భారత ఆర్ధిక వ్యవస్ధ, మన్మోహన్ వ్యర్ధ ప్రయత్నం -కార్టూన్


Indian economy

భారత ఆర్ధిక వ్యవస్ధకు చేసిన జబ్బుకి మళ్ళీ ఎఫ్.డి.ఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మందు వేయడానికి మన్మోహన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. క్షీణిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను వృద్ధి చేసుకోడానికీ, ప్రమాదకరంగా ఉన్న కరెంటు ఖాతా లోటును స్ధిరీకరించడానికి ఎఫ్.డి.ఐలు తప్ప మరో మార్గం లేదని భారత ప్రభుత్వంలోని ఆర్ధిక పండితులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ప్రజలు, ప్రతిపక్షాల అభ్యంతరాలతో నిమిత్తం లేకుండా వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచుతున్నట్లు వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ మంగళవారం ప్రకటించేరు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపు కోసం ప్రభుత్వం దాదాపు ఏ రంగాన్నీ వదల్లేదు. దేశ సార్వభౌమత్వానికి కాపలాదారు అయిన కీలక రక్షణ రంగంతో పాటు టెలికాం, ఇన్సూరెన్స్, సరుకుల ఎక్ఛేంజీ మార్కెట్లు, విద్యుత్ ఎక్ఛేంజీలు తదితర రంగాల్లో ఎఫ్.డి.ఐ ల పరిమితిని ప్రభుత్వం పెంచుతోందని మంత్రి ప్రకటించారు.

టెలికాం రంగంలో కంపెనీలను ఇప్పుడు విదేశీ పెట్టుబడులు నూరుశాతం తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు. నిన్నటి వరకు ఇది 74 శాతంగా ఉంది. రక్షణ రంగంలో 26 శాతం ఎఫ్.డి.ఐలకు అనుమతి ఇస్తూ దానిని ఆటోమేటిక్ గా ఆమోదం పొందేలా నిబంధనలు మార్చారు. అత్యున్నత స్ధాయి రక్షణ పరికరాల ఉత్పత్తి రంగంలో కేబినెట్ కార్యదర్శి నేరుగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించారు. చిల్లర వర్తకంలో విదేశీ కంపెనీల అనుమానాలను తొలగించేందుకు త్వరలో మార్గదర్శక సూత్రాలను జారీ చేస్తున్నట్లు ఆనంద్ శర్మ ప్రకటించారు.

ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి విదేశీ కంపెనీల డిమాండును ప్రభుత్వం నెరవేర్చింది. 26 శాతం ఉన్న ఎఫ్.డి.ఐ పరిమితిని 49 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది కూడా ఆటోమేటిక్ అప్రూవల్ రూట్ లో ఆమోదం పొందే ఏర్పాటు చేశారు. టెలికాం రంగంలో సెల్యులార్ సేవలకు సంబంధించి ఆటోమేటిక్ రూట్ లో వచ్చే ఎఫ్.డి.ఐల పరిమితిని 49 శాతానికి ఎఫ్.ఐ.పి.బి (Foreign Investment Promotion Board) రూట్ లో వచ్చే ఎఫ్.డి.ఐల పరిమితిని 100 శాతానికి పెంచేశారు.

పెట్రోలియం మరియు సహజవాయువు, కామోడిటీ ఎక్ఛేంజీలు, పవర్ ఎక్ఛేంజీలు, స్టాక్ ఇక్ఛేంజీలు మరియు డిపాజిటరీలు తదితర రంగాల్లో ఎఫ్.డి.ఐ పరిమితిని ఆటోమేటిక్ రూట్ లో 49 శాతానికి పెంచారు. అలాగే ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీల కోసం 49 శాతం పరిమితిని కొనసాగిస్తూనే దానిని ఆటోమేటిక్ రూట్ లోకి తెచ్చారు. ఎఫ్.ఐ.పి.బి రూట్ లో మాత్రం 100 శాతానికి పెంచారు. ఋణ సమాచార కంపెనీల కోసం ఎఫ్.డి.ఐ పరిమితిని ఆటోమేటిక్ రూట్ లో 74 శాతానికి పెంచారు.

సింగిల్ బ్రాండ్ చిల్లర వర్తకంలో 49 శాతం పరిమితిని ఆటోమేటిక్ రూట్ లోకి మార్చి ఎఫ్.ఐ.పి.బి రూట్ లో ఆ పరిమితిని 100 శాతానికి పెంచారు. కొరియర్ సర్వీస్ రంగంలో ఆటోమేటిక్ రూట్ లో పరిమితిని 100 శాతానికి పెంచారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదట. ప్రధాని మన్మోహన్ నేతృత్వంలో జరిగిన మంత్రుల సమావేశం ఈ నిర్ణయాలు తీసుకుంది. వీటిని త్వరలో కేబినెట్ ఆమోదం పొందనున్నారు.

భారత ఆర్ధిక వ్యవస్ధను పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఏలుబడిలోనికి తీసుకెళ్ళే ప్రయత్నాలు శరవేగంగా సాగిపోతున్నాయి. ఏ విదేశీ పెట్టుబడులు, సరుకులైతే బ్రిటిష్ పాలనలో భారత ప్రజల ఆర్ధిక నాడులను క్రుంగదీశాయో ఈ రోజు అవే విదేశీ పెట్టుబడులు, సరుకులకు భారత పాలకులు గేట్లు ఎత్తేస్తున్నారు. దేశానికి వచ్చిందని చెబుతున్న స్వతంత్రం ఇక ఎవరిని ఉద్ధరిస్తున్నట్లు? వ్యాపారం చేయడానికి వచ్చిన బ్రిటిష్ వాడు దేశాన్ని ప్రత్యక్షంగా పాలించాడు. ఇప్పుడు అనేక దేశాలు ప్రత్యక్షంగా కాకుండా తమ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా దేశాన్ని పాలిస్తున్నాయి. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమీ లేదు, ఒక్క విదేశీయుల ప్రత్యక్ష ఉనికి తప్ప.

విదేశీ పెట్టుబడులకు గేట్లు లేకుండా చేస్తే దేశ ఆర్ధిక వ్యవస్ధను కాపాడగలరో లేదో కార్టూన్ చక్కగా వివరిస్తోంది.

FDI caps

14 thoughts on “భారత ఆర్ధిక వ్యవస్ధ, మన్మోహన్ వ్యర్ధ ప్రయత్నం -కార్టూన్

 1. చాలా బాగా వివరించారు. ఆ fdi లని (కొన్నిటిని) కుడా మన రాజకీయ నాయకులు వాళ్ళ బ్లాకు మనీ ని fdi ల రూపం లో ఇక్కడ పరోక్షంగా పెట్టుబడి పెట్టిస్తున్నరేమో అని అనుమానంగా వుంది.

  చిదంబరమ్ అమెరికా పర్యటన తర్వాత fdi మీద ఉత్తరాఖంద్ relief works కంటే శర వేగంగా నిర్ణయం తీసుకోడం మన రాజకియనయకులకి , fdi + వారికీ వచ్చే ting ting + వారి బ్లాక్ ని వైట్ గ మర్చబోయే దొంగ fdi ల మీద యంత మోసో చెప్పకనే చెప్తుంది !!!!

  భారతీయులకి ఓ కొత్త సినిమా ఉచితంగా చూసే అద్భుత అవకాసం

  1991 crisis (returns)

  director – sonia gandhi
  cameraman – chidambaram
  hero – rahul gandhi
  music director – kapil sibal & co

 2. i think this can be called as second phase of manmohanics and it results to the share of the socialism in the economy to decrease and open the doors for capitalism in broad way then the post 1991 reforms period .But it will not give the sustainable growth as we can see the the poverty levels are not drastically decreased in this last two decades.sir but i cant able to understand,how the so called socialistic communistic china implementing capitalism decreased there poverty levels drastically from 80% to 10% in the same period ?

 3. Hi Pavan, your assumption is right. This is the second phase of ‘Manmohanamics/sell out to foreign capital’ which has been desperately attempted for last 3 or 4 years by UPA-II. These policies are basically aimed at subjugating Indian economy to the western market economy. As such Indian economy has no independent existence. It is bound to be influenced by the ups and downs in western economies. Purpose of these policies is to serve the needs of western and other multinational companies. Hence it’s growth also reflects its purpose.

  Coming to China, upto Mao’s death i.e to the middle of 70s socialist policies were implemented without visible hinderence. Those policies raised the living standards of Chinese population which became the bedrock of the present day growth of Chinese economy. But, such base is steadily getting evaporated and hence there have been lakhs of workers’ agitations every year in China.

  There was no more poverty in China during socilist construction. What was so dubbed was nothing but western propaganda. What was followed between 50s and 70s in India was half-hearted mixed economy, where as in China it was full scale socialist economy. So there must not be any comparison between India and China regarding economic progress. Both are completely different then and now (now it is a market economy. Even it’s public sector serves market economy.)

 4. ఇప్పుడు మీరు చెప్పిoదంత మన్మోహన్ (mms) కి తప్పకుండ అవగాహనా వుండి వుంటది , ప్రస్తుత ఆర్ధిక నిర్ణయాల వలన ప్రజలు అడుక్కు తినే రోజు తొందరలో వస్తుందని తెలిసి కూడా , అతను ఎందుకు ఈ వైకరి ని అవలంబిస్తున్నారు .

  మన రాజ్యాంగం మనది socialist state అని preamble లో స్పష్టంగా చెప్పినప్పటికీ దాన్ని తుంగలో తొక్కారు . so it is violating fundamental feature of constitution. cant we file pil in court because what now india following is extreme capitalism which is violation to basic structure of constitution.

  10 years తర్వాత చైనా లో ప్రజలకి తినడానికి తిండి ఐన వుంటది, మన సంగతి అధోగతే అనిపిస్తుంది

  100% FDI in telecom is a scam meant to compensate firms who lost money in 2G scam and its a wellcome signal to clear doubts of mnc’s . capitalism వున్నప్పతికి అమెరికా లో ప్రజల జీవన సరళి అంత ఉచ్ఛ స్థితి లో ఎలా ఉందంటారు ?

 5. మన్మోహన్ హార్వర్డ్ ఉత్పత్తి. ఆయన శిక్షణ తీసుకున్నదే అందుకు. ఆయనకు భారత ప్రజల పాట్లు అనవసరం.

  మనది సోషలిస్టు స్టేట్ అని మొదట రాసుకోలేదు. ‘సార్వభౌమ ప్రజాస్వామ్య రిపబ్లిక్’ అని మాత్రమే మొదట రాసారు. ఆ తర్వాత ఎమర్జెన్సీలో రాజ్యాంగ సవరణ చేసి ‘సామ్యవాద, లౌకిక’ అని చేర్చారు. నిజానికి సామ్యవాదం మన రాజ్యాంగానికి మీరన్నట్లు ఫండమెంటల్ ఫీచర్ కాదు. అది అలంకార ప్రాయం మాత్రమే.

  దేశంలో పెల్లుబుకుతున్న నిరసనలు, వామపక్ష విప్లవ ఉద్యమాల వలన ‘సోషలిస్టు’ అనీ, జె.పి నాయకత్వంలో, ఆర్.ఎస్.ఎస్ మద్దతుతో తలెత్తిన అవినీతి వ్యతిరేకం వలన ‘సెక్యులర్’ అనీ చేర్చారని విశ్లేషకులు చెబుతారు.

  కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల్లాంటి సరిహద్దు రాష్ట్రాలలో స్వతంత్రం కోసం జరుగుతున్న ఉద్యమాల కారణంగా ‘యూనిటీ’ స్ధానంలో ‘యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ’ అని చేర్చారని కూడా చెబుతారు.

  అమెరికా ప్రజల జీవన సరళి ఉచ్ఛ స్ధితిలో ఉందనడం కరెక్ట్ కాదు. డెబ్భైల నుండే అక్కడ ఉద్యోగుల నిజవేతనాలు పడిపోవడం మొదలయింది. 2008 నాటి ఆర్ధిక సంక్షోభంతో అమెరికా ఆర్ధిక పతనం ఎఫెక్టివ్ గా పూర్తయినట్లు చెప్పుకోవచ్చు. ఇపుడక్కడ దరిద్రం తాండవిస్తోంది. సంక్షోభం పెరిగే కొద్దీ వేతనాలు ఇంకా కోసేసి, ఉద్యోగాలు రద్దు చేసేసి లాభాలు పెంచుకునే పనిలో కంపెనీలు నిమగ్నం అవుతున్నాయి. దానితో జనం పరిస్ధితి ఇంకా దిగజారుతోంది.

  అంతర్జాతీయంగా కూడా అమెరికా ఆదేశాలు పెద్దగా చెల్లుబాటు కావడం లేదు. ఇటీవల అమెరికా ఇష్టానికి వ్యతిరేకంగా ఈజిప్టు మిలట్రీ కుట్రను సౌదీ అరేబియా, యు.ఎ.ఇ లు ఫైనాన్స్ చేశాయి. భవిష్యత్తులో అమెరికాకి వ్యతిరేకంగా మరిన్ని పరిణామాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

 6. @saayi

  మీరు ఒకే వ్యాక్యం లో చెప్తే రీడర్స్ కి చదువుటకు సులువుగా ఉంటుంది. నేను కూడా తెలుగు లో రాయుటకు చాలా uneasy గా ఉండేది కాని ఈ సాఫ్ట్వేర్ ఇంస్టాల్ చేసాక తెలుగు లో రాయడం చాలా సులువు గ వుంది. మీరు ప్రయత్నించగలరు

  http://www.google.co.in/inputtools/windows/

  ధన్యవాదాలు

 7. just open it and select telugu, to flip between telugu and english use ctr+g , if you type baavam it shows బావం, బావాం, బఆవం, similar to other words also. so u need to use arrows (up and down) and enter to make sure what you written is flawless.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s