేందుకు మీరు చేస్తున్న ప్రయత్నానికి వేలవేల జోహార్లు.
  కొన్నేల్లక్రితం జరిగిన ఓ సంఘటనను మీ ముందుంచుతాను. 2001 జనాభా లెక్కల గణాంకాల విడుదల సంధర్భంగా అనుకుంటా..
  National population registry వారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి గణాంకాల్ని అధికారికంగా వెలువరించారు. అంతకు ముందు దశాబ్దం లెక్కల్తో పోల్చి ముస్లిం ల జనాభా హిందువుల జనాభాతో పోల్చితే 4 రెట్లు అధికంగా పెరుగుతుందని అధికారికంగా తేల్చారు. ఆ మరుసటిరోజు అన్ని వార్తాపత్రికల్లోనూ ఇది ప్రధాన వార్త గా వచ్చింది. ఇక మన ఈనాడు లో ఐతే, ఆ వార్త, దానిపక్కనే దీనితో జరగబోయే పరిణామల్ని వివరిస్తూ బిజెపి వారి ఆక్రోశం రెండూ మొదటిపేజీలో వచ్చాయి. మీలాంటి ఆలోచనా పరులెవరో తర్వాత ఆ లెక్కల్ని తరచి చూస్తే తేలిందేమంటే..
  ప్రతి పదేల్లకోసారి చేసే జనగనణ లెక్కల్లో వృద్ధిరేటు, శాతాల్లో లెక్కగట్టేటప్పుడు కాశ్మీర్ జనాభాని కలపకుండా లెక్కగట్టేవారు. కానీ 2001 ప్రెస్ మీట్ లో మొదటిసారిగా కాశ్మీర్ జనాభాని కూడా కలుపుకుని లెక్కగట్టారు. సహజంగానే కాశ్మీర్లో ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి, మొత్తం మీద చూస్తే ముస్లింల సంఖ్య గననీయంగా పెరిగినట్లు కనిపించింది. TV స్టూడియోల్లో 2 రోజుల పాటు ముస్లింల జనాభా పెరిగిపోతుందహో అనే ఊకదంపుడు ఉపన్యాస్యాసాల తర్వాత ప్రభుత్వం సవరించిన గణాంకాల్ని ప్రచురించింది. దీనిలో తేలిందేమంటే, పెరుగుదలలో తగ్గుదల రేటు , హిందువులలో కంటే ముస్లింలలో ఎక్కువగా ఉందని. కానీ అనుకున్నట్లుగానే దీనిని ఏ పత్రికా ప్రముఖంగా ప్రచురించలేదు.( ఒక్క THEHINDU తప్ప). ఇక తెలుగు పత్రికల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.
  ఇక మీకు తెలిసిన ముస్లింలలో ఎంత మంది 4 భార్యల్ని కలిగి ఉన్నరో ఎవరికి వారు లెక్కెసుకోవచ్చు. ఇద్దరు భార్యల్ని కలిగిన ముస్లిమ్నే నేనింతవరకు చూల్లేదు.
  ఇక జనాభా నియంత్రనకి ఇస్లాం వ్యతిరేకం అనేది కూడా మరో అపోహ. ఇండోనేసియా, ఇరాన్, మొరాకో లాంటి అనేక దేశాలు జనాభానియంత్రన పద్దతుల్ని ఎఫెక్టివ్ గా అమలుచేస్తున్నాయి. మన దేశంలో కూడా చదువుకున్న చాలా మంది ముస్లింలు ఇద్దరు పిల్లల తర్వాత ఆపరేషన్లు చేయించుకుంటున్న వైనం వారితో క్లోజ్ గా మూవ్ అయ్యే ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఐనా రాజకీయాలు చేసేవారికి నిజానిజాల్తో పనిలేదు కదా.. అందుకే ఈ విషయం గురించి అసత్య ప్రచారాలు నిరాటంకంగా జరిగిపోతూనే ఉన్నాయ్.

 6. ప్రియమైన విశేఖర్ గారు,
  మీరు చూపించిన ప్రకారం
  హిందువులు ముసల్మానులు
  1951 – 36.1 కోట్లు 3.58 కోట్లు
  2011 – 121.0 కోట్లు 17.2 కోట్లు
  2100 – 178.0 కోట్లు 32.0 కోట్లు
  పెరిగిన రెట్లు (1951 – 2011) 3.36 – 4.96 (దగ్గరగ 5 రెట్లు)
  పెరిగె రెట్లు (1951 – 2100) 4.93 – 9.14 (దగ్గరగ 9 రెట్లు)

  మరి ఎవరు ఎక్కువ పెరుగుతున్నట్లు
  మీరు దీనిని ఏ విధంగ విశ్లేషిస్తారు
  Intaku mundu pampinadi koddiga mistake vachindi deenini prachurinchagalaru

 7. పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి విడిపోయిన తరువాత కూడా ఆదేశం అదే పేరును కొనసాగించటం ఆశ్చర్యకరమైన విషయం. మత ప్రాతిపదికమీద ఏర్పడిన దేశం, బంగ్లాదేశ యుద్ద సమయంలో తమ స్వంత మతస్థుతల పైనే ఎన్నో ఘోరమైన అకృత్యాలు చేశారు. ఈ మధ్య యుద్ద నేరాల క్రింద కొంతమందికి శిక్షలు పడ్డాయి. వీటికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ ప్రజలంటే వారికి చాలా చిన్న చూపు. పొట్టిగా,నల్లగా ఉంటారని, పంజాబి పాక్ వాళ్లు చాలా హాండ్సం గా ఉంటారని పాకీల భావన.
  డబ్బులు లేన్ని దరిద్రులు అన్న భావనే తప్ప ప్రపంచ వ్యాప్తంగా వాళ్లు గొప్పగా చెప్పుకొనే ముస్లిం సోదర భావమేమి వాళ్లకు ఉండేది కాదు. అదేకాక బంగ్లా లో పేదలు, తుఫానుల సంఖ్య ఎక్కువ. పాక్ వాళ్లకు బంగ్లా వారికి ప్రతి తుఫాను కు ఎందుకు ధన సహాయం చేయాలి? అనే భావన ఉండేది. రెండు దేశాలు కలసి ఉన్నపుడు,ఒకసారి పాక్ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, మరుగుదొడ్లు కట్టుకోవటానికి బంగ్లా వారు నిధులడిగితే , మీకు … మరుగు దొడ్లు కావాలా? ఆరు బయట పంటచేలలో పోండి అని పంజాబి పాక్ మంత్రులు వారిని ఎగతాళి చేశారట. ఇటువంటి అవమానాలు వారి చేతిలో పడి పడి బంగ్లా వారువిరక్తి చెందారు. తిరగబడ్డారు.
  అయినా ఆదేశం గురించి ఇంత చర్చ అనసరమా?! వాళ్ల భవిషత్తును వారి నాయకులే ఎప్పుడో ఊహించి చెప్పారు. అలాగే జరుగుతున్నాది.

  Maulana Abul Kalam Azad: The Man Who Knew The Future Of Pakistan Before Its Creation

  http://www.newageislam.com/articledetails.aspx?ID=2139

 8. శేఖర్,
  ఆ వ్యాఖ్య సాయి భార్గవ్ ను ఉద్దేశించి రాశాను. ఏడిటింగ్ లో కొన్ని లైన్స్ ఎగిరి పోయి, చెప్పాలనుకొన్న దానిని స్పష్ట్టంగా చెప్పలేకపోయాను. ఇప్పుడా వ్యాఖ్య ఈ టపాకు రిలవెంటో, కాదో , కనుక ఆ వ్యాఖ్యను ప్రచూరించటం ప్రచూరించకపోవటం మీ ఇష్టం.

 9. పాక్ లో ఒక్క హిందూ లనే చంపట్లా సిఖులని christians ni ఇంక మాత్ట్లాదీతె సున్నీలు షియాలని షియాలు సున్నీల ని చంపుకుంతారు దానికి ఎవరు ఏమి చేస్తారు socialist laki enti sambandham ee lekkalanne waste mr sai bhargav straight gaa ardam ayetatlu okka vishayam cheppandi

  hindus religious freedom in pak,bangladesh vs muslims religious freedom in india is incomparable. hindus condition in pakistan, bangladesh is pathetic, miserable.

  daaniki parishkaaram emanna undaa leda ikkada kooda freedom vaddaaa asalu akkadi gola mankenduku ikkada unna hindu la paristite ayomayam veellalone unity ledu veellu vaallani uddharunchamantaaraaa

  durga going muslims are also not muslims hindullone chala cultures unnayi veellantaa okati ani evaranna cheppaaraa niluvu bottu adda bottu chukka bottu dvaitam advaitam visishtadvaitam dvaitadvaitam inkaa chaala groups unnai vaallu dargaa ki velte enti maszid ke velte enti hindu lantaa oke gudiki vellaru appudu vaallu hiudu lu kaadaa

 10. విశేఖర్‌ గారు, చీకటి గారు,
  చాలా బాగా చెప్పారు, ఇన్నీ ఘనాంకాలు, ఇన్ని లెక్కలు మన సాదరన పౌర లకు అవసరమా రాజకీయ నాయకులకు, మత దురా హంకారులకు, జాతీయ దుర హంకాహరులకు తప్ప?! అబద్దాలు చెట్టా పట్టా లేసుకతిరుగుతున్నాయి.- ముఖ్యంగా యువత మనసుల్లో విష భావలెక్కిస్తున్నారు.
  ఏజనాభా ఎంత పెరిగినా తిండి దొరక్క పోతె తప్ప మరెవకి అవసరం. ఏవేవో మతాలొచ్చి మన దేశాన్ని కభలిస్తాయనీ మతపరంగా తప్ప మనం జాగ్రతగా వుండలేమనే మాట ఎంత ఊహజనితమైంది. నిజంగా ఈ లాంటి వాల్లు ఉంటారంటే నాకు నమ్మబుద్ది అవటం లేదు. గత ప్రభుత్వం లో ఎన్‌ సీ అర్‌ టీ పాఠ్య పుస్తకాలు కూడ మార్చేసరట! ఎక్కడొ చదివాను. మరి రానున్నా పది పదిహెను సవంత్సరాలలో ఎలా వుంటుందో మరి. ఏమైన మీరు ఇస్తున్న వివరాలకు అభినందనులు.

 11. కొంత కాలం ప్రభుత్వవుద్యోగం చేశాను. రాజకీయ అవసరాలకు కులమత లెక్కలను ఎలా మారుస్తారో నాకు బాగా తెలుసు. ఇపుడు జరగబోయే పంచాయితీ ఎన్నికలకు చేసిన రిజర్వేషన్స్ అవకతవకలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఓట్ల రాజకీయానికి కులాల్ని మతాల్ని ఏ సమయంలో ఎలా వాడుకోవాలో మన నాయకులకు బాగాతెలుసు. మీరు నిజాయితిగా ఒక చిన్న పట్టణాన్ని మైనారిటీలు ఉన్నచోట్ల సర్వే చేయండి. వాస్తవాలు బయటకు వస్తాయి

 12. @visekar @ chandu tulasi @cheekati

  2011 census లో govt deliberately dont given religion wise population statistics and population projection details , but given in 2001 census. ఎందుకు ప్రచురించలేదు ? because హిందు జనాభా 70% కంటే తక్కువ పడిపోయింది , అది అసలు కారణం . english media, majority of universities ని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న socialist లు ఈ విషయాన్ని ప్రజలకి ఎందుకు చెప్పరు. దేశాన్ని 28 ముక్కలు చేసి తద్వారా ఏదో చేసేద్దాం అని బ్రమలో వుండే socialist లు వాళ్ల goal ని direct గా చెప్పచ్చు కదా? మరి డొంకతిరుగుడు తనం ఎందుకు.

  ఆచరణ లో మతం , రాజకీయం , ఆర్ధిక స్థితిగతులు దేనికవే వేరు వేరు కాదు, ఒక దాన్ని ఇంకొకటి ప్రభావితం చేస్తాయి. అయినా socialism అనేది failed కాన్సెప్ట్ , అది failed కాదు , అసలు ఇప్పుడు దాకా ఎక్కడా లేదు, ఇకముందు మేము స్థాపిస్తం అనుకోడానికి మించిన బ్రమ , ఊహ ఇంకొకటి లేదు.

  కార్ల్ మార్క్స్ ఏమి చెప్పాడు “మతం ఒక మత్తు ” అని. భయo , అజాగ్రత్త, జననం , మరణాంతరం , విశ్వ ఆవిర్బావం , కష్ట – సుకాలకి గల కారణాలు ఇంకా మరెన్నో తాత్విక , theological విషయాలు మనిషిని మతం వైపు ప్రయానింప చేస్తాయి. దీన్ని 100 marx, stalinlu, 10000మంది రంగానాయకమ్మలు , అరుంధతి రాయ్ లు వచ్చినా మార్చలేరు.

  మొదట socialism అనే బ్రమ ని, తర్వాత, ఈ ప్రపంచాన్ని ఆర్ధిక స్థితిగతులు మాత్రమె ఆడిస్తుంది అనే పూర్తిగా వాస్తవం కాని అవాస్తవాన్ని విడిచిపెడితే అన్నీ సక్రమంగా అర్ధమవుతాయి.

  every man/women is unique, our world is unique, if one see this world as poor(exploited by rich) / rich (exploiter) than it is against to the unique nature of this world. such ideology is incorrect, narrow, subscribers to such ill ideology are people who thinks that they interpreted this world in correct sense and remaining interpretations are wrong/ politically motivated only. there is more than poor /rich here(leading a happy life, satisfaction, spiritual growth, to know ultimate truth etc etc).

 13. to know ultimate truth etc etc). ikkada ardam aite ultimate ade ardam avutundi hindu population numbedr cheppinaa cheppak poyinaa vache nashtam laabham ledu ikkada unna system lo enni kotla hindu lunnarani evaroo pattinchukoru special benefits ivvaru adi ye govt vachinaa asalu hindu ane concepte ledu unnadi kulam praantam dabbu bhaasha power peda vadini peda vadu anaka emantaaru adi against nature elaa avutundi adee nature lo parte kadaa socialism vidili edi pedataam capitalism pedadaamaa inkedanna izam pedadaamaa briteshers adi peditene kadaa poraadi deenni techaaru దేశాన్ని 28 ముక్కలు చేసి తద్వారా ఏదో చేసేద్దాం anukunte ilaantive 28 replica lu vastaayi antakannaa edi kaadu hinduism socialism edi andariki benefit kaadu alaa aite andaroo dantlone chere vaallu 70% kanna taggindi kaani number increase avtundi gaa
  leading a happy life, satisfaction, spiritual growth, to know ultimate truth etc ivi kaavaalante andari daggara dabbu ledu veetillo edi kaavaalanna money must poor ki meru cheppinavi evaru istunnaru kaneesam choopistunnaraa

  socialism అనేది failed కాన్సెప్ట్ , అది failed కాదు , అసలు ఇప్పుడు దాకా ఎక్కడా లేదు, ఇకముందు మేము స్థాపిస్తం అనుకోడానికి మించిన బ్రమ , ఊహ ఇంకొకటి లేదు. asalu jeevitame pedda bhrama andulo idiinko bhrama every man/women is unique, our world is unique, let them be unique you cant make them one with socialism or hinduism

 14. సాయి గారు,
  మీరు కొన్ని నిజాలైన భూమి మీద నిలబడి మాట్లుడు తున్నారు శూన్యంలో కాకుండా!

 15. there is more than poor /rich here(leading a happy life, satisfaction, spiritual growth, to know ultimate truth etc etc). అంటే మీరు చెప్పినవి చేసేది సన్యాసులు అందరిని సన్యాసం తీసుకుమంటారా అల్టిమేట్ నిజం తెలిసేది వాళ్ళకే సామాన్యులకి కాదు పేద ధనిక తేడ లేకుండా సాధారణ్ మనుషులుండరు అలా జీవితం గడిపే వాళ్ళు ఎక్కడున్నారు ఆశ్ర్అమాల్లో ఉన్నారా

 16. మొన్న మీకు సాయి అంటే ఇస్లాం పేరు అనిచెప్పా దాన్ని తిరగ తిప్పితే ఇసా isah అంటే యేసు క్రీస్తు అని అరబిక్ లో అర్ధం కాబట్టి అన్ని మతాలూ అందులోనే ఉన్నాయి సర్వ మత సమ్మేళనము (sms ) ee vishayam pak lo edo aipotundanna aayanaki cheppandi mundu ayana daggare 3 mataalunnayani

 17. టపాకి సంబంధం లేని వ్యాఖ్య.
  Educated caste Hindu youth campaign against inter-caste marriages

  http://www.thehindu.com/todays-paper/tp-national/tp-tamilnadu/educated-caste-hindu-youth-campaign-against-intercaste-marriages/article3644332.ece

  మిగతా రాష్ట్రాల కన్నా తమిళనాడులో కుల పైత్యం శృతి మించినట్లు ఉంది. ఇటువంటి సంఘటనలు చదివితే పెరియార్ ప్రభావం సమాజం పైన నిజంగా కనీస స్థాయిలో అన్నా ఉందా? అని అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా, ఈ పిచ్చి ఈ స్థాయిలోఉందంటే ఎమనుకోవాలి? అది కూడా ఆయనకు జేజేలు పలికిన వర్గాల వారిలోనే! తమిళ నాడు లో ఎమి జరుగుతున్నాది? మీకేమైన తెలిస్తే రాసేది.

 18. Educated caste Hindu youth కి మతం భాష ఆలోచన ఆహారం అనీ నేర్పారు పెళ్లి కూడా ఎలా చేసుకోవాలో నేర్పండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s