భారతీయ జనతా పార్టీ తమ ప్రధాని అభ్యర్ధి ఎవరో చేప్పలేదు. తాము ఇంకా నిర్ణయించుకోలేదని బి.జె.పి అధ్యక్షుడు చెబుతున్నప్పటికీ ఇతర నాయకులు మాత్రం నరేంద్ర మోడియే ప్రధాని అభ్యర్ధి అని బహిరంగంగానే చెబుతున్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు నరేంద్ర మోడి అని చెప్పని నాయకుడు బి.జె.పిలో లేరు. హైద్రాబాద్ లో న.మో సభ పెట్టి దానికి రు. 5/- టికెట్ పెట్టే వరకూ బి.జె.పి నాయకులు వెళ్లారు. అదేమంటే ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయం నిమిత్తం అనీ, సేవాభావం పెంపొదిస్తున్నామనీ అంటూ విచిత్రంగా సమాధానం చెబుతున్నారు.
కింది నాయకులంతా తమకు అవకాశం వచ్చినప్పుడల్లా రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్ధి అని ప్రకటిస్తుంటారు. రాహుల్ ని త్వరగా ప్రధాని అభ్యర్ధిని చేయాలని అధిష్టానానికి మహజర్ల మీద మహజర్లు సమర్పిస్తుంటారు. దిగ్విజయ్ సింగ్ లాంటి వారు తాము ఇంకా రాహుల్ గాంధీని తమ అభ్యర్ధిగా ప్రకటించలేదని చెబుతుంటారు. రాహుల్ కూడా తనకు ప్రధాని పదవికి పోటీ పడే ఉద్దేశ్యం లేదని చెబుతుంటారు. కానీ రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్ధి అని తెలియడానికి కావలసినన్ని పరోక్ష సూచనలు కాంగ్రెస్ నాయకులు ఇస్తుంటారు.
కాంగ్రెస్ ప్రధాని మంత్రి అభ్యర్ధిత్వం ఎంత ప్రహసనంగా మారిందో ఈ కార్టూన్ సూచిస్తోంది.
nice
రాహుల్ ప్రధాని పదవి పోటీ గురించి ఐనా….తెలంగాణ గురించి ఐనా
చెప్పకనే చెప్పడం
చెప్పింది చెప్పామని చెప్పకుండా,
చెప్పనిదీ…..చెప్పలేదని చెప్పకనే,
చెబుతామో లేదో కూడా చెప్పకపోవడం….
ఏం చెబుతుందో….ఎప్పుడు చెపుతుందో,
ఏం చెప్పిందో, చెప్పలేదో అర్ధం కాకుండా చెప్పడం…
అసలు చెబుతుందో, చెప్పదో కూడా తెలీకుండా చెప్పడమే కాంగ్రెస్ శైలి.
గందరగోళంలో పడి జుట్టు పీక్కోవడం జనం పని.
చెబుతుందో, చెప్పదో కూడా తెలీకుండా చెప్పడమే కాంగ్రెస్ శైలి. vote evariki vestamo veyamo cheppakundaa veyatam voters syli ainaa ee rahulgandhi modi laki twitter lo facebook lo votelu padutunnai asalu elections lo padavu online voting pedite gelavochu
evaru enni cheppinaa 2014 lo pm ayedi navin patnaik rahulgandhi modi ki bhajana cheyatam waste madyalo eeyana elaa vachaadantaara okappudu gujral devegauda laage repu eeyana vastaadu chaapa kinda neeru laaga na prediction tappo correcto 2014 daakaa teleedu